Sunday 18 June 2023
Thursday 15 June 2023
Wednesday 14 June 2023
Tuesday 13 June 2023
8౦ రోజుల్లో భూ ప్రదక్షిణ - 7
పోయిన అధ్యాయం లో చాలా ఆందోళనతో కథ సాగింది.. సరిగ్గా 20 డిసెంబర్ కి ఫిలియాస్ ఫాగ్ లివర్ పూల్ చేరాడు. అక్కడ నుంచి ఆరు గంటల ప్రయాణంతో అతను ఫిన్ ల్యాండ్ చేరుతాడు. ఆ తర్వాత సరిగ్గా 21 డిసెంబర్ 8 .45 PM కి రిఫార్మ్ క్లబ్ కి ఆయన చాలా సులభంగా చేర గలడు కానీ, ఆఖరి నిముషంలో ఈ డిటెక్టివ్ ఫిక్స్ రావటం, అరెస్ట్ చేయటం వంటి పరిణామాలు, జైలు లో వేయటం, అక్క డ కొంత సమయం వృధా కావటం ఇలా ఒక దాని తర్వాత ఒకటి జరిగి పోయాయి. చాలా వేగం గా, వింతగా జరిగి పోయాయి. ఫిలియాస్ ఫాగ్ కి డిటెక్టివ్ ఫిక్స్ మీద మొదటి సారిగా కోపం వచ్చింది. డిటెక్టివ్ ని కోప్పడటం, కొట్టటం కూడా జరిగంది. పాస్ పర్ట్ కి కూడా డిటెక్టివ్ ఫిక్స్ మీద చాలా కోపం వచ్చింది. గట్టిగానే కోప్పడ్డాడు పాస్ పర్ట్ డిటెక్టివ్ ఫిక్స్ ని.
ఆ తర్వాత ఇంకా ఆలస్యం చేయకండా వెంటనే వాళ్ళు రైల్వే స్టేషన్ కి బయలు దేరారు. అక్కడికి వెళ్లేసరికి దురదృష్టం కొద్ది రైలు ఆలస్యంగా వచ్చింది. మరి ఆరోజు 21 డిసెంబర్ ఇక్కడ రైలు ఆలస్యం అయింది. అందరూ చాలా ఆదుర్దాగా రైలు ఎక్కేసారు.ఇంగ్లాండ్ హూస్టన్ స్టేషన్ కి చేరి టైం చూద్దామని గడియారం వైపు చూసారు. ఆ గడియారం 21 డిసెంబర్ సాయంత్రం 8 .50 నిముషాలు చూపిస్తుంది.
ఎంత దురదృష్టమంటే సరిగాా అయిదు నిముషాల ఆలస్యం వల్ల పందెం ఓడిపోతున్నాం అని అందరికి బాధ కలిగింది. మౌనంగానే వాళ్లలో వాళ్ళు బాధ పడుతూ ఇంటికి వెళ్లిపోయారు.
ఫిలియాస్ ఫాగ్ ముభావంగా గంభీరంగా , మౌనంగా ఉన్నారు. పాస్ పర్ట్ చాలా బాధ పడుతున్నాడు. తన యజమాని ఈ పోటీ గెలవాలని ఎంతో కోరుకున్నాడు. చివరికి ఇలా ఐదు నిమిషాల వల్ల ఓడి పోవటం ఏమిటీ అని అనుకున్నాడు. మేడం ఔదా కూడా ఇలా జరిగినందుకు చాలా బాధ పడింది.
ఆ మర్నాడు ఫిలియాస్ ఫాగ్, మామూలుగా అయితే పొద్దున్నే 11.౩౦ కల్లా టంచనుగా రిఫార్మ్స్ క్లబ్ కి బయలుదేరాడు. కానీ వెళ్ళలేదు . మొట్టమొదటి సారిగా అలా జరిగింది.
ఫిలియాస్ ఫాగ్, మేడం ఔదా దగ్గరకి వచ్చాడు . నేను మిమ్మల్ని ఇంగ్లాండ్ కి తీసుకుని వచ్చాను. మీకు ఎంతో మంచి జీవితాన్ని ఇవ్వా లని ఆశ పడ్డాను. కానీ ఇప్పుడు నేను బీదవాడిని అయ్యాను. నాక ఈ ఇల్లు మాత్రమే ఉంది. అని ఎంతో బాధగా అన్నాడు.
దానికి సమాధానంగా అదే మిటి? మీక ఎవరూ స్నేహితులు లేరా... అని అడిగింది . అంటే
ఫిలియాస్ ఫాగ్ లేరు. నాకు స్నేహితులు ఎవరూ లేరు అన్నాడు. మరి బంధువులు కూడా
ఎవరూ లేరా. అంటే, బంధువులు కూడా ఎవరూ లేరు అని ఫిలియాస్ ఫాగ్ ముక్తసరిగా జవాబిచ్చాడు. అందుకు క మేడం ఔదా పరవాలేదు మనకి బంధువులు ఎవరూ లేకపోయినా, స్నేహితులు ఎవరూ లేకపోయినా, డబ్బులు లేకపోయినా మనిద్దరమూ హయిగా జీవించ వచ్చును.. నేను మీకు తోడుగా వుంటాను. సహా యంగా నిలుస్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అనగానే, ఆ మాటలకి ఫిలియాస్ ఫాగ్ కళ్ళు చెమ ర్చా యి. కంట్లోనీటి చుక్కలు మెరిసాయి. యిది అంతా గమనిస్తున్న పాస్ పర్ట్ ఆ సన్నివేశానికి చలించిపోయాడు. ఔదా మళ్ళీ ఇలా అంది ఫిలియాస్ ఫాగ్ తో. "చూడండి ! నేనెవ్వ రో తెలియక పోయినా, చితి మంటల్లో కాలిపోవాల్సిన నన్ను కాపాడారు. నాకు ఒక కొత్త జీవితాన్ని కల్పించారు. ఇవన్నీ నేను ఎలా మరిచిపోగలను?" అని అంది.
ఫిలియాస్ ఫాగ్ సమాధానంగా. "మరి నిన్ను అంత దారుణంగా చితి మంటల మధ్య దహనం చితి మంటల మధ్య దహనం చేయాలనుకంటే అది చూసిన నేను భరించలేక పోయాను. అందులో నా గొప్పతనం ఏమీ లేదు", అని అన్నాడు.
అపుడు వెంటనే ఫిలియాస్ ఫాగ్, ఔదా అంగీకారం తెలపడం తో , పాస్ పర్ట్ ని పిలిచి, నీకు Rev. విల్ సన్ గారి ఇల్లు తెలుసు కదా! నేను, ఔదా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకంటున్నాం. వెంటనే దానికి సంబంధించిన వివరాలు కనుకు ని రా అని చెప్ప గానే పాస్ పర్ట్ ఎంతో సంతోషంగా వెంటనే పరిగెత్తాడు. మళ్ళీ కాసేపటికి ఊపిరి ఎగబీలుస్తూ వెనక్కి వచ్చాడు. మై మాస్టర్ ! ఫిలియాస్ ఫాగ్ ! ఇవ్వాళ శనివారం. యింకొక పది నిముషాల్లో బయలు దేరాలి రిఫార్మ్ క్లబ్ కి వెళ్ళండి.మీరు మీ పందాన్ని గెలిచారు అంటూ సంతోషంగా గట్టిగా అరిచి చెప్పా డు. ఈ రోజు డిసెంబర్ 21వ తేదీ! శనివారం ! సాయంత్రం 8 .45 నిముషాలకి మీరు రిఫార్మ్ క్లబ్ కి చేరుకోవాలి. ఇంకా టైముంది. త్వ రగా బయలు దేరండి అంటూ తొందర పెట్టాడు పాస్ పర్ట్.
"అదేమిటీ ! ఇవ్వాళ శనివారమా ! అది ఎలా ! "అంటూ ఆశ్చర్య పోయాడు. అసంభవం
కదా! అన్నాడు ఫిలియాస్ ఫాగ్. సమాధానంగా పాస్ పర్ట్ మనం ప్రదక్షిణ తూర్పు
వైపుగా ప్రయాణం చేసాము. తూర్పు దిశగా వెళ్ళితే మనకు సమయం చాలా కలిసి వస్తుంది..
అందు కే మనం రెండు రోజులు ముందు గానే గమ్యాన్ని చేరుకున్నాము. ఎక్కువ టైం లేదు.
మీరు త్వరగా బయలు దేరండి , అంటూ హడావిడి చేసాడు. తానే ఒక గుర్రపు బండి ని
మాట్లాడి రిఫార్మ్ క్లబ్ చేరుకోవాలన్న తొందర వల్ల తానే వేగం గా నడపడం మొదలు
పెట్టా డు పాస్ పర్ట్ . మధ్యలో రెండు కుక్కల ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక ముసలావిడ
కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.. రిఫార్మ్ క్లబ్ చేరగానే హుందాగా,
ఎటువంటి హావభావాలు ప్రదర్శించకుండా , 8.45 నిముషాలకి క్లబ్ ద్వారం దగ్గరకి
ఫిలియాస్ ఫాగ్ చేరారు. క్లబ్ లో ఉన్న స్నేహితులందరూ ఆదుర్దాగా ఎదురు
చూస్తున్నారు. ఇంకొక్క నిముషమే ఉంది అని అనుకుంటుండగా తలుపు తెరిచి, "Good evening, gentlemen, I am back here. I hope I am a rich man now", అని అన్నాడు ఫిలియాస్ ఫాగ్.
అందరూ అతనితో ఆనందంతో ,"అవును నీవు పందెం గెలిచావు. నువ్వు రిచ్ మాన్ వి "అని చప్పట్లు కొట్టారు. అక్కడున్న వారందరూ ఫిలియాస్ ఫాగ్ విజయ వంతంగా భూప్రదక్షిణ చేసి వచ్చినందుకు చాలా సంతోషించారు.
మేడం ఔదా, పాస్ పర్ట్ లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారి ఆనందానికి పగ్గాలు లేవు.యింటికి రాగానే సోమవారం నాడు ఔదా, ఫిలియాస్ ఫాగ్ వివాహం చేసుకున్నా రు. పాస్ పర్ట్ కి వీరిద్దరి వివాహం చాలా ఆనందం కలిగించిoది. ఆ సందర్భం లో పాస్ పర్ట్ ఒకమాట అన్నాడు. నిజానికి ఫిలియాస్ ఫాగ్ గారు తూర్పు దిశ్ల్ల మనం ఇండియా దిక్కుగా వెళ్లకుండా వేరే మార్గం లో వెళ్లి ఉంటె, మనం 78 రోజుల్లోనే భూప్రదక్షిణ చేసి రిటర్న్ వచ్చే వాళ్ళం . అంటే ఫిలియాస్ ఫాగ్ పాస్ పర్ట్ తో నిజమే! నువ్వన్నట్టు వేరే దిశ లో ప్రయాణించి ఉంటె త్వరగా వచ్చే వాళ్ళం, కానీ మన ప్రయాణం ఇలా సాగినందుకే కదా నాకు ఇంత అందమైన ఔదా లభించింది. నా భార్య గా చేసుకోగలిగాను అంటూంటే ఔదా, పాస్ పర్ట్ లు ఇద్దరూ ఎంతో సంతోషించారు.
సోమవారం వివాహం చేసుకున్న తర్వాత వారందరూ చక్క గా, ఉత్సాహంగా పార్టీ
చేసుకున్నారు. అప్ప టి నుంచీ ఔదా, ఫిలియాస్ ఫాగ్, పాస్ పర్ట్ లు హాయిగా, ఆనందంగా
వారి జీవితాలు గడిపారు. ఆ తర్వాత నుంచీ, యదావిధిగా, వారి జీవిత ప్రయాణం ఎప్పటిలాగానే సాగింది. వీరి 80 రోజుల్లోభూప్రదిక్షిణ చేసిన విషయాన్ని మాత్రం అందరూ ఎంతో గొప్ప గా, సాహస కృత్యంగా చెప్పుకున్నారు
ప్రియమైన పాఠ కుల్లారా.... ఈ కథను విని మీరందరూ ఆనందిస్తారని , భౌగోళిక పరిస్థితులు,
సమయాల వివరణ అర్థం చేసుకుంటారనే అనుకంటున్నాను. ఒక దిశ గా ప్రయాణిస్తే ఒక
టైం జోన్, ఇంకో దిశ గా ప్రయాణిస్తే, ఇంకో టైం జోన్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ముందుకి ,
మరోసారి ఇంకో టైం జోన్ వల్ల ప్రయాణిస్తే 80 రోజుల్లో భూప్రదక్షిణ కావించాము. మీకు నచ్చిందని భావిస్తున్నాం.
నమస్తే !
*************
Saturday 10 June 2023
80 -రోజుల్లో భూప్రదక్షిణ - 6
ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్ తన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా అతను
తన నాయకత్వ లక్షణాలు చూపుతూ అధైర్య పడకుండా తగినట్టుగా ప్రణాళికలు
రచిస్తూ వున్నాడు.
కెప్టెన్ గా మరీనా ఫిలియాస్ ఫాగ్ లోగడ మనం చెప్పుకున్నట్లుగా 45 నిముషాలు ఆలస్యంగా
వెళ్లినందుకు చైనా అనే ఓడ వీళ్ళు లివర్ పూల్ కి వెళ్ళవలసినది మిస్ అయిపోయారు.
అయితే ఫిలియాస్ ఫిలియాస్ ఫాగ్ మాత్రం తన ప్రయత్నాలని తాను చేస్తూ ఆఖరికి పారిస్ కి వెళ్లే కార్గో షిప్ ని ఎలాగో ఎక్కి, ప్రయాణికుడికి 2000 పౌండ్స్ చొప్పున నలుగురికీ పే చేయటం, ఆ ఓడ పేరు H S (Hispilania )ఫిలానియా. ఆ ఓడ ఎక్కాక ఆ నావికులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ నలుగురు ప్రయాణీకులనీ లివర్ పూల్ చేర్చేలా ఒప్పుకోవటగం, ఆ నావికులందరూ కలిసి, ఓడ నడిపే కెప్టెన్ ని బంధించి, గదిలో పెట్టి తాళం వేయటం తెలుసుకున్నాం.
ఈ విధంగా ఆగమేఘాలమీద ఆ కార్గో ఓడ హైస్పీలనియా (Hispilania), లివర్ పూల్ దిశగా ప్రయాణించింది. అందరూ ఆశ్చర్య పడేలా ఫిలియాస్ ఫాగ్ ఆ ఓడకి కెప్టెన్ గా బాధ్యత వవహించాడు. పడవ నడిపే నావికులు కూడా ఫిలియాస్ ని చూసి చాలా ఆశ్చర్య పడ్డారు.
డిటెక్టివ్ ఫిక్స్ మాత్రం ఇలా అనుకున్నాడు మనసులో. ఇతడు మామూలు దొంగ కాదు. సముద్రపు దొంగ అయివుంటాడు. ఇతడేమిటి కార్గో షిప్ లో వెళ్ళాడు. పైగా పారిస్ వెళ్లాల్సిన ఓడలో బోల్డంత డబ్బు చెల్లించి, లివర్ పూల్ దిశగా తానే కేప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు. లివర్ పూల్ కెళ్ళి అక్కడినుంచి ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడు. అదేమిటో నాకేమీ అర్ధం కావటంలేదు. మళ్ళీ ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడేమిటి? నాకేమీటీ. అర్ధం కావటం లేదు, అని బుర్రబద్దలుకొట్టుకుంటున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆరోజు డిసెంబర్ 10 వ తేదీ. వీళ్ళు న్యూయార్క్ ఓడరేవు దగ్గర దిగి లివర్ పూల్ కివెళ్లాలనుకున్నపుడు అది డిసెంబర్ 20 వరకు ఏ ఓడ బయలు దేరదన్నపుడు, మరి పందెం ఓడిపోతాడు కదా! 21 వ తేదీ కల్లా రిఫార్మ్స్ క్లబ్లోకి సాయంత్రం 5 PM కల్లా వెళ్ళాలి కదా! అందుకే ఫిలియాస్ ఫాగ్ గారు ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు. సరిగ్గా డిసెంబర్ 14 న ఫిలియాస్ ఫాగ్ ఓడ కి కెప్టెన్ గా వ్యవహరించి, అతి చాకచక్యంగా ఆ ఓడని లివర్ పూల్; వైపుగా అట్లాటిక్ మహా సముద్రం ద్వారా ప్రయాణించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణం ఏమాత్రం సహకరించట్లేదు. ఓడ చాలా వేగంగా వెళ్తోంది. పాస్ పర్ట్ ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఫిలియాస్ ఫాగ్ చాలా గంభీరంగా వున్నాడు. వాతావారణం ప్రతికూలంగా వుంది కాబట్టి అతను తన మనసునంతా ప్రయాణం దిశగా కేంద్రీకరించి ఓడను నడుపుతున్నాడు. ఈలోగా ఆ నావికుల్లో ఒకడు వచ్చి ఏమండీ! ఇంత వేగంగా ఓడను నడుపుతున్నాము. మనకు బొగ్గు నిల్వలన్నీ చాలా తగ్గి పోయాయి.ఇంత వేగంగా ప్రయాణం చేస్తే మన ఓడలో ఏమాత్రం బొగ్గు మిగలదు. ప్రయాణం మధ్యలో నిలప వలసివస్తుంది. ప్రయాణం లివర్ పూల్ దాకా వెళ్ళటం కష్టం అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడెలా! ఎలా వెళ్ళటం అబ్బా! అని అందరూ అనుకుంటూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్ మాత్రం చాలా గంభీరంగా, ఎటువంటి పరిస్థితిలోనూ ఈ వేగం తగ్గించటానికి వీలులేదు.మీరు ఒకపని చేయండి. ఈ ఓడమీద చెక్కతో చేసిన స్తంబాలు, కుర్చీలు వంటి వాటిని విరక్కొట్టండి. వాటిని మనం కలప లాగా వాడుకుందాం. కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఈ వేగాన్ని తగ్గించటానికి వీలులేదు, అని దృడంగా చెప్పాడు. ఎందుకంటె ఆ ప్రయాణానికి చాలా డబ్బు అతను ఇస్తున్నాడు కాబట్టి ఆ నావికులందరూ కూడా, ఆ ఓడలో చెక్కతో చేసిన వస్తువులనన్నింటినీ విరగకొట్టి, కలపలాగా, వాడుకుంటున్నారు. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో చాలా దూరం వరకు వచ్చేసారు. కాసేపట్లో ఒక నావికుడు వచ్చి, అయ్యా, ఏర్పాటు చేసిన కలప అంతా అయిపోయింది. ఇంకా తగల బెట్టడానికి ఏమీ లేదు. దగ్గరలో ఉన్న ద్వీపం దగ్గర ఆ పడవని ఆపారు. ఫిలియాస్ ఫాగ్ ఎంతో ధైర్యంగా ఆ ఓడని దిగి, పక్కనే వున్న క్వీన్ స్టోన్అనే స్టేషన్ కి వెళ్లి, అక్కణ్ణించీ డబ్లిన్ వెళ్లి, అక్కణ్ణుంచి ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయం చేసుకున్నాడు. ఎలాగైతే
నేమి వాళ్ళు 20 డిసెంబర్ కి అనుకున్న గమ్యస్థానం లివర్ పూల్ కి చేరుకున్నారు. పాస్ పర్ట్ కి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటె తన యజమాని 21 డిసెంబర్ కల్లా రిఫార్మ్స్ క్లబ్ కి చేరుకుంటాడు. లివర్ పూల్ నుంచి ఆరుగంటల ప్రయాణమే కదా అని సంతోషపడుతూ వున్నాడు.ఈలోగా డిటెక్టివ్ ఫిక్స్ చాలా ఆనందంగా ఉన్నాడు. అతను వచ్చాడు. వీళ్లంతా సంతోషంగా ఉన్నారు. ఫిలియాస్ ఫాగ్ దగ్గరకెళ్ళి మీ పేరు ఫిలియాస్ ఫాగ్ కదా, అని అడిగాడు. డిటెక్టివ్ ఫిక్స్. ఒక్కింత ఆశ్చర్యడ్పడ్డాడు ఫిలియాస్ ఫాగ్ అలా అడగటంతో. అవును అన్నాడు ఫిలియాస్ ఫాగ్. మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను. బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ లో దొంగతనం చేశారు. అరెస్ట్ వారెంట్ చేతికి రావాలని మీ చుట్టూ తిరుగుతున్నాను . మిమ్మల్నిపుడు
అరెస్ట్ చేస్తున్నాను, అని అనగానే అందరూ చాలా ఆశ్చర్య పడ్డారు. ఫిలియాస్ ఫాగ్ కూడా ఒక్క క్షణం అవాక్కయ్యాడు. కానీ ఒకరకమైన నిస్సహాయ స్థితిలో వున్నాడు యిపుడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఫిలియాస్ ఫాగ్ కి చాలా కోపం వచ్చింది మొట్టమొదటి సారి. ఫిలియాస్ ఫాగ్
డిటెక్టివ్ ఫిక్స్ తో నీ అంత ద్రోహి ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను నా స్నేహితుడిగా భావించి, నీ కోసం నేను నా డబ్బులు ఖర్చు చేసి, నిన్ను ఇంతవరకూ తీసుకుని వచ్చాను. ఇంత విశ్వాసఘాతకుడివి అని నేనెప్పుడూ అనుకోలేదు, అని చాలా గట్టిగా కోప్పడ్డాడు. మనసులో డిటెక్టివ్ ఫిక్స్ నిజంగానే ఫిలియాస్ ఫాగ్ మంచివాడిలాగే ఉన్నాడు. కానీ నేను ఏం చేయగలను.
నేను న్యాయంగా నా డ్యూటీ చేస్తున్నాను. ఈ హఠాత్పరిణామం చూసి మేడం ఔదా వెక్కి వెక్కి ఏడుస్తూ పాస్ పర్ట్ భోజంపై తలవాల్చి తన దుఃఖాన్ని ప్రకటిస్తోంది. ఫిలియాస్ ఫాగ్ ఏమీ చేయలేని పరిస్థితిలో జైల్లో బంధింప బడ్డాడు. తన సర్వస్వం అంతా పోగుట్టుకున్నాడు. ఏంచేయాలి. ఒక మంచి అవకాశం దొరికితే బాగుండును కదా అని అనుకున్నాడు. అతడు
విజయానికి చాలా చేరువలో ఉన్నాడు. విధి ఎంత విచిత్రమైనది కదా అని అనుకున్నాడు. నేను దొంగని అని భ్రమించి, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఆలోచిస్తూ ఉండగా, కొద్దీ క్షణాల్లోనే పాస్ పర్ట్ , ఔదా, గబగబా పరుగెత్తుకుంటూ ఫిలియాస్ ఫాగ్ ఉన్న జైలు దగ్గరికి వచ్చారు. వెంటనే
వెనుకే డిటెక్టివ్ ఫిక్స్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఫిలియాస్ ఫాగ్ గారూ! మీరు వెళ్లిపోవచ్చు. మీరు స్వేచ్ఛా జీవి. బ్యాంకులో దొంగతనం చేసిన అసలైన దొంగని మూడురోజుల క్రితమే అరెస్ట్ చేశారు. కాబట్టి మీరు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అని చెప్పగానే, ఫిలియాస్ ఫాగ్ బయటికి
వచ్చాడు. కానీ అతనికి చాలా కోపంగా ఉంది. ఏమీ చేయని నేరానికి ఇలా చేస్తాడా అని, ముందు ఎడమ చేత్తో తర్వాత కుడిచేత్తో డిటెక్టివ్ ఫిక్స్ డొక్కలో పొడిచాడు గట్టిగా. పిడి గుద్దులు గుద్దాడు. ఆ దెబ్బలకి డిటెక్టివ్ ఫిక్స్ ఒక్కసారిగా కిందపడిపోయాడు.
***********