శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి తపన
శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి ఆవేదన, ఆయన ఆలోచనలు, భావాలు నాగానాథునికి
తెలుస్తున్నాయి. సంస్థానం వారు వాళ్లకి ఇష్టం లేని భాగాలు తీసివేసి ప్రచురించడం, ఆ
తర్వాత పీఠాధిపతి ఆ సంస్థానం లోని సాక్షాత్తు దేవతామూర్తుల విగ్రహాలముందే పాద పూజ
చేయించుకోవడం, ఆ నీళ్ళు అక్కడే ఉన్న శ్రీపాదశ్రీవల్లభ, నృసింహ సరస్వతి విగ్రహాల
మీద పడడం మల్లాది గోవింద దీక్షితులు గారు చూసి బాధ పడి , ఆ సంస్థానం వారితో ఆ
విషయం మీద గొడవ పడడం, ఆ తర్వాత ఆయన ఆ సంస్థానానికే వెళ్ళడం మానేయడం జరిగింది. ఆ
తర్వాత ఆయన చేసినటువంటి అసలైన గ్రంథరాజాన్ని తీసుకుని పలువురి దగ్గరకు వెళ్లి
యథాతథంగా ప్రచురించమని ప్రాధేయపడ్డారు. ఈ క్రమ౦లో ఆయన దగ్గరకి చాలామంది వ్యక్తులు
రావడం, ఆ పుస్తకాన్ని తీసుకోవడం, ఆయనకి తెలియకుండానే ఒక చలనచిత్రం నిర్మించాలని
తలపోవడం, ఇంకొక వ్యక్తి కూడా తప్పకుండా ప్రచురిస్తానని తీసుకుని వాళ్ళు ఎవరూ కూడా
ఏమాత్రం పట్టించుకోకుండా ప్రచురించక పోవడంతో దీక్షితులు గారి ఆర్తి, ఆవేదన
పెరుగుతూ ఉన్నాయి.