Sunday 18 June 2023
Thursday 15 June 2023
Wednesday 14 June 2023
Tuesday 13 June 2023
8౦ రోజుల్లో భూ ప్రదక్షిణ - 7
పోయిన అధ్యాయం లో చాలా ఆందోళనతో కథ సాగింది.. సరిగ్గా 20 డిసెంబర్ కి ఫిలియాస్ ఫాగ్ లివర్ పూల్ చేరాడు. అక్కడ నుంచి ఆరు గంటల ప్రయాణంతో అతను ఫిన్ ల్యాండ్ చేరుతాడు. ఆ తర్వాత సరిగ్గా 21 డిసెంబర్ 8 .45 PM కి రిఫార్మ్ క్లబ్ కి ఆయన చాలా సులభంగా చేర గలడు కానీ, ఆఖరి నిముషంలో ఈ డిటెక్టివ్ ఫిక్స్ రావటం, అరెస్ట్ చేయటం వంటి పరిణామాలు, జైలు లో వేయటం, అక్క డ కొంత సమయం వృధా కావటం ఇలా ఒక దాని తర్వాత ఒకటి జరిగి పోయాయి. చాలా వేగం గా, వింతగా జరిగి పోయాయి. ఫిలియాస్ ఫాగ్ కి డిటెక్టివ్ ఫిక్స్ మీద మొదటి సారిగా కోపం వచ్చింది. డిటెక్టివ్ ని కోప్పడటం, కొట్టటం కూడా జరిగంది. పాస్ పర్ట్ కి కూడా డిటెక్టివ్ ఫిక్స్ మీద చాలా కోపం వచ్చింది. గట్టిగానే కోప్పడ్డాడు పాస్ పర్ట్ డిటెక్టివ్ ఫిక్స్ ని.
ఆ తర్వాత ఇంకా ఆలస్యం చేయకండా వెంటనే వాళ్ళు రైల్వే స్టేషన్ కి బయలు దేరారు. అక్కడికి వెళ్లేసరికి దురదృష్టం కొద్ది రైలు ఆలస్యంగా వచ్చింది. మరి ఆరోజు 21 డిసెంబర్ ఇక్కడ రైలు ఆలస్యం అయింది. అందరూ చాలా ఆదుర్దాగా రైలు ఎక్కేసారు.ఇంగ్లాండ్ హూస్టన్ స్టేషన్ కి చేరి టైం చూద్దామని గడియారం వైపు చూసారు. ఆ గడియారం 21 డిసెంబర్ సాయంత్రం 8 .50 నిముషాలు చూపిస్తుంది.
ఎంత దురదృష్టమంటే సరిగాా అయిదు నిముషాల ఆలస్యం వల్ల పందెం ఓడిపోతున్నాం అని అందరికి బాధ కలిగింది. మౌనంగానే వాళ్లలో వాళ్ళు బాధ పడుతూ ఇంటికి వెళ్లిపోయారు.
ఫిలియాస్ ఫాగ్ ముభావంగా గంభీరంగా , మౌనంగా ఉన్నారు. పాస్ పర్ట్ చాలా బాధ పడుతున్నాడు. తన యజమాని ఈ పోటీ గెలవాలని ఎంతో కోరుకున్నాడు. చివరికి ఇలా ఐదు నిమిషాల వల్ల ఓడి పోవటం ఏమిటీ అని అనుకున్నాడు. మేడం ఔదా కూడా ఇలా జరిగినందుకు చాలా బాధ పడింది.
ఆ మర్నాడు ఫిలియాస్ ఫాగ్, మామూలుగా అయితే పొద్దున్నే 11.౩౦ కల్లా టంచనుగా రిఫార్మ్స్ క్లబ్ కి బయలుదేరాడు. కానీ వెళ్ళలేదు . మొట్టమొదటి సారిగా అలా జరిగింది.
ఫిలియాస్ ఫాగ్, మేడం ఔదా దగ్గరకి వచ్చాడు . నేను మిమ్మల్ని ఇంగ్లాండ్ కి తీసుకుని వచ్చాను. మీకు ఎంతో మంచి జీవితాన్ని ఇవ్వా లని ఆశ పడ్డాను. కానీ ఇప్పుడు నేను బీదవాడిని అయ్యాను. నాక ఈ ఇల్లు మాత్రమే ఉంది. అని ఎంతో బాధగా అన్నాడు.
దానికి సమాధానంగా అదే మిటి? మీక ఎవరూ స్నేహితులు లేరా... అని అడిగింది . అంటే
ఫిలియాస్ ఫాగ్ లేరు. నాకు స్నేహితులు ఎవరూ లేరు అన్నాడు. మరి బంధువులు కూడా
ఎవరూ లేరా. అంటే, బంధువులు కూడా ఎవరూ లేరు అని ఫిలియాస్ ఫాగ్ ముక్తసరిగా జవాబిచ్చాడు. అందుకు క మేడం ఔదా పరవాలేదు మనకి బంధువులు ఎవరూ లేకపోయినా, స్నేహితులు ఎవరూ లేకపోయినా, డబ్బులు లేకపోయినా మనిద్దరమూ హయిగా జీవించ వచ్చును.. నేను మీకు తోడుగా వుంటాను. సహా యంగా నిలుస్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అనగానే, ఆ మాటలకి ఫిలియాస్ ఫాగ్ కళ్ళు చెమ ర్చా యి. కంట్లోనీటి చుక్కలు మెరిసాయి. యిది అంతా గమనిస్తున్న పాస్ పర్ట్ ఆ సన్నివేశానికి చలించిపోయాడు. ఔదా మళ్ళీ ఇలా అంది ఫిలియాస్ ఫాగ్ తో. "చూడండి ! నేనెవ్వ రో తెలియక పోయినా, చితి మంటల్లో కాలిపోవాల్సిన నన్ను కాపాడారు. నాకు ఒక కొత్త జీవితాన్ని కల్పించారు. ఇవన్నీ నేను ఎలా మరిచిపోగలను?" అని అంది.
ఫిలియాస్ ఫాగ్ సమాధానంగా. "మరి నిన్ను అంత దారుణంగా చితి మంటల మధ్య దహనం చితి మంటల మధ్య దహనం చేయాలనుకంటే అది చూసిన నేను భరించలేక పోయాను. అందులో నా గొప్పతనం ఏమీ లేదు", అని అన్నాడు.
అపుడు వెంటనే ఫిలియాస్ ఫాగ్, ఔదా అంగీకారం తెలపడం తో , పాస్ పర్ట్ ని పిలిచి, నీకు Rev. విల్ సన్ గారి ఇల్లు తెలుసు కదా! నేను, ఔదా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకంటున్నాం. వెంటనే దానికి సంబంధించిన వివరాలు కనుకు ని రా అని చెప్ప గానే పాస్ పర్ట్ ఎంతో సంతోషంగా వెంటనే పరిగెత్తాడు. మళ్ళీ కాసేపటికి ఊపిరి ఎగబీలుస్తూ వెనక్కి వచ్చాడు. మై మాస్టర్ ! ఫిలియాస్ ఫాగ్ ! ఇవ్వాళ శనివారం. యింకొక పది నిముషాల్లో బయలు దేరాలి రిఫార్మ్ క్లబ్ కి వెళ్ళండి.మీరు మీ పందాన్ని గెలిచారు అంటూ సంతోషంగా గట్టిగా అరిచి చెప్పా డు. ఈ రోజు డిసెంబర్ 21వ తేదీ! శనివారం ! సాయంత్రం 8 .45 నిముషాలకి మీరు రిఫార్మ్ క్లబ్ కి చేరుకోవాలి. ఇంకా టైముంది. త్వ రగా బయలు దేరండి అంటూ తొందర పెట్టాడు పాస్ పర్ట్.
"అదేమిటీ ! ఇవ్వాళ శనివారమా ! అది ఎలా ! "అంటూ ఆశ్చర్య పోయాడు. అసంభవం
కదా! అన్నాడు ఫిలియాస్ ఫాగ్. సమాధానంగా పాస్ పర్ట్ మనం ప్రదక్షిణ తూర్పు
వైపుగా ప్రయాణం చేసాము. తూర్పు దిశగా వెళ్ళితే మనకు సమయం చాలా కలిసి వస్తుంది..
అందు కే మనం రెండు రోజులు ముందు గానే గమ్యాన్ని చేరుకున్నాము. ఎక్కువ టైం లేదు.
మీరు త్వరగా బయలు దేరండి , అంటూ హడావిడి చేసాడు. తానే ఒక గుర్రపు బండి ని
మాట్లాడి రిఫార్మ్ క్లబ్ చేరుకోవాలన్న తొందర వల్ల తానే వేగం గా నడపడం మొదలు
పెట్టా డు పాస్ పర్ట్ . మధ్యలో రెండు కుక్కల ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక ముసలావిడ
కూడా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.. రిఫార్మ్ క్లబ్ చేరగానే హుందాగా,
ఎటువంటి హావభావాలు ప్రదర్శించకుండా , 8.45 నిముషాలకి క్లబ్ ద్వారం దగ్గరకి
ఫిలియాస్ ఫాగ్ చేరారు. క్లబ్ లో ఉన్న స్నేహితులందరూ ఆదుర్దాగా ఎదురు
చూస్తున్నారు. ఇంకొక్క నిముషమే ఉంది అని అనుకుంటుండగా తలుపు తెరిచి, "Good evening, gentlemen, I am back here. I hope I am a rich man now", అని అన్నాడు ఫిలియాస్ ఫాగ్.
అందరూ అతనితో ఆనందంతో ,"అవును నీవు పందెం గెలిచావు. నువ్వు రిచ్ మాన్ వి "అని చప్పట్లు కొట్టారు. అక్కడున్న వారందరూ ఫిలియాస్ ఫాగ్ విజయ వంతంగా భూప్రదక్షిణ చేసి వచ్చినందుకు చాలా సంతోషించారు.
మేడం ఔదా, పాస్ పర్ట్ లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారి ఆనందానికి పగ్గాలు లేవు.యింటికి రాగానే సోమవారం నాడు ఔదా, ఫిలియాస్ ఫాగ్ వివాహం చేసుకున్నా రు. పాస్ పర్ట్ కి వీరిద్దరి వివాహం చాలా ఆనందం కలిగించిoది. ఆ సందర్భం లో పాస్ పర్ట్ ఒకమాట అన్నాడు. నిజానికి ఫిలియాస్ ఫాగ్ గారు తూర్పు దిశ్ల్ల మనం ఇండియా దిక్కుగా వెళ్లకుండా వేరే మార్గం లో వెళ్లి ఉంటె, మనం 78 రోజుల్లోనే భూప్రదక్షిణ చేసి రిటర్న్ వచ్చే వాళ్ళం . అంటే ఫిలియాస్ ఫాగ్ పాస్ పర్ట్ తో నిజమే! నువ్వన్నట్టు వేరే దిశ లో ప్రయాణించి ఉంటె త్వరగా వచ్చే వాళ్ళం, కానీ మన ప్రయాణం ఇలా సాగినందుకే కదా నాకు ఇంత అందమైన ఔదా లభించింది. నా భార్య గా చేసుకోగలిగాను అంటూంటే ఔదా, పాస్ పర్ట్ లు ఇద్దరూ ఎంతో సంతోషించారు.
సోమవారం వివాహం చేసుకున్న తర్వాత వారందరూ చక్క గా, ఉత్సాహంగా పార్టీ
చేసుకున్నారు. అప్ప టి నుంచీ ఔదా, ఫిలియాస్ ఫాగ్, పాస్ పర్ట్ లు హాయిగా, ఆనందంగా
వారి జీవితాలు గడిపారు. ఆ తర్వాత నుంచీ, యదావిధిగా, వారి జీవిత ప్రయాణం ఎప్పటిలాగానే సాగింది. వీరి 80 రోజుల్లోభూప్రదిక్షిణ చేసిన విషయాన్ని మాత్రం అందరూ ఎంతో గొప్ప గా, సాహస కృత్యంగా చెప్పుకున్నారు
ప్రియమైన పాఠ కుల్లారా.... ఈ కథను విని మీరందరూ ఆనందిస్తారని , భౌగోళిక పరిస్థితులు,
సమయాల వివరణ అర్థం చేసుకుంటారనే అనుకంటున్నాను. ఒక దిశ గా ప్రయాణిస్తే ఒక
టైం జోన్, ఇంకో దిశ గా ప్రయాణిస్తే, ఇంకో టైం జోన్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ముందుకి ,
మరోసారి ఇంకో టైం జోన్ వల్ల ప్రయాణిస్తే 80 రోజుల్లో భూప్రదక్షిణ కావించాము. మీకు నచ్చిందని భావిస్తున్నాం.
నమస్తే !
*************
Saturday 10 June 2023
80 -రోజుల్లో భూప్రదక్షిణ - 6
ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్ తన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా అతను
తన నాయకత్వ లక్షణాలు చూపుతూ అధైర్య పడకుండా తగినట్టుగా ప్రణాళికలు
రచిస్తూ వున్నాడు.
కెప్టెన్ గా మరీనా ఫిలియాస్ ఫాగ్ లోగడ మనం చెప్పుకున్నట్లుగా 45 నిముషాలు ఆలస్యంగా
వెళ్లినందుకు చైనా అనే ఓడ వీళ్ళు లివర్ పూల్ కి వెళ్ళవలసినది మిస్ అయిపోయారు.
అయితే ఫిలియాస్ ఫిలియాస్ ఫాగ్ మాత్రం తన ప్రయత్నాలని తాను చేస్తూ ఆఖరికి పారిస్ కి వెళ్లే కార్గో షిప్ ని ఎలాగో ఎక్కి, ప్రయాణికుడికి 2000 పౌండ్స్ చొప్పున నలుగురికీ పే చేయటం, ఆ ఓడ పేరు H S (Hispilania )ఫిలానియా. ఆ ఓడ ఎక్కాక ఆ నావికులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ నలుగురు ప్రయాణీకులనీ లివర్ పూల్ చేర్చేలా ఒప్పుకోవటగం, ఆ నావికులందరూ కలిసి, ఓడ నడిపే కెప్టెన్ ని బంధించి, గదిలో పెట్టి తాళం వేయటం తెలుసుకున్నాం.
ఈ విధంగా ఆగమేఘాలమీద ఆ కార్గో ఓడ హైస్పీలనియా (Hispilania), లివర్ పూల్ దిశగా ప్రయాణించింది. అందరూ ఆశ్చర్య పడేలా ఫిలియాస్ ఫాగ్ ఆ ఓడకి కెప్టెన్ గా బాధ్యత వవహించాడు. పడవ నడిపే నావికులు కూడా ఫిలియాస్ ని చూసి చాలా ఆశ్చర్య పడ్డారు.
డిటెక్టివ్ ఫిక్స్ మాత్రం ఇలా అనుకున్నాడు మనసులో. ఇతడు మామూలు దొంగ కాదు. సముద్రపు దొంగ అయివుంటాడు. ఇతడేమిటి కార్గో షిప్ లో వెళ్ళాడు. పైగా పారిస్ వెళ్లాల్సిన ఓడలో బోల్డంత డబ్బు చెల్లించి, లివర్ పూల్ దిశగా తానే కేప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు. లివర్ పూల్ కెళ్ళి అక్కడినుంచి ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడు. అదేమిటో నాకేమీ అర్ధం కావటంలేదు. మళ్ళీ ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడేమిటి? నాకేమీటీ. అర్ధం కావటం లేదు, అని బుర్రబద్దలుకొట్టుకుంటున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆరోజు డిసెంబర్ 10 వ తేదీ. వీళ్ళు న్యూయార్క్ ఓడరేవు దగ్గర దిగి లివర్ పూల్ కివెళ్లాలనుకున్నపుడు అది డిసెంబర్ 20 వరకు ఏ ఓడ బయలు దేరదన్నపుడు, మరి పందెం ఓడిపోతాడు కదా! 21 వ తేదీ కల్లా రిఫార్మ్స్ క్లబ్లోకి సాయంత్రం 5 PM కల్లా వెళ్ళాలి కదా! అందుకే ఫిలియాస్ ఫాగ్ గారు ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు. సరిగ్గా డిసెంబర్ 14 న ఫిలియాస్ ఫాగ్ ఓడ కి కెప్టెన్ గా వ్యవహరించి, అతి చాకచక్యంగా ఆ ఓడని లివర్ పూల్; వైపుగా అట్లాటిక్ మహా సముద్రం ద్వారా ప్రయాణించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణం ఏమాత్రం సహకరించట్లేదు. ఓడ చాలా వేగంగా వెళ్తోంది. పాస్ పర్ట్ ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఫిలియాస్ ఫాగ్ చాలా గంభీరంగా వున్నాడు. వాతావారణం ప్రతికూలంగా వుంది కాబట్టి అతను తన మనసునంతా ప్రయాణం దిశగా కేంద్రీకరించి ఓడను నడుపుతున్నాడు. ఈలోగా ఆ నావికుల్లో ఒకడు వచ్చి ఏమండీ! ఇంత వేగంగా ఓడను నడుపుతున్నాము. మనకు బొగ్గు నిల్వలన్నీ చాలా తగ్గి పోయాయి.ఇంత వేగంగా ప్రయాణం చేస్తే మన ఓడలో ఏమాత్రం బొగ్గు మిగలదు. ప్రయాణం మధ్యలో నిలప వలసివస్తుంది. ప్రయాణం లివర్ పూల్ దాకా వెళ్ళటం కష్టం అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడెలా! ఎలా వెళ్ళటం అబ్బా! అని అందరూ అనుకుంటూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్ మాత్రం చాలా గంభీరంగా, ఎటువంటి పరిస్థితిలోనూ ఈ వేగం తగ్గించటానికి వీలులేదు.మీరు ఒకపని చేయండి. ఈ ఓడమీద చెక్కతో చేసిన స్తంబాలు, కుర్చీలు వంటి వాటిని విరక్కొట్టండి. వాటిని మనం కలప లాగా వాడుకుందాం. కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఈ వేగాన్ని తగ్గించటానికి వీలులేదు, అని దృడంగా చెప్పాడు. ఎందుకంటె ఆ ప్రయాణానికి చాలా డబ్బు అతను ఇస్తున్నాడు కాబట్టి ఆ నావికులందరూ కూడా, ఆ ఓడలో చెక్కతో చేసిన వస్తువులనన్నింటినీ విరగకొట్టి, కలపలాగా, వాడుకుంటున్నారు. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో చాలా దూరం వరకు వచ్చేసారు. కాసేపట్లో ఒక నావికుడు వచ్చి, అయ్యా, ఏర్పాటు చేసిన కలప అంతా అయిపోయింది. ఇంకా తగల బెట్టడానికి ఏమీ లేదు. దగ్గరలో ఉన్న ద్వీపం దగ్గర ఆ పడవని ఆపారు. ఫిలియాస్ ఫాగ్ ఎంతో ధైర్యంగా ఆ ఓడని దిగి, పక్కనే వున్న క్వీన్ స్టోన్అనే స్టేషన్ కి వెళ్లి, అక్కణ్ణించీ డబ్లిన్ వెళ్లి, అక్కణ్ణుంచి ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయం చేసుకున్నాడు. ఎలాగైతే
నేమి వాళ్ళు 20 డిసెంబర్ కి అనుకున్న గమ్యస్థానం లివర్ పూల్ కి చేరుకున్నారు. పాస్ పర్ట్ కి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటె తన యజమాని 21 డిసెంబర్ కల్లా రిఫార్మ్స్ క్లబ్ కి చేరుకుంటాడు. లివర్ పూల్ నుంచి ఆరుగంటల ప్రయాణమే కదా అని సంతోషపడుతూ వున్నాడు.ఈలోగా డిటెక్టివ్ ఫిక్స్ చాలా ఆనందంగా ఉన్నాడు. అతను వచ్చాడు. వీళ్లంతా సంతోషంగా ఉన్నారు. ఫిలియాస్ ఫాగ్ దగ్గరకెళ్ళి మీ పేరు ఫిలియాస్ ఫాగ్ కదా, అని అడిగాడు. డిటెక్టివ్ ఫిక్స్. ఒక్కింత ఆశ్చర్యడ్పడ్డాడు ఫిలియాస్ ఫాగ్ అలా అడగటంతో. అవును అన్నాడు ఫిలియాస్ ఫాగ్. మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను. బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ లో దొంగతనం చేశారు. అరెస్ట్ వారెంట్ చేతికి రావాలని మీ చుట్టూ తిరుగుతున్నాను . మిమ్మల్నిపుడు
అరెస్ట్ చేస్తున్నాను, అని అనగానే అందరూ చాలా ఆశ్చర్య పడ్డారు. ఫిలియాస్ ఫాగ్ కూడా ఒక్క క్షణం అవాక్కయ్యాడు. కానీ ఒకరకమైన నిస్సహాయ స్థితిలో వున్నాడు యిపుడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఫిలియాస్ ఫాగ్ కి చాలా కోపం వచ్చింది మొట్టమొదటి సారి. ఫిలియాస్ ఫాగ్
డిటెక్టివ్ ఫిక్స్ తో నీ అంత ద్రోహి ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను నా స్నేహితుడిగా భావించి, నీ కోసం నేను నా డబ్బులు ఖర్చు చేసి, నిన్ను ఇంతవరకూ తీసుకుని వచ్చాను. ఇంత విశ్వాసఘాతకుడివి అని నేనెప్పుడూ అనుకోలేదు, అని చాలా గట్టిగా కోప్పడ్డాడు. మనసులో డిటెక్టివ్ ఫిక్స్ నిజంగానే ఫిలియాస్ ఫాగ్ మంచివాడిలాగే ఉన్నాడు. కానీ నేను ఏం చేయగలను.
నేను న్యాయంగా నా డ్యూటీ చేస్తున్నాను. ఈ హఠాత్పరిణామం చూసి మేడం ఔదా వెక్కి వెక్కి ఏడుస్తూ పాస్ పర్ట్ భోజంపై తలవాల్చి తన దుఃఖాన్ని ప్రకటిస్తోంది. ఫిలియాస్ ఫాగ్ ఏమీ చేయలేని పరిస్థితిలో జైల్లో బంధింప బడ్డాడు. తన సర్వస్వం అంతా పోగుట్టుకున్నాడు. ఏంచేయాలి. ఒక మంచి అవకాశం దొరికితే బాగుండును కదా అని అనుకున్నాడు. అతడు
విజయానికి చాలా చేరువలో ఉన్నాడు. విధి ఎంత విచిత్రమైనది కదా అని అనుకున్నాడు. నేను దొంగని అని భ్రమించి, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఆలోచిస్తూ ఉండగా, కొద్దీ క్షణాల్లోనే పాస్ పర్ట్ , ఔదా, గబగబా పరుగెత్తుకుంటూ ఫిలియాస్ ఫాగ్ ఉన్న జైలు దగ్గరికి వచ్చారు. వెంటనే
వెనుకే డిటెక్టివ్ ఫిక్స్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఫిలియాస్ ఫాగ్ గారూ! మీరు వెళ్లిపోవచ్చు. మీరు స్వేచ్ఛా జీవి. బ్యాంకులో దొంగతనం చేసిన అసలైన దొంగని మూడురోజుల క్రితమే అరెస్ట్ చేశారు. కాబట్టి మీరు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అని చెప్పగానే, ఫిలియాస్ ఫాగ్ బయటికి
వచ్చాడు. కానీ అతనికి చాలా కోపంగా ఉంది. ఏమీ చేయని నేరానికి ఇలా చేస్తాడా అని, ముందు ఎడమ చేత్తో తర్వాత కుడిచేత్తో డిటెక్టివ్ ఫిక్స్ డొక్కలో పొడిచాడు గట్టిగా. పిడి గుద్దులు గుద్దాడు. ఆ దెబ్బలకి డిటెక్టివ్ ఫిక్స్ ఒక్కసారిగా కిందపడిపోయాడు.
***********
Thursday 8 June 2023
Wednesday 7 June 2023
80 రోజుల్లో భూప్రదక్షిణ - 5
4వ అధ్యాయంలో, ఏ విధంగా ఘోరమైన ప్రమాదం నుండి, తప్పించుకుని,ఊపిరి పీల్చుకున్నారో తెలుసుకున్నాము. ఆ రైలు మొత్తం, శిధిలమైన ఆ వంతెన మీదుగా అతివేగంగా ప్రయాణించి, చివరి బోగీ సురక్షితంగా ఆ వంతెనని దాటాక, ప్రయాణీకులందరూ చూస్తుండగానే భయంకరమైన శబ్దంతో కిందవున్నఅగాధంలో ఆ వంతెన పడిపోయింది. ఈ విధంగా, జోన్ పాస్ పర్ట్ మొత్తానికి ఎలాగైతేనేఁ , అందరమూ ప్రమాదం నుంచి బయట పడ్డం కదా అని ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాతి ప్రయాణం సుఖవంతంగా సాగింది. అటూ ఇటూ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొలరాడో పర్వతాలు చాలా అందంగా ఉన్నాయి. రమణీయంగా వున్నాయి. కానీ జోన్స్ పాస్ పర్ట్ మాత్రం తన యజమానికి పోటీ గురించే ఆలోచిస్తున్నాడు. తాను డిటెక్టివ్ ఫిక్స్ ప్రక్కన కూర్చున్నా కూడా అతనితో మాట్లాడాటానికి మనసు ఇష్టపడటం లేదు. ఈ విధంగా ప్రయాణం సాగుతోంది. ఫిలియాస్ ఫాగ్ చాలా నిశ్చింతగా ఏమీ పట్టనట్లుగా మేడం ఔదా తో హాయిగా పేకాట ఆడుకుంటున్నాడు. డిటెక్టివ్ ఫిక్స్ చిన్న పిల్లవాడిలా కంపార్టుమెంటులో ఉయ్యాలలు ఊగుతుంటే, అతడి తల కూడా కిందకీ పైకి కదులుతోంది. అయితే పాస్ పర్ట్ మాత్రం ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎటువంటి అవాంతరాలు వస్తాయో, అని మనసులో ఎందుకో అనుకుంటూ వున్నాడు. మూడు రోజులై, మూడు రాత్రులు ప్రయాణం తర్వాత వారు దాదాపు 2200 కిలోమీటర్లు పైన ప్రయాణం చేశారు వాళ్ళు. మిగిలిన ప్రయాణీకులు కూడా దాదాపు ఈ ప్రయాణానికి అలవాటు పడిపోయారు. సరిగ్గా పాస్ పర్ట్ ఊహించి నట్టుగా కొద్ది రోజుల్లోనే, ఆ రైలు కి రెండు వైపులనుంచీ పెద్దపెట్టున నినాదాలతో సూ ఇండియన్స్ వాళ్ళు బాణాలతోను, బల్లాల తోను,గుర్రాలమీద, వేగంగా వస్తూ ముందుకు రాసాగారు. ప్రయాణీకుల మీద బాణాల వర్షం కురిపించ సాగారు.
జరిగిన ఈ హఠాత్పరిమాణానికి ఈ కూర్చున్న ప్రయాణీకులందరూ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. అందులోని కొందరు ధైర్యస్తులు తమ పిస్టళ్లను తీసి ఆ న్యూ ఇండియన్స్ మీద కాల్చటం మొదలు పెట్టారు. ఈ ఇధంగా అనేకమంది, స్యూ ఇండియన్స్ పట్టాల వెంబడి రెండువైపులా, గట్టిగా అరుస్తూ బాణాలు వదులుతూ వున్నారు. గుర్రాలు కూడా చాలా వేగంగా కదులుతున్నాయి. చివరికి వారు ఆ ఇంజిన్ లోనికి ఎక్కటం, ఆ ఇంజిన్ డ్రైవర్లని వారు గట్టిగా తాళ్లతో కట్టేసి, ఆ రైలు నుండి బయటికి తోసివేసారు. ఈ దెబ్బకి మెల్లి మెల్లి గా అందరూ కొంత తేరుకున్నారు. అయితే ఆ దగ్గరలోనే పోర్ట్ కెనీ అనే ప్రాంతంలో ఈ మిలిటరీ సైనికులు ఉన్నారు. వాళ్లంతా కూడా ఈ రైలు చప్పుడు, దానిలోంచి పిస్తోళ్ళ చప్పుళ్ళకి, స్యూ ఇండియన్స్ చేస్తున్న నినాదాలు అరుపులూ కేకలూ విని, ఏమిటా అని వారు బయటికి వచ్చి, ఆ స్యూ ఇండియన్స్ మీద వారు కూడా తూటాలా వర్షం కురిపించారు. ఈలోగా ఈ స్యూ ఇండియన్స్ లో కొంతమంది, వారి లోవున్న ఒక నాయకుడు, చూడు, ఈ రైల్ లో ఉన్న ఒకతను మనల్ని చాలా యిబ్బంది పెడుతున్నాడు. అతన్ని పట్టుకుని పారిపోదాం పదండి అని చెప్పి , ధైర్యస్తులైన యిద్దరు ప్రయాణీకులను వారు పట్టుకున్నారు. వాళ్ళని రక్షించడానికి వెళ్లిన పాస్ పర్ట్ ని కూడా గట్టిగా పట్టుకుని, కిందకి దింపి, ఆ ముగ్గురినీ వాళ్ళ గుర్రాలమీద ఎక్కించుకుని, అడవుల్లోకి పారిపోయారు. ఎందుకంటె ఈ మిలిటరీ వాళ్ళు కూడా గుర్రాల మీద రావటంతో స్యూ ఇండియన్స్ పారిపోయారు. ఈ పరిణామానికి మేడం ఔదా చాలా విచారపడింది. అయ్యో! పాస్ పర్ట్ సహాయం చేయబోయి, తానే ఇరుక్కున్నాడే... ఎలా? అని ఎంతో బాధపడుతూ ఉంది. ఎందుకంటె మేడం ఔదా కి పాస్ పర్ట్ పట్ల ఎంతో మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటె ఎప్పుడైతే స్యూ ఇండియన్స్, ఇంజిన్ డ్రైవర్లను బయటికి విసిరి వేసారో మరి ఆ రైలు ని ఆపాలి కదా మరి ఎలా ఆపాలి. అందరూతలపట్టుకున్నారు. డ్రైవర్లు లేకుండానే ఆ ట్రైను ప్రయాణం చేస్తున్నప్పుడు, పాస్ పర్ట్ కి ఒక ఆలోచన వచ్చింది. అతను చాలా బలిష్టంగా ఉంటాడు కాబట్టి, తన కంపార్ట్మెంట్ తలుపు తెరిచి, చాలా ధైర్యంగా, ఆ కారేజీ కిందికి వెళ్లి, బలవంతుడు కాబట్టి, మెల్ల మెల్లగా, ఇంజిన్ దిశగా పాక్కుంటూ వెళ్లి, సరిగా ఇంజిన్ దగ్గర బోగీ కి వచ్చి, ఇంజిన్ కీ, బోగీలకీ వున్న లింకు ని తన బలిష్టమైన చేతులతో విడ దీసాడు. ఇతడు చేసిన అద్భుతమైన సాహసం వల్ల , మెల్లగా ఆ భోగీలన్నీ ఆగి పోయాయి. అందుకని, మిగతా ప్రయాణీకులూ, మేడం ఔదా కూడా, పాస్ పర్ట్ తన ప్రాణానికి తెగించి ఇంతమందిని కాపాడాడు. ఆఖరికి ఈ స్యూఇండియన్స్ పట్టుకెళ్ళిపోయారే అని బాధపడ సాగారు. అప్పుడు ఫిలియాస్ ఫాగ్ వచ్చి, ఏం ఫరవాలేదు. నేను వాళ్ళని తీసుకువస్తాను. పాస్ పార్ట్ , బతికున్నా ,చనిపోయినా సరే తీసుకు వస్తాను. అని ధైర్యంగా చెప్పాడు. అతడిని చూసి ఇతడే నాకు తగిన కథానాయకుడు. ఇతనికి భయం కూడా లేదు. అని మేడం ఔదా మనసులో ఫిలియాస్ ఫాగ్ గురించి అనుకుంటూ ఆనందపడింది. కృతజ్ఞతా భావంతో పొంగిపోయింది. అయితే ఫిలియాస్ ఫాగ్ తనతో పాటు కొంతమంది సైనికులు తోడుగా వస్తే, వాళ్ళని రక్షించి వెనక్కి తీసుకురాగలము అన్నాడు. దానికి సైనికులుసిద్ధపడ్డారు. ముప్పైమంది సైనికులు, ఫిలియాస్ ఫాగ్ స్యూ ఇండియన్స్ తీసుకెళ్లిన పాస్ పర్ట్, ని, మిగిలిన ప్రయాణీకులనూ తీసుకు రావడానికి అందరూ కలిసి అడవుల్లోకి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం అయిపోయినా ఇంకా ఫిలియాస్ ఫాగ్ వాళ్ళు వెనక్కి రాలేదు. మేడం ఔదా, డిటెక్టివ్ ఫిక్స్ అక్కడే స్టేషన్లో ఉన్నారు.
వారు ఆ రాత్రంతా చలికి గజగజా వణుకుతూ అలాగే కూచున్నారు. మేడం ఔదా ఫిలియాస్ ఫాగ్, పాస్ పర్ట్ ల గురించి ఆలోచిస్తోంది. సరిగ్గా సూర్యోదయం అయ్యేసరికి, అక్కడ అరుపులూ, కేకలూ వినిపించే సరికి, ఏం జరిగిందా అని చూసేసరికి ఫిలియాస్ ఫాగ్ అందరికన్నా ముందున్నాడు. సైనికులు వెనక పాస్ పర్ట్ మిగిలిన యిద్దరు ప్రయాణీకులు. వెనక్కి క్షేమంగా రావటం, సంతోషంతో హర్షద్వానాలతో మారుమోగిపోయింది. మేడం ఔదా చాలా సంతోషించింది. వీరందరూ వెనక్కి క్షేమంగా రావటం చూసి గట్టిగా ఆనందంతో అరిచింది. అమ్మయ్యా ! క్షేమంగా వెనక్కి వచ్చేసారు అని. అందరూ వీరు వెనక్కి రావడం చూసి ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు తాము ముందుకి ప్రయాణం ఎలా కొనసాగించాలా అని ఆలోచనలో ఉన్నారు. డిటెక్టివ్ ఫిక్స్ బయటికి వెళ్ళాడు. ఎవరితోనో మాట్లాడాడు. అతనిని తీసుకుని వెనక్కి వచ్చాడు. అతను ఈ విధంగా చెప్పాడు. ఇతను స్లెడ్జి ని నడుపుతాడు. విపరీతమైన మంచు కురిసి, ప్రయాణం ఆగిపోయినపుడు తన స్లెడ్జి మీద ప్రయాణీకులని, ఆ తర్వాతి స్టేషన్ కి తరలిస్తూ ఉంటాడు, అని పరిచయం చేసాడు. వీళ్ళు అంటే ఫిలియాస్ ఫాగ్ వాళ్ళు వయా చికాగో, న్యూయార్క్ కివెళ్లాలని ఆలోచన అన్నమాట. సరేనని అంతనితో బేరం కుదుర్చుకుని, ఈ ప్రయాణీకులంతా ఎక్కారు. చాలా మందే ఎక్కారు. అది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. కానీ చాలా చల్లగా వుంది. వెచ్చని దుస్తులు కప్పుకున్నప్పటికీ కూడా చాలా చలి గా ఉండాలి. ప్రయాణీకులందరూ ఒకరితో ఒకరు మాటలు లేకుండా, బిగుసుకు పోయి వున్నారు. మొత్తానికి వారు అనుకున్న స్టేషన్ కి చేరుకున్నారు.చాలాపెద్ద మొత్తంలో స్లెడ్జి నడిపే యజమానికి ధనాన్ని ముట్టజెప్పాడు. డిటెక్టివ్ ఫిక్స్ కి మాత్రం ఈ ఫిలియాస్ ఫాగ్ మనస్తత్వం ఏమీఅర్ధం కావటం లేదు. ఎందుకంటె ఫోర్ట్ కీనీ స్టేషన్ లో ఫిలియాస్ ఫాగ్ఆ స్టేషన్ మాస్టారుతో న్యూయార్క్ వెళ్ళటానికి రైలు ఎప్పుడుందని అడిగితే అదే రోజు సాయంతరం ఉందని చెప్పాడు. ఫిక్స్ సాయంతరం రైలు కె బయలు దేరుతారని అనుకున్నాడు. కానీ, ఫిలియాస్ ఫాగ్ మాత్రం తన ప్రయత్నాల్ని మానుకోలేదు. అప్పటికే ప్రయాణంలో 24 గంటలు వెనక్కి వున్నారు. దానికి తానే బాధ్యుణ్ణి కదా అని పాస్ పర్ట్ లోలోపల ఎంతో బాధపడుతున్నాడు.
అటువంటి సమయంలోనే ఈ స్లెడ్జి మీద ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. తప్పని సరిగా ఫిక్స్ వాళ్ళతో పాటుగా ప్రయాణించి, వీళ్ళు ఎప్పుడైతే ఇంగ్లాండ్ లో అడుగు పెడ్తారో అప్పుడు అరెస్ట్ చేసేస్తాను, అని మనసులో అనుకుంటూ వున్నాడు. వీళ్ళు స్టేషన్ చేరుకోగానే చికా గో వెళ్ళడానికి రైలు సిద్ధంగా వుంది. అక్కడి నుంచి వెంటనే న్యూయార్క్ వెళ్ళటానికి కూడా రైలు సిద్ధంగా ఉండటం సంభవించింది. ఆ విధంగా న్యూయార్క్ కూడా చేరుకోవటం వీలైంది. ఈ విధంగా వాళ్లకి ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఫిలియాస్ ఫాగ్ ముందుచూపు, నాయకత్వ లక్షణాల వల్ల ఒహామా అనే స్టేషన్ నుంచి చికా గో, అక్కడి నించి, న్యూయార్క్ కి 11 గంటలకి 11 డిసెంబర్ న చేరారు. అక్కడినించి చైనా అనే ఓడ ఎక్కి లివర్పూల్ కి వెళ్లాలన్నమాట. కానీ వీళ్ళు ఆ ఓడ ఎక్కాలని, ఓడరేవుకి 45 నిముషాలు ఆలస్యంగా వెళ్లారు. దాంతో ఆ చైనా అనే ఓడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడినించి, ఒక పెద్ద అవాంతరాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. పాస్ పర్ట్ చాలా గాబరా పడసాగాడు. ప్రయాణం చివరగా చాలా దగ్గరికి వచ్చేసాము అక్కడినించి వాళ్ళు లివర్ పూల్ కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కువ సమయం పట్టదు లండన్ చేరుకోవటానికి. అయ్యో! ఈ అవాంతరం వచ్చిందేమిటి, అనుకున్నాడు. ఫిలియాస్ ఫాగ్ మాత్రం చాలా ధైర్యంగా, గంభీరంగా ఉన్నాడు. అతడు అక్కడే వున్న ఒక ఓడ యజమాని దగ్గరకు వెళ్ళటం జరిగింది. ఫిలియాస్ ఫాగ్ అతనిని మీరు లివర్పూల్ కి తీసుకెళ్తారా అని అడిగితే వారిలో ఎవరూ కూడా కుదరదు అని చెప్పారు. ఎవరూ ఒప్పుకోలేదు. ఆఖరికి ఫిలియాస్ ఫాగ్ సామాన్లను మోసుకెళ్లే ఓడ ఉంటె కార్గోషిప్ దగ్గరికెళ్లి అతనితో బేరమాడాడు. కెప్టెన్ ఆ కూడా పారిస్ కి వెళ్లాలని, 20 డిసెంబర్ కల్లా ఈ సరుకులన్నిటినీ అక్కడి వారికి అందజేయాలని, కాబట్టి తానూ రావటం కష్టం,వారిని తీసుకెళ్లలేనని, నిర్మహమాటంగా చెప్పాడు. అప్పుడు ఫిలియాస్ ఫాగ్ మీతో పాటు మేము వస్తాము. నువ్వు ఎక్కడికెళ్తే అక్కడికి వస్తాము. అంటే నీ ప్రయాణం పారిస్ కి కదా, అక్కడికి వస్తాము. మేము నలుగురం వున్నాము. ఒక్కొక్కరికీ నీకు రెండు వేల డాలర్ చొప్పున ముట్టజెప్తాను. మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగాడు. ఆ కెప్టెన్ చాలా ఆశ్చర్య పడ్డాడు. ఏమిటీ ఇంత డబ్బిస్తానంటున్నాడు ఇతను. కెప్టెన్ సరే అలాగే తీసుకెళ్తానని చెప్పటం, ఆ మాటలు వింటున్న ఫిక్స్ కి మతిపోవటం జరిగింది.అదేమిటి, ఈ కార్గోషిప్ లో పారిస్ కి వెళ్ళటం ఏమిటి? ఎక్కడికో, ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లి పారిపోవాలని అనుకుంటున్నాడేమో.... నాకు వేరే గత్యంతరం లేదు. నేను ఇతని చుట్టూ తిరిగినా అతనివెంటే వెళ్లి, ఏదో ఒక రోజు తప్పకుండా అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా అనుకున్నాడు.
సరే! అందరూ ఆ కార్గోషిప్ ఎక్కారు. ఈ లోగా ఫిలియాస్ ఫాగ్ ఏం చేస్తాడా అని ఫిక్స్, పాస్ పర్ట్ అందరూ కూడా ఆలోచిస్తూ వున్నారు. ఎప్పటి మాదిరిగానే ఫిలియాస్ ఫాగ్ తన భావాలని బయటికి కానీ, ఎవరికైనా గానీ చెప్పలేదు. ఆ కార్గోషిప్ ని నడుపుతున్న ఆ ఓడ లోని నావికులందరి దగ్గరికీ వెళ్లి ఆ నాయకుడి తో మీరు మమ్మల్ని లివర్ పూల్ కి తీసుకు వెళ్తే, మీకు బోలెడంత డబ్బిస్తానని, ఎంతో డబ్బుని ఆశగా చూపించాడు. ఆ ఓడని నడుపుతున్న నావికులందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఇతనేమిటి ఇంత డబ్బు ఆశ జూపుతున్నాడు, అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళందరూ ఒక్క మాటగా మిమ్మల్ని తప్పకుండా లివర్ పూల్ తీసుకెళ్తామని చెప్పారు. నావికులందరూ ఆ కెప్టెన్ దగ్గర కెళ్ళి మూకుమ్మడిగా పట్టుకుని కాళ్ళు చేతులూ కట్టేసి తీసుకెళ్లి గదిలో పడేసి తాళం వేశారు. అతను లోపల్నుంచి అరుపులు, కేకలు పెడుతున్నా కూడా, ఎవరూ పట్టించుకోలేదు. పారిస్ కి బదులుగా ఈ ఓడ లివర్ పూల్ వైపుగా ప్రయాణ౦ సాగించింది. నిజంగా ఈ డిటెక్టివ్ ఫిక్స్ కి మతిపోయింది. పాస్ పర్ట్ కి తన యజమాని పట్ల ఎంతో గౌరవం పెరిగింది. ఫిలియాస్ ఫాగ్ గురించి అలా ఆలోచిస్తూ వున్నాడు.
****************
Sunday 4 June 2023
Friday 2 June 2023
8౦ రోజుల్లో భూప్రదక్షిణ - 4
ఈ విధంగా అనుకోకుండా విచిత్ర పరిస్థితులలో ఫిలియాస్ ఫాగ్, జోన్ పాస్ పర్ట్ వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యంగా కలిశారు. కనాటికా ఓడలో వీళ్ళందరూ డిటెక్టివ్ ఫిక్స్ తో సహా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి వాళ్ళ ప్రయాణం మొదలైంది. ఈ కనాటికా అనే ఓడ పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తుంది. అద్భుతమైన సాహసాలతో. ఈ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు జోన్ పాస్ పర్ట్ అంతవరకూ కూడా డిటెక్టివ్ ఫిక్స్ గురించి ఆలోచించ లేదు. ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు గబగబా జరిగిపోయాయి. తన గొడవలో తానున్నాడు కాబట్టి ఈ ఫిక్స్ గురించి అంతగా పట్టించుకోలేదు. యిప్పుడు ఆలోచిస్తే, ఏమిటబ్బా! ఈ ఫిక్స్ అనేవాడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో పాటుగా వస్తున్నాడు. అక్కడ సూయెజ్ దగ్గర కలిసాడు. పరిచయం పెంచుకున్నాడు.యజమానిని గురించి వాకబు చేసాడు.మేము ఎక్కడికెళితే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. అసలు ఏమిటి ఉద్దేశ్యం? ఇతనిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఈ డిటెక్టివ్ ఫిక్స్ గురించి యిలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. పాస్ పర్ట్ కి అర్ధం కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఎందుకు ఈ ఫిక్స్ నన్ను ఫిలియాస్ ఫాగ్ గారి దగ్గరకు వెళ్లకుండా ఆపి, బార్ కి తీసుకెళ్లి విపరీతంగా తాగించి, ఫిలియాస్ ఫాగ్ కి సమాచారం అందకుండా ఎందుకు చేసాడు. మేమంటే ఒక పందెం కోసం కాబట్టి యిలా అన్నిదేశాలూ ప్రయాణం చేస్తున్నాO. మరి ఈ ఫిక్స్ గారికి మాతో పాటుగా రావటానికి ఏమవసరం? యిలా మాతోపాటు అన్నిదేశాలు తిరగటం ఏమిటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్ గారు గొంతు వినిపించింది. నేను, మేడం ఔదా కలిసి బయటికి వెళ్తున్నా0. రేపు పొద్దున్న 7.15 కి మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫిలియాస్ ఫాగ్, మేడం ఔదా వీళ్ళిద్దరూ చాలా చనువుగా వుంటున్నారు. ఔదా ఎంతో అద్భుతమైన సౌందర్యవంతురాలు. ఆవిడ ఫిలియాస్ ఫాగ్ పట్ల చాలా ఆరాధనగా ఉంది. స్నేహపూర్వకంగా ఉంది. కృతజ్ఞత పూర్వకంగా ఉంది. కానీ ఫిలియాస్ మాత్రం ఆవిడని ఏమాత్రం గమనించటం లేదు. అని పాస్ పర్ట్ మనసులో అనుకుంటూ వున్నాడు. కానీ అతనికి ఒకటే ఒక ధ్యేయం. ఎలాగైనా ఫిలియాస్ ఫాగ్ తన పందేన్ని తప్పకుండా గెలవాలని, తన మూలంగా ఆయన ప్రయాణానికి ఎటువంటి ఆటంకమూ కలగకూడదని, జాగ్రత్తగా వుండాలని ఆలోచిస్తూ వున్నాడు. మొత్తానికి వాళ్లిద్దరూ శాన్ ఫ్రాన్సిస్కోచేరటం జరిగింది. ఈ విధంగా వారు ఎక్కిన ఓడ ఎటువంటి అవాంతరాలు లేకుండా, శాన్ ఫ్రాన్సిస్కో క్షేమంగా చేరింది.ఇక్కడ ఫిలియాస్ ఫాగ్ తన నోట్ బుక్ లో సోమవారం రెండు గంటలు ముందున్నాము. మంగళవారం మూడు గంటలు వెనక్కి వెళ్ళాము. బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో కి అనుకున్న సమయం ప్రకారం చేరాము, అని రాసుకున్నాడు. అక్కడి నుంచి వారు న్యూయార్క్ వెళ్ళవలసి ఉంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకి రైల్ లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి, న్యూయార్క్ కి తన ప్రయాణాన్నికొనసాగించారు. ఒకప్పుడు ఆరునెలలు పట్టేది. ఈ రైలు ప్రయాణానికి, కాకపొతే ఈ మధ్యనే యూనియన్ పసిఫిక్ రైల్వే వారి పుణ్యమా అని ప్రయాణం కేవలం ఏడు రోజులలోనే వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో నించి న్యూయార్క్ కి వెళ్లగలుగు తున్నారు. ఎక్కడ ఆరు నెలలు, ఎక్కడ ఏడు రోజుల ప్రయాణం అనుకుని ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా వారి రైలు ప్రయాణము సాగుతోంది. ఫిలియాస్ ఫాగ్ గారు ఈ రైల్లో మోహమా అనే సెంట్రల్ స్టేషన్ చేరుకొని, అక్కడినించి న్యూయార్క్ కి చేరుకోవాలని ప్రణాళిక (పధకం) వేశారు.
ప్రయాణం చాలా సాఫీగా సాగుతోంది. అద్భుతమైన ప్రకృతి ఇరువైపులా కనిపిస్తోంది. పాస్ పర్ట్ మాత్రం ఫిక్స్ ప్రక్కనే కూర్చున్నాడు కానీ డిటెక్టీస్ ఫిక్స్ అయితే యిప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. అతడు చాలా దుర్మార్గంగా కుట్ర పన్నిన విధానం తనకి నచ్చలేదు. అతని విధానం పై మంచివాడు కాదన్న ఒక అభిప్రాయం వచ్చింది కాబట్టి పాస్ పర్ట్ బిగదీసుకుని కూర్చున్నాడు. ఒక గంట తర్వాత బ్రహ్మాండం గా మంచు కురవడం మొదలు పెట్టింది కానీ రైలు మాత్రం ఎక్కడా ఆగలేదు. మర్నాడు 6 గంటలకి కూర్చున్న పాస్ పర్ట్ కి ఎదురుగా ఉన్న కుర్చీ కి తన తల బలంగా కొట్టుకోవటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఎందుకు రైలు ఆగిందా అని చూస్తే, ఎదురుగుండా కొన్ని వందల సంఖ్యలో అడవి దున్నలు వైల్డ్ (wild) buffallos రైలు పట్టాలని దాటుతూంటే ఈ అధునాతనమైన ఈ రైలు పట్టాలపై అడ్డంగా ఈ అడవి దున్నలు అడ్డం రావటం ఏమిటని గట్టిగా అరిచాడు. కానీ ఆ ఇంజిన్ డ్రైవర్ చాలా తాపీగా సమాధానం యిస్తూ, మనం ఏమీ చేయ లేమండీ! ముందుకి వెళ్ళ నిస్తే ఇంజిన్ దెబ్బతింటుంది. అందుకే అవి వెళ్లేంత వరకు ఆగటం తప్ప మనమేమీ చేయలేము, అన్నాడు. పాస్ పర్ట్ కి కూడా ఏం చేయాలో తెలియలేదు. సరిగా మూడు గంటల సమయం తీసుకున్నాయి. అడవి దున్నలు ఆ రైల్వే ట్రాక్ దాటటానికి ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగింది. ఈ రైలు ప్రయాణంలో కనిపిస్తున్న అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఏమాత్రం గమనించ కుండా, మేడం ఔదాకి పేకాట ఎలా ఆడాలో చాలా శ్రద్ధగా నేర్పిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా తెలివి కలది కాబట్టి చురుగ్గా, త్వరగా నేర్చుకుంటోంది. యిద్దరూ ఆ పేకాటలోనే మునిగి పోయారు. చుట్టూ పక్కల పరిసరాలపై వారిద్దరికీ ఎటువంటి ఆసక్తి లేకుండా, పూర్తిగా ఆటలో మునిగి పోయారు. పాస్ పర్ట్ ఆలోచనలు మాత్రం చాలా రకాలుగా వున్నాయి. ఎక్కువగా ఎలాగైనా సరే తన యజమాని ఈ పోటీని గెలవాలని ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా పాస్ పర్ట్ నిద్రనుంచి లేచాడు. ఎందుకంటె ఆ రైల్ ఒక్క కుదుపుతో ఉన్నటుంది ఆగిపోయింది కాబట్టి. ఆ కుదుపుకి ఒక్కసారిగా మెలకువ వచ్చి లేవటం జరిగింది. ఏం జరిగిందా అని అతను ఆలోచిస్తూ ఉంటే ఆ పక్కస్టేషన్ లో ఉండే Medicine Bow అన్నతను ఈ ఇంజిన్ డ్రైవర్తో ఇలాచెప్పాడు. ఇంకా ముందుకి మీరు వెళ్ళటం అంత మంచిది కాదు. ఇంకొంత దూరంలో ఉన్న బ్రిడ్జి చాలా పాతది. మీరు వెళ్లే రైలు బరువు ఆ బ్రిడ్జి తట్టుకోలేదు. దానికి మర్మత్తులూ అవీ చేయాలి. అది చాలా సమయం పడుతుంది.ఒహామా కి మేము టెలిగ్రామ్ లు కూడా ఇచ్చాము. సహాయం కోసం. కాబట్టి మీరు జాగ్రత్తగా వుండండి. అని చెప్పటంతో పాస్ పెర్త్ తో పాటు మిగిలిన పాసెంజర్లు కూడా ఈ విషయం విని హడలిపోయారు. ఇంత చలిలో, ఇంత మంచులో ఎలా ఉండాలి. అయితే మేము ఈ ప్రయాణాన్ని ముందుకి ఎలా సాగించాలి అని బెంబేలెత్తిపోయారు. గొడవ చేస్తున్నారు. ఈలోగా ఇంజిన్ డ్రైవర్ కి ఒక ఆలోచన వచ్చింది. ఈ రైలుని ఒక రెండు కిలోమీటర్లు వెన్నక్కి తీసుకెళ్లి చాలా వేగంగా ముందుకు౭ తీసుకెళ్తూ, ఆ బ్రిడ్జి ని మనం దాటవచ్చు. మనం దాటాక ఆ బ్రిడ్జి పడిపోయినా ఫరవాలేదు, అని ఆలోచించాడు. దానికి అతని అసిస్టెంట్ కూడా ఒప్పుకున్నాడు. ఈ మాటలు విన్న పాస్ పర్ట్ కి మతిపోయింది. అలాకాదు మనందరం రైలు దిగి ఆ బ్రిడ్జి ఎలాగోలా దాటితే బరువు తక్కువగాఉంటుంది. కాబట్టి ఈ రైలు శుభంగా బ్రిడ్జి మీదనించి వచ్చినా ప్రమాదం ఉండదు. కానీ ఆ అసిస్టెంట్ మాత్రం లేదు లేదు ఆ ఇంజిన్ డ్రైవర్ చెప్పిన సలహానే బాగుంది. చాలా వేగంతో కనక మనం వెళ్ళ గలిగితే చాలా సులభంగా మనం బ్రిడ్జి ని దాటగలం. ఆ తర్వాత ఆ బ్రిడ్జి కూలిపోయినా మనకి సమస్య లేదుకదా! కాబట్టి ఇంజిన్ డ్రైవర్ చెప్పిన ప్రకారం ఈ సలహా చాలా బాగుందని అన్నాడు. ఈ మాటలకి పాస్ పర్ట్ కి మతిపోయింది. ఏం చేయాలో అర్ధం కాలేదు. మిగతా ప్రయాణీకులందరూ కూడా ఈ పధకం చాలా బాగుంది. ఇంజిన్ డ్రైవర్ చెప్పిన సలహా బాగుందని అందరూ కూడా ఒప్పేసుకున్నారు.రైలు ఎప్పుడైతే వేగంగా ప్రయాణం చేస్తుందో అపుడు దాని బరువు తగ్గిపోతుంది. మెల్లిగా ప్రయాణం చేసినప్పుడు బరువుగా ఉంటుంది.
కాబట్టి, బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉంటుంది అన్న సిద్దాంతం ప్రకారం ఆ ఇంజిన్ డ్రైవర్ చాలా హుషారుగా, ఆ హారన్ గట్టిగా నొక్కి ఒక రెండు కిలోమీటర్లు ఆ ఇంజిన్ ని వెనక వైపుకి నడిపించాడు. ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా రైలు ని ముందుకి నడిపించాడు. పాస్ పర్ట్ గుండె చాలా వేగంగా కొట్టుకో సాగింది. వేగంగా ఆ రైలు బ్రిడ్జి మీద ప్రయాణించి, బ్రిడ్జి దాటగానే వెనక్కి చూస్తే ఆ బ్రిడ్జి పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కూలిపోయి, కిందవున్న అగాధంలో పడిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
************
Tuesday 16 May 2023
8౦ రోజుల్లో భూప్రదక్షిణ - 3
పోయిన అధ్యాయం లో అనగా పార్ట్ 2 మనం ఫిలియాస్ ఫాగ్, జోన్ పాస్ పర్ట్ ఏ విధంగా ఔదా ని రక్షించారు, ఏ విధంగా అల్గహబాద్ చేరుకున్నారు అని తెలుసుకున్నా ము. కలకత్తాకి చేరుకునే ప్రయాణంలో ఔదా కి జరిగన విషయాలన్నీ తెలిపారు. ఆమె చాలా కృతజత్యా భావం తెలిపింది. అనుకున్నట్టు గానే రైలు ఆ రోజు మధ్యాహ్నానికి కలకత్తా చేరింది హాంగ్ కాంగ్ కి వెళ్ళే ఓడ బయలు దేరుతుందని తెలిసాక ఆ ముగ్గురూా కొంచెం అటూ ఇటూ తిరుగుతూ ఓడ బయలు దేరే సమయానికి వచ్చి ఎక్కారు.. ఆ ఓడ హాంగ్ కాంగ్ దేశానికి బయలుదేరింది. డిటెక్టివ్ ఫిక్స్ ఎలా అక్కడకి చేరాడో తెలియదు కానీ అతడు కూడా హాంగ్కాంగ్ కి వెళ్ళే ఓడ ఎక్కాడు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో వాళ్ళు ముగ్గురూ హాంగ్ కాంగ్ చేరి అక్కడ నించి యొకహోో మా (జపాన్) దేశానికి వెళ్ళే ఓడనితప్పి పోయారు. వాళ్ళు అనుకున్న దాని కన్నా ఒక రోజు ఆలస్యంగా చేరినందు వల్ల తప్పిపోయారు. డిటెక్టివ్ ఫిక్స్ వీళ్ళు ఏం చేస్తారా అని గమనిస్తున్నాడు. ఎందుకంటె హాంగ్ కాంగ్ బ్రిటిష్ వారి ఆధీనంలో ఆఖరి డెస్డం. టెలిగ్రాం ఆధిపత్యం లో వచ్చిందా లేదా అని కనుక్కో వటానికి వెళ్ళాడు. అక్కడ పోలీసు వాళ్ళు ఏమీ చెప్పలేదు. కాబట్టి ఫిలియాస్ ఫాగ్ వాళ్ళ ని అరెస్టు చేయలేక పోయినందుకు చాలా ఆదుర్దా పడుతున్నాడు. కానీ అతను తప్పని సరిగా ఫిలియాస్ ఫాగ్ ని వెంబడంచి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఫిలియాస్ ఫాగ్, జోన్ పాస్ పర్ట్ వీళ్ళిద్దరూ కూడా సీపోర్ట్ కి నెక్స్ట్ ఓడ ఎప్పుడు వెళ్లుతుందని కనుక్కోవడానికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళవలసిన గమ్యం యొకహోో మా. ఇది జపాన్నోఉంది. ఎక్కవలసిన, తప్పిపోయిన ఓడని పట్టుకోవాలి.. అక్కడ ఉన్న ఓడ యజమానిని ఫిలియాస్ ఫాగ్, యొకహోో మా వెళ్ళే ఓడ ఎప్పుడుంది, అని అడిగారు. దానికి సమాధానంగా ఆ ఓడ కెప్టెన్ రేపు ఉదయం బయలు దేరుతుందని చెప్పాడు. అదే మిటి ఈ రోజు ఉదయం బయలు దే రాలి కదా. అంటే నిజమేనండీ! అనుకోకుండా ఓడకి కొన్ని మరమ్మత్తులు చేయవలసి వచ్చింది . అందు వలన ఆలస్య మవుతోంది. రేపు పొద్దున్నే బయలు దేరుతుందని చెప్పాడు. అప్ప టికే ఒకరోజు వెనకబడి పోయారు. మరి జోన్ పాస్ పర్ట్ కి మాత్రం ఎందుకో సంతోషం కలిగంది. ఆ కెప్టెన్ కి ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఫిక్స్ కూడా హాంగ్ కాంగ్ కి ఆ టెలిగ్రాం ఎప్పుడు వస్తుందా .... ఎప్పుడు అరెస్టు చేయాలా అని ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా వీళ్ళు హాంగ్ కాంగ్ లో నే ఉండవలసి వచ్చింది. మామూలుగానే ఫిలియాస్ ఫాగ్ తానూ బసచేసిన హోటల్ కి వెళ్ళాడు. జోన్ పాస్ పర్ట్ మాత్రం అసలు ఈ ఓడ ఎప్పు డు కరెక్టు గా బయలుదేరుతుందో, మరమ్మత్తులు ఎంత వరకు వచ్చాయో అని మళ్ళీ ఒకసారి కనుక్కుందామని ఆ ఓడ కెప్టెన్ ని అడగగా రేపు పొద్దున్న దాకా ఆగవలసిన అవసరం లేదు. మరమ్మత్తులు చాలా తొందరగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కల్లా ఓడ ప్రయాణానికి సిద్ధం అవుతుందని చెప్పాడు. ఆ శుభవార్త విని జోన్ పస పర్ట్ చాలా సంతోషించాడు. ఎలా గైనా ఈ విషయాన్ని తన యజమానికి తెలపాలని నిశ్చయించుకుని వెంటనే హోటల్ వైపు వెళ్ళాడు.యిదంతా గమనిస్తున్న డిటెక్టివ్ ఫిక్స్ చాలా నిరుత్సాహ పడ్డాడు అయ్యో ! టెలిగ్రాం ఇప్పటిదాకా అందలేదు. ఈలోగా వీళ్ళు ఈ ఓడ పట్టుకుని యోకోహామా వెళ్ళితే నాకు వీళ్ళని అరెస్టు చేయడం సాధ్యం కాదు కదా ! ఎలాగైనా వాళ్ళని ఆపాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ జోన్ పాస్ పర్ట్ ఎలాగో కొంచెం అమాయకుడి లాగానే కనిపిస్తున్నాడు.ఇతడిని కనుక ఈ రోజు నేను ఆపగలిగి తేా , అంటే ఫిలియాస్ ఫాగ్ కి ఈ ఓడ ఈ సాయంత్రమే బయలు దేరుతుందనే విషయం తెలియకండా ఉండాలంటే, ఈ జోన్ పాస్ పర్ట్ ని ఎలాగైనా మాయమాటలతో మాయచేయాలని ఆలోచించి, మెలాగా జోన్ పాస్ పర్ట్ తో నడుస్తూ మాటలు కలిపాడు.
జోన్ పాస్ పర్ట్ డిటెక్టివ్ తో, "ఈ రోజు సాయంత్రమే ఈ ఓడ బయలుదేరుతుంది. ఈ విషయం మా యజమాని ఫిలియాస్ ఫాగ్ కి చెప్పాలి. లేకపోతే ఓడ ప్రయాణం పొద్దున్న కాబట్టి అప్పటికి సిద్ధమవ్వాలని అనుకంటాడు" అని సంతోషంగా చెప్పా డు.
ఆ మాట విని జోన్పాస్ పర్ట్ తో డిటెక్టివ్ ఫిక్స్ , "నేను చాలా రోజులయింది ఇంగ్లాండ్ వదిలి. ఒంటరిగా ఉన్నా ను. నాకు ఏమీ తోచటం లేదు . పరిచయస్తులు కూడా ఎవరూ లేరు.ఫిలియాస్ఫాగ్ ఉన్న హోటల్ దగ్గర ఒక మంచి రెస్టా రంట్ ఉంది. అక్కడ కొంచెం డ్రింక్స్ తీసుకుందాం. దయచేసి కొంత సమయం నాతో గడపండి" అని అభ్యర్థనగా అడిగారు డిటెక్టివ్ ఫిక్స్.
జోన్ పాస్ పర్ట్ కొద్దిగా తటపటాయించాడు. "లేదండీ. నేను మా యజమానికి ఈ విషయం తెలపాలి".
"పరవాలేదులే. ఎక్కువసేపు గడపనఖ్ఖర్లేదు కొద్దీ సేపు మాత్రమే కూర్చుందాం అని అన్నాడు. జోన్ పాస్ పర్ట్ తో. ఈ లోగా డిటెక్టివ్ ఫిక్స్ ఆ బార్ యజమానితో జోన్పాస్ పర్ట్ కి కొంచం ఘాటైన విస్కీని ఇ వ్వవలసిoదిగా పురమాయించాడు.
ఇవేమీతెలియని జోన్ పాస్ పర్ట్ డిటెక్టివ్ ఫిక్స్ తెప్పించిన ఘాటైన విస్కీ ని సేవించాడు. ఇలాగే మాయమాటలు, కబుర్లు చెప్తూ చెప్తూ , జోన్ పాస్ పర్ట్ ని గ్లాసు తర్వాత గ్లాసు అలా ఖాళి చేయిస్తూ వచ్చాడు. చివరకి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే జోన్ పాస్ పర్ట్ ఒళ్ళు తెలియకుండా అలాగే టేబుల్ పైన సోలిపోయాడు.
డిటెక్టివ్ ఫిక్స్ మాత్రం సంతోషంగా హమ్మయ్య! ఫిలియాస్ ఫాగ్ కి ఓడఈ సాయంత్రమే బయలు దేరుతుందన్న విషయం తెలియదు. కాబట్టి యింకా మరికొన్ని గంటలు ఆయన ఇక్కడే ఉంటాడు. రేపు పొద్దున్న వరకల్లా నాకు టెలిగ్రామ్ వస్తే, నేను ఇతన్ని అరెస్ట్ చేయవచ్చు, అని
విజయగర్వంతో అనుకుంటూ డిటెక్టివ్ ఫిక్స్ బార్ నించీ బయటికి వచ్చాడు. డిటెక్టివ్ ఫిక్స్ బయటికి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడుటెలిగ్రామ్ వస్తుందా, ఫిలియాస్ ఫాగ్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తానా అని ఆలోచిస్తున్నాడు. పధకాలు వేస్తున్నాడు. ఇక్కడ ఫిలియాస్ ఫాగ్ కి తాను వెళ్లాల్సిన ఓడ కనాటికా ఆరోజు అంటే క్రితం రోజు సాయంత్రమే వెళ్లిందన్న విషయం తెలియదు. కాబట్టి పొద్దున్నే జోన్ పాస్ పర్ట్ కోసం వెతికాడు. కానీ అతను కనిపించలేదు. ఫిలియాస్ ఫాగ్, ఔదా ఆశ్చర్యపడుతున్నారు. ఎక్కడికెళ్లాడా అని. ఈలోగా ఫిలియాస్ ఫాగ్ తన
బాగ్ ని తానె చక్కగా, సర్దుకొని, హోటల్ బిల్ పే చేసి, సిపోర్ట్ (sea port)దగ్గరికి వెళ్ళగానే,
ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. తాను ఇవ్వాళ పొద్దున్నే వెళ్ళవలసిన ఓడ కనాటికా నిన్న సాయంత్రమే మరమ్మతులు అయిన వెంటనే బయలు దేరి వెళ్లిందనీ, తెలిసింది. ఫిలియాస్ ఫాగ్ కించిత్తు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటీ ఈ జోన్ పాస్ పెర్త్ కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు, అని ఆలోచిస్తున్నాడు. అక్కడ డిటెక్టివ్ ఫిక్స్ కూడా టెలిగ్రామ్ ఇంకా రాలేదు. అయినా ఈ ఫిలియాస్ ఫాగ్ ఏం చేస్తాడా అని, యొకఁలోహోమా (జపాన్ కి) ఎలా వెళ్తాడా అని అనుకుంటూ అతన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అయితే ఫిలియాస్ ఫాగ్ మాత్రం ఏమాత్రం తొట్రుపాటు లేకుండా, మోహంలో ఎటువంటి హావభావాలు లేకుండా, అక్కడే ఉన్న ఒక ఓడ యజమానిని చూసి అతనిని అడిగాడు. తాను ఎక్కవలసిన కనాటికే ఓడ నిన్ననే వెళ్ళిపోయింది. మరి నేను యొక్లహోమా కి వెళ్ళాలి, మరి నన్నుతీసుకెళ్తావా అని అడిగేసరికి ఆ ఓడ యజమాని ఒప్పుకున్నాడు. ఎందుకంటె ఫిలియాస్ ఫాగ్ ఆ ఓడ యజమానికి కొంచం ధారా ళంగానే ముట్టజెపుతున్నాడు.ఇతన్ని అనుసరిస్తున్న డిటెక్టివ్ ఫిక్స్, ఫిలియాస్ ఫాగ్ పధకాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు కాబట్టి అదే చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏమిటీ మనిషి. నాకు అంతు పట్టకుండా ఉన్నాడు. ఒక్క చోట కూడా ఆగకుండా యిలా చక చకా ప్రయాణాలు ఏర్పాటు చేసుకునివెళ్ళిపోతున్నాడు. ఎలాగైనా సరే నేను కూడా ఇతనిని అనుసరిస్తూ, సమయం వచ్చినపుడు అరెస్ట్ చేయాలి అని అనికుంటూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్, డిటెక్టివ్ ఫిక్స్ ని గుర్తుపట్టి, "ఏమిటీ! మీరు చాలా ఆదుర్దాగా కనిపిస్తున్నారు? ఏమిటి సంగతి" అంటే,
"అవునండీ నేను వెళ్ళవలసిన ఒక కనాటికా తప్పిపోయింది. యొక్లహోమా వెళ్లాలని ఆలోచిస్తున్నాను", అన్నాడు.
"ఫరవాలేదు. మీరుకూడా మాతోపాటు రండి", అని ఫిలియాస్ ఫాగ్, ఫిక్స్ నికూడా తనతో పాటుగా తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఇలా ఆ ముగ్గురూ, ఓడ ప్రయాణం చేస్తూ యొక్లహోమా దిక్కుగా వెళ్తున్నారు.
ఇక్కడ జోన్ పాస్ పర్ట్ ఏం చేస్తున్నాడో చూద్దాం. జోన్ పాస్ పర్ట్ కి ఆ బార్ లో కొన్ని గంటల తర్వాత మెలుకువ వచ్చింది. తలంతా దిమ్ముగా, నెప్పిగా ఉంది. ఏవిషయాలు కూడా గుర్తుకు రావటం లేదు. ఎక్కడున్నాడు? ఎలా వచ్చాడు? వంటివి అన్నీ మర్చిపోయాడు. బుర్ర అంతా గందరగోళం అయిపోయింది. కాసేపయాక జోన్ పాస్ పర్ట్ కి మెల్లి మెల్లిగా జరిగిన సంగతులన్నీ జ్ఞ్యాపకం రాసాగాయి. అతని మనసులో షిప్ అన్న విషయం రాగానే అతను కొంచం గాబరా
పడ్డాడు. అరెరే! నేను ఈ ఓడ కనాటికా సాయంత్రమే బయలు దేరుతుందని ఫిలియాస్ ఫాగ్ కి చెప్పాలనుకుంటూ బయటికి రాగానే, ఒక పెద్దమనిషి నన్ను పలకరించాడు. మనిద్దరం సూయజ్ లో కలుసుకున్నాం కదా. ఈజిప్ట్ Mr . ఫిక్స్ అంటారు అంటూ గుర్తుపట్టారా అని అడగడం, పాస్ పర్ట్ అవునవును మనం కలిసాం అంటూ మీ పేరు.... అంటూ తడబడగా అవును నా పేరు Mr. ఫిక్స్ అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇప్పుడు నేను మా యజమానికి వెళ్లి
కనాటికా ఓడ ఈ రోజు రాత్రే బయలు దేరుతుందని చెప్పాలి. అందుకే త్వరగా వెళ్ళాలి అంటే "ఏమిటయ్యా మీ యజమాని ఎక్కడా ఆగకుండా ఎక్కడెక్కడికో అలా అలా వెళ్ళిపోతున్నాడు. చాలా విచిత్రమైన స్వభావం కూడా మీ యజమానిది" ? అన్నాడు.
"నేను తొందరగా వెళ్లాలడి. ఈ కనాటిక ఓడ కి మరమ్మత్తులు వేగంగా జరిగి ఇవ్వాళ సాయంత్రానికే సిద్ధమవుతోంది. ఈ సంగతి మా యజమానికి చెప్పాలి వెంటనే నేను వెళ్ళాలి" అనడం వెంటనే ఆ వ్యక్తి
"అలాగా! ఎలాగైనా సాయంత్రం వరకు టైముంది కదా! నాకేమీ తోచటం లేదు. ఒంటరిగా ఉన్నాను. చాలా రోజులైంది నా దేశం వదిలి అని అంటూ, మీ హోటల్ దగ్గర ఒక బార్ ఉంది.
అక్కడ మనిద్దరం డ్రింక్స్ తీసుకుందాం రండి "అని పిలవటం.
పాస్ పర్ట్ మొహమ్మాటంగా ఒప్పుకుని ఆ బార్ లోనికి వెళ్ళటగం, మితిమీరి తాగటం యివన్నీ మెల్లిగా పాస్ పెర్త్ కి జ్ఞ్యాపకం వచ్చాయి. హడావిడిగా లేచాడు. అయ్యో ! సమయం అయిపోతుంది. నేను వెళ్ళాలి అనుకుంటూ గబగబా ఫిలియాస్ ఫాగ్ బసచేసిన హోటల్ కి చేరాడు. అక్కడ ఎవరూ లేరు. పరుగెత్తుకుంటూ సీపోర్ట్ కి వెళ్ళాడు. అక్కడ ఓడ కానీ, ఫిలియాస్ ఫాగ్ కానీ, ఔదా కానీ ఎవరూ కనిపించలేదు. అయ్యో! ఏమైంది. ఇలా జరిగిందేమిటి
అనుకున్నాడు. క్రితంరోజే మరమ్మతులు జరిగిన ఓడ వెళ్లైపోయింది. పాస్ పర్ట్ కి ఏం చేయాలో పాలుపోలేదు. ఈలోగా ఇంకొక ఓడ యొకఁలోహోమా కనిపించింది బయలు దేరబోతోంది. తనకి ముందే టిక్కెట్లు కొని ఉంచారు. కాబట్టి ఆ ఓడ ఎక్కి కూచున్నాడు పాస్ పర్ట్ .హాంగ్ కాంగ్ నుంచి యొక్లహోమా దిశగా వెళ్లే ఆ ఓడలో కూచుని తదుపరి ఏం చేయాలా అని
ఆలోచిస్తున్నాడు. తన ఈ పరిస్థితికి దిగులుగా చాలా బాధపడుతూ అయ్యో! ఎంత పొరపాటు చేసాను. ఆ ఫిక్స్ మూలంగా నా యజమానికి సరైన సమయానికి సమాచారం అందివ్వలేక పోయాను. మరి ఈ ఓడ కానటికా లో వారిద్దరూ ఫిలియాస్ ఫాగ్, ఔదా కనపడలేదు. ఏం చేయాలో తోచక ఒక్కడినే ఈ ఓడ ఎక్కేసాను. నా చేతిలో డబ్బులు కూడా లేవు అని పరిపరి విధాల ఆలోచిస్తూ యొక్లహోమా చేరాడు పాస్ పర్ట్ . చేరనైతే చేరాడు కానీ చేతిలో డబ్బులు లేవు. తాను వేసుకున్న యురోపెయన్ జాకెట్ వంటివి అమ్మేసి, అక్కడ చౌకరకమైన జపాన్
జాకెట్ ని కొన్నాడు. మిగిలిన డబ్బు చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఆ డబ్బు కూడా సరిపోదని తెలుసు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఓడ దిగి ఊరంతా తిరుగుతూ అటూ ఇటూ చూసాడు. అక్కడ కొన్ని పోస్టర్లు కనిపించాయి. Mr . Bettle Cock గారి అద్భుతమైన సర్కస్ చివరిరోజు ప్రదర్శన. ఈ ప్రదర్శన తర్వాత మేము అమెరికాకి వెళ్ళిపోతున్నాము. మాకు చాలా మంది సర్కస్ లో పనిచేయడానికి కావాలి. అందులో కలౌన్స్ అంటే నవ్వించే వాళ్ళు, రకరకాల విన్యాసాలు చేసే వారు, సింహాలను ఆడించే వీసాలు అలా కావాలన్నారు. పాస్ పర్ట్ ఈ సర్కస్ వాళ్ళు అమెరికా వెళ్తున్నారు కదా! వీళ్ళ ట్రూపులో చేరి వీళ్ళతో పాటుగా అమెరికాకి వెళ్లి, అక్కడి నుంచీ లండన్ చేరుకోవాలి అనుకుని, ఆ సర్కస్ యజమాని దగ్గరకు వెళ్ళాడు. తన సంగతంతా వివరంగా చెప్పాడు. ఓహో! నువ్వు ఫ్రెంచ్ వాడివా. అయితే నువ్వు నా సర్కస్ లో కలౌమ్ గా వుండాలన్నమాట. ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేయాలి. ఉదాహరణకి పెద్దపులులని చూసుకోవటం వంటివి కూడా చేయాలి అని చెప్పాడు ఆ సర్కస్ యజమాని. నిజానికి పాస్ పర్ట్ కి ఈ సర్కస్ యజమాని ప్రతిపాదన ఏమాత్రమూ నచ్చలేదు. కానీ గత్యంతరం లేదు కాబట్టి అలాగే అని ఒప్పుకున్నాడు. పాస్ పర్ట్బ చాలా బలిష్టంగా ఉంటాడు కాబట్టి ఆ రోజు సర్కస్ లో హ్యూమన్ పిరమిడ్ లో బేస్ పిరమిడ్ గా నిలబడ్డాడు. అతని
బలమైన భుజస్కందాల మీద మిగిలిన మనుషులు ఎక్కారు. అలా ఒకరి తర్వాత ఒకరు
వారి స్థానాల నెంచుకుని, హ్యూమన్ పిరమిడ్ ఏర్పడింది. ప్రేక్షకులందరూ చూస్తున్నారు.
ఇక్కడ ఫిలియాస్ ఫాగ్ సంగతికొస్తే, వాళ్ళు యొక్లహోమా చేరగానే, వెనకే వచ్చిన కనాటికా ఓడ దగ్గరకెళ్ళి, అక్కడినుంచి ఎవరెవరు ప్రయాణీకులు వచ్చారా అని విచారించగా, హాంగ్ కాంగ్ నుంచి, యొక్లహోమా కి పాస్ పర్ట్ కూడా వచ్చినట్లుగా తెలిసింది. అయితే ఫిలియాస్ ఫాగ్ ఆలోచిస్తూ పాస్ పర్ట్ దగ్గర డబ్బులు ఏమీ లేవు కదా! ఇక్కడకు వచ్చి ఏం చేస్తున్నాడు అని అనుకున్నాడు. సరేనని ఔదాతో పాటుగా ఊరుచూడటానికి బయలు దేరాడు. గత్యంతరం లేక డిటెక్టివ్ ఫిక్స్ కూడా వాళ్ళ వెంటా ఉన్నాడు. యిప్పుడు ఫిక్స్ జపాన్ లో ఉన్నాడు కాబట్టి ఫిలియాస్ ఫాగ్ ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. అలా తిరుగుతూ అక్కడ జరుగుతున్న అద్భుతమైన సర్కస్ ప్రదర్శన పోస్టర్లు చూసాడు. సర్కస్ కి వెళదాం అని ఔదాతో సహా ఆ
సర్కస్ ప్రదర్శనకు వెళ్ళటం జరిగింది. అతని మనసులో ఏదో ఒక ప్రేరణ వుంది. ఈ సర్కస్ లో పాస్ పర్ట్ ఏమైనా దొరుకుతాడేమో అని మనసులో అనిపించింది. ప్రేక్షకుల్లో కూర్చుని ఫిలియాస్ ఫాగ్ సర్కస్ చూస్తున్నాడు.
హ్యూమన్ పిరమిడ్ లో కింద నిలుచున్న పాస్ పర్ట్ ప్రేక్షకుల్లో కూర్చున్న తన యజమాని ఫిలియాస్ ఫాగ్ ని చూడగానే ఒక్కసారిగా గావుకేక వేసాడు. ఒక్కసారిగా హ్యూమన్ పిరమిడ్ నుంచి బయటికి వచ్చేసరికి పాస్ పర్ట్ ని ఆధారంగా చేసుకుని అతని భుజాలపైన నిలబడిన వారందరూ ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ డాంమని కింద పడిపోయారు. ఇవేవీ గమనించకుండా పాస్ పర్ట్ ప్రేక్షకులలో కూర్చున్న తన యజమాని ఫిలియాస్ ఫాగ్ ని కలిసాడు. ఆసర్కస్ యజమానికి క్షమాపణ చెప్పే ఆలోచన కూడా లేకుండా, అక్కడినుంచి అందరూ బయటపడ్డారు.
ఈ విధంగా ఎలాగైతేనేమి, విచిత్ర పరిస్థితులలో ఫిలియాస్ ఫాగ్, ఔదాలను పాస్ పర్ట్ కలవటం జరిగింది. విధిలేని పరిస్థితులలో డిటెక్టీస్ ఫిక్స్ కూడా వీరితో పాటుగా ప్రయాణం చేయటం తప్పలేదు. జరిగిందంతా ఫిలియాస్ ఫాగ్, పాస్ పర్ట్ వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ అందులో ఫిలియాస్ఫాగ్, ఫిక్స్ గురించి చెప్పటం మర్చిపోయాడు. తాను ఏవిధమైన పరిస్థితుల్లో యోక్లాజ్హోమా చేరాడు, ఇక్కడకు చేరాక సర్కస్ లో చేరడం, హ్యూమన్ పిరమిడ్ లో తాను పాల్గొనడానికి కారణం. ఒక వ్యక్తి జబ్బు పడేసరికి, ఆ స్థానంలో తనను తీసుకోవటం, ఆ సర్కస్ లో ఉన్నపుడు ప్రేక్షకులలో కూర్చున్న తమరిని నేను చూడటం, మీ దగ్గరకు ఒక్క ఉదుటున పరుగెత్తి రావటం వంటివి అలా జరిగాయి, అని చెప్పాడు పాస్ పర్ట్ ఫిలియాస్ ఫాగ్ తో. పాస్ పర్ట్ తో నేను ఆరు రోజుల తర్వాత యొక్లహోమా చేరాక, తర్వాత కనాటిక ఓడలో నీ పేరు చూసి నువ్వు కూడా యొక్లహోమా చేరినట్లుగా తెలిసింది. నువ్వున్న ఈ సర్కస్ కి అనుకోకుండా రావటం, నిన్ను చూడటం జరిగింది అనుకుంటూ మాట్లాడుకోసాగారు.
26 నవంబర్:- ఈ కనాటికా ఓడలో యొక్లహోమా నుంచి పసిఫిక్ మహా సముద్రం మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణం చేయాలి. అందరూ బయలుదేరారు.
***************
Sunday 14 May 2023
80 రోజుల్లో భూప్రదక్షిణ - అధ్యాయం 2
ఫిలియాస్ ఫాగ్ , జోన్ పాస్ పర్ట్
అక్టోబర్ 9 : స్కాట్లాండ్ యార్డ్ డిటెక్టివ్ ఫిక్స్ ఒక నిర్ణయానికి వచ్చేసాడు. రిఫార్మ్స్ క్లబ్ లో ఒక పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నఫిలియాస్ ఫాగ్ అనే అతను బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ నుంచి 55౦౦౦ పౌండ్స్ దొంగలించాడని నిర్ధారణకు వచ్చేసాడు డిటెక్టివ్ ఫిక్స్. అతను ఎలాగైనా సరే ఈ ఫిలియాస్ ఫాగ్ వెంటబడి, పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసి 2000 పౌండ్స్ ని తీసుకోవాలనే పథకంలో ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఫిలియాస్ ఫాగ్ కి కానీ, జోన్ పాస్ పర్ట్ కి కానీ ఏమీ తెలియవు. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఇటలీ చేరుకుని, మంగోలియా అనే ఓడలో బొంబాయి కి వెళ్ళవలసింది అన్నమాట. ఎలాగైతే నేమి ఇటలీ లో మంగోలియా ఓడని వాళ్ళు ఎక్కారు. డిటెక్టివ్ ఫిక్స్ ఎలాగైతేనేమి వాళ్ళని పట్టుకోవాలని అక్కడికి చేరాడు. అలా చేరుకొని ఆ ప్రయాణికుల్ని బాగా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతనికి హఠాత్తుగా సూయెజ్ దగ్గర ఫిలియాస్ ఫాగ్ మరియు జోన్ పాస్ పర్ట్ వాళ్ళని కనుగొన్నాడు. అక్కడ సూయెజ్ లో వాళ్ళని పట్టుకొని సంభాషణలు మొదలు పెట్టాడు. అభివాదాలు చేసి "ఏమిటీ మీరు యిక్కడ సూయెజ్ లో బోలెడు చూడవలసినవి చాలా ప్రదేశాలున్నాయి కదా. మరి మీరు ఇవేవీ చూడకుండా ఇంత హడావిడిగా ఉన్నారేంటి?" అని ప్రశ్నించాడు.
దానికి సమాధానంగా జోన్ పాస్ పర్ట్, "ఏం లేదండి, మా యజమాని గారు ఈ 80 రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ చేయాలనుకుంటున్నారు. నాకూ చూడాలని ఉంటుంది కానీ మరి నేను మా యజమానితో పాటు వెళ్ళాలి కదా, అందుకే నాకు ఈ సూయెజ్ ని చూసే అవకాశం లేదు", అని చెప్పాడు.
డిటెక్టివ్ ఫిక్స్ కి తన అనుమానం రూడి అయింది. ఏమీతెలియని వాడిలా, "అదేమిటీ ? మీ యజమాని గారి దగ్గర చాలా డబ్బులున్నట్టున్నాయి కదా! "
"చాలా ధనవంతులు అయినా ఇదేమిటయ్యా ? ఇన్నిమంచి మంచి ప్రదేశాలు చూడకుండా, 80 రోజుల్లో భూప్రదక్షిణ చేస్తే ఏం వస్తుంది? దానివల్ల ఏం లాభం? ఎందుకు మీ యజమాని అంత ఆత్రుత పడుతున్నాడు?" అని అడిగాడు.
జోన్ పాస్ పర్ట్, "ఏమోనండీ నాకేం తెలీదు. నేనిప్పుడు గబగబా మా యజమాని దగ్గరికి వెళ్ళాలి. ఔను ఇంతకీ మీరు..... మీరు ........ అంటూంటే
"నేను ఫిక్స్ ని. నన్ను ఫిక్స్ " అని పిలుస్తే చాలు.
"నా పేరు జోన్ పాస్ పర్ట్ అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అయితే మరి నేను వెళ్ళొస్తాను" అని చెప్పి వెళుతుంటే బహుశా "నేను కూడా నీతో పాటు వస్తానని అనుకుంటాను, మళ్ళీ మనం కలుద్దామ ఆని" చెప్పాడు ఫిక్స్.
అక్టోబర్ 10. : మొత్తానికి సూయెజ్ నుంచి కూడా బొంబాయి దిశగా ప్రయాణం సాగించింది. డిటెక్టివ్ ఫిక్స్ ఆలోచిస్తూ ఉన్నాడు. తనకి టెలిగ్రామ్ వస్తే కానీ అతను ఫిలియాస్ ఫాగ్ ని అరెస్ట్ చేయడానికి కుదరనే కుదరదు. ఏమిటబ్బా, ఇతనితో పాటు నేను కూడా వెళ్ళవలసి వస్తుంది. టెలిగ్రామ్ ఇంకా రాలేదు అని అతను పరి పరి విదాలు ఆలోచిస్తూ అతను కూడా ఆ ఓడలో ప్రయాణం సాగించాడు.
అక్టోబర్ 2౦: మంగోలియా ఓడ బొంబాయి తీరాన్ని చేరుకుంటుంది. ఈలోగా ఫిలియాస్ ఫాగ్ గారు తన చిన్న నోట్ బుక్ లో తన ప్రయాణ ప్రణాళికని రాసుకుంటున్నాడు. ఏ రోజు ఎన్ని గంటలకు ఎక్కడ తిరిగాడో, ఏ ఓడ ఎక్కాడు, ఏ విధమైన ప్రయాణం చేస్తున్నాడని , అన్నిరాసుకుంటున్నాడు.
జోన్ పాస్ పర్ట్ కూడా ఆలోచిస్తున్నాడు. మా మాస్టర్ గారు రెండు రోజుల ముందే ఉన్నారు. మా యజమానిగారు అనుకున్న దానికన్నా, కానీ ఎలాగైనా సరే ఈయన ఒప్పందం గెలవాలి లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. వాతావరణం సరిగ్గా లేక పోయినా , రైలు లైన్ సరిగ్గా లేక పోయినా చాలా కష్టం కదా ! అని తన పెట్టెలో తన యజమాని పెట్టిన ఇరవై వేల పౌండ్స్ గురించి జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాడు. ఇవేవి పట్టనట్టుగా ఫిలియాస్ఫాగ్ నోట్ బుక్ లో అన్ని వివరాలు రాసుకుంటూ తోటి ప్రయాణీకులతో చక్కగా పేకాట ఆడుతూ సరదాగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఏమీ పట్టనట్టుగా యిలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా 20 అక్టోబర్ న బొంబాయి కి ఈ మంగోలియా అనే ఓడ చేరింది. ఫిలియాస్ ఫాగ్ , జోన్ పాస్ పర్ట్ ఇద్దరూ కూడా బొంబాయి స్టేషన్ కి వెళ్లారు. అనుకున్న ప్రకారమే ఆ రైలు సిద్ధంగా ఉంది. ఆ రైలు ఎక్కారు. వారు అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అంతా బాగుంది అని అనుకున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక ఆ ఇంజిన్ డ్రైవర్, రైలు ఆపి ప్రయాణీకులను ఉద్దేశించి, "ఈ ప్రయాణం ఇంకా ముందుకి సాగదు. ముందు మరమ్మత్తులు సాగుతున్నాయి. రైల్వే ట్రాక్ ఇంకా పూర్తిగా వేయలేదు.ముందు స్టేషన్ కి మీరు వెళ్లాలంటే యిక్కడే దిగి మీ ప్రయాణాలు మీరు చేసుకోవాలి", అని చెప్పాడు.
దాంతో జోన్ పాస్ పర్ట్ కి చాలా దిగులు వేసింది"అయ్యో! భగవంతుడా !" ఏమిటి ఇలా జరుగుతోంది! అని అనుకున్నాడు. అయితే ప్రయాణీకులంతా ఎవరి ప్రయాణ సన్నాహాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు అక్కడినుంచి కలకత్తా మీదుగా అలాహాబాదు వెళ్లాలన్నమాట. అర్ధాంతరంగా రైలు ఆగింది. నింపాదిగా ఉన్నాడు ఫిలియాస్ ఫాగ్. డిటెక్టివ్ ఫిక్స్ కూడా ఆలోచిస్తున్నాడు. మిగిలిన ప్రయాణీకులని గమనిస్తూ ఉన్నాడు. కొంతమంది ఎడ్లబండిలో వెళ్తున్నారు. కొంతమంది రిక్షాలో వెళ్లిపోతున్నారు. అక్కడే ఏనుగు నడిపే వాడు ఉన్నాడు. ఫిలియాస్ ఫాగ్ అతని దగ్గరికి వెళ్లి బేరం మొదలు పెట్టాడు. అలాహాబాద్ వెళ్ళాలి మేము. నువ్వు చూస్తున్నావు కదా ఈ ఏనుగుని నేను కొంటాను. నీకు కావలసిన డబ్బు ఇస్తాను. నువ్వే మమ్మల్ని అలాహాబాద్ చేర్చాలి, అని బేరం పెట్టాడు. ఆ మావటి వాడు తాను అనుకున్నదాని కన్నా ఫిలియాస్ ఫాగ్ ఎక్కువ ధనం ఇస్తానని అనగానే, ఆ ఏనుగుని అమ్మేశాడు. కానీ మరి తాను మావటి వాడుగా వుండి అలాహాబాద్ వస్తాను అని అన్నాడు. ఇలా జరుగుతూ కొంతదూరం ప్రయాణం చేసే సరికి, పెద్ద అడవిలోకి ప్రవేశించారు. సింహాల అరుపులు వినిపిస్తున్నాయి. చీకటిగా ఉంది. ఆ అందమైన ఏనుగు పేరు పూని. మావటివాఁడు దానికి కొంత విశ్రాంతి యివ్వాలని ఒక చెట్టు కింద ఆపారు. ఆ చీకట్లో వాళ్ళు అలాగే ఉండిపోయారు. అలా ఎవరి ఆలోచనల్లో వారు ఉండగా పెద్ద కోలాహలం, అరుపులు, కేకలు, డప్పులు, వాయిద్యాలు, మోతలుఅన్నీ వినిపిస్తున్నాయి.
వీళ్ళందరూ ఆశ్చర్య పడ్డారు ఏమిటా హడావిడి అని. అదేమిటో నేను కనుక్కుని వస్తానని, మీరిక్కడ ఉండండని మావటి వాడు దగ్గరలో ఆ కోలాహలం కనిపిస్తున్న ఆ ఊరి వైపుగా వెళ్ళాడు. అక్కడంతా జనాలు ఉన్నారు. దూరంగా కాగడాల వెలుతురు. ఆ వెలుగులో కొన్ని దృశ్యాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ హుషారుగా, పిచ్చి పెట్టినట్లుగా గంతులు వేస్తున్నారు. మామూలు పరిస్థితిలో వున్నట్టుగా నాకు కనిపించటంలేదు. ఈ లోగా మావటివాఁడు వచ్చాడు. "అయ్యా! ఈ వూళ్ళో ముసలి రాజుగారు చనిపోయారు. ఆయనని దహనం చేయాలి".
"అయితే మరి అంత హడావిడి ఏమిటి? ఆ జనం అంతా బాగా తాగినట్లుగా నృత్యాలు చేస్తున్నారు, అరుపులు, కేకలు ఏమిటి? అంటే.....
"ఏమీలేదు.... భార్యను కూడా దహనం చేస్తారు. ఈ ముసలి రాజుగారి భార్య చాలా చిన్నది. బొంబాయిలో ఒక ధనవంతుడైన వర్తకుడి కుటుంబంలో పుట్టింది; పాశ్చాత్య విద్యలన్నీ నేర్చుకుంది. ఆంగ్ల భాష అనర్గళంగా మాట్లాడగలదు . యూరోపియన్ పద్ధతులన్నీ తెలుసు. తండ్రి పోయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఈ ముసలి రాజుగారితో వివాహం అయి, యువరాణి అయింది. పెళ్ళైన మూడు నెలలకే ఆ ముసలి రాజు గారు చనిపోయారుట. ఆయన చితి మీద దహనం చేయడానికి యువరాణిని కూడా తీసుకొచ్చారు. అందుకే అక్కడ, అరుపులు, కేకల తో, తాగి నృత్యాలు చేస్తున్నారు" అంటూ మావటివాఁడు విషయం చెప్పేసరికి ఫిలియాస్ ఫాగ్ కి చాలా కోపం వచ్చింది. "ఇదేమిటి? ఈ వింతఆచారం ఏమిటి? అమానుషం. మానవులు బతికున్న ఆ అమ్మాయ్హిని సజీవంగా దహనం చేయడం ఏమిటి? ఎలాగైనా సరే ఆ అమ్మాయిని రక్షించే తీరుతాను" అనిచెప్పాడు. దానికి సమాధానంగా ఆ మావటివాఁడు, " బాబూ! అక్కడికి వెళ్లారంటే, మీమాట విన్నారంటే వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని చంపేస్తారు. ఇది ఎప్పడినించో వస్తున్న ఆచారం. మీరు చెప్పినట్లు ఎవరూ వినరు, జాగ్రత్త " అన్నాడు
"నేను మిమ్మల్నెవరినీ రమ్మనటం లేదు. నేనొక్కడినే వెళ్లి ఆమెని రక్షిస్తాను అని ఫిలియాస్ ఫాగ్ చెప్పాడు. దానికి సమాధానంగా
జోన్ పాస్ పర్ట్ " అయ్యా! నేను కూడా మీతో పాటు మీకు సహాయంగా వస్తాను" అని చెప్పటం జరిగింది.
ఆ యువరాణి గారి పేరు ఔదా! జోన్ పాస్పర్ట్, ఫిలియాస్ ఫాగ్ ఈ ఇద్దరూ కూడా ఆ యువరాణి ని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నారు. జనం అంతా విపరీతంగా ఉన్నారు. తెల్లవారేసరికి ఈ సతీ సహగమనం చేసేయాలి. జనం అంతా చాలా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. యిప్పుడు కనక వెళ్తే ప్రమాదం అని గమనించారు. ఫిలియాస్ ఫాగ్ చాలా సేపు చూసాడు. అతనిలో ఒక్కసారిగా ఆవేశం వచ్చేసింది. వెంటనే అతను ఆ జనం మధ్యలోకి ఉరికాడు. ఈలోగా జనం అంతా ఆశ్చర్యపోతూ అరుపులు, కేకలూ మొదలు పెట్టారు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసేసరికి ప్రజలకీ, ఫిలియాస్ ఫాగ్ కి, ఈ యిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ చనిపోయారన్న ఆ ముసలి రాజావారు నిజానికి చని పోలేదు. అతడు అమాంతంగా చితినుండి లేచి, ముందే కట్టలు విప్పుకున్నాడు కాబోలు, ఔదా ని చేతితో పట్టుకుని జనానికి దూరంగా అక్కడి నుంచి వేగంగా పరుగెత్తి పారి పోసాగారు. కాసేపటికి ఫిలియాస్ ఫాగ్ కి అర్ధమైంది, ఆశ్చర్యం వేసింది. ఆ పరుగెత్తి వెళ్ళిపోతున్నవాడు జోన్ పాస్ పర్ట్ అని . లోగడ యితడు ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు కదా? అన్నింట్లో అనుభవం ఉంది. అన్ని వృత్తుల్లో ఉన్నాడు. అని గమనించి తాను కూడా బయలుదేరి ఆ ఫూని, ఆ ఏనుగు పేరు ఫూని అని చెప్పున్నాము కదా! అక్కడికి బయల్దేరారు. ఆ చీకట్లో అందరూ, తమ ప్రయాణాన్ని సాగించి, తెల్లవారు ఝామున అలాహాబాద్ కి చేరారు. అలాహాబాద్ నించి వారు కలకత్తా కి వెళ్ళాలి. ఫిలియాస్ ఫాగ్ చాలా సంతోషించి ఆ మావటి వాడితో, " ఈ ఏనుగుని నీకు బహుమతిగా యిచ్చేస్తున్నాను. నువ్వు నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు". అని చెప్పాడు.
ఆ మావటివాఁడు పదే పదే కృతజ్ఞతలు చెప్తూ చాలా చాలా సంతోషించాడు. మళ్ళీ ఆ ఏనుగుకి యజమాని అయ్యాడు కదా! హాయిగా ఆ ఏనుగు మీద తిరిగి వెనక్కి వెళ్ళి పోయాడు.
ఔదా రాణికి అప్పుడప్పుడే తెలివి వచ్చింది. హౌరాకి వెళ్ళవలసిన రైలు సమయానికి వచ్చింది. రైల్లోకి ఎక్కాక జరిగిన సంగతంతా ఫిలియాస్ ఫాగ్, మరియు, జోన్ పాస్ పర్ట్ లు వివరించగా ఔదా రాణి గారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతో కృతజ్ఞతా భావం గుబాళించింది. అదేమిటి, ముక్కూ మొహం ఎలియని ఈ పరదేశీయులు ప్రాణాలకు తెగించి నన్ను ఈ విధంగా రక్షించారు... అని కృతజ్ఞతా భావం కలిగి ఉంది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ తెల్లవారు ఝాము అయ్యేసరికి హౌరాలో దిగారు. కలకత్తా నుంచీ వాళ్ళు హాంగ్ కాంగ్ వెళ్లే ఓడను పట్టుకోవాలన్నమాట. అదృష్టం కొద్దీ వీళ్ళు వెళ్లే సరికి ఆ ఓడ మధ్యాన్నం 12 గంటలకు బయలు దేరుతుందని చెప్పారు. వీళ్ళకి సమయం చాలా ఉందన్న మాట.
మరి ఈ సమాచారం డిటెక్టివ్ ఫిక్స్ కి ఎలా తెగెలిసిందో తెలియదు కానీ అతను కూడా వీళ్ళతో పాటు ఇదే ఓడ ఎక్కి హాంగ్ కాంగ్ కి బయలు దేరాడు. హాంగ్ కాంగ్ కి బయలు దేరిన ఓడ కొంత సమయం సింగపూర్ లో ఆగింది. డిటెక్టివ్ ఫిక్స్ ఒకటే మదన పడ సాగాడు. ఏమిటీ టెలిగ్రామ్ ఇంకా రానే రాలేదు. మరి టెలిగ్రామ్ వస్తే కానీ నేనేమీ చేయలేను. హాంగ్ కాంగ్ కూడా ప్రస్తుతం బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉంది కదా!. బహుశా నేను హాంగ్గ్ కాంగ్ వెళ్లేసరికి టెలిగ్రామ్ వచ్చే ఉంటుంది. ఎలాగైనా సరే నేను ఫిలియాస్ ఫాగ్ ని అరెస్ట్ చేయిస్తాను అనే తన పధకాలు తాను వేసుకుంటూనే ఉన్నాడు. అయితే స్ ఫాగ్ ని అరెస్ట్ చేయిస్తాను అనే తన పధకాలు తాను వేసుకుంటూనే ఉన్నాడు. అయితే హాంగ్ కాంగ్ నించే వాళ్ళు జపాన్ వెళ్ళవలసిన ఓడ ఎక్కాల్సింది. కానీ దురదృష్ట వశాత్తు వాతావరణ పరిస్థితులు సరిగా లేనందు వలన వీళ్ళెక్కిన ఓడ ఒక రోజు ఆలస్యంగా హాంగ్కాంగ్ కి చేరింది. అప్పుడు జోన్ పాస్ పర్ట్ చాలా నిరుత్సాహపడ్డాడు.
"అయ్యో! నా యజమాని పందెం ఓడిపోతాడేమో! ఇప్పుడెలా? ఒకరోజు మనకి పోయింది". అంటే ఫిలియాస్ ఫాగ్ ఎటువంటి త్రొట్రుపాటు లేకుండా, ఆ పార్టీలోనే ఒక చోట వున్న యజమాని దగ్గరకెళ్ళి ,యోక్లోహోమాకి వెళ్లే ఓడ ఎప్పుడు బయలు దేరుతుంది?" అని అడిగాడు. "
"రేపు పొద్దున్నే బయలు దేరుతుంది. ఎందుకంటె ఈ ఓడలో కొన్ని మరమత్తులు జరగాల్సి ఉన్నాయి ఆ మరమ్మత్తులన్నీ చేసే సరికి ఆలస్యమవుతుంది. అవన్నీ అయ్యాక బయలు దేరుతాము,"అని చెప్పాడు ఆ బోటు యజమాని. అంటే వీళ్ళు ఈ ఓడ ఎక్కి యొకఁలోహోమా అంటే జపాను చేరి అక్కడ హాంగ్ కాంగ్ తప్పిపోయిన ఓడ ఎక్కి పై (ముందు) ప్రయాణం చేసుకోవాలన్న మాట. ఆ పడవ యజమాని అలా చెప్పేసరికి జోన్ పాస్ పర్ట్ ఎందుకో సంతోషించాడు. ఆ పడవ యజమానికి ధన్యవాదాలు చెప్పాడు. ఫిలియాస్ ఫాగ్ కొంచెం ఆశ్చర్యపడ్డా బయటికి ఏమీ మాట్లాడలేదు. ఈ విధంగా వారంతా వెనక్కి వెళ్లిపోయారు. అంటే 6 నవంబర్ న వాళ్ళు చేరి ఆ ఓడని ఎక్కవలసిందే . కానీ వాతావరణం ప్రతికూలంగా ఉండటం వలన వాళ్ళు 7 నవంబర్ కి చేరేసరికి ఆ ఓడ వాళ్ళని వదిలేసి హాంగ్ కాంగ్ కి వెళ్ళిపోయింది. అందుకే ఫిలియాస్ ఫాగ్ యింకొక ఓడని ఎక్కి హాంగ్ కాంగ్ కి వెళ్లి అక్కడ ఆ పెద్ద ఓడని ఎక్కాలని ప్రయత్నం అన్నమాట. ఈ వివరాలన్నీ ఫిలియాస్ ఫాగ్ తన నోట్ బుక్ డైరీ లో ఎప్పటికప్పుడు రాసుకుంటూ వున్నారు.
Saturday 13 May 2023
80 రోజుల్లో భూప్రదక్షిణ - అధ్యాయం 1
ముందుగా ఈ కథలోని ముఖ్య పాత్రలగురించి మాట్లాడుకుందాం. ఈయన పేరు ఫిలియాస్ ఫాగ్. ఈయన బ్రిటిష్ పౌరుడు. 7 Savel రోడ్ సెంట్రల్ లండన్ లో ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు. మనిషి చాలా క్రమ శిక్షణతో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అందరికీ కూడా ఫిలియాస్ ఫాగ్ అంటే ఎంతో గౌరవం. ఇతనుచాలా ధనవంతుడు. కానీ ఈ ధనం ఎంత సంపాదించాడో, ఎలా సంపాదించాడో అన్నది ఎవరికీ తెలియదు. ఇతనికి నా అన్న వారు ఎవరూ లేరు. స్నేహితులు గానీ బంధువులు గానీ ఎవరూ లేరు. ఖరీదైన సెంట్రల్ లండన్ లో ఈయన నివసిస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఈయన తప్పనిసరిగా రిఫార్మ్స్ క్లబ్ కి వెళతారు. ఈక్లబ్ లోనే అన్నీ న్యూస్ పేపర్లు చదువుతూంటాడు .అలాగే పేకాట కూడా ఆడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఏ ప్రదేశా న్నైనా సరే, అక్కడిఅద్భుతాలన్నీ ఈయన ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటాడు. అయితే, అతనికి అందరూ తెలిసిన వాళ్ళు కూడా ఏదో ఒకప్పుడు, ఈయన ఆ ప్రాంతానికి తప్పకవెళ్లి ఉంటారు, ఖచ్చితమైన వివరాలు ఇస్తున్నారు కదా అని అంటారు. యింకాబాగా తెలిసిన వాళ్ళు, అదేంటి మేము ఎన్నో ఏళ్ళనుంచి ఈయనని ఎరుగుదుము. ఈయన ఎప్పుడూ ఇంగ్లండును వదిలి వెళ్లనే లేదు, అని, వాదిస్తూ ఉండేవాళ్ళు.బహుశా, ఈయన తన మెదడులోనే ఇన్ని ప్రదేశాలకి ప్రత్యక్షంగా వెళ్లిఉంటారేమో అని ఇంకొకళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్గురించి అందరూ రకరకాలుగా చెబుతూ ఉంటారు. కానీ అతను చాలా వ్యక్తిగతంగానే ఉంటాడు. అంటే, ఒంటరిగానే ఉంటాడు. స్నేహితులంటూ, బంధువులంటూ ఎవరూ లేరు. ఇంట్లో ఒక పనిమనిషి మాత్రమే ఉంటాడు. అన్నీ పనులూ ఈ పనివాడు చేస్తూఉంటాడు. గడియారంలో ముల్లు ఎంత క్రమ బద్ధంగా , ఒక్క సెకండ్ కూడా అటూ ఇటూ కాకుండా తిరుగుతూ ఉంటాయో, ఈ ఫిలియాస్ ఫాగ్ కూడా అంత క్రమ శిక్షణ కలిగి ఉంటాడు. ప్రతీ రోజూ ఏ సమయంలో ఏ పనిచేస్తారో అదే సమయంలో అదే పని ఒక్క సెకండ్ అటూ ఇటూ తేడా లేకుండా అలాగే తూచా తప్పకుండా అదే విధంగా ఈ ఫిలియాస్ ఫాగ్ ఆచరిస్తూ, ప్రవర్తిస్తూ దినచర్య ని ఖచ్చితoగా పాటిస్తూ ఉంటాడు. ఇది ఈయన గురించి చాలా మంది చేసి నటువంటి విశ్లేషణ. అయితే, ఒకరోజు పనిమనిషిని పనిలో నించి తొలగించడం జరిగింది. ఎందుకంటె షేవింగ్ చేసుకునే నీళ్లు, మామూలు వేడి కంటే ఎక్కువగా ఉన్నాయనే విషయంలో, ఆ పనివాడు తప్పు చేసాడని, అతనిని ఉద్యోగంలోంచి ఫిలియాస్ ఫాగ్ తొలగించాడు. మరి ప్రస్తుతం ఆయనకు రాబోయే కొత్త పనివాడి కోసం,పేరు సర్వెంట్ జోన్ పాస్పర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రొద్దున్న పదకొండు, పదకొండున్నర మధ్యలో ఈయన ఆపాయిట్మెంట్యి వ్వడం జరిగింది. మాటిమాటికీ గడియారం చూసుకుంటూ ఉన్నాడు ఫిలియాస్ ఫాగ్. ఎందుకంటె ఖచ్చితంగా పదకొండు గంటల ముప్పై నిముషాలకి ఆయన ఇంట్లోంచి బయలుదేరి, రిఫార్మ్స్ క్లబ్ కి వెళ్తాడు. ఈలోగా, అప్పుడే ఎవరో వచ్చినట్టుగా తలుపు తట్టుతున్న చప్పుడు వినిపించింది. ఎవరబ్బా అని బహుశా సర్వెంట్ జోన్ పాస్పర్ట్ అయి ఉంటాడని తలుపు తెరవగానే ఎదురుగా ముప్పై ఏళ్ళ ఆకర్షణీయంగా ఉన్న యువకుడు ఫిలియాస్ ఫాగ్ కి అభివాదం చేసాడు. నా పేరు జోన్ పాస్పర్ట్ అని అతను పరిచయం చేసుకునే లోగానే, ఫిలియాస్ ఫాగ్ గారు మరి జాన్ అంటే బ్రిటిష్ వారి పేరు కదా? మరి నీవు ఫ్రెంచ్ వాడివి అంటున్నావు, మరి ఏమిటి విశేషం అంటే, నా పేరు జోన్ పాస్పర్ట్ . జాన్ కాదండీ. నేను ఫ్రెంచ్ వాడినే, అన్నాడు. కొన్నాళ్ళు నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెషనల్ ఇ న్స్ట్రక్టర్ గా పనిచేసాను. కొన్నాళ్ళు సంగీత అభ్యాసం చేసాను. పాటలు పాడే వాడిని. కొన్నాళ్ళు పారిస్ లో ఫైర్ బ్రిగేడ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసాను. కొన్నాళ్ళు సర్కస్ లో కూడా గుర్రపు స్వారీ చేస్తుండే వాడిని. కానీ, పనివాడిగా నా జీవితంలో నేనెప్పుడూ పని చేయలేదు. మీ గురించి నా మిత్రుడు ఎంతో గొప్పగా చెప్పాడు. మొత్తం లండన్ లో మీ అంత పెద్దమనిషి ఉండరని, క్రమశిక్షణకు మారుపేరని, నిక్కచ్చిగా ఉంటారని, ఇలా మీ గురించి ఎన్నో విషయాలు, నాకు ఆయన చెప్పారు. నేను ఇప్పటివరకు స్థిరం లేకుండా అక్కడా ఇక్కడా ఉద్యోగాలు చేసాను. మీ సంగతి విన్నాక ఇక్కడ మీ దగ్గర ప్రశాంతంగా పనివాడుగా చేరదామని అనుకున్నాను. కానీ నేను పనివాడుగా ఇంతవరకూ పని చేయలేదండీ. నాకు మాత్రం ఆ అనుభవం లేదు, అని గబగబా తనకి తెలిసిన విషయాలు చెప్పేసాడు. ఓహో, అలాగా, రిఫార్మ్స్ క్లబ్ లో నామిత్రుడు నీ గురించి చెప్పాడు. నువ్వు ఫ్రెంచ్ దేశస్తుడని చాలా మర్యాదస్తుడవనీ, నాకే సరిగా సరిపోయే మనిషి అని, నాకు చెప్పడం జరిగింది, అని ఫిలియాస్ ఫాగ్ సమాధానమిచ్చాడు. ఫిలియాస్ ఫాగ్ కి ఎలాంటి పనివాడు కావాలో అని చెప్పబోయే సరికి, సర్వెంట్ జోన్ పాస్పర్ట్ నాకు అంతా అర్ధమయింది, అని చెప్పాడు. సరే యిప్పుడు టైం ఎంతైంది? అని అడగ్గా, జోన్ పాస్పర్ట్ తన జేబులోంచి చిన్న గడియారాన్ని తీసి పదకొండు గంటల ఇరవై రెండు నిముషాలు అయిందని చెప్పాడు. నాలుగు నిముషాలు లేటుగా ఉంది. సరే నువ్వు పదకొండు గంటల ఇరవై ఆరు నిముషాల నుంచి ఈ ఉద్యోగంలో చేరినట్టుగా లెక్క. సరే. నేను వెళతాను, అని చెప్పి సరిగ్గా పదకొండు గంటల ముప్పై నిముషాలకి, నెత్తిమీద టోపీ పెట్టుకొని ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.చాలా క్లుప్తంగా జరిగాయి పరిచయాలు.
జోన్ పాస్పర్ట్ మనసులో ఆయన గురించి ఈ విధంగా అనుకున్నాడు. ఈ మనిషి, ఒడ్డూ పొడుగూ చాలా అందంగా ఉన్నాడు. కళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. చాలా గౌరవంగా ఉన్నాడు. చాలా కలుపటంగా జరిగింది ఆయనతో మాట్లాడటం. ఈయన చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. ఈయన హావభావాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం. బహుశా బ్రిటిష్ వారంతా ఇలాగే ఉంటారు కాబోలు. అతను ఏమి ఆలోచిస్తాడో మనకి ఏమీ తెలియదు కానీ, బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతను నాకు తగిన యజమాని అని అనుకున్నాడు. ఇక్కడైనా నేను హాయిగా ప్రశాంతంగా ఉంటాను, నమ్మకస్తుడిగా ఉంటాను, అని జోన్ పాస్పర్ట్ అనుకుంటాడు.
ఇక జోన్ పాస్పర్ట్ గురించి మాట్లాడుకుందాం. జోన్ పాస్పర్ట్ ముప్పైఏళ్ళవాడు. ఆకర్షణీయమైన మొహాన్ని కలిగి ఉన్నాడు. చాలా బలిష్టంగా ఉన్నాడు. నీలి జుట్టు మాత్రం కొంచం చిందర వందరగా ఉంటుంది. జోన్ పాస్పర్ట్ ముందుగా ఆ యింటినంతా ఒక్కొక్క గదిలోకి వెళ్లి పరీక్షించాడు. అంతా చాలా శుభ్రంగా అమర్చినట్లుగా ఉంది. అంతా అయినాక తన గదిలోకి వచ్చాడు. తన గది కూడా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ ఓకే పెద్ద గడియారం ఉంది. ఈ గడియారం కి సెకండ్ల ముల్లు చాలా పెద్దగా ఉంది. ఈ రెండు గడియారాలు ఖచ్చితమైన సమయాన్నే సూచిస్తూ ఉన్నాయి. మేడ మీద ఒక కాగితం అంటించబడి ఉంది. దానిపై జోన్ పాస్పర్ట్ దిన చర్య అంతా రాయడం జరిగింది. దానిని చూసుకుంటూ తన పిన్నిని తాను నిర్వహిస్తూ ఉండాలి. అంటే ఫిలియాస్ ఫాగ్ గారు ఎన్నింటికి లేస్తారు. నీళ్ల ఉష్ణోగ్రత ఎంత ఉండాలి. ఎన్నింటికి బ్రేక్ ఫాస్ట్ చేజేస్తారు. ఎన్నింటికి ఇంట్లోంచి బయిటికి వెళతారు. మళ్ళీ ఎన్నింటికి వస్తారు. యివన్నీ కూడా వివరంగా అక్కడ రాసి ఉన్నాయి. జోన్ జోన్ పాస్పర్ట్ కి చాలాసంతోషం వేసింది. ఈ మనిషి గడియారంలాగా ఖచ్చితంగా బాగా పని చేస్తూ ఉంటాడు. కాబట్టీ నేను అసలు సిసలైన యజమాని దగ్గరికే వచ్చాను, అని అతను ఎంతో సంతోషపడ్డాడు.
ఫిలియాస్ ఫాగ్ గారు చాలా ఖచ్చితంగా ఉంటాడని మనం చెప్పు కున్నాం కదా. అంటే సరిగా పదకొండు గంటల ముప్పై నిముషాలకి ఆయన రిఫార్మ్స్ క్లబ్ కి వెళ్తాడు. ముందుగా ఎడమ పాదం పెడ్తారు. అది 575 సార్లు అయ్యేసరికి ఆయన రిఫార్మ్స్ క్లబ్ కి వెళతారు. ఆ తరువాత 575 సార్లు తర్వాత కుడి పాదం పెట్టె సరికి, రిఫార్మ్స్ క్లబ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆయన చేరుతారు. అక్కడ ఆయన పదమూడు నిముషాలు తక్కువగా ఒంటి గంటకు అక్కడే మధ్యాహ్నం భోజనం అదే టేబుల్ మీద కుర్చీలో కూర్చుని చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న లైబ్రరీ లో పుస్తకాలు, మాగజైన్లు చదువుతూ ఉంటారు. సరిగా ఐదు గంటలకి ఆయన టీ సేవిస్తారు. ఆ తరువాత పది నిముషాల తక్కువ ఆరు గంటలకి రిఫార్మ్స్ క్లబ్ లో పేకాట ఆడే గదిలోకి ప్రతీ నిత్యం తాను కూర్చునే టేబుల్ కుర్చీ దగ్గర ఆయన కూర్చుంటారు. పేకాట ఆడినపుడు వచ్చే డబ్బుని, విరాళంగా పంచి ఇచ్చేస్తాడు.
ఫిలియాస్ ఫాగ్ గారితో విచిత్రమైనటువంటి పందెం :
ఆరోజు అక్టోబర్ 2, 1872 వ సంవత్సరం. ఫిలియాస్ ఫాగ్ పేకాట ఆడడానికి కూర్చునే సమయానికి లండన్ లో చాలా మంది పెద్ద మనుషులు, ధనవంతులు వాళ్లంతా కూడా వచ్చి అక్కడే పేకాట ఆడుతూ ఉంటారు. ఆండ్రూస్ స్టువర్ట్, మరొక ధనవంతుడు సర్ రాల్ఫ్ గౌటీర్ (Sir Ralph Gautier) వీళ్లంతా ఖచ్చితమైన సమయానికి ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజూ ఒక విచిత్రమైనటువంటి సంచలనాత్మకమైన వార్తా న్యూస్ పేపర్ లో వచ్చింది. ఆండ్రూ స్టువర్ట్ గట్టిగా చదువుతున్నాడు. సరిగా సెప్టెంబర్ 29 తేదీన బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ లో 55,౦౦౦ పౌండ్స్ దొంగతనం జరిగిందనీ, ఆ దొంగతనం చేసినవాడు పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నాడని, ఆయన అలా చదువుకుంటూ వెళుతున్నారు. మిగితా సభ్యులందరూ కూడా పేకాట ఆడటానికి సిద్ధమవుతుండగా ఆండ్రూ స్టీవర్ట్ ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఆ దొంగతనం చేసిన వ్యక్తిని ఎవరైనా పట్టుకుంటేవారికి 2,000 పౌండ్స్ బహుమానంగా ఇస్తామని బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ వారు పత్రికా ముఖంగా తెలియజేసారు. ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాతమైన డిటెక్టివ్ లు అందరూ కూడా ఎలాగైనా సరే ఈ దొంగని పట్టుకోవాలని, ఆ రెండువేల పౌండ్స్ బహుమతిని తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఈ దొంగతనం చేసిన వ్యక్తి చాలా దర్జాగా, ఠీవిగా చాలా పెద్ద మనిషిలా ఉంటాడు, అని ఒక చిన్నపాటి వర్ణన కూడా చేశారు.
ఆండ్రూస్ స్టీవర్ట్ చదువుతూ అంత పెద్ద విశాల ప్రపంచంలో వాడు ఎక్కడ దాక్కుంటాడో, దొంగని ఎలా పెట్టుకుంటారో, ఏమిటో అని అన్నాడు.
"అసలు ప్రపంచం అంత పెద్దది కాదండీ" అని ఫిలియాస్ ఫాగ్ జవాబిచ్చాడు.
"ఏమిటి ? ప్రపంచం అంత పెద్దదిగా లేదా. ఏం మాట్లాడుతున్నారండీ ఫిలియాస్ ఫాగ్
గారు"? అనగా
"లేదండీ ప్రపంచం నిజానికి అంత పెద్దగా లేదు. అది చాలా చిన్నగానే ఉందని" చాలా ధీమాగా ఫిలియాస్ ఫాగ్ గారు జవాబిచ్చారు.
దానికి సమాధానంగా సర్ రాల్ఫ్ గౌటీస్ (Sir Ralph Gautier) "ఒకప్పుడు బి హోమి చాలా విశాలంగా ఉండేది. కానీ ప్రస్తుతం అది చిన్నగా అయింది. అని మీరు చెపుతున్నంతచిన్నగా కాలేదండీ". ఈ విధంగా పరస్పరంగా అనుకున్నారు.
ఫిలియాస్ ఫాగ్ మా త్రం "ఏం లేదండీ. ప్రపంచం చిన్నదై పోయింది. నిజం చెప్పాలంటే మనం 8౦ రోజుల్లో భూమినంతా ప్రదక్షిణ చేయవచ్చు", అని ధీమాగా చెప్పాడు.
ఈ ఇద్దరి సంభాషణ మిగితా సభ్యులందరూ కూడా చాలా ఆసక్తిగా, శ్రద్ధగా వింటున్నారు. అదేమిటి, 80 రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ ఎలాచేస్తాము. మధ్యలో అవాంతరాలు రావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు. ఓడలు మర్మత్తుకి గురికావచ్చు. ఇన్ని ఉన్నాయి కదా. అలాగని గట్టిగా ఎలా చెప్పగలుగుతారంటే, ఈ అవాoతారాలన్నీ దృష్టిలో పెట్టుకొనే మనం ౮౦ రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ చేయొచ్చు, అని ఫిలియాస్ ఫాగ్ గట్టిగా చెప్పాడు. దానికి గౌటీర్ (Gautier) వారు గట్టిగా నవ్వారు. అది చాలా కష్టం. 80 రోజులలో భూప్రదక్షిణ మాత్రం జరగదు అని అన్నారు. జరుగుతుంది అని అన్నారు ఫిలియాస్ ఫాగ్.
యిద్దరు పట్టుదలగా మాట్లాడుతుంటే, పంతాలు పట్టింపులు పెరుగుతున్నాయి. సభ్యులందరు ఆతృతగా ఏం జరుగుతుందో అని చూస్తూ వింటున్నారు. అయితే, ఆ పని నీవు చేయగలవా? అని గౌటీర్ వారు సవాలు విసిరారు. 4000 పౌండ్స్ పందెం కడతానన్నారు. ఫిలియాస్ ఫాగ్ అన్నారు, నేనే చేస్తాను. కానీ పందెం నేను 20000 పౌండ్స్ కడతాను, అని అయన దృడంగా
చెప్పారు. ఎప్పుడు అని అడగ్గా యిప్పుడే పందెం మొదలవుతుంది, అని ఫిలియాస్ ఫాగ్ దృడంగా చెప్పాడు. పందెం ఈ రోజునుంచే ప్రారంభం. సరిగ్గా పావు తక్కువ ఎనిమిదికి నేను డోవర్ (Dowar) స్టేషన్ నుంచి బయలు దేరుతాను.ఈ రోజూ అక్టోబర్ 2nd. నేను మళ్ళీ 21st డిసెంబర్ కల్లా వెనక్కి వస్తాను. ఒక వేళ అలా కానీ పక్షంలో నేను యిప్పుడే చెక్ రాసిస్తున్నాను ౨౦౦౦౦ పౌండ్స్ కి. రాలేకపోతే ఈ పౌండ్స్ మీ సొంతమవుతాయి, అని తన జేబులోని ఒక చిన్న నోట్ బుక్ తీసుకుని ఈ వివరాలన్నీ ఫిలియాస్ ఫాగ్ గారు రాసుకున్నారు. సరిగా డిసెంబర్ 21st 8.45 పీఎం (PM) కి రిఫార్మ్స్ క్లబ్ లోకి నేను వస్తాను. అప్పుడే కలుద్దాం, అని చెప్పాడు.
ఫిలియాస్ ఫాగ్ గారు ఈ మాటలు చెపుతూ వెంటనే అక్కడినుంచి లేచి తన టోపీ పెట్టుకుని రిఫార్మ్స్ క్లబ్ నుంచి బయిటికి వెళ్లిపోయారు.
సరిగా ఎనిమిది గంటల పది నిముషాలకి ఇంటికొచ్చిన ఫిలియాస్ ఫాగ్ ను చూసి
జోన్ పాస్ పెర్త్ చాలా ఆశ్చర్య పడ్డాడు.
ఫిలియాస్ ఫాగ్ గారు
వెంటనే పాస్ పెర్త్ టోనీ చెప్పాడు, "మనం ఒక పది నిముషాలలో ఇంట్లోంచి
బయటకు వెళుతున్నాము. Dowar స్టేషన్ లో మనం ట్రైన్ పట్టుకుని పదకొండు గంటలకి మనం కారు పట్టుకుని సింప్లీ మనం చేరాలి. పది నిముషాలు సమయం ఇస్తున్నాను. అంతా గబగబా సద్దేసేయి. ఎక్కువ బట్టలు ఏమీ పెట్టుకోకు. మనం దారిలోనే కొనుకుందాం. మనం 80 రోజులలో మొత్తం ఈ భూప్రదక్షిణ చేయబోతున్నాము. అందుకనే మనం సామాన్లు కూడా తీసుకెళ్లక్కర్లేదు," అని చెప్డ్పాడు ఫిలియాస్ ఫాగ్.
జోన్ పాస్ పెర్త్ కి తల తిరిగిపోయింది. అతనికి ప్రపంచం తలకిందులయినట్టుగా అయింది. ఏమీ అర్ధం కావడంలేదు. కానీ ఫిలియాస్ ఫాగ్లో ఎటువంటి హావభావాలు లేవు. ఆయన నింపాదిగా తన గదిలోపలికి వెళ్ళిపోయాడు.
జోన్ పాస్ పెర్త్ మనసులో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇదేంట్రా భగవంతుడా స్థిరమైన ఉద్యోగం తో యేవో పనులు చేస్తూ హాయిగా ఈ ఫిలియాస్ ఫాగ్ గారి దగ్గర ప్రశాంతంగా జీవనం గడుపుదామంటే, ఈయన ప్రతి రోజూ అదే సమయానికి ఖచ్చితంగా అన్ని పనులు చేస్తుంటాడని , అని నేను హాయిగా ఉందామంటే, ఇదేమిటి ఈయన 80 రోజుల్లో భూప్రదక్షిణ అంటాడు, అని ఆలోచిస్తూ, ఆశ్చర్యపడ్డాడు. అయినా తన పని తానూ చేసుకుంటూ ఉన్నాడు. సరిగా పది నిముషాలలో అంతా సద్దుకున్నారు. ఫిలియాస్ ఫాగ్ గారు మరియు జోన్ పాస్ పర్ట్ బాగ్ లు తెచ్చారు. ఆ బాగ్ లో 20000 పౌండ్స్ఉ న్నాయి. అది కూడా ఒక చిన్న పాకెట్ లో పెట్టారు. జాగ్రత్త అని ఫిలియాస్ఫాగ్ అన్నాడు. ఒక పది నిముషాల్లో రైల్వే స్టేషన్ కి వెళ్ళటం, రైల్ ఎక్కడం జరిగి పోయింది.
ఈ ఫిలియాస్ ఫాగ్ ,రిఫార్మ్స్ క్లబ్ మెంబర్ 80 రోజుల్లో భూప్రదక్షిణ ప్రపంచ యాత్ర అంతా చేస్తున్నట్టుగా మొత్తం లండన్ అంతా మారుమోగిపోయింది. మరుసటి రోజూ పేపర్లలో కూడా వచ్చేసింది. కానీ ఈ విషయాలు వీరిద్దరికీ తెలీదు. ఇదంతా గమనిస్తున్నటువంటి స్కాట్లాండ్ డిటెక్టివ్ ఫిక్స్ (Fix) ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాడు. దొంగ చాలా హుందాగా ఉంటాడు. పెద్ద మనిషి తరహాగా ఉంటాడు. అంటే ఈ లక్షణాలన్నీ కూడా రిఫార్మ్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి ఫిలియాస్ ఫాగ్ గారికి వర్తిస్తాయి. అందుకనే ఆయన వెంటనే ఈ భూప్రదక్షిణ అనే నెపంతో డబ్బులన్నీ కాజేసి బయలుదేరుతున్నారు. కాబట్టి తప్పకుండా ఫిలియాస్ ఫాగ్ దొంగ అయి ఉంటాడని, డిటెక్టివ్ ఫిక్స్ ఒక నిర్ధారణకు వచ్చేసాడు.
ఫిలియాస్ ఫాగ్ గారి ఈ ప్రయాణం గురించి నలుగురూ నాలుగు విధాలుగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. కొంతమంది ఫిలియాస్ ఫాగ్ ఒక పిచ్చివాడని చెప్పారు. కొంతమంది కాదు, కాదు అతను మేధావి అని, అతను అన్ని ప్రణాళికలు చాలా పకడ్బందీగా వేస్తుంటాడని, యిలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది జరిగిన కొద్ది రోజుల్లో ఒక ప్రముఖమైనటువంటి వార్త వచ్చింది. అది డిటెక్టివ్ ఫిక్స్ అనే ఆయన చెప్పిన సమాచారం ప్రకారంగా "దొంగ యొక్క ఆనవాళ్ళన్నీ తెలిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఖచ్చితంగా నా అనుమానమంతా రిఫార్మ్స్ క్లబ్ లో గౌరవనీయులు అయినటువంటి ఈ ఫిలియాస్ ఫాగ్ అనేవ్యక్తి వైపే నా దృష్టి అంతా కేంద్రీకరింప బడింది. అతనే తప్పకుండా ఈ పని చేసి, భూప్రదక్షిణ అనే నెపంతో ఇలా హఠాత్తుగా బయలుదేరడానికి కారణం", అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వార్తా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురింప బడింది. ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్ గురించి రకరకాలుగా జనాలు అనుకుంటున్నారు. ఈ వార్త అందరి నోళ్ళలో పడింది.
************