N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Saturday 20 May 2017

Bhaarth Maata ki Jai!!

 Congratulations, salutations to govt of India and advocate Salvey. On behalf of our readers we sincerely thank the Govt. of India, specially external affairs minister Sushma Swaraj and Law minister Ravishankar Prasad and special thanks to advocate Harish Salvey for defending the case of Kulbhushan Jadhav in international court of justice.

     This is the first time in the history of India after gaining independence in 1947 this Government come forward and put all efforts to save the life of an ordinary Indian. We feel very proud, and we salute Govt. of India from bottom of our heart, our prime minister Narendra Modi and his entire team. Special thanks to his advocate Harish Salevy who hasn't taken any fee for this process. The entire nation of India is being praying for the life of the Sri Kulbhushan Jadhav. We continue to pray for his safe return. 

భారత్ మాతా కీ జై

శ్రీ కులబూషణ్ జాదవ్ గారి కోసం మనం అందరం ఆ భగవంతుని ప్రార్ధన చేద్దాం. ఆయన క్షేమంగా మళ్ళీ స్వదేశానికి రావాలని ,వాళ్ళ  కుటుంబ సభ్యులలో మళ్ళీ  ఆనందాన్ని రేకెత్తించాలని  ప్రార్ధన చేద్దాం.

భారత్ మాతా కీ జై.


విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్,  ప్రియ తమ  ప్రధాన మంత్రి నరేంద్ర మొది  ప్రభుత్వానికి మరియు  న్యాయవాది హరీశ్ సాల్వె గారికి అభివందనాలు.

అమాయకంగా పాకి స్తాన్ ఖైదులో మగ్గుతున్న శ్రీ కులబూషణ్ జాదవ్ గారి ప్రాణాలు కాపాడారు. ప్రత్యేకంగా  ప్రఖ్యాత  న్యాయవాది హరీశ్ సాల్వె గారికి మా అందరి తరపున  అభినందనలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.

Tuesday 9 May 2017

Gayatri Mantra Mahima-5




పండిత శ్రీ రామ శర్మ ఆచార్య – దయ్యాల కొంప
పరమ గురువు పండిత శ్రీ రామశర్మ ఆచార్య గారు గాయత్రి పరివార్  వ్యవస్థాపకులు . హరిద్వార్ లోని శాంతికుంజ్ సప్తఋషులు తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశ౦ ,విశ్వామిత్రుడు గాయత్రి మాతని ప్రత్యక్షం చేసుకున్నటువంటి పవిత్ర భూమిలో ఆయన గాయత్రి పరివార్ ని స్థాపించారు . శ్రీ రామశర్మ ఆచార్య గారు మధుర జిల్లాలో అవల్ఖేడ్ అనే గ్రామంలో జమిందారీ కుటుంబంలో జన్మించారు . పదిహేనేళ్ళ ప్రాయంలో ఆయనకి ఆయన గురువు గారైన సర్వేశ్వరానంద స్వామిని కలిసారు . 

Sunday 7 May 2017

దేవదత్తుని వృత్తాంతం - 07

దేవదత్తుని వృత్తాంతం – 7వ భాగం

దత్తాత్రేయులు వారు అభయమిచ్చాక పింగళ నాగుడు వారిని ఈవిధంగా ప్రశ్నించాడు. “స్వామీ ! మన సంఘంలో చాలా కట్టుబాట్లు ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మ పద్ధతులు ఉన్నాయి. వివిధ రకాల వర్ణాల వారికి వివిధ రకాలైన సాంఘికపరంగా ధర్మాలు ఉన్నాయి. ఈ నాలుగు వర్ణాశ్రమ ధర్మాలు మనందరమూ పాటించాల్సి వస్తుంది కదా ! మరి ఈ మహాయజ్ఞం లో సాక్షాత్తు మీరు ఈ సాంఘిక మర్యాదలను పాటించకుండా ఎన్నో చేస్తున్నారు. అక్కడికి వచ్చిన కుక్కల్ని తాకుతున్నారు. మధ్యమధ్య లో మీరు కుండలతో కల్లు త్రాగుతున్నారు. అంతే కాకుండా ఒక అందమైన యువతి కూడా మీ దగ్గరలోనే ఉన్నది. ఇదంతా చూస్తున్న నాకు మీ తత్వమేమిటో అర్థం కావడం లేదు. సాక్షాత్తు దేవతలు, గంధర్వులు, యక్షులు మీ చుట్టూతా మూగుతున్నారు. మీ ముగ్ధమోహన స్వరూపం చూస్తుంటే మా అందరికి  తనివి తీరడం లేదు.  మీలో ఎంతో కొంత గొప్పతనం  ఉంటే తప్ప సాక్షాత్తు సిద్ధులు, గంధర్వులు, సాధువులు, సత్పురుషులు, దేవతలు మీ దగ్గరకి రారు కదా ! మరి ఇదేమిటీ స్వామీ నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో ఏదో విశేషమర్మం ఉంది. దయ చేసి దాని ఈరు నాకు చెప్పండి అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా దత్తాత్రేయుల వారు చిరునవ్వు నవ్వుతూ “ పింగళ నాగా! నీవు సత్పురుషుడివి. ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచారాలని, సాంఘిక నియమాలన్నీ నీవు  పాటిస్తున్నావు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు, పెద్దలు నియమించిన సాంఘిక కట్టుబాట్లన్నీ మీరందరూ  యథాతథంగా పాటించ వలసిందే ల్సిందే. అవి మీరు  దాటకూడదు. నాకు ఈ వర్ణాశ్రమ ధర్మాలు వర్తించవు. నేను వీటికి అతీతంగానే ఉంటాను. నాకు ఒక పని చేసినందు వల్ల పుణ్యం కానీ ఇంకొక పని చేసినందువల్ల పాపం కానీ ఈ రెండూ నాకు అంటవు. నేను ఒక చేత్తో సూర్యుణ్ణి తాకుతాను అని చెప్పగా పింగళ నాగునికి అద్భుతంగా ఆయన హస్తం అక్కడ సూర్యమండలాన్ని తాకడం గమనించాడు. నాయనా పింగళ నాగా ! నేను ఇంకొక చేత్తో అశుద్ధాన్ని కూడా ముట్టుకుంటాను అని చెప్పగానే రెండో చేయి ఆశుద్ధాన్ని ముట్టుకున్నట్టుగా కనిపించింది. నాకు ఈ రెండింటికీ ఏమీ భేదం లేదు. నాలాగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళనే అవధూతలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు సాటి అయినవాడు నిజానికి ఈలోకంలో ఎవరూ లేడు. బాహ్యం గా నేను చేస్తున్నపనులు వాళ్ళు గమనించి నన్ను అనుకరించాలని ప్రయత్నం చేస్తే వాళ్లకి పతనం తప్పదు. వాళ్ళతో పాటు వాళ్ళ శిష్యులందరికీ కూడా పతనావస్థ  తప్పదు. నాకు కుక్కలకి, కల్లుకి , యువతులకి ఎటువంటి భేదం లేదు అని చెప్పి పింగళ నాగుని భ్రుకుటిని తాకగానే ఆయనకి స్వామి వారి దగ్గరున్న ఆ నాలుగు కుక్కలు కూడా చాలా అద్భుతమైన సిద్దులుగా కనిపించారు. అలాగే అక్కడ ప్రక్కనే  ఉన్న యువతి సాక్షాత్తు అనఘామాతగా దర్శనమిచ్చారు. అలాగే ఆయన త్రాగుతున్న కల్లు అమృతప్రాయంగా కనిపించింది. వెంటనే పింగళ నాగుడు వారందరికీ ఎంతో భక్తి శ్రద్ధలతో సాష్టాంగ దండ ప్రణామం చేశాడు.

తర్వాత వల్లభ దాసు “నాయనలారా ! విన్నారు కదా అవధూత తత్వం! స్వామి వారి తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీకు నేను కొంచెం మాత్రమే చెప్పగలిగాను. ఈ మాత్రమైనా మీరు అర్థం చేసుకున్నారంటే అవధూతలుగా చెప్పబడుతున్న ఎటువంటి వారి దగ్గరకైనా వెళ్లవలసిన అవసరం లేదు. అటువంటి అవధూతలు ప్రస్తుతం ఎక్కడా లేరు. ఆయన  సాక్షాత్తు వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపం , అద్వితీయుడు, షడ్భావవికారాలు లేనివాడు, పుట్టుట- పెరుగుట- మరణించుట ఇటువంటివి ఏవీ ఆయనకి లేవు. కాబట్టి నాయనలారా,  నేను మొదట్నుంచి కూడా శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని, ఆ దత్తప్రభువుని  మాత్రమే పట్టుకుని ఉంటాను. మనమందరం కూడా మూలాన్నే పట్టుకోవాలి. ఆ మూలం నుంచి వచ్చిన కొమ్మల్ని, ఆకుల్ని పట్టుకుని లాభం లేదు. ధృఢమైన ఆ మూలాధారం నుంచి ఊర్ధ్వముఖంగా వెళ్ళు తున్నటువంటి ఆ చైతన్యాన్ని మాత్రమే పట్టుకోవాలి” అని చెప్పగా అక్కడున్న భక్తులందరూ కూడా చాలా సంతోషించారు. ఈవిధంగా వల్లభ దాసు ఏమాత్రం శాస్త్రపరిజ్ఞానం లేకపోయినా ఎంతో చక్కగా దత్తాత్రేయుని యొక్క అవధూత తత్వాన్ని  చెప్పడం నాగానాథునికి చాలా ఆనందం కలిగింది. అందుకే ఈ వల్లభ దాసు, ఆయన శిష్యులందరూ కేవలం ఆ దత్తాత్రేయ ప్రభువుని మాత్రమే తమ గురువుగా చేసుకుని మరి అటు ఇటు ఎక్కడకి వెళ్ళకుండా నిరంతరం ఆయన నామస్మరణం చేసుకుంటూ ఉండడం నాగనాథునికి సంతోషంగా అనిపించింది. ఎంతో విజ్ఞానం కలిగి, శాస్త్రాలు చదివిన వేదపండితులు, విద్యావంతులు వీరందరూ మూలాన్ని పట్టుకోకుండా కొమ్మలు పట్టుకుని వేలాడుతున్నారేమిటీ అని కూడా అనిపించింది. కేవలం శాస్త్రాలు, దత్తపురాణాలు లేక దత్తుని అవతారాల చరిత్రలు చదివినంత మాత్రాన వాళ్ళలో మార్పు కలగడం లేదని నాగ నాథుడు బాధ పడ్డాడు. ఆశ్రమం చుట్టూ కూడా వలయాకారంగా ఎంతో అద్భుతమైన కాంతి పరివేష్టితాన్ని ఆయన చూసి చాలా సంతోష పడ్డాడు.  

దేవదత్తుని వృత్తాంతం - 06

                                     దేవదత్తుని వృత్తాంతం 6వ అధ్యాయం 


నాగనాథుని ఆవేదన

              ఈ విధంగా అందరిని గమనిస్తున్న నాగనాథునికి అయ్యో ! శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారు జన్మించిన ఈ పిఠాపురంలో నిజమైన భక్తులున్నారా? అని ఆవేదన చెందుతున్నప్పుడు ఆయన మనోనేత్రానికి పిఠాపురం చివరగా ఉన్న ఒక వ్యక్తి వైపు ఆయన దృష్టి వెళ్ళింది. ఊరికి దూరంగా ఉన్నఒక మాలపల్లిని  ఆయన గమనించాడు. అక్కడ ఎంతో అందమైన కుటీరం లాగా ఒక ఇల్లు కనిపించింది. అది మునివాటిక లాగా ఉన్నది. ఆ వీధి అంతా ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఆ వ్యక్తి యొక్క శరీరమంతాకూడా విద్యుల్లతలు కనిపించాయి. అతని శిరస్సు చుట్టూ ఒక దివ్య తేజస్సుకనిపించింది. ఆయన పేరు వల్లభ దాసు అని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళగా ఎంతో పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించి ఆ వల్లభ దాసు ఎదురుగుండా  చాలామంది కూర్చుని చక్కగా భజన చేస్తున్నారు. అక్కడ నాలుగు కుక్కలు నిశ్శబ్దంగా, ఎంతో శ్రద్ధగా వారు చేస్తున్నటువంటి భజనల్ని, కీర్తనలని వింటున్నాయి. వల్లభదాసు ఎంతో శ్రావ్యంగా తంబూరా మీటుతూ  దత్తాత్రేయుని మీద, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మీద తనకు తోచిన కీర్తనలు తమకు తోచిన శైలిలో పాడుతూ ఉన్నారు. ఆయన వాక్కులు బయటకి వస్తున్నప్పుడు వాటిలో ఎంతో శక్తివంతమైన విద్యుత్పుంజాలు కనిపించాయి. అవి అక్కడ కూర్చున్న మనుష్యులను తాకుతున్నాయి. వారిలో మానసికంగా , శారీరకంగా చాలా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. నాగనాథునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వల్లభ దాసు ఎటువంటి శాస్త్రాలు  చదవలేదు. తాను నమ్ముకున్న శ్రీపాద శ్రీవల్లభుని మీద, దత్తాత్రేయుని మీద కీర్తనలు ఎంతో తన్మయత్వంతో చేస్తున్నాడు. నాగనాథుడు కూడా ఎంతో తన్మయత్వంతో ఆనందంగా  ఆ కీర్తనలని వింటున్నాడు.

              కీర్తనలు, భజనలు అయిపోయినాక అక్కడ చేరిన భక్తులు “మహాత్మా ! మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటికి సమాధానాలు మీరే చెప్పాలి” అని ప్రశ్నించారు. దానికి  సమాధానంగా ఎంతో ప్రశాంతంగా “నాయనలారా ! తప్పకుండా అడగండి. నేను సమాధానాలు చెప్పి మీ సందేహాలని తీరుస్తాను” అని చెప్పాడు. వెంటనే వారిలో ఒకడు స్వామీ ! ఈ పిఠాపురంలో ఒక అవధూత ఉన్నారని అందరూ చెప్పు కుంటున్నారు. అక్కడ కూడా జనం చాలా విపరీతంగా వెళ్ళుతున్నారు. ఒక సారి నేను కూడా అక్కడకి వెళ్ళడం జరిగింది. ఆయన ఒక మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ తర్వాత అక్కడనుంచి నేను వచ్చేశాను. అసలు అవధూత అంటే ఏమిటి స్వామి? ఆ తత్వం ఏమిటో మీరు మాకు చెప్పగలరా ? అని ఎంతో వినయంగా అడిగాడు. దానికి సమాధానంగా “నీవు చూసిన వ్యక్తి మంచి సాధువు. అతను ఎప్పుడూ తాను అవధూత అని చెప్పుకోలేదు. అక్కడ చేరిన ప్రజలు ఆతని గురించి అలా ప్రచారం చేస్తున్నారు. ఆతను సహృదయుడు, ఎంతో నెమ్మదస్తుడు, వృద్ధుడు. నాయనా! ఈ పీఠికాపురం లో సుమతీ మహారాణి గారి దగ్గరకి ఒక సాధువు యాచించడానికి వచ్చాడు. అప్పుడు సుమతీ మహారాణి గారు అతనికి భిక్ష ఇచ్చినప్పుడు ఆ వచ్చిన సాధువు “అమ్మా ! నీకేం వరం వరం కావాలో కోరుకో ! అని అన్నాడు. సుమతీ మహారాణి గారు ఎంతో వినయంగా  “నాయనా ! నన్ను ‘అమ్మా’ అని పిలిచావు. అది సార్థకం చేయి’, అని సుమతీ మహారాణి గారు అన్నారు. అంటే తనకి పుత్రుడుగా జన్మించమని అన్నారు. అప్పుడు ఆ సాధువు తన నిజ రూపాన్ని చూపించాడు. ఆయన మరెవరో కాదు సాక్షాత్తు దత్తాత్రేయుడు. అవధూత రూపంలో వచ్చాడు. తల్లీ ! నీకు నావంటి పుత్రుడే జన్మిస్తాడు అని చెప్పాడు. కాని దత్తాత్రేయుడి లాంటి వ్యక్తి , అవధూత ఇంకొకడు లేదు కాబట్టి ఆయనే స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిలా ఆమె గర్భం నుంచి జన్మించారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? సాక్షాత్తు దత్తాత్రేయుల వారి రూపమే సంపూర్ణమైనటువంటి అవధూత. ఇంకా ఈ ప్రపంచంలో తనలాంటి అవధూత ఇంకొకడు లేదు కాబట్టి ఆయనే స్వయంగా జన్మించవలసి వచ్చింది. అయితే తనని ఎవరైతే చాలా భక్తిగా, శ్రద్ధతో సేవించారో శ్రీపాద శ్రీవల్లభుల స్వామి వారు  వారిని ఆశీర్వదించి వారికి కొన్నిమహిమలు, మంచి శక్తులూ, సిద్ధులూ వచ్చే జన్మలో కలుగుతాయని ఆశీర్వదించారు కాబట్టి అందులో ఒకతను శ్రీ వెంకయ్య గారనే ఆతను అవధూతగా జన్మించడం అనేది కేవలం శ్రీపాద శ్రీవల్లభుల వారి వాక్కు వల్లనే సుమా ! అని చెప్పాడు.




                  దానికి ఒక వ్యక్తి “స్వామీ ! అసలు అవధూత తత్వం ఏమిటీ?” అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వల్లభ దాసు “నాయనా ! దానికి సమాధానం చెప్తాను శ్రద్ధగా విను. అవధూత తత్వం గురించి చెప్పడం అనేది చాలా కష్టపరమైన విషయం. నాకున్న బుద్ధీ, పరిజ్ఞానంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిఆశీర్వాదం, అనుగ్రహంతో ఆయన నానోట పలికించ బోయే వాక్కు మాత్రమే నేను మీకు చెప్పగలను అని చెప్పి, కొచెం సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని అప్పుడు ఇలా చెప్ప సాగారు. పూర్వం పరశురాముడు శ్రీ దత్తస్వామిని ప్రధానంగా పెట్టుకుని ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని చేశారు. సమస్త దేవతలు, మహర్షులు, సిద్ధులు, సాధువులు, మనుష్యులు అందరూ కూడా ఆ యజ్ఞానికి విచ్చేశారు. ఆ యజ్ఞంలో పింగళనాగుడు అనే ఒక బ్రాహ్మణుడికి కూడా కొంత అర్చకత్వం లభించింది. ఈ పింగళనాగుడు ఒక మహానుభావుడు. ఎన్నో శాస్త్రాలు చదివిన వాడు. అయితే అయన గమనిస్తున్న కొన్ని విషయాలను చూసి చాల ఆశ్చర్య పడి పోయాడు. ఒక రోజు దత్తాత్రేయ ప్రభువు అమలక వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పింగళ నాగుడు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో చేతులు కట్టుకుని “మహాత్మా ! మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని వచ్చాను. మీరు కోపగించకుండా ఉంటే అడుగుతాను” అని చెప్పగా శ్రీ దత్తాత్రేయుల వారు చిరునవ్వు నవ్వుతూ “పింగళ నాగా! ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. తప్పకుండా నీవు అడుగు. నేను జవాబు చెప్తాను” అని చెప్పారు.

దేవదత్తుని వృత్తాంతం - 05

                    దేవదత్తుని వృత్తాంతం –  ఐదవ  భాగం (తరువాయి భాగం)

   శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి తపన (continued)


             అక్కడే ఉన్న ఒక వైద్యుడు దీక్షితులు గారి అభిమాని. హాస్పిటల్ లోనికి ఆయన్ని తీసుకుని వెళ్ళారు. దురదృష్టవశాత్తు మల్లాది గోవింద దీక్షితులు గారికి కనీసం ఆ హాస్పిటల్ లో ఒక మంచమైనా దొరకలేదు. అందుకని ఆయన్ని క్రిందనే పడుకోబెట్టారు. అదే ఊళ్ళో ఆ డాక్టర్ గారు ఉంటారు కాబట్టి ఆయన గురువుగారికి సకల సపరిచర్యలు చేయడం, ప్రొద్దున్నే ఆయనకి కావలసిన అల్పాహారం ఇవ్వడం, మరి అప్పటికే ఆయన కాలు చాలా భయంకరంగా వాచి పోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండడం, ఖరీదైన మందులు ఆయనకి ఇవ్వడం, ఇదంతా నాగనాథుడు గమనిస్తూనే ఉన్నాడు


ఋణానుబంధం

                  నాగనాథుడు కొద్దిగా భూతకాలంలోనికి వెళ్ళడం, అక్కడ గుజరాత్ నుండి రాజకుమారి అనే ఆవిడ, భాగ్యనగరం నుండి ప్రసిద్ధులైనటువంటి ఒక హోమియోపతి వైద్యుడు, మరియొక యువకుడు ఆ దత్తుని సంస్థలో కలవడం, ఎన్నో విషయాలు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు వారితో చర్చించడం, వాళ్లకి శ్రీ గోవింద దీక్షితులు గారితో అనుబంధం కలవడం, ఆ సందర్భంలో శ్రీ గోవింద దీక్షితులు గారు రాజకుమారి తో తన గురువు గారి దగ్గర్నుంచి తీసుకుని వచ్చిన అసలైన శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం ఇచ్చి దాన్ని హిందీ భాషలోనికి అనువదించమని సూచించడం, వీడ్కోలు సమయంలో ఒక ఔదుంబర మొక్కని కూడా వారికి ప్రసాదించడం, ఎంతో అభిమానంతో వారిద్దరినీ సాగనంపడం, ఇవన్నీ నాగనాథుడు చూస్తూనే ఉన్నాడు. రాజకుమారిగారి అంతఃకరణ ఎంతో పరిశుద్ధంగా ఉండడం, ఇన్నేళ్ళ నుంచి హిందీ భాషలోనికి అనువాదం చేస్తామని చెప్పినవారు ఆ పనినే చేయకపోవడం, దాన్ని ఎంతో సమర్థవంతంగా రెండు నెలలోనే రాజకుమారిగారు హింది భాష లోనికి అనువాదం చేయడం, ఆ రోజు శ్రీ గోవింద దీక్షితులు గారు ఎంతో సంతోషపడడం నాగనాథుని కంటికి కనిపించింది. అంతే కాక వారు దాన్ని హరబాబా గారికి పంపించడం, ఆయన త్వరలోనే దాన్ని పుస్తకరూపంలో ముద్రిస్తామని చెప్పడం, అయన మనోగతానికి అర్థమైంది. శ్రీ గోవింద దీక్షితులు గారి పరిస్థితి తెలిసిన ఆ రాజ కుమారి గారు వెంటనే ఆయనకి దాదాపు లక్ష రూపాయల దాకా ఆయన బ్యాంకు లో డిపాజిట్ చేయడం, అంతా చూసిన నాగనాథుడు ‘ఆహా ! ఇంకా ఈలోకం లో మంచివాళ్ళు ఉన్నారు కదా !” అని అనుకున్నాడు. మంచి హృదయం, శ్రీపాద శ్రీ వల్లభుల వారి పట్ల ఎంతో గౌరవం ఉన్న వాళ్ళు ఆయన కంటికి కనిపించినందు వల్ల ఆయన చాలా సంతోషపడ్డారు.


                   ఇక్కడ శ్రీ మల్లాది గోవింద దీక్షితులుగారికి వైద్యం చేస్తున్నటువంటి వైద్యుడు ఆయనలో ఏమాత్రం మార్పు కనిపించక పోవడంతో కాస్త భయపడ్డాడు. అప్పుడు శ్రీ దీక్షితులు గారు నాకు భాగ్యనగరంలో ఉన్న డాక్టర్ శాంతిస్వరూప్ గారి మందులే కావాలి అని చెప్పడం, ఆ డాక్టర్ గారు అక్కడ్నుంచే ఆ రిపోర్ట్ లన్నీ చెప్పడం, డాక్టర్ శాంతిస్వరూప్ గారు భాగ్యనగరం నుండే మందులు చెప్పడం, ఆ మందులు ఆయన వాడడం, సరిగ్గా రెండు వారాలలోనే శ్రీ దీక్షితులుగారి కాలు నయమైపోయి, స్వస్థత చేకూరడం నాగనాథుడు గమనించాడు. ఒకవైపు అదే ఊళ్ళో ఉంటున్న దత్త సంస్థ కాని, శ్రీపాద శ్రీవల్లభ సంస్థ కాని ఏమీ పట్టించుకోక పోవడం, ఎక్కడ్నుంచో ముక్కు-ముఖం తెలియని వాళ్ళు వచ్చి శ్రీ దీక్షితులుగారితో అనుబంధం పెంచుకోవడం, సమయానికి వారు ఆయనకి ఆర్ధిక సహాయం చేయడం చూసిన నాగనాథుడు “ఆహా ! ఏమీ ఈ తేడా ! ఏమి ఈ విచిత్రం !” అని అనుకున్నాడు. వారిద్దరిని కూడా ఆయన ఎన్నోరకాలుగా ఆశీర్వదించాడు.  


             అటు దత్తుని సంస్థ వారు, ఇటు శ్రీపాద శ్రీవల్లభ సంస్థ వారు శ్రీ గోవింద దీక్షితులు గారిని కేవలం పిచ్చివాడి మాదిరిగానే చూడడం, అలాగే ఆయన వెనుక ఆయన గురించి మాట్లాడడం చూసి నాగనాథుని మనస్సుకి కొంచెం ఆవేదన కలిగింది. “అయ్యో ! వీళ్ళు ఎంత పాపకర్మలని పెంచుకుంటున్నారు ! ఇది వీరి అమాయకత్వమా లేక అహంకారమా?” అని ఆయన మీమాంసలో పడ్డారు. 

Saturday 6 May 2017

Gayatri Mantra Mahima-4

గాయత్రి మంత్ర మహిమ
గుంటూరులో కొద్ది  కాలం క్రిందట ఒక  సద్బ్రాహ్మణుడు  రెండు వైపులా మంచి నీళ్ళ బిందెలతో  కావడి  మోసుకుంటూ మంచి నీటి కొరత ఉన్న ఇళ్ళలో  మంచి మంచి నీళ్ళు చేర వేస్తూ ఉండే వాడు. అతడు  ఊళ్లోనే ఉన్న ఒక సంపన్న కుటుంబీకునికి కూడా  మంచి నీళ్ళు సరఫరా చేస్తుండేవాడు. అతడు చాలా నిరాడంబరుడిగా, నిజాయితీపరుడిగామితభాషిగా ఉండేవాడు 

Friday 5 May 2017

Gayatri Mantra Mahima-3

ఆధ్యాత్మిక  విశేషాలు
పూర్వం వంగ దేశం అంటే   పశ్చిమ బెంగాల్ లో ఒక సిద్ధ పురుషుడు మహాత్ముడు ఉండేవాడుఆయన ఎంతో నిరాడంబరంగా ఉంటూ తనకు తోచిన పద్ధతుల్లో ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఉండేవాడు చుట్టూ ప్రక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఆయన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉండేవాళ్ళుఆయన  ఊరికి వెళ్లినా సరేఅక్కడి జనమంతా ఆయన్ని సత్కరించి , కూర్చోబెట్టి , వాళ్ల ఇంట్లో వండిన మిఠాయిలుమంచి రుచికరమైన   పదార్థాలు అన్నీ ఆయనకి అర్పిస్తూ ఉండేవాళ్ళుఇలాగేఆయన ఒకసారి పర్యటిస్తూ ఒక గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఉన్నారు.  వేలాదిమంది భక్తులు వచ్చి, వారు తీసుకువచ్చిన మధుర పదార్థాలన్నీ కూడా ఆయనముందు పెట్టారు.

Thursday 4 May 2017

Gayatri Mantra Mahima-2




గాయత్రి మంత్రం మహిమ 

ఇది చాలా ఏళ్ళ క్రిందట కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో నిజంగా జరిగిన సంఘటన. కథ కాదు. గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నా అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబంలాగా ఉంటుండేవారు. లక్ష్మినారాయణ అనే సద్బ్రాహ్మణుడు   జన్మతః బ్రాహ్మణుడైనా 20 ఎకరాల మంచి మాగాణి భూమి ఉండడంతో రైతు పని చేస్తుండేవారు. ఆయనకి ఊళ్ళో మంచి పేరు ఉండేది.