దేవదత్తుని వృత్తాంతం – మూడవ భాగం
ఈ విధంగా దేవదత్తుడు, నాగనాథుడు కొంచెంసేపు ఆ ప్రాంగణమంతా కలియతిరుగుతూ అక్కడ ఉన్న ఔదుంబర వృక్షం క్రింద కూర్చున్నారు. దేవదత్తుని ముఖం చాలా గంభీరంగా ఉండిపోయింది. బహుశా ఆయనకి పాత స్మృతులన్నీ ఎన్నో ఆయన మనోవీధిలో తిరుగాడుతున్నట్టుగా నాగనాథుడు గమనించాడు. చివరకి ఆయన “నాగనాథా! నీలో ఎంతో ఆర్తి, ఆవేదన ఉంది. శ్రీ దత్తాత్రేయులవారి తత్వం గురించి చెప్పమని నీవు నను అడిగావు. నేను నీకు తప్పకుండా చెప్తాను. కాని ఆయన తత్వం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే నీవు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి లోకపుతీరుని గమనించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ మానవనైజాలు, వారి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క ఆధ్యాత్మిక పరిణామక్రమాలు ఎలా ఉన్నాయి, అసలు ఏం జరుగుతున్నది అన్నది నీవు ఒక సాక్షిగా గమనిస్తూ ఉండు.

నీకు ఎన్నో రకాల సందేహాలు
వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తులో ముందు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకి
ఇలా ఎన్నో సందేహాలు, ప్రశ్నలు కలుగుతూ ఉండడం సహజమే. ఎవర్ని అడిగి ఈ సందేహాలు తీర్చుకోవాలో
తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. కనుక నీ మనస్సుకి తోచినట్టుగా నీ అంతరాత్మ
చెప్పిన విధంగా నీవు కొద్ది రోజులు పరిస్థితులను గమనించు. నీవు ఎంతో కొంత సాధన
చేశావు కనుక నీ మనో నేత్రానికి నీవు చూస్తున్నదేమిటీ? అసలు వాస్తవమేమిటీ? అన్న
విషయాలన్నీ కూడా, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా కనిపించే విధంగా నీకు
నేను దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను.