N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Tuesday 13 June 2023

8౦ రోజుల్లో భూ ప్రదక్షిణ - 7

 

పోయిన అధ్యాయం లో చాలా  ఆందోళనతో కథ సాగింది.. సరిగ్గా  20 డిసెంబర్ కి  ఫిలియాస్ ఫాగ్ లివర్ పూల్  చేరాడు. అక్కడ నుంచి  ఆరు గంటల  ప్రయాణంతో అతను ఫిన్ ల్యాండ్ చేరుతాడు. ఆ తర్వాత  సరిగ్గా 21 డిసెంబర్ 8 .45 PM కి  రిఫార్మ్ క్లబ్ కి  ఆయన చాలా  సులభంగా చేర గలడు కానీ, ఆఖరి నిముషంలో  ఈ డిటెక్టివ్ ఫిక్స్ రావటం, అరెస్ట్ చేయటం వంటి పరిణామాలు, జైలు లో వేయటం, అక్క డ కొంత సమయం వృధా కావటం ఇలా   ఒక దాని తర్వాత  ఒకటి జరిగి  పోయాయి. చాలా వేగం గా, వింతగా జరిగి పోయాయి. ఫిలియాస్ ఫాగ్ కి  డిటెక్టివ్  ఫిక్స్ మీద మొదటి సారిగా కోపం  వచ్చింది. డిటెక్టివ్  ని కోప్పడటం, కొట్టటం  కూడా జరిగంది. పాస్ పర్ట్ కి  కూడా డిటెక్టివ్  ఫిక్స్ మీద చాలా కోపం వచ్చింది. గట్టిగానే కోప్పడ్డాడు పాస్ పర్ట్ డిటెక్టివ్ ఫిక్స్ ని. 

ఆ తర్వాత ఇంకా ఆలస్యం  చేయకండా వెంటనే వాళ్ళు రైల్వే స్టేషన్ కి బయలు దేరారు. అక్కడికి వెళ్లేసరికి దురదృష్టం కొద్ది  రైలు ఆలస్యంగా వచ్చింది. మరి ఆరోజు 21 డిసెంబర్ ఇక్కడ  రైలు ఆలస్యం అయింది. అందరూ చాలా ఆదుర్దాగా రైలు ఎక్కేసారు.ఇంగ్లాండ్ హూస్టన్ స్టేషన్  కి చేరి టైం చూద్దామని గడియారం వైపు చూసారు. ఆ గడియారం 21 డిసెంబర్ సాయంత్రం  8 .50 నిముషాలు చూపిస్తుంది.

 ఎంత దురదృష్టమంటే  సరిగాా అయిదు  నిముషాల ఆలస్యం వల్ల పందెం ఓడిపోతున్నాం అని అందరికి బాధ కలిగింది. మౌనంగానే వాళ్లలో వాళ్ళు బాధ పడుతూ ఇంటికి వెళ్లిపోయారు.

 ఫిలియాస్ ఫాగ్ ముభావంగా గంభీరంగా , మౌనంగా ఉన్నారు. పాస్ పర్ట్  చాలా బాధ పడుతున్నాడు. తన యజమాని ఈ పోటీ గెలవాలని ఎంతో కోరుకున్నాడు. చివరికి ఇలా ఐదు నిమిషాల వల్ల ఓడి పోవటం ఏమిటీ అని అనుకున్నాడు. మేడం ఔదా కూడా ఇలా జరిగినందుకు చాలా బాధ పడింది.

ఆ మర్నాడు  ఫిలియాస్ ఫాగ్, మామూలుగా అయితే పొద్దున్నే  11.౩౦ కల్లా టంచనుగా రిఫార్మ్స్ క్లబ్ కి బయలుదేరాడు. కానీ వెళ్ళలేదు . మొట్టమొదటి సారిగా అలా  జరిగింది.

ఫిలియాస్ ఫాగ్, మేడం ఔదా దగ్గరకి వచ్చాడు . నేను మిమ్మల్ని ఇంగ్లాండ్ కి తీసుకుని వచ్చాను. మీకు ఎంతో మంచి జీవితాన్ని ఇవ్వా లని ఆశ పడ్డాను. కానీ ఇప్పుడు  నేను బీదవాడిని   అయ్యాను. నాక ఈ ఇల్లు మాత్రమే  ఉంది. అని  ఎంతో బాధగా  అన్నాడు.

దానికి  సమాధానంగా అదే మిటి? మీక ఎవరూ స్నేహితులు లేరా... అని అడిగింది . అంటే

ఫిలియాస్ ఫాగ్ లేరు. నాకు స్నేహితులు ఎవరూ లేరు అన్నాడు. మరి బంధువులు కూడా

ఎవరూ లేరా. అంటే, బంధువులు కూడా ఎవరూ లేరు అని  ఫిలియాస్ ఫాగ్ ముక్తసరిగా జవాబిచ్చాడు. అందుకు క మేడం ఔదా పరవాలేదు మనకి  బంధువులు ఎవరూ లేకపోయినా, స్నేహితులు ఎవరూ లేకపోయినా, డబ్బులు  లేకపోయినా మనిద్దరమూ హయిగా జీవించ వచ్చును.. నేను మీకు  తోడుగా వుంటాను. సహా యంగా నిలుస్తాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అనగానే, ఆ మాటలకి ఫిలియాస్ ఫాగ్ కళ్ళు  చెమ ర్చా యి. కంట్లోనీటి చుక్కలు మెరిసాయి. యిది అంతా గమనిస్తున్న  పాస్ పర్ట్ ఆ సన్నివేశానికి చలించిపోయాడు. ఔదా మళ్ళీ ఇలా అంది ఫిలియాస్ ఫాగ్ తో. "చూడండి ! నేనెవ్వ రో తెలియక పోయినా, చితి మంటల్లో  కాలిపోవాల్సిన నన్ను కాపాడారు. నాకు ఒక కొత్త జీవితాన్ని కల్పించారు. ఇవన్నీ నేను ఎలా మరిచిపోగలను?" అని అంది. 

ఫిలియాస్ ఫాగ్ సమాధానంగా. "మరి నిన్ను   అంత దారుణంగా చితి మంటల మధ్య దహనం  చితి మంటల మధ్య దహనం చేయాలనుకంటే అది చూసిన  నేను భరించలేక పోయాను. అందులో  నా గొప్పతనం ఏమీ లేదు", అని అన్నాడు.


 అపుడు వెంటనే ఫిలియాస్ ఫాగ్, ఔదా అంగీకారం తెలపడం తో , పాస్ పర్ట్ ని  పిలిచి, నీకు  Rev. విల్  సన్ గారి ఇల్లు తెలుసు కదా! నేను, ఔదా ఇప్పుడే పెళ్లి  చేసుకుందాం అనుకంటున్నాం. వెంటనే దానికి సంబంధించిన వివరాలు కనుకు ని రా అని చెప్ప గానే పాస్ పర్ట్  ఎంతో సంతోషంగా వెంటనే పరిగెత్తాడు. మళ్ళీ కాసేపటికి ఊపిరి ఎగబీలుస్తూ వెనక్కి వచ్చాడు. మై మాస్టర్ ! ఫిలియాస్ ఫాగ్ ! ఇవ్వాళ శనివారం. యింకొక పది నిముషాల్లో బయలు దేరాలి రిఫార్మ్ క్లబ్ కి వెళ్ళండి.మీరు మీ పందాన్ని గెలిచారు అంటూ సంతోషంగా గట్టిగా అరిచి చెప్పా డు. ఈ రోజు డిసెంబర్ 21వ తేదీ! శనివారం ! సాయంత్రం 8 .45 నిముషాలకి  మీరు రిఫార్మ్ క్లబ్ కి చేరుకోవాలి. ఇంకా టైముంది. త్వ రగా బయలు దేరండి  అంటూ తొందర పెట్టాడు పాస్ పర్ట్.

"అదేమిటీ ! ఇవ్వాళ శనివారమా ! అది ఎలా ! "అంటూ ఆశ్చర్య పోయాడు. అసంభవం

కదా! అన్నాడు ఫిలియాస్ ఫాగ్. సమాధానంగా పాస్  పర్ట్  మనం ప్రదక్షిణ తూర్పు 

వైపుగా ప్రయాణం చేసాము. తూర్పు దిశగా వెళ్ళితే మనకు సమయం చాలా  కలిసి వస్తుంది..

అందు కే మనం రెండు రోజులు ముందు గానే గమ్యాన్ని చేరుకున్నాము. ఎక్కువ టైం లేదు.

మీరు త్వరగా బయలు దేరండి , అంటూ హడావిడి  చేసాడు. తానే ఒక గుర్రపు బండి ని

మాట్లాడి రిఫార్మ్ క్లబ్  చేరుకోవాలన్న తొందర వల్ల తానే వేగం గా   నడపడం మొదలు

పెట్టా డు పాస్ పర్ట్ .  మధ్యలో రెండు కుక్కల ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక ముసలావిడ

కూడా తృటిలో  ప్రమాదం నుంచి తప్పించుకుంది.. రిఫార్మ్ క్లబ్  చేరగానే హుందాగా,

ఎటువంటి హావభావాలు ప్రదర్శించకుండా , 8.45 నిముషాలకి  క్లబ్ ద్వారం దగ్గరకి 

 ఫిలియాస్ ఫాగ్ చేరారు. క్లబ్ లో ఉన్న స్నేహితులందరూ ఆదుర్దాగా ఎదురు 

చూస్తున్నారు. ఇంకొక్క నిముషమే ఉంది అని అనుకుంటుండగా తలుపు తెరిచి, "Good evening, gentlemen,  I am  back here. I hope I am a rich man now", అని అన్నాడు ఫిలియాస్ ఫాగ్. 



అందరూ అతనితో ఆనందంతో ,"అవును నీవు పందెం గెలిచావు. నువ్వు  రిచ్ మాన్ వి "అని చప్పట్లు కొట్టారు. అక్కడున్న వారందరూ  ఫిలియాస్ ఫాగ్ విజయ వంతంగా భూప్రదక్షిణ చేసి వచ్చినందుకు చాలా సంతోషించారు.

మేడం ఔదా, పాస్ పర్ట్ లు కూడా చాలా  సంతోషంగా ఉన్నారు. వారి ఆనందానికి  పగ్గాలు లేవు.యింటికి  రాగానే సోమవారం నాడు ఔదా, ఫిలియాస్ ఫాగ్ వివాహం చేసుకున్నా రు. పాస్ పర్ట్ కి వీరిద్దరి వివాహం చాలా ఆనందం కలిగించిoది. ఆ సందర్భం లో పాస్ పర్ట్  ఒకమాట అన్నాడు. నిజానికి  ఫిలియాస్ ఫాగ్ గారు తూర్పు  దిశ్ల్ల మనం ఇండియా దిక్కుగా వెళ్లకుండా వేరే మార్గం లో వెళ్లి ఉంటె,  మనం 78 రోజుల్లోనే భూప్రదక్షిణ చేసి రిటర్న్ వచ్చే వాళ్ళం . అంటే ఫిలియాస్ ఫాగ్ పాస్ పర్ట్  తో  నిజమే! నువ్వన్నట్టు వేరే దిశ లో ప్రయాణించి ఉంటె త్వరగా వచ్చే వాళ్ళం, కానీ మన ప్రయాణం ఇలా సాగినందుకే కదా నాకు  ఇంత అందమైన ఔదా లభించింది. నా భార్య గా చేసుకోగలిగాను అంటూంటే ఔదా, పాస్ పర్ట్ లు  ఇద్దరూ  ఎంతో సంతోషించారు.

సోమవారం వివాహం చేసుకున్న  తర్వాత  వారందరూ చక్క గా, ఉత్సాహంగా పార్టీ 

చేసుకున్నారు. అప్ప టి నుంచీ ఔదా, ఫిలియాస్ ఫాగ్, పాస్ పర్ట్   లు హాయిగా, ఆనందంగా

వారి జీవితాలు గడిపారు. ఆ తర్వాత నుంచీ, యదావిధిగా, వారి జీవిత ప్రయాణం ఎప్పటిలాగానే  సాగింది. వీరి 80 రోజుల్లోభూప్రదిక్షిణ చేసిన విషయాన్ని  మాత్రం  అందరూ ఎంతో గొప్ప గా, సాహస కృత్యంగా  చెప్పుకున్నారు


ప్రియమైన పాఠ కుల్లారా.... ఈ కథను విని మీరందరూ ఆనందిస్తారని , భౌగోళిక  పరిస్థితులు, 

సమయాల వివరణ అర్థం  చేసుకుంటారనే అనుకంటున్నాను. ఒక దిశ గా   ప్రయాణిస్తే ఒక

టైం  జోన్, ఇంకో దిశ గా  ప్రయాణిస్తే, ఇంకో టైం  జోన్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ముందుకి ,

మరోసారి ఇంకో టైం  జోన్ వల్ల  ప్రయాణిస్తే 80 రోజుల్లో భూప్రదక్షిణ కావించాము. మీకు నచ్చిందని భావిస్తున్నాం.


నమస్తే !


*************

Saturday 10 June 2023

80 -రోజుల్లో భూప్రదక్షిణ - 6



ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్ తన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా అతను

తన నాయకత్వ లక్షణాలు చూపుతూ అధైర్య పడకుండా తగినట్టుగా ప్రణాళికలు

రచిస్తూ వున్నాడు.

కెప్టెన్ గా మరీనా ఫిలియాస్ ఫాగ్ లోగడ మనం చెప్పుకున్నట్లుగా 45 నిముషాలు ఆలస్యంగా 

వెళ్లినందుకు చైనా అనే ఓడ వీళ్ళు లివర్ పూల్ కి వెళ్ళవలసినది మిస్ అయిపోయారు.

అయితే ఫిలియాస్ ఫిలియాస్ ఫాగ్ మాత్రం తన ప్రయత్నాలని తాను చేస్తూ ఆఖరికి పారిస్ కి వెళ్లే కార్గో షిప్ ని ఎలాగో ఎక్కి, ప్రయాణికుడికి 2000 పౌండ్స్ చొప్పున నలుగురికీ పే చేయటం, ఆ ఓడ పేరు H S (Hispilania )ఫిలానియా. ఆ ఓడ ఎక్కాక ఆ నావికులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ నలుగురు ప్రయాణీకులనీ లివర్ పూల్ చేర్చేలా ఒప్పుకోవటగం, ఆ నావికులందరూ కలిసి, ఓడ నడిపే కెప్టెన్ ని బంధించి, గదిలో పెట్టి తాళం వేయటం తెలుసుకున్నాం.

ఈ విధంగా ఆగమేఘాలమీద ఆ కార్గో ఓడ హైస్పీలనియా  (Hispilania), లివర్ పూల్ దిశగా ప్రయాణించింది. అందరూ ఆశ్చర్య పడేలా ఫిలియాస్ ఫాగ్ ఆ ఓడకి కెప్టెన్ గా బాధ్యత వవహించాడు. పడవ నడిపే నావికులు కూడా ఫిలియాస్ ని చూసి చాలా ఆశ్చర్య పడ్డారు.

డిటెక్టివ్ ఫిక్స్ మాత్రం ఇలా అనుకున్నాడు మనసులో. ఇతడు మామూలు దొంగ కాదు. సముద్రపు దొంగ అయివుంటాడు. ఇతడేమిటి కార్గో షిప్ లో వెళ్ళాడు. పైగా పారిస్ వెళ్లాల్సిన  ఓడలో బోల్డంత డబ్బు చెల్లించి, లివర్ పూల్ దిశగా తానే కేప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు. లివర్ పూల్ కెళ్ళి అక్కడినుంచి ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడు. అదేమిటో నాకేమీ అర్ధం కావటంలేదు. మళ్ళీ ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడేమిటి? నాకేమీటీ. అర్ధం కావటం లేదు, అని బుర్రబద్దలుకొట్టుకుంటున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆరోజు డిసెంబర్ 10 వ తేదీ. వీళ్ళు న్యూయార్క్ ఓడరేవు దగ్గర దిగి లివర్ పూల్ కివెళ్లాలనుకున్నపుడు అది  డిసెంబర్ 20 వరకు ఏ ఓడ బయలు దేరదన్నపుడు, మరి పందెం ఓడిపోతాడు కదా! 21 వ తేదీ కల్లా రిఫార్మ్స్ క్లబ్లోకి సాయంత్రం 5 PM కల్లా వెళ్ళాలి కదా! అందుకే ఫిలియాస్ ఫాగ్ గారు ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు. సరిగ్గా డిసెంబర్ 14 న ఫిలియాస్ ఫాగ్ ఓడ కి  కెప్టెన్ గా వ్యవహరించి, అతి చాకచక్యంగా ఆ ఓడని లివర్ పూల్; వైపుగా అట్లాటిక్ మహా సముద్రం ద్వారా ప్రయాణించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణం ఏమాత్రం సహకరించట్లేదు. ఓడ చాలా వేగంగా వెళ్తోంది. పాస్ పర్ట్  ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఫిలియాస్ ఫాగ్ చాలా గంభీరంగా వున్నాడు. వాతావారణం ప్రతికూలంగా వుంది కాబట్టి అతను తన మనసునంతా ప్రయాణం దిశగా కేంద్రీకరించి ఓడను నడుపుతున్నాడు. ఈలోగా ఆ నావికుల్లో ఒకడు వచ్చి ఏమండీ! ఇంత వేగంగా ఓడను నడుపుతున్నాము. మనకు బొగ్గు నిల్వలన్నీ చాలా తగ్గి పోయాయి.ఇంత వేగంగా ప్రయాణం చేస్తే మన ఓడలో ఏమాత్రం బొగ్గు మిగలదు. ప్రయాణం మధ్యలో నిలప వలసివస్తుంది. ప్రయాణం లివర్ పూల్ దాకా వెళ్ళటం కష్టం అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడెలా! ఎలా వెళ్ళటం అబ్బా! అని అందరూ అనుకుంటూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్ మాత్రం చాలా గంభీరంగా, ఎటువంటి పరిస్థితిలోనూ ఈ వేగం తగ్గించటానికి  వీలులేదు.మీరు ఒకపని చేయండి. ఈ ఓడమీద చెక్కతో చేసిన స్తంబాలు, కుర్చీలు వంటి వాటిని విరక్కొట్టండి. వాటిని మనం కలప లాగా వాడుకుందాం. కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఈ వేగాన్ని తగ్గించటానికి వీలులేదు, అని దృడంగా చెప్పాడు. ఎందుకంటె ఆ ప్రయాణానికి చాలా డబ్బు అతను ఇస్తున్నాడు కాబట్టి ఆ నావికులందరూ కూడా, ఆ ఓడలో చెక్కతో చేసిన వస్తువులనన్నింటినీ విరగకొట్టి, కలపలాగా, వాడుకుంటున్నారు. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో చాలా దూరం వరకు వచ్చేసారు. కాసేపట్లో ఒక నావికుడు వచ్చి, అయ్యా, ఏర్పాటు చేసిన కలప అంతా అయిపోయింది. ఇంకా తగల బెట్టడానికి ఏమీ లేదు. దగ్గరలో ఉన్న ద్వీపం దగ్గర ఆ పడవని ఆపారు. ఫిలియాస్ ఫాగ్ ఎంతో ధైర్యంగా ఆ ఓడని దిగి, పక్కనే వున్న క్వీన్ స్టోన్అనే స్టేషన్ కి వెళ్లి, అక్కణ్ణించీ డబ్లిన్ వెళ్లి, అక్కణ్ణుంచి ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయం చేసుకున్నాడు. ఎలాగైతే

        


నేమి వాళ్ళు 20 డిసెంబర్ కి అనుకున్న గమ్యస్థానం లివర్ పూల్ కి చేరుకున్నారు. పాస్ పర్ట్ కి  చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటె తన యజమాని 21 డిసెంబర్ కల్లా రిఫార్మ్స్ క్లబ్ కి చేరుకుంటాడు. లివర్ పూల్ నుంచి ఆరుగంటల ప్రయాణమే కదా అని సంతోషపడుతూ వున్నాడు.ఈలోగా డిటెక్టివ్ ఫిక్స్ చాలా ఆనందంగా ఉన్నాడు. అతను వచ్చాడు. వీళ్లంతా సంతోషంగా ఉన్నారు. ఫిలియాస్ ఫాగ్ దగ్గరకెళ్ళి మీ పేరు ఫిలియాస్ ఫాగ్ కదా, అని అడిగాడు.  డిటెక్టివ్ ఫిక్స్. ఒక్కింత ఆశ్చర్యడ్పడ్డాడు ఫిలియాస్ ఫాగ్ అలా అడగటంతో. అవును అన్నాడు ఫిలియాస్ ఫాగ్. మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను. బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ లో దొంగతనం చేశారు. అరెస్ట్ వారెంట్ చేతికి రావాలని మీ చుట్టూ తిరుగుతున్నాను . మిమ్మల్నిపుడు

అరెస్ట్ చేస్తున్నాను, అని అనగానే అందరూ చాలా ఆశ్చర్య పడ్డారు. ఫిలియాస్ ఫాగ్ కూడా ఒక్క క్షణం అవాక్కయ్యాడు. కానీ ఒకరకమైన నిస్సహాయ స్థితిలో వున్నాడు యిపుడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఫిలియాస్ ఫాగ్ కి చాలా కోపం వచ్చింది మొట్టమొదటి సారి. ఫిలియాస్ ఫాగ్

డిటెక్టివ్ ఫిక్స్ తో నీ అంత ద్రోహి ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను నా స్నేహితుడిగా భావించి, నీ కోసం నేను నా డబ్బులు ఖర్చు చేసి, నిన్ను ఇంతవరకూ తీసుకుని వచ్చాను. ఇంత విశ్వాసఘాతకుడివి అని నేనెప్పుడూ అనుకోలేదు, అని చాలా గట్టిగా కోప్పడ్డాడు. మనసులో డిటెక్టివ్ ఫిక్స్ నిజంగానే ఫిలియాస్ ఫాగ్ మంచివాడిలాగే ఉన్నాడు. కానీ నేను ఏం చేయగలను.

నేను న్యాయంగా నా  డ్యూటీ చేస్తున్నాను. ఈ హఠాత్పరిణామం చూసి మేడం ఔదా వెక్కి వెక్కి ఏడుస్తూ పాస్ పర్ట్  భోజంపై తలవాల్చి తన దుఃఖాన్ని  ప్రకటిస్తోంది. ఫిలియాస్ ఫాగ్ ఏమీ చేయలేని పరిస్థితిలో జైల్లో బంధింప బడ్డాడు. తన సర్వస్వం అంతా పోగుట్టుకున్నాడు. ఏంచేయాలి. ఒక మంచి అవకాశం దొరికితే బాగుండును కదా అని అనుకున్నాడు. అతడు

విజయానికి చాలా చేరువలో ఉన్నాడు. విధి ఎంత విచిత్రమైనది కదా అని అనుకున్నాడు. నేను దొంగని అని భ్రమించి, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఆలోచిస్తూ ఉండగా, కొద్దీ క్షణాల్లోనే పాస్ పర్ట్ , ఔదా, గబగబా పరుగెత్తుకుంటూ ఫిలియాస్ ఫాగ్ ఉన్న జైలు దగ్గరికి వచ్చారు. వెంటనే

వెనుకే డిటెక్టివ్ ఫిక్స్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఫిలియాస్ ఫాగ్ గారూ! మీరు వెళ్లిపోవచ్చు. మీరు స్వేచ్ఛా జీవి. బ్యాంకులో దొంగతనం చేసిన అసలైన  దొంగని మూడురోజుల క్రితమే అరెస్ట్ చేశారు. కాబట్టి  మీరు  ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అని చెప్పగానే, ఫిలియాస్ ఫాగ్ బయటికి

వచ్చాడు. కానీ అతనికి చాలా కోపంగా ఉంది. ఏమీ చేయని నేరానికి ఇలా చేస్తాడా అని, ముందు ఎడమ చేత్తో తర్వాత కుడిచేత్తో డిటెక్టివ్ ఫిక్స్ డొక్కలో పొడిచాడు గట్టిగా. పిడి గుద్దులు గుద్దాడు. ఆ దెబ్బలకి డిటెక్టివ్ ఫిక్స్ ఒక్కసారిగా కిందపడిపోయాడు.

                                                                  ***********

Wednesday 7 June 2023

Nanduri Vamsha Charitra Audio 8


nanduri Vamsha Charitra Audio 8

Nanduri Vamsha Charitra Audio 7




                                                                                                                                                      
 

80 రోజుల్లో భూప్రదక్షిణ - 5

 

                                  

  4వ అధ్యాయంలో, ఏ విధంగా ఘోరమైన ప్రమాదం నుండి, తప్పించుకుని,ఊపిరి పీల్చుకున్నారో తెలుసుకున్నాము. ఆ రైలు మొత్తం, శిధిలమైన ఆ వంతెన మీదుగా అతివేగంగా ప్రయాణించి, చివరి బోగీ సురక్షితంగా ఆ వంతెనని దాటాక, ప్రయాణీకులందరూ చూస్తుండగానే భయంకరమైన శబ్దంతో కిందవున్నఅగాధంలో ఆ వంతెన పడిపోయింది. ఈ విధంగా, జోన్ పాస్ పర్ట్ మొత్తానికి ఎలాగైతేనేఁ , అందరమూ ప్రమాదం నుంచి బయట పడ్డం కదా అని ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాతి ప్రయాణం సుఖవంతంగా సాగింది. అటూ ఇటూ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొలరాడో పర్వతాలు  చాలా అందంగా ఉన్నాయి. రమణీయంగా వున్నాయి. కానీ జోన్స్ పాస్ పర్ట్ మాత్రం తన యజమానికి పోటీ గురించే ఆలోచిస్తున్నాడు. తాను డిటెక్టివ్ ఫిక్స్ ప్రక్కన  కూర్చున్నా కూడా అతనితో మాట్లాడాటానికి మనసు ఇష్టపడటం లేదు. ఈ విధంగా ప్రయాణం సాగుతోంది. ఫిలియాస్ ఫాగ్ చాలా నిశ్చింతగా ఏమీ పట్టనట్లుగా మేడం ఔదా తో హాయిగా పేకాట ఆడుకుంటున్నాడు. డిటెక్టివ్ ఫిక్స్  చిన్న పిల్లవాడిలా కంపార్టుమెంటులో ఉయ్యాలలు ఊగుతుంటే, అతడి తల కూడా కిందకీ పైకి కదులుతోంది. అయితే పాస్ పర్ట్ మాత్రం ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎటువంటి అవాంతరాలు వస్తాయో, అని మనసులో ఎందుకో అనుకుంటూ వున్నాడు. మూడు రోజులై, మూడు రాత్రులు ప్రయాణం తర్వాత వారు దాదాపు 2200  కిలోమీటర్లు పైన ప్రయాణం చేశారు వాళ్ళు. మిగిలిన ప్రయాణీకులు కూడా దాదాపు ఈ  ప్రయాణానికి అలవాటు పడిపోయారు. సరిగ్గా పాస్ పర్ట్ ఊహించి నట్టుగా కొద్ది రోజుల్లోనే, ఆ రైలు కి రెండు వైపులనుంచీ పెద్దపెట్టున నినాదాలతో సూ  ఇండియన్స్ వాళ్ళు  బాణాలతోను, బల్లాల  తోను,గుర్రాలమీద, వేగంగా వస్తూ  ముందుకు రాసాగారు.  ప్రయాణీకుల మీద బాణాల వర్షం కురిపించ సాగారు. 

జరిగిన ఈ హఠాత్పరిమాణానికి ఈ కూర్చున్న ప్రయాణీకులందరూ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. అందులోని కొందరు ధైర్యస్తులు తమ పిస్టళ్లను తీసి ఆ న్యూ ఇండియన్స్ మీద  కాల్చటం మొదలు పెట్టారు. ఈ ఇధంగా అనేకమంది, స్యూ ఇండియన్స్ పట్టాల వెంబడి రెండువైపులా, గట్టిగా అరుస్తూ బాణాలు వదులుతూ వున్నారు. గుర్రాలు కూడా చాలా వేగంగా కదులుతున్నాయి. చివరికి వారు ఆ ఇంజిన్ లోనికి ఎక్కటం, ఆ ఇంజిన్ డ్రైవర్లని వారు గట్టిగా తాళ్లతో కట్టేసి, ఆ రైలు నుండి బయటికి తోసివేసారు. ఈ దెబ్బకి మెల్లి మెల్లి గా అందరూ కొంత తేరుకున్నారు. అయితే ఆ దగ్గరలోనే పోర్ట్ కెనీ అనే ప్రాంతంలో ఈ మిలిటరీ సైనికులు ఉన్నారు. వాళ్లంతా కూడా ఈ రైలు చప్పుడు, దానిలోంచి పిస్తోళ్ళ చప్పుళ్ళకి, స్యూ  ఇండియన్స్ చేస్తున్న నినాదాలు అరుపులూ కేకలూ విని, ఏమిటా అని వారు బయటికి వచ్చి, ఆ  స్యూ ఇండియన్స్ మీద వారు కూడా తూటాలా వర్షం కురిపించారు. ఈలోగా ఈ  స్యూ ఇండియన్స్ లో కొంతమంది, వారి లోవున్న ఒక నాయకుడు, చూడు, ఈ రైల్ లో ఉన్న ఒకతను మనల్ని చాలా యిబ్బంది పెడుతున్నాడు. అతన్ని పట్టుకుని పారిపోదాం పదండి అని చెప్పి , ధైర్యస్తులైన యిద్దరు ప్రయాణీకులను వారు పట్టుకున్నారు. వాళ్ళని రక్షించడానికి వెళ్లిన పాస్ పర్ట్ ని కూడా గట్టిగా పట్టుకుని, కిందకి దింపి, ఆ ముగ్గురినీ వాళ్ళ గుర్రాలమీద ఎక్కించుకుని, అడవుల్లోకి పారిపోయారు. ఎందుకంటె ఈ మిలిటరీ వాళ్ళు కూడా గుర్రాల మీద రావటంతో  స్యూ ఇండియన్స్ పారిపోయారు. ఈ పరిణామానికి మేడం ఔదా చాలా విచారపడింది. అయ్యో! పాస్ పర్ట్  సహాయం చేయబోయి, తానే  ఇరుక్కున్నాడే... ఎలా? అని ఎంతో బాధపడుతూ ఉంది. ఎందుకంటె మేడం ఔదా కి పాస్ పర్ట్ పట్ల ఎంతో మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటె ఎప్పుడైతే  స్యూ ఇండియన్స్, ఇంజిన్ డ్రైవర్లను బయటికి  విసిరి వేసారో మరి ఆ రైలు ని ఆపాలి కదా  మరి ఎలా ఆపాలి. అందరూతలపట్టుకున్నారు. డ్రైవర్లు లేకుండానే ఆ ట్రైను ప్రయాణం చేస్తున్నప్పుడు, పాస్ పర్ట్ కి ఒక ఆలోచన వచ్చింది. అతను చాలా బలిష్టంగా ఉంటాడు కాబట్టి, తన కంపార్ట్మెంట్ తలుపు తెరిచి, చాలా ధైర్యంగా, ఆ కారేజీ కిందికి వెళ్లి, బలవంతుడు  కాబట్టి, మెల్ల మెల్లగా, ఇంజిన్ దిశగా పాక్కుంటూ వెళ్లి, సరిగా ఇంజిన్ దగ్గర బోగీ కి వచ్చి, ఇంజిన్ కీ, బోగీలకీ వున్న లింకు ని తన బలిష్టమైన చేతులతో విడ దీసాడు. ఇతడు చేసిన అద్భుతమైన సాహసం వల్ల , మెల్లగా ఆ భోగీలన్నీ ఆగి పోయాయి. అందుకని, మిగతా ప్రయాణీకులూ, మేడం ఔదా కూడా, పాస్ పర్ట్ తన ప్రాణానికి తెగించి ఇంతమందిని కాపాడాడు. ఆఖరికి ఈ  స్యూఇండియన్స్ పట్టుకెళ్ళిపోయారే అని బాధపడ సాగారు. అప్పుడు ఫిలియాస్ ఫాగ్ వచ్చి, ఏం ఫరవాలేదు. నేను వాళ్ళని తీసుకువస్తాను. పాస్ పార్ట్ , బతికున్నా ,చనిపోయినా సరే తీసుకు వస్తాను. అని ధైర్యంగా చెప్పాడు. అతడిని చూసి ఇతడే నాకు తగిన కథానాయకుడు. ఇతనికి భయం కూడా లేదు. అని మేడం ఔదా మనసులో ఫిలియాస్ ఫాగ్ గురించి అనుకుంటూ ఆనందపడింది. కృతజ్ఞతా భావంతో పొంగిపోయింది. అయితే ఫిలియాస్ ఫాగ్ తనతో పాటు కొంతమంది సైనికులు తోడుగా వస్తే, వాళ్ళని రక్షించి వెనక్కి తీసుకురాగలము అన్నాడు. దానికి సైనికులుసిద్ధపడ్డారు. ముప్పైమంది సైనికులు, ఫిలియాస్ ఫాగ్  స్యూ ఇండియన్స్ తీసుకెళ్లిన పాస్ పర్ట్, ని, మిగిలిన ప్రయాణీకులనూ తీసుకు రావడానికి అందరూ కలిసి అడవుల్లోకి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం అయిపోయినా ఇంకా ఫిలియాస్ ఫాగ్ వాళ్ళు వెనక్కి రాలేదు. మేడం ఔదా, డిటెక్టివ్ ఫిక్స్ అక్కడే స్టేషన్లో ఉన్నారు.

వారు ఆ రాత్రంతా చలికి గజగజా వణుకుతూ  అలాగే కూచున్నారు. మేడం ఔదా ఫిలియాస్ ఫాగ్, పాస్ పర్ట్ ల గురించి ఆలోచిస్తోంది. సరిగ్గా సూర్యోదయం అయ్యేసరికి, అక్కడ అరుపులూ, కేకలూ వినిపించే సరికి, ఏం జరిగిందా అని చూసేసరికి ఫిలియాస్ ఫాగ్ అందరికన్నా ముందున్నాడు. సైనికులు వెనక పాస్ పర్ట్ మిగిలిన యిద్దరు ప్రయాణీకులు. వెనక్కి క్షేమంగా రావటం, సంతోషంతో హర్షద్వానాలతో మారుమోగిపోయింది. మేడం ఔదా చాలా సంతోషించింది. వీరందరూ వెనక్కి క్షేమంగా రావటం చూసి గట్టిగా ఆనందంతో అరిచింది. అమ్మయ్యా ! క్షేమంగా వెనక్కి వచ్చేసారు అని. అందరూ వీరు వెనక్కి రావడం  చూసి ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడు తాము ముందుకి ప్రయాణం ఎలా కొనసాగించాలా అని ఆలోచనలో ఉన్నారు. డిటెక్టివ్ ఫిక్స్ బయటికి వెళ్ళాడు. ఎవరితోనో మాట్లాడాడు. అతనిని తీసుకుని వెనక్కి వచ్చాడు. అతను ఈ  విధంగా చెప్పాడు. ఇతను స్లెడ్జి ని నడుపుతాడు. విపరీతమైన మంచు కురిసి, ప్రయాణం ఆగిపోయినపుడు తన స్లెడ్జి మీద ప్రయాణీకులని, ఆ తర్వాతి స్టేషన్ కి తరలిస్తూ ఉంటాడు, అని పరిచయం చేసాడు. వీళ్ళు అంటే ఫిలియాస్ ఫాగ్ వాళ్ళు వయా చికాగో, న్యూయార్క్ కివెళ్లాలని ఆలోచన అన్నమాట. సరేనని అంతనితో బేరం కుదుర్చుకుని, ఈ ప్రయాణీకులంతా ఎక్కారు. చాలా మందే ఎక్కారు. అది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. కానీ చాలా చల్లగా వుంది. వెచ్చని దుస్తులు కప్పుకున్నప్పటికీ కూడా చాలా చలి గా ఉండాలి. ప్రయాణీకులందరూ ఒకరితో ఒకరు మాటలు లేకుండా, బిగుసుకు పోయి వున్నారు. మొత్తానికి వారు అనుకున్న స్టేషన్ కి చేరుకున్నారు.చాలాపెద్ద మొత్తంలో స్లెడ్జి నడిపే యజమానికి ధనాన్ని ముట్టజెప్పాడు.  డిటెక్టివ్  ఫిక్స్ కి మాత్రం ఈ ఫిలియాస్ ఫాగ్ మనస్తత్వం ఏమీఅర్ధం కావటం లేదు. ఎందుకంటె ఫోర్ట్ కీనీ స్టేషన్ లో ఫిలియాస్ ఫాగ్ఆ స్టేషన్ మాస్టారుతో న్యూయార్క్ వెళ్ళటానికి రైలు ఎప్పుడుందని అడిగితే అదే రోజు సాయంతరం ఉందని చెప్పాడు. ఫిక్స్ సాయంతరం రైలు కె బయలు దేరుతారని అనుకున్నాడు. కానీ, ఫిలియాస్ ఫాగ్ మాత్రం తన ప్రయత్నాల్ని మానుకోలేదు. అప్పటికే ప్రయాణంలో 24 గంటలు వెనక్కి వున్నారు. దానికి తానే బాధ్యుణ్ణి కదా అని పాస్ పర్ట్ లోలోపల ఎంతో బాధపడుతున్నాడు.

అటువంటి సమయంలోనే ఈ స్లెడ్జి మీద ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. తప్పని సరిగా ఫిక్స్ వాళ్ళతో పాటుగా ప్రయాణించి, వీళ్ళు ఎప్పుడైతే ఇంగ్లాండ్ లో అడుగు పెడ్తారో అప్పుడు అరెస్ట్ చేసేస్తాను, అని మనసులో అనుకుంటూ వున్నాడు. వీళ్ళు స్టేషన్ చేరుకోగానే చికా గో వెళ్ళడానికి రైలు సిద్ధంగా వుంది. అక్కడి నుంచి వెంటనే న్యూయార్క్ వెళ్ళటానికి కూడా రైలు సిద్ధంగా ఉండటం సంభవించింది. ఆ విధంగా న్యూయార్క్ కూడా చేరుకోవటం వీలైంది. ఈ విధంగా వాళ్లకి  ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఫిలియాస్ ఫాగ్ ముందుచూపు, నాయకత్వ లక్షణాల వల్ల ఒహామా అనే స్టేషన్ నుంచి చికా గో, అక్కడి నించి, న్యూయార్క్ కి 11 గంటలకి 11 డిసెంబర్ న చేరారు. అక్కడినించి చైనా అనే ఓడ   ఎక్కి  లివర్పూల్ కి వెళ్లాలన్నమాట. కానీ వీళ్ళు ఆ ఓడ  ఎక్కాలని, ఓడరేవుకి 45 నిముషాలు ఆలస్యంగా వెళ్లారు. దాంతో ఆ చైనా అనే ఓడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడినించి, ఒక పెద్ద అవాంతరాన్ని  ఎదుర్కోవలసి వచ్చింది. పాస్ పర్ట్ చాలా  గాబరా పడసాగాడు. ప్రయాణం చివరగా చాలా దగ్గరికి వచ్చేసాము అక్కడినించి వాళ్ళు లివర్ పూల్ కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కువ సమయం పట్టదు లండన్ చేరుకోవటానికి. అయ్యో! ఈ అవాంతరం వచ్చిందేమిటి, అనుకున్నాడు. ఫిలియాస్ ఫాగ్ మాత్రం చాలా ధైర్యంగా, గంభీరంగా ఉన్నాడు. అతడు అక్కడే వున్న ఒక ఓడ  యజమాని దగ్గరకు వెళ్ళటం జరిగింది. ఫిలియాస్ ఫాగ్  అతనిని మీరు లివర్పూల్ కి తీసుకెళ్తారా అని అడిగితే వారిలో ఎవరూ కూడా కుదరదు అని చెప్పారు. ఎవరూ ఒప్పుకోలేదు. ఆఖరికి ఫిలియాస్ ఫాగ్ సామాన్లను మోసుకెళ్లే ఓడ ఉంటె  కార్గోషిప్ దగ్గరికెళ్లి అతనితో బేరమాడాడు. కెప్టెన్ ఆ కూడా పారిస్ కి వెళ్లాలని, 20 డిసెంబర్ కల్లా ఈ సరుకులన్నిటినీ అక్కడి వారికి అందజేయాలని, కాబట్టి తానూ రావటం కష్టం,వారిని తీసుకెళ్లలేనని, నిర్మహమాటంగా చెప్పాడు. అప్పుడు ఫిలియాస్ ఫాగ్ మీతో పాటు మేము వస్తాము. నువ్వు ఎక్కడికెళ్తే అక్కడికి వస్తాము. అంటే నీ ప్రయాణం పారిస్ కి కదా, అక్కడికి వస్తాము. మేము నలుగురం వున్నాము. ఒక్కొక్కరికీ నీకు రెండు వేల  డాలర్ చొప్పున ముట్టజెప్తాను. మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగాడు. ఆ కెప్టెన్ చాలా ఆశ్చర్య పడ్డాడు. ఏమిటీ ఇంత డబ్బిస్తానంటున్నాడు ఇతను. కెప్టెన్ సరే అలాగే తీసుకెళ్తానని చెప్పటం, ఆ మాటలు వింటున్న ఫిక్స్ కి మతిపోవటం జరిగింది.అదేమిటి, ఈ కార్గోషిప్ లో పారిస్ కి వెళ్ళటం ఏమిటి? ఎక్కడికో, ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లి పారిపోవాలని అనుకుంటున్నాడేమో.... నాకు వేరే గత్యంతరం లేదు. నేను ఇతని చుట్టూ తిరిగినా అతనివెంటే వెళ్లి, ఏదో ఒక రోజు తప్పకుండా అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా అనుకున్నాడు.



సరే! అందరూ ఆ కార్గోషిప్ ఎక్కారు. ఈ లోగా ఫిలియాస్ ఫాగ్ ఏం చేస్తాడా అని ఫిక్స్, పాస్ పర్ట్  అందరూ కూడా ఆలోచిస్తూ వున్నారు. ఎప్పటి మాదిరిగానే ఫిలియాస్ ఫాగ్ తన భావాలని బయటికి కానీ, ఎవరికైనా గానీ చెప్పలేదు. ఆ కార్గోషిప్ ని నడుపుతున్న ఆ ఓడ లోని నావికులందరి దగ్గరికీ వెళ్లి ఆ నాయకుడి తో మీరు మమ్మల్ని లివర్ పూల్ కి తీసుకు వెళ్తే, మీకు బోలెడంత డబ్బిస్తానని, ఎంతో డబ్బుని ఆశగా చూపించాడు. ఆ ఓడని నడుపుతున్న నావికులందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఇతనేమిటి ఇంత డబ్బు ఆశ జూపుతున్నాడు, అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళందరూ ఒక్క మాటగా మిమ్మల్ని తప్పకుండా లివర్ పూల్ తీసుకెళ్తామని చెప్పారు. నావికులందరూ ఆ కెప్టెన్ దగ్గర కెళ్ళి మూకుమ్మడిగా పట్టుకుని కాళ్ళు చేతులూ కట్టేసి తీసుకెళ్లి గదిలో పడేసి తాళం వేశారు. అతను లోపల్నుంచి అరుపులు, కేకలు పెడుతున్నా కూడా, ఎవరూ పట్టించుకోలేదు. పారిస్ కి బదులుగా ఈ ఓడ  లివర్ పూల్ వైపుగా ప్రయాణ౦ సాగించింది. నిజంగా ఈ డిటెక్టివ్ ఫిక్స్ కి మతిపోయింది. పాస్ పర్ట్ కి తన యజమాని పట్ల ఎంతో గౌరవం పెరిగింది. ఫిలియాస్ ఫాగ్ గురించి అలా ఆలోచిస్తూ వున్నాడు.


****************

Friday 2 June 2023

Nanduri Vamsha Charitra 2 

8౦ రోజుల్లో భూప్రదక్షిణ - 4


ఈ విధంగా అనుకోకుండా విచిత్ర పరిస్థితులలో ఫిలియాస్ ఫాగ్, జోన్ పాస్ పర్ట్ వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యంగా కలిశారు. కనాటికా ఓడలో వీళ్ళందరూ డిటెక్టివ్  ఫిక్స్ తో సహా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి వాళ్ళ ప్రయాణం మొదలైంది. ఈ కనాటికా అనే ఓడ  పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తుంది. అద్భుతమైన సాహసాలతో. ఈ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు  జోన్ పాస్ పర్ట్ అంతవరకూ కూడా డిటెక్టివ్ ఫిక్స్  గురించి ఆలోచించ లేదు. ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు గబగబా జరిగిపోయాయి. తన గొడవలో తానున్నాడు కాబట్టి ఈ ఫిక్స్   గురించి అంతగా పట్టించుకోలేదు. యిప్పుడు ఆలోచిస్తే, ఏమిటబ్బా! ఈ ఫిక్స్ అనేవాడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో పాటుగా వస్తున్నాడు. అక్కడ సూయెజ్ దగ్గర కలిసాడు. పరిచయం పెంచుకున్నాడు.యజమానిని గురించి వాకబు చేసాడు.మేము ఎక్కడికెళితే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. అసలు ఏమిటి ఉద్దేశ్యం? ఇతనిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఈ డిటెక్టివ్ ఫిక్స్ గురించి  యిలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. పాస్ పర్ట్  కి అర్ధం కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఎందుకు ఈ ఫిక్స్ నన్ను ఫిలియాస్ ఫాగ్ గారి దగ్గరకు వెళ్లకుండా ఆపి, బార్ కి తీసుకెళ్లి విపరీతంగా తాగించి, ఫిలియాస్ ఫాగ్ కి సమాచారం అందకుండా ఎందుకు చేసాడు. మేమంటే ఒక పందెం కోసం కాబట్టి యిలా అన్నిదేశాలూ ప్రయాణం చేస్తున్నాO. మరి ఈ ఫిక్స్ గారికి మాతో పాటుగా రావటానికి ఏమవసరం? యిలా మాతోపాటు అన్నిదేశాలు తిరగటం ఏమిటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్ గారు గొంతు వినిపించింది. నేను, మేడం ఔదా కలిసి బయటికి వెళ్తున్నా0. రేపు పొద్దున్న 7.15 కి మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫిలియాస్ ఫాగ్, మేడం ఔదా వీళ్ళిద్దరూ చాలా చనువుగా వుంటున్నారు. ఔదా ఎంతో అద్భుతమైన సౌందర్యవంతురాలు. ఆవిడ ఫిలియాస్ ఫాగ్ పట్ల  చాలా ఆరాధనగా ఉంది. స్నేహపూర్వకంగా ఉంది. కృతజ్ఞత పూర్వకంగా ఉంది. కానీ ఫిలియాస్ మాత్రం ఆవిడని ఏమాత్రం గమనించటం లేదు. అని పాస్ పర్ట్ మనసులో అనుకుంటూ వున్నాడు. కానీ అతనికి ఒకటే ఒక ధ్యేయం. ఎలాగైనా ఫిలియాస్ ఫాగ్ తన పందేన్ని తప్పకుండా గెలవాలని, తన మూలంగా ఆయన ప్రయాణానికి ఎటువంటి ఆటంకమూ కలగకూడదని, జాగ్రత్తగా వుండాలని ఆలోచిస్తూ వున్నాడు. మొత్తానికి వాళ్లిద్దరూ శాన్ ఫ్రాన్సిస్కోచేరటం జరిగింది. ఈ విధంగా వారు ఎక్కిన ఓడ ఎటువంటి అవాంతరాలు లేకుండా, శాన్ ఫ్రాన్సిస్కో క్షేమంగా చేరింది.ఇక్కడ ఫిలియాస్ ఫాగ్ తన నోట్ బుక్ లో సోమవారం రెండు గంటలు ముందున్నాము. మంగళవారం మూడు గంటలు వెనక్కి వెళ్ళాము. బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో కి అనుకున్న సమయం ప్రకారం చేరాము, అని రాసుకున్నాడు. అక్కడి నుంచి వారు న్యూయార్క్ వెళ్ళవలసి ఉంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకి రైల్ లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి, న్యూయార్క్ కి తన ప్రయాణాన్నికొనసాగించారు. ఒకప్పుడు ఆరునెలలు పట్టేది. ఈ రైలు ప్రయాణానికి, కాకపొతే ఈ మధ్యనే యూనియన్ పసిఫిక్ రైల్వే వారి పుణ్యమా అని ప్రయాణం కేవలం ఏడు రోజులలోనే వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో నించి న్యూయార్క్ కి వెళ్లగలుగు తున్నారు. ఎక్కడ ఆరు నెలలు, ఎక్కడ ఏడు రోజుల ప్రయాణం అనుకుని ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా వారి రైలు ప్రయాణము సాగుతోంది. ఫిలియాస్ ఫాగ్ గారు ఈ రైల్లో మోహమా అనే సెంట్రల్   స్టేషన్ చేరుకొని, అక్కడినించి న్యూయార్క్ కి చేరుకోవాలని ప్రణాళిక (పధకం) వేశారు.

ప్రయాణం చాలా సాఫీగా సాగుతోంది. అద్భుతమైన ప్రకృతి ఇరువైపులా కనిపిస్తోంది. పాస్ పర్ట్ మాత్రం ఫిక్స్ ప్రక్కనే కూర్చున్నాడు కానీ డిటెక్టీస్ ఫిక్స్ అయితే  యిప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. అతడు చాలా దుర్మార్గంగా కుట్ర పన్నిన విధానం తనకి నచ్చలేదు. అతని విధానం పై మంచివాడు కాదన్న ఒక అభిప్రాయం వచ్చింది కాబట్టి పాస్ పర్ట్ బిగదీసుకుని కూర్చున్నాడు. ఒక గంట తర్వాత బ్రహ్మాండం గా మంచు కురవడం మొదలు పెట్టింది కానీ రైలు మాత్రం  ఎక్కడా ఆగలేదు. మర్నాడు 6 గంటలకి కూర్చున్న పాస్ పర్ట్  కి ఎదురుగా ఉన్న కుర్చీ కి తన తల బలంగా కొట్టుకోవటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఎందుకు రైలు ఆగిందా అని చూస్తే, ఎదురుగుండా కొన్ని వందల సంఖ్యలో అడవి దున్నలు వైల్డ్ (wild) buffallos రైలు పట్టాలని దాటుతూంటే ఈ అధునాతనమైన ఈ రైలు పట్టాలపై అడ్డంగా ఈ అడవి దున్నలు అడ్డం రావటం ఏమిటని గట్టిగా అరిచాడు. కానీ ఆ ఇంజిన్ డ్రైవర్ చాలా తాపీగా సమాధానం యిస్తూ, మనం ఏమీ చేయ లేమండీ! ముందుకి వెళ్ళ నిస్తే ఇంజిన్ దెబ్బతింటుంది.  అందుకే అవి వెళ్లేంత వరకు ఆగటం తప్ప మనమేమీ చేయలేము, అన్నాడు. పాస్ పర్ట్  కి కూడా ఏం చేయాలో తెలియలేదు. సరిగా మూడు గంటల సమయం తీసుకున్నాయి. అడవి దున్నలు ఆ రైల్వే ట్రాక్ దాటటానికి ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగింది. ఈ రైలు ప్రయాణంలో కనిపిస్తున్న అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఏమాత్రం గమనించ కుండా, మేడం ఔదాకి పేకాట ఎలా ఆడాలో చాలా శ్రద్ధగా నేర్పిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా తెలివి కలది కాబట్టి చురుగ్గా, త్వరగా  నేర్చుకుంటోంది. యిద్దరూ ఆ పేకాటలోనే మునిగి పోయారు. చుట్టూ పక్కల పరిసరాలపై వారిద్దరికీ ఎటువంటి ఆసక్తి లేకుండా, పూర్తిగా ఆటలో మునిగి పోయారు. పాస్ పర్ట్  ఆలోచనలు మాత్రం చాలా రకాలుగా వున్నాయి. ఎక్కువగా ఎలాగైనా సరే తన యజమాని ఈ పోటీని గెలవాలని ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా పాస్ పర్ట్   నిద్రనుంచి లేచాడు. ఎందుకంటె ఆ రైల్ ఒక్క కుదుపుతో ఉన్నటుంది ఆగిపోయింది కాబట్టి. ఆ కుదుపుకి ఒక్కసారిగా మెలకువ వచ్చి లేవటం జరిగింది. ఏం జరిగిందా అని అతను ఆలోచిస్తూ ఉంటే ఆ పక్కస్టేషన్ లో ఉండే  Medicine Bow అన్నతను ఈ ఇంజిన్ డ్రైవర్తో ఇలాచెప్పాడు. ఇంకా ముందుకి మీరు వెళ్ళటం అంత మంచిది కాదు. ఇంకొంత దూరంలో ఉన్న బ్రిడ్జి చాలా పాతది. మీరు వెళ్లే రైలు బరువు ఆ బ్రిడ్జి తట్టుకోలేదు. దానికి మర్మత్తులూ అవీ చేయాలి. అది చాలా సమయం పడుతుంది.ఒహామా కి మేము టెలిగ్రామ్ లు కూడా ఇచ్చాము. సహాయం కోసం. కాబట్టి మీరు జాగ్రత్తగా వుండండి. అని చెప్పటంతో పాస్ పెర్త్ తో పాటు మిగిలిన పాసెంజర్లు  కూడా ఈ విషయం విని హడలిపోయారు. ఇంత చలిలో, ఇంత మంచులో ఎలా ఉండాలి. అయితే మేము ఈ ప్రయాణాన్ని ముందుకి ఎలా సాగించాలి అని బెంబేలెత్తిపోయారు. గొడవ చేస్తున్నారు. ఈలోగా ఇంజిన్ డ్రైవర్ కి ఒక ఆలోచన వచ్చింది. ఈ రైలుని ఒక రెండు కిలోమీటర్లు వెన్నక్కి తీసుకెళ్లి చాలా వేగంగా ముందుకు౭ తీసుకెళ్తూ, ఆ బ్రిడ్జి ని మనం దాటవచ్చు. మనం దాటాక ఆ బ్రిడ్జి పడిపోయినా ఫరవాలేదు, అని ఆలోచించాడు. దానికి అతని అసిస్టెంట్ కూడా ఒప్పుకున్నాడు. ఈ మాటలు విన్న పాస్ పర్ట్   కి మతిపోయింది. అలాకాదు మనందరం రైలు దిగి ఆ బ్రిడ్జి ఎలాగోలా దాటితే బరువు తక్కువగాఉంటుంది. కాబట్టి ఈ రైలు శుభంగా బ్రిడ్జి మీదనించి వచ్చినా ప్రమాదం ఉండదు. కానీ ఆ అసిస్టెంట్ మాత్రం  లేదు లేదు ఆ ఇంజిన్ డ్రైవర్ చెప్పిన సలహానే  బాగుంది. చాలా వేగంతో కనక మనం వెళ్ళ గలిగితే చాలా సులభంగా మనం బ్రిడ్జి ని దాటగలం. ఆ తర్వాత ఆ బ్రిడ్జి కూలిపోయినా మనకి సమస్య లేదుకదా! కాబట్టి ఇంజిన్ డ్రైవర్ చెప్పిన ప్రకారం ఈ సలహా చాలా బాగుందని అన్నాడు. ఈ మాటలకి పాస్ పర్ట్  కి మతిపోయింది. ఏం చేయాలో అర్ధం కాలేదు. మిగతా ప్రయాణీకులందరూ కూడా ఈ పధకం చాలా బాగుంది. ఇంజిన్ డ్రైవర్  చెప్పిన సలహా బాగుందని అందరూ కూడా ఒప్పేసుకున్నారు.రైలు ఎప్పుడైతే వేగంగా ప్రయాణం చేస్తుందో అపుడు దాని బరువు తగ్గిపోతుంది. మెల్లిగా ప్రయాణం చేసినప్పుడు బరువుగా ఉంటుంది.

కాబట్టి, బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉంటుంది అన్న సిద్దాంతం ప్రకారం ఆ ఇంజిన్ డ్రైవర్ చాలా హుషారుగా, ఆ హారన్   గట్టిగా నొక్కి ఒక రెండు కిలోమీటర్లు ఆ ఇంజిన్ ని వెనక వైపుకి నడిపించాడు. ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా రైలు ని ముందుకి నడిపించాడు. పాస్ పర్ట్  గుండె చాలా వేగంగా కొట్టుకో సాగింది. వేగంగా ఆ రైలు బ్రిడ్జి మీద ప్రయాణించి,  బ్రిడ్జి దాటగానే వెనక్కి చూస్తే ఆ బ్రిడ్జి పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కూలిపోయి, కిందవున్న అగాధంలో పడిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


************