N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here
Showing posts with label Miscellaneous. Show all posts
Showing posts with label Miscellaneous. Show all posts

Sunday, 2 October 2016

అతీంద్రియ శక్తులు



విదేశస్థులకి మన భారతదేశమంటే చాలా కుతూహలంగా ఉంటుంది. ముఖ్యంగా  అతి పవిత్రమైన హిమాలయ పర్వతాలు, మహిమలు చేస్తుండే సిద్ధులు, సాధువులు వీళ్ళందరి పట్ల వాళ్లకి ఎంతో కుతూహలం ఉంటూ ఉండేది. అప్పుడు మన భారతదేశంలో ఉండేటటువంటి సాధువులలో ఎంతమంది నిజమైన సాధువులో, ఎంతమంది కపట సాధువులో అని తెలుసుకొనడం చాలా కష్టంగా ఉండేది. అందుకని పాల్ బ్రంటన్ (Paul Brunton) అనే జర్నలిస్టుని వాళ్ళు స్పాన్సర్ చేసి భారతదేశానికి పంపించారు. అతని రాకలో ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే ఆ సమయంలో పేరుప్రఖ్యాతులున్నమహాత్ములని దర్శించడం, దగ్గరగా ఉండి వాళ్ళని పరీక్షించడం వాళ్ళు నిజంగా మహిమ కల వాళ్ళా , మహాత్ములా లేక దొంగ సాధువులా అని తేల్చుకోవడం.  మొట్టమొదటగా అప్పట్లో అతను
బొంబాయి నగరానికి చేరినప్పుడు అప్పట్లో అక్కడ  బాగా ప్రఖ్యాతమైన తాజ్ మహల్ హోటల్లో బస చేయడం జరిగింది. అయితే విదేశస్థులు భారతదేశానికి వచ్చేముందు అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకుని ముందే ఒక పథకం తయారు చేసుకుని దాని ప్రకారం ఒక క్రమశిక్షణతో వాటిని పాటిస్తూ ఉంటారు. తాజ్ మహల్ హోటల్లో మామూలుగా దిగాడు. అతను ఒక రోజు బయటకి వచ్చి నిల్చున్నప్పుడు ఆ వరండాలో చాలామంది ఉన్నారు.

Tuesday, 13 September 2016

Modulation of Voice and Inner Conviction

The next pre-requisite is the voice or the speech. Thoughts are very powerful because they create the very powerful thought waves which are magnetic in nature. When thoughts are expressed it comes out in the form of speech with different sounds. You can build up a very good relationship with the society and achieve your set goals very successfully provided your thoughts are pure, sincere and full of confidence. In short, when you translate your thoughts into the sound or speech you have to put behind these words energy of honesty, sincerity, conviction and confidence. Definitely, I assure you that the response from the people will be very positive.

Whenever you are giving a proposal to the people you should have complete knowledge what you are going to inform your customers or the people. If you lack knowledge in what you are going to present to the people, success is never guaranteed, on the other hand you will never be trusted and once the trust is lost, you have lost those people. Most of us do not spend sufficient time to update our knowledge on the pretext that you hardly get time to do so. Here the wants are dominating your needs. The desire or a want is emotional, whereas, a need is the necessity. You should differentiate between, the desire, want and the need. 

Saturday, 27 August 2016

పరమాచార్య వైభవం



కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు చాలా గొప్ప సాధకుడు, ఆధ్యాత్మికవేత్త, ఎంతో ప్రతిభాశాలి. ఆయన దర్శనానికి, ప్రవచనాలు వినడానికి వేలాది మంది గుంపులు గుంపులుగా వస్తూండేవారు. ఒకసారి ఆయన బాలత్రిపురసుందరి పూజ నిర్వహిస్తుండగా చుట్టు ప్రక్క గ్రామాల నుంచి తండోపతండాలుగా ఎంతో మంది భక్తులు పూజని చూడడానికి రావడం జరిగింది. అందరూ చాల నిశ్శబ్దంగా ఉండి స్వామివారు చేస్తున్న అద్భుతమైనటువంటి అమ్మవారి అలంకరణ చూసి మురిసిపోతున్నారు. పరమాచార్యగారు స్వయంగా బాలాత్రిపురసుందరికి పూజ చేసినప్పుడు అమ్మవారికి ఒక మంచి పట్టు చీర కట్టారు.  ఎంతో వైభవంగా అలంకరణ చేశారు. ఇలా తంతు సాగిపోతుండగా, అక్కడికి వచ్చిన చాలా మంది మహిళలలో ఒక స్త్రీ కూడా నిశ్శబ్దంగా తన వరుస క్రమంలో కూర్చొని పరమాచార్య చేస్తున్నటువంటి పూజని తిలకిస్తూ ఉంది.  

Friday, 15 July 2016

ప్రకృతి చికిత్సతో కాన్సర్ వ్యాధి నివారణ

అపక్వ ఆహారములతో కాన్సర్ వ్యాధి నివారణ

పచ్చి కూరల ప్రభావ౦ నాకు సరిగా  తెలియనప్పుడు ఇతర డాక్టర్ల వలె నేను కూడా  రోగ౦ రాకుండా చేయడం ఎలాగో తెలియకరోగ లక్షణాలకు చికిత్స చేశాను. ఇక ముందైనా డాక్టర్లు రోగం వచ్చాక రోగం నయం చేయడానికి ప్రయత్నించడం కంటె రోగం రాకుండా చేయడానికి ఉపాయాలను హెచ్చుగా అన్వేషించాలి . నేను స్వతహాగా డాక్టర్ని అయినా రోగి అయినందుకు, అందునా ఘోర జాడ్య౦ నన్ను ఆవరించినందువల్ల ముఖ్య౦గా నేను  పచ్చి కూరలని ఆహార౦గా ఉపయోగించడం మొదలుపెట్టాను.


Friday, 6 May 2016

Attitude of Gratitude

The Ego and its negative Effects (777)
An attitude of gratitude.(A story from the Upanishads)

Once upon a time the Aryavarta in India was ruled by a powerful emperor. The emperor was basically a good man but the only problem with him was he was highly egoistic. He always used to boast his greatness in each and everything and some of the good people were not happy with this negative quality of the emperor. Hence they all went to Yajnyavalkya Maharshi and requested him to reform their emperor.

 Accordingly Yajnyavalkya Maharshi had visited the court of this emperor and he was very well received by the emperor and he said, “Maharshi ! I am very happy to see you here in my court and I am sure you will be happy to notice the richness of this very big hall, golden throne and my people are very happy and comfortable. I request you to join me for lunch tomorrow.” After some time the Maharshi went back to rest and next day he visited the great emperor.

The emperor received the Maharshi and his followers and requested them to be seated. Then the emperor said, “Maharshi, I am very happy that you have personally come to visit my court and also my home (palace). You might have seen the seat on which you are sitting is made of pure gold and studded with costly diamonds and even my throne is also made up of pure gold and studded with diamonds which are very expensive.”
 Maharshi, “you also might have seen this big house of mine and see the pillars, they are also gold coated and studded with very precious stones. Now I invite you to have food with me.” Maharshi,  “Please sit on this golden seat, even my seat is also made up of pure gold and studded with precious stones.”

Saturday, 27 February 2016

ఆశావాది -నిరాశావాది

ఆశావాది  అంటే  జీవితంలో తను అనుకున్నది తప్పకుండా  సాధిస్తాననుకునే  ఒక ధృఢమైన ఆత్మవిశ్వాసం మరియు నమ్మకం వున్నవాడు ఆ పని చేయగలిగిన సామర్ధ్యం  కలిగినవాడు పట్టుదలగా  చేసేవాడు తన లక్ష్యం నెరవేరే వరకు కూడా ప్రయత్నాన్ని విరమించు కోకుండా చేసేవాడు . నిరాశావాది  దానికి భిన్నంగా ఉంటాడు. చెయ్యగలిగే సామర్ధ్యం వుండికూడా అతనిలో ఆత్మ విశ్వాసం తక్కువగా వుంటుంది , ఎప్పుడూ కూడా తన లక్ష్యాన్ని తాను చేరుకొలేనేమో అని భయం పట్టి పీడిస్తూ వుంటుంది . అటువంటి వాళ్ళు మన సమాజంలో కొకోల్లలుగా వున్నారు. వాళ్ళు జీవితంలో ఏ పనిని కూడా సాధించలేరు పైగా సాధించగలిగే  స్నేహితులని కూడా నిరాశ, నిరుత్సాహం పాలుచేస్తూ  వుంటారు . అలాంటి వాళ్ళ కథ ఈ రోజు తెలుసుకుందాం .

Saturday, 20 February 2016

The Universal Principle of Exchange of Energy


Author: Nanduri Sri Sairam

The Universe is full of exchange of energies. There is a standard and universal principle in the nature and there is always exchange of energies. When we say exchange, this exchange takes place between two or more number of people. We are living in the society and we are not alone in the society. All of us are contributing something to the society and hence there is always exchange of energies. This is the guiding principle in the famous proverb which says “What you sow so shall you reap.” To make it very simple if you sow the seed of love, in return or in exchange you will get many folds of energy of love.

Friday, 22 January 2016

Manners and Mannerism

One should have good manners to build up positive relationship and to achieve success in life. What exactly does good manners mean? As explained earlier, there are certain set of rules, which the players are expected to follow in any game or sport,  similarly in any society, a set of manners are prescribed mostly conventionally which the people are expected to follow in  public life.

The way you work, the way you talk and the way you express your feelings in the form of gestures, the modulation in your tone, your dressing code, your body language certainly have and leaves its own impact either positive or negative on the people around you to whom you are associated with. You are at liberty to do whatever you want to do when you are alone or left alone. Nobody questions about it, because nobody knew what you were or are doing when you are alone. It is okay.

But, when you are in public, you need to interact with people who hail from different cultures, different environments etc. Hence there are standard set of rules, customs or ways which are universally accepted. If you want to be successful and if you want appreciation and gain importance from the people in the society you have to adhere honestly to this behavioral pattern; there is no pretention with regard to manners. Rest assured your individuality is not at stake.

Tuesday, 12 January 2016

వింత వస్తువు


యథా ప్రకారంగా మేమందరం కథ కోసం మా అమ్మ చుట్టూ చాలా ఆసక్తిగా కూర్చుని ఎదురు చూస్తుంటు౦టే ఈ ప్రకారంగా కథ చెప్పడం మొదలు పెట్టింది.

కాకతీయ సామ్రాజ్యాన్ని రాణి రుద్రమ దేవి పరిపాలిస్తున్న రోజుల్లో ధర్మపురి అనే పట్టణం పాడి పంటలతో సస్య శ్యామలంగా ఉండేది. అక్కడ భూమి సారవంతమైనందు వల్ల పంటలు చక్కగా పండి ఆహార ధాన్యాలు ఇతర ప్రదేశాలకు కూడా ఎగుమతి చేస్తుండేవాళ్ళు. అదే ఊళ్ళో ధర్మాన్న అనే ఒక సంపన్న రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి ఉండేవాడు. అతను ఒక రోజు తన పొలంలో భూమి దున్నుతుండగా భూమినుండి ఒక వింత వస్తువు దొరికింది. దాన్ని భూమిలో నుంచి పైకి తీసి , మట్టంతా దులిపి, శుభ్రం చేసి ఎంతో పరీక్షించాడు. ఎంత చూసినా కూడా అదేమిటో ఆయనకి అర్థం  కాలేదు. దాన్ని తీసుకుని వెళ్లి ఆ ఊళ్ళో అతనికి తెలిసిన వారందరికి చూపించి  అడగ్గా వాళ్ళందరూ అల్లాంటి వస్తువుని వాళ్ళెప్పుడు చూడలేదని చెప్పారు.

Wednesday, 6 January 2016

సత్య దేవత – అసత్య దేవత



ఒక సారి సత్య దేవత , అసత్య దేవత కలిసి ఒక అరణ్య ప్రాంతంలో ఏకాంతంగా విహరిస్తుంటే వారికి అక్కడ ఒక అద్భుతమైన సరస్సు కనిపించింది. చుట్టూ ప్రక్కల వాతావరణం చాలా రమ్యంగా ఉంది.వారికి ఆ సరస్సు చూడగానే దానిలో దిగి స్నానం చేయాలి అనే ఒక పెద్ద కోరిక చాలా బలంగా కదిలింది. అదే ప్రకారంగా వారిద్దరు మెల్లమెల్లగా ఆ సరస్సు దగ్గరకి వెళ్లి, అది నిర్జన ప్రదేశం గా భావించి , వారు వేసుకున్న వస్త్రాలని విప్పి , గట్టు మీద ఉంచి ఆ సరస్సులో దిగారు. అందులో చాలా సేపు జలకాలాడుకుని వినోదించారు. కొంచెం సేపయ్యాక అసత్య దేవత ఆ సరస్సు ఒడ్డుకి వచ్చింది. అక్కడ గట్టు మీద ఉన్న సత్య దేవత విడిచిన వస్త్రాలని ఆవిడ ధరించింది.ఆవిడ ఈ పని కావాలా నే చేసింది. ఎందుకంటే సత్యానికి చాలా శక్తి ఉంది కదా ! ఈ లోపల సత్య దేవత కూడా సరస్సునుంచి బయటకు వచ్చి ఒడ్డుకి చేరింది. ఆవిడకి తన వస్త్రాలు అక్కడ కనిపించలేదు. ఆ స్థానంలో అసత్యదేవత విడిచివేసిన వస్త్రాలు మాత్రమే కనిపించాయి. 

Sunday, 1 November 2015

The story of Seetafal or the Custard apple

Recently when I visited  my sister’s place in Mumbai I saw custard apples in the  market and purchased  at Rs.30/-each and came home. When we started  enjoying them we remembered  our childhood days together we spent in our village. In  those days can anyone believe if I say that we used to get a basket full of  custard apples may be  more than a hundred just for 75 paise or one rupee? But it was a fact . We used to  finish all within no time. 

As we were refreshing our  memories suddenly I remembered  my mother telling about the benefits of eating the custard  apple  As  usual one day during the vacation we all (myself, my brothers, sisters and  all my cousins who came to our place to spend the vacation) gathered around my Mom entreating for  a story. Mother  said in a firm and yet in an informal tone, " look, children, just for a change today  I will tell you about the benefits of  eating fruits. She asked  us which fruit you are fond of? Of course ! Most of us named custard apple. 

Tuesday, 21 July 2015

Datta's appearance

Details as follows:

On the above mentioned day we had a small gathering to release  the book  "Anaghasthami Vratha Kalpam". This book is different from other similar books available in the market, because it was narrated by "Sripada Sri Vallabha Swamy" at Panchadev Pahaad. 

The details are available in the 54th Chapter on our website - www.sridatta.info - in the audio version of "Sripada Sri Vallabha Sampoorna Charitamrutham"

The program started at 10 am exactly in front of "Sri Datta, Sripada", "Sri Nrusimha Saraswathy Swamy " temple, within the compound of "Siddhi Vinayaka Temple".

Had bhajan for 20 mins and followed by Satsang on "Late Sri Malladi Govinda Deekshitulu Garu".

As one of the devotees was taking video, at 10:30am a brilliant light appeared and lo there appeared "Lord Sri Dattatreya" with his "3 heads and Abhaya Mudra", and all of us felt a divine fragrance and thus Lord Dattatreya blessed this holy book. We bought 50 disposable plates and glasses and surprisingly the same number of people participated the event. The function was a grand success.




On 9th August, 2015 - "Samuhika (group)  Anaghastami Vratham" will be performed. All are invited to participate in this holy event and receive blessings from the lord. 

For details contact - Pujari G Subramanya Sharma - 94405 46238

Jai Guru Datta

Sunday, 1 February 2015

Caterpillar to Butterfly



Once a very big fussy and fatty cater pillar was ruling over a large community of caterpillars in a beautiful forest with full of greenery and plenty of food to eat day and night. It’s job was to see that the entire community keeps up the traditions, old beliefs of living and follows the laws of the land laid down by the ancestors. One day it was addressing the community group who assembled to listen to her lecture. “I understand that the spirit of this forest is meeting our people and offering lot of group deals. Hence I have decided to meet that spirit of forest and talk to her exactly what she wants from us. One of the caterpillars asked the leader, “Fine! But how are you going to meet her?”

Friday, 5 December 2014

A Cute Letter from a newly married girl to her mother

Dear mom,
Like every normal girl, I was excited about marriage right from my childhood days. I never thought beyond the time that I would spend happily with my prince charming.


But today when I am married, I realize that marriage is not all roses. It’s not just about being with your beloved and having a gala time. There is so much more to it. It comes with its own share of responsibilities, duties, sacrifices and compromises.



I can’t wake up anytime I want to. 
I am expected to be up and ready before everyone else in the family. 
I can’t laze around in my pyjamas throughout the day. 
I am expected to be presentable every time. 
I can’t just go out anytime I want to. 
I am expected to be sensitive to the needs of the family. 
I just can’t hit the bed anytime I want to. 
I am expected to be active and around the family. 
I can’t expect to be treated like a princess but am supposed to take care of everyone else in the family.


And then I think to myself, ‘why did I get married at all?’ I was happier with you, mom. Sometimes I think of coming back to you and getting pampered again.


I want to come home to my favorite food cooked by you every evening after a nice outing with friends. I want to sleep on your laps like I have no worry in this world. But then I suddenly realize, had you not got married and made such sacrifices in your life, I wouldn't have had so many wonderful memories to hang on to. And suddenly, the purpose of all this becomes clear- to return the same comfort, peace and happiness to my new family that I got from you.



And I am sure that as time would pass, I would start loving this life equally as you do. Thank you mom for all the sacrifices and compromises you made. They give me the strength to do the same. Love you.

Nidhi Mehta Pipalia

Monday, 16 June 2014

Haindavi - M. Indushekhar

ఎంతో శ్రమ చేసి , ఎన్నో పరిశోధనలు చేసి వ్రాసినటువంటి పుస్తకం  హైందవి   విశ్వమంతా వ్యాపించిన భారతీయ సంస్కృతి రచయిత శ్రీ ముదిగొండ ఇందుశేఖర్ గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఈ పుస్తకాన్ని మా వెబ్ సైట్ లో పెట్టడానికి అనుమతి ఇచ్చిన ముదిగొండ ఇందుశేఖర్ గారికి నా కృతజ్ఞతలు. వెబ్ సైట్ పాఠకులందరూ  దీన్ని చదివి మన భారతీయ సంస్కృతిని  గుర్తిస్తారు అని   ఆశిస్తున్నాను 
---- నండూరి  శ్రీ సాయిరాం

 

  

Saturday, 3 May 2014

Jagdish Chandra Bose



ఆధ్యాత్మిక అనుభవాలు  - విశేషాలు 

భారతీయ శాస్త్రజ్ఞుడైన సర్ జగదీశ్ చంద్ర బోస్ వృక్షాల మీద చేసిన పరిశోధనలు, ప్రయోగాలు.

క్రిందటి ఎపిసోడ్ లో చెప్పినట్టుగానే మొక్కల గురించి నాకు తెలిసిన  చాలా ఆసక్తికర మైన విషయాలు నేను మీతో చెప్పదలచు కున్నాను. మన భారతీయ శాస్త్రవేత్త సర్ జగదీశ్ చంద్ర బోస్ గారు కనుక్కున్న క్రెస్కోగ్రాఫ్  అనే పరికరము, ఆయన దానితో మొక్కలమీద, వృక్షాల మీద  చేసిన ప్రయోగాలు చెప్తాను. అంతే కాకుండా మరి కొన్ని ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయాలు కూడా చెప్పదలుచు కున్నాను.  

మహానుభావుడు, మన భారతీయ శాస్త్రజ్ఞుడైనట్టి సర్ జగదీశ్ చంద్ర బోస్ గారిని మనం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడే అని చెప్పాలి. పరమ హంస యోగానంద గారు విషయం "ఒక యోగి ఆత్మ కథ " (ఆటో బయోగ్రఫీ అఫ్ యోగి ) అనే పుస్తకంలో చాలా చక్కగా వివరించారు.

Thursday, 27 March 2014

Quotations

  • A bird is in the air but its mind is on the ground.
  • A big man is one who makes us feel big when we are with him.
  • A miracle though happening through one, affects the consciousness of many
  • If your inner nature is firm and balanced, there is a definite possibility that you can create your life the way you want it to be.
  • Death is a very beautiful experience.
  • Man is ignorant of the pain he causes to others.
  • As you recognize the divine hand that shapes and guides your life, you love increases and consciousness becomes miracle.
  • Acceptance is bedrock of spirituality
  • Life contains the seed of death so does death contains the seed of love.
  • The universe is an inter play of positive and negative energies.
  • A miracle gives a whole new meaning to life.
  • Two kinds of people live on this planet – one rise and sink with tides of ocean – other sails on the ocean of grace




Monday, 27 January 2014

Nivrutti Sangamam


నివృత్తి సంగమం- తీర్థ క్షేత్ర దర్శనం

నాకు ఈ మధ్యే గొప్ప దత్త భక్తుడు అంతకుమించి శ్రీ పాద శ్రీ వల్లభుడి భక్తాగ్రేసరుడు అయినటువంటి సాయికృష్ణ గారితో వెబ్ ద్వారా పరిచయం అయ్యింది . ఆయన  నన్ను ఋషిపంచమి రోజున తప్పకుండా నివృత్తి సంఘానికి తీసుకెళతాను అని చెప్పారు. నాకు నేత్రవ్యాధి కొంత ఉన్నది కనుక ఎలాగా అని కొంత తటపటాయిస్తుండగా “ఏమి  పర్వాలేదు, మిమ్మల్ని స్వయంగా నేను తీసుకెళతాను” అని అక్కడ విఠల్ బాబా గారి కట్టించినటువంటి వసతి గృహం ఉంది, అక్కడే పైన చిన్న ఆలయం ఉంది అని వివరాలు చెప్పగా అది నేను శ్రీ పాదశ్రీ వల్లభుల యొక్క ఆదేశమే అని గ్రహించి అదే ఉద్దేశంతో తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. వినాయకచవితి రోజు పూజ అయ్యాక  మధ్యానం శ్రీపాద శ్రీవల్లభుడి భక్తుడు వర్మగారు అనే ఆయన వచ్చి ఆయన కారులో అమీర్ పేట్ తీసుకువెళ్ళారు. అక్కడే దాదాపు 20 మంది భక్తులు బస్సులో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బృందానికి నాయకత్వం సాయి కృష్ణగారు వహించారు. మంచి కార్య దీక్షత, పట్టుదల, వాక్చాతుర్యం మరియు నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా ఆయనని నేను గ్రహించాను ఎందుకంటే ఇంతమందిని ఏ తీర్థయాత్రకి తీసుకెళ్లాలన్నా చాలా కష్టమైన పని.

ఆ పనిని నిర్వహించే వారికే ఆ బాధలు తెలుస్తాయి. లోగడ నేను కూడా అటువంటి పనులు  చేసి ఉన్నాను కాబట్టి అది ఎంత కష్టమో నాకు తెలుసు. కాని ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ కష్టం ఏమి అనిపించదు. మేము అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికే మా బస్సు ప్రారంభం అయ్యింది.  అది వీడియో కోచ్ కావడం వాళ్ళ దానిలో ప్రశాంతత కలిగేట్లుగా శ్రీ పాదవల్లభ చరితామృతం సీడీ పెట్టారు. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను ఎందుకంటే మేము వెళ్ళేది వినాయక చవితి రోజు, చాలా పవిత్రమైన రోజు. మర్నాడు అది ఋషి పంచమి, పర్వ దినం. ఆ రోజు ప్రత్యేకంగా శ్రీ పాదశ్రీవల్లభుల వారే  స్వయంగా నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించినట్లుగా భావించాను. ఎంతో ఆహ్లాదకరంగా ఆ చరితామృతం  వింటుండగా కొంతమందికి అది నచ్చలేదో ఏమో తెలియదుకాని అది తీసి ఏదైనా కొత్త సినిమా పెట్టమని చెప్పటం జరిగింది. అపుడు నేను శ్రీ పాదుడిని మనసులో ఇలా ప్రార్దించుకోసాగాను “స్వామీ ఏదో ఈ రోజు పూజ చేసుకుని నేనిలా వచ్చాను. మనం వెళ్ళే ప్రదేశానికి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, మనకి మంచి పవిత్రమైన స్పందనలు కలగాలంటే  మంచి విషయాలు వినాలి కదా మరి ఎందుకు స్వామీ ఈ సినిమా సీడీలు, ఎట్లాగో ప్రతీ రోజు ఇంట్లో చూస్తూనే ఉంటాము. మన జీవితంలో చాలా భాగం ఇటువంటి వాటికే వెచ్చిస్తూ ఉంటాము అని కొంత బాధపడ్డాను. అయితే మరి కారణాలు ఏమిటో తెలియదు కొత్త సినిమా పెట్టారు కాని ప్రింట్ సరిగా లేకపోవడమో, సౌండ్ సరిగా లేకపోవడమో ఇంకొకటి పెట్టగా అది కూడా అలానే జరగడంతో వాళ్ళు అన్నారు ఇవేమో బాగాలేవు ఇవన్ని తీసేయండి అనగా ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడింది. హమ్మయ్య అని మనసులో ఊపిరి పీల్చుకుని శ్రీ పాదులవారికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఈ విధంగా మేము మా ప్రయాణం సాగించాము.

మక్తల్ దాటాక తంగిడి అనే ఒక చిన్న గ్రామం ఉంది, ఆ గ్రామంలోనే మా బస్సు ఆగింది. ఆ దారి అంతా పాడయిపోయింది. వర్షాలు నిరంతరంగా కురవడం వల్ల అక్కడంతా బురదగా ఉంది. కార్లు అటువైపుగా రాలేవు వస్తే అవి బురదలో చిక్కుకుపోతాయి. అంతకు మునుపే విఠల్ బాబాగారు సమాచారం మేరకు మేము నివృత్తి సంగమంచేరుకోడానికి  ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. అవి మాత్రమే ఆ బురదలో ప్రయాణించగలవు అని చెప్పడం వల్ల మేము అక్కడే బస్సు ఆపుకున్నాము. ఎక్కడ చూసిన చీకటి, కరంటు అప్పుడే పోయినట్లుంది. 

అలాగే మేము నిరీక్షిస్తూ కూర్చున్నాము. కాసేపటికి 2 ట్రాక్టర్లు రావటం, మేము రెండు భాగాలుగా విడిపోయి ఆ ట్రాక్టర్లో నివృత్తి సంగమందగ్గర ఉన్న విఠల్ బాబా ఆశ్రమానికి చేరుకున్నాము. కాని ఈ ప్రయాణం చాలా సాహసయాత్ర మాదిరిగానే ఉన్నది. ఆ ప్రదేశానికి చేరుకొని నేను ట్రాక్టరు దిగగానే మొట్ట మొదటి సారి విఠల్ బాబాగారిని చూసాను. ఆయన అందరిని పేరుపేరునా "వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా" అని ఆప్యాయంగా పలకరించారు. సాయికృష్ణగారు నన్ను వారికి పరిచయం చేసారు. తరువాత ఆయన అందరిని "బాగా అలసిపోయారు, పైకి వెళ్లి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి" అని మేడ మీదకి పంపించారు. మేము వస్తున్న సంగతి ముందే తెలుసు కాబట్టి అందరికి భోజనం సిద్ధంగా ఉంచారు. నాకు ప్రత్యేకంగా చపాతీలు ఏర్పాటు కూడా చేసారు. అందరికీ చక్కగా అతిధి సత్కారం చేసారు. ఆ తరువాత మేమందరం 2వ అంతస్తులోకి వెళ్ళగా అక్కడ మాకు దత్త భీమేస్వరుడి విగ్రహం కనిపించింది.

అక్కడ ఒక చిన్న మందిరం కూడా ఉన్నది. నాకు వారు అక్కడ భీమేశ్వరాలయం ఎక్కడ ఉంది, భీమజా నది ఎక్కడ నుండి వస్తుంది, కృష్ణ ఎక్కడ నుండి వస్తుంది ఈ 2 నదుల యొక్క సంగామాన్నే నివృత్తి సంగమం అంటారని వారు చెప్పడం  జరిగింది. అయితే అక్కడ సత్సంగం చేసుకుందామని కొందరు అనుకున్నారు. అయితే విఠల్ బాబాగారు మేమున్న అంతస్తుకి రావడం, చాలా క్లుప్తంగా ఆయన సత్సంగం చెయ్యడం, ఆయన మమ్మల్ని ఉద్దేశించి "పైకి వెళ్ళద్దు, అక్కడ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, చీకట్లో పడిపోగలరు” అని పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి జాగ్రత్త చెప్పినట్లుగా చెప్పారు. భోజనాలయ్యాక అందరం విశ్రమించాము. ఆ తరువాత తెల్లవారుజామున 3 గంటలకు కాబోలు అందరు అక్కడ హాలులో కుర్చీలు వేసుకుని ఆ సంగమం వైపే చూస్తూ కూర్చున్నాము. 

ఋషిపంచమి రోజున ఋషులు, సిద్ధులు, యోగులు ఈ సంగమం దగ్గరకు వచ్చి ప్రాతః కాలాన్నే స్నానం చేస్తారని, వారు జ్యోతిస్వరూపంలో వస్తారని  చెప్పి ప్రతీతి. అయితే వాళ్ళు కొంతమందికి కనపడతారు, కొంతమందికి కనపడరు అని చెప్పడం జరిగింది. అందరు అక్కడే కూర్చుని ఆ నదిసంగమం వైపు తదేకంగా చూస్తున్నారు. కొంతమంది తమ కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు, తరువాత ఆ ఫోటోలు చూడగా వాటిలో సిద్ధగోళాలు కనిపించడం జరిగింది. అయితే నేను అక్కడే కూర్చున్న కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తున్నాను. మరి ఈ కాంతి స్వరూపంతో వచ్చిన మహానుభావులకి అందరికి కనపడడం ఇష్టముండదు, ఎవరైతే ఆధ్యాత్మిక దారిలో వెళతారో, వారికి చూడాలని అనిపిస్తేనే చూస్తారు . కానీ నిజమైన దత్తభక్తులకి ఇటువంటి మహిమల పట్ల కాని, ఇటువంటి దృశ్యాలు చూడాలని అనిపించదు. ఆధ్యాత్మిక మొదటిదశలో ఉన్నవారికి తప్పకుండా ఇటువంటి ఆశ ఉండటం చాల సహజం. అయితే నేను చదివిన ఒక సంఘటనలో సారాంశం ఏమిటంటే అటువంటి దివ్యపురుషులు వస్తుంటే మనం వారిని చూడకూడదు అని చెప్పినా కూడా ఒకతను వినకుండా అటువైపు చూడటము, ఆ జ్యోతిస్వరూపం నుండి వచ్చిన వెలుగురేఖల తాకిడికి అతనికి మెల్లగా అంధత్వం రావటం జరిగిందని నాకు గుర్తొచ్చాయి. అయితే ఒకటి, అతను ఒక మంచి భావనతో కాకుండా ఏమిటి ఈ దుష్టశక్తులు అని భావించడం, ఆ వెలుగు కనపడినపుడు దానిని దూషించడం జరిగింది కనుకనే అలా జరిగింది అని నేను రకరకాలుగా ఆలోచించడం జరిగింది.

అయితే ఈ లోపల విఠల్ బాబా దగ్గర నుండి “మీరు 6 తరువాత స్నానం చెయ్యండి, ఎందుకంటే ఈ రోజు అక్కడకి చాలామంది మహా పురుషులు వస్తారు, మనం ఏ మాత్రం వారి ప్రశాంతతకి భంగ పరచకూడదు” అని ఆదేశం వచ్చింది. మేము అలాగే 6 తరువాతే స్నానానికి బయలుదేరాము, బయల్దేరగానే పెద్ద వర్షం మొదలయ్యింది. అలాగ వర్షం పడుతుండగానే మేము మెల్లగా నదిలోకి ప్రవేశించడం జరిగింది. గమ్మత్తేమిటంటే నది మొదలు నీరు చల్లగా ఉన్నాయి, మధ్యలోకి  వెళ్ళగా నీరు గోరువెచ్చగా ఉన్నట్లుగా మాకు అనిపించింది. అక్కడ రాళ్ళు అన్ని పాదుకల మాదిరిగా, కొన్ని వినాయకుడి ఆకృతిలో ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే మేము వెళ్ళినపుడు నీరు ఎక్కువగా ఉండడం వాళ్ళ కాబోలు మాకు పెద్దగా అటువంటి రాళ్ళు కనపడలేదు. 

స్నానం అయిన తరువాత ఆశ్రమానికి వచ్చి అల్పాహారం తీసుకుని బాబాగారి దగ్గర సత్సంగంలో పాల్గొన్నాము. ఆయన చాలా మంచి విషయాలు బోధించడం జరిగింది.  ఎటువంటి వసతులు లేని చోట  నానా ఇబ్బందులు పడుతున్న భక్తుల కోసం అన్ని వసతులు కల ఒక ఆశ్రమాన్ని స్థాపించడం అనే ఆయన ఆలోచనకి, సంస్కారానికి నా మనసులోనే ధన్యవాదాలు అర్పించుకున్నాను. అయితే ఎక్కడ నదులు ప్రవహిస్తు ఉంటాయో, ఆ నదులలో కూడా ఒక విధమైన కుండలిని శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 2 నదులు కలిసే చోట అక్కడ ఒక అద్భుతమైన శక్తి ప్రకటితం అవుతుంది.

కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యుడి నుంచి వచ్చే కిరణాల వల్ల, కొన్ని గ్రహాలూ నుంచి వచ్చే స్పందనల వల్ల ఇటువంటి నదీ ప్రదేశాలలో ఒక దైవికశక్తి విద్యుత్రూపంలో ప్రహిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో కనుక మనం అటువంటి చోట స్నానం చేస్తే మన ప్రాణమయశరీరం శుద్ధి కావించబడుతుంది. అటువంటి సమయంలో ఏదో దైవధ్యానంలోనో, భగవన్నామ స్మరణలోనో ఉంటే మన భావాలూ ఇంకా ఎక్కువ పరిశుద్ధమవుతాయి. మన మనస్సు ఎంత ప్రశాంతంగా పెట్టుకంటే మన భావనలు కాని మన స్పందనలు కాని మనకి అనుభూతిలోకి వస్తాయి అని నేను అనుకున్నాను. ఆ తరువాత మేము విఠల్ బాబాగారి ఆశ్రమం నుంచి సెలవు తీసుకుని వెనక్కి వచ్చేసాము. అయితే అక్కడ నుంచి పంచదేవ్ పహాడ్ వచ్చి అన్ని దర్శనాలు చేసుకుని అటునుంచి వల్లభాపురం వచ్చాము. విఠల్ బాబా అక్కడ ముందే మాకు భోజన సదుపాయం ఏర్పాటు చేయించారు. బాబా గారి ఆతిధ్యం నేను మొదటి సారి తీసుకున్నది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కురుపురంలో భక్తులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ సమయంలో భక్తుల కష్టాలను గ్రహించి ఆయన అక్కడ అన్ని సదుపాయాలు కల  ఒక పెద్ద భవనం కట్టించడం జరిగింది. నేను కూడా అక్కడ ఒకసారి బస చేయడం జరిగింది.

దత్త మహాప్రభువుకి ఎంతోమంది ఎన్నో సేవలు చేస్తున్నారు. అదే విధంగా విఠల్ బాబాగారు కూడా ఈ రకంగా ఈ వల్లభాపురం దగ్గర, నివృత్తి సంగమం దగ్గర కూడా భక్తులకి ఈ విధంగా సదుపాయాలు కల్పించి ఆ దత్త మహాప్రభువుని సేవిస్తున్నారు అని నేను మనసులోనే ఆయనకి నమస్కరించుకున్నారు. తిరుగుప్రయాణంలో మహబూబ్ నగర్లో సాయికృష్ణగారి ఆప్తమిత్రుఅలైన పండరిగారు, వారి తండ్రి లక్ష్మినరసింహం గారి ఇంట్లో బస చేసాము. వారి కుటుంబం మా బృందం అంతటికి ఎంతో మర్యాద చేసారు. 

మేము వచ్చేటపుడు సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చేసాము. ఆధ్యాత్మికత అంటే ఎప్పుడు నవ్వకుండా ఉండటమో, భగవంతుని గురించే మాట్లాడుతూ ఉండటమే కాదు దీనిలో కూడా మనం ఆడుతూ పాడుతూ ఉండచ్చు, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఆ విధంగా మేమందరం చక్కగా ఒక కుటుంబసభ్యులుగా ఈ యాత్ర పూర్తి చేసాము. ఇదంతా చూసాక ప్రతి మనిషిలోను ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, అలా ఉండాలి అప్పుడే జీవితం చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇది ఒక కుటుంబ మరియు ఆధ్యాత్మిక యాత్రగా నేను భావించాను. నా తోటి ప్రయాణికులందరికి నేను మనసులోనే నమస్కరించి వీడ్కోలు తీసుకున్నాను.

 ఇక్కడ నివృత్తి అంటే ఏమిటంటే ఏ వ్రుత్తి లేకుండా, అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉండే స్థితి. ఏదన్నా సందేహాలు కనుక ఉన్నట్లయితే వాటిని తీర్చుకోడాన్ని కూడా నివృత్తి అని అంటాము. అయితే అక్కడ నివృత్తి సంగమంలో మనం ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో, అంటే సూన్య స్థితిలోకి వెళ్ళటం అని భావించాలి. అక్కడకి వెళ్ళినపుడు మనం ఆ స్థితిలోకి వెళ్ళినట్లయితే మనము సాక్షాత్తు మన ఆత్మని దర్శించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి జీవి పుట్టినపుడు అదే సూన్య స్థితిలో ఉంటారు. అక్కడ ఏవిధమైన పుణ్యకర్మలు, పాపకర్మలు చేయకుండా ఉంటాము. అదే మన ప్రధమతత్వం, అటువంటి స్థాయికి మనం తిరిగి చేరుకునే ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని ఈ ఋషిపంచమి రోజున నివృత్తి సంగమంలో నేను సందేశంగా స్వీకరించాను.

-నండూరి సాయిరాం