అపక్వ ఆహారములతో
కాన్సర్ వ్యాధి నివారణ
పచ్చి కూరల
ప్రభావ౦ నాకు సరిగా తెలియనప్పుడు ఇతర డాక్టర్ల వలె నేను కూడా రోగ౦
రాకుండా చేయడం ఎలాగో తెలియక, రోగ లక్షణాలకు
చికిత్స చేశాను. ఇక ముందైనా డాక్టర్లు రోగం వచ్చాక రోగం నయం చేయడానికి
ప్రయత్నించడం కంటె రోగం రాకుండా చేయడానికి ఉపాయాలను హెచ్చుగా అన్వేషించాలి . నేను స్వతహాగా డాక్టర్ని అయినా రోగి అయినందుకు, అందునా ఘోర జాడ్య౦ నన్ను ఆవరించినందువల్ల ముఖ్య౦గా నేను పచ్చి కూరలని
ఆహార౦గా ఉపయోగించడం మొదలుపెట్టాను.
నాకు రొమ్ములో
కాన్సర్ ఏర్పడింది. దీనికి ముఖ్య కారణ౦ 12 సంవత్సరాలు ఆసుపత్రిలో పని
చేస్తున్నప్పుడు నేను అవలంబించిన ఆహారాలు, దురలవాట్లు మాత్రమే. ఆ రోజుల్లో నాకు ఆకలి మందగించి ఉండేది. ఆసుపత్రిలో పని
చేసేవాళ్ళకి ఇచ్చే ఆహార౦లో మార్పేమీ ఉండేది కాదు. ఒకప్పుడు నాకు కడుపులో
రక్తస్రావంతో ఏర్పడిన పుండు వల్ల చనిపోయేంత పరిస్థితి ఏర్పడింది. అందువల్ల
మత్స్యమాంసాలు మాని పూర్తిగా శాకాహారినయ్యాను. తరువాత చాలామటుకు పచ్చి కూరలనే
ఆహారంగా తీసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల రోగం పూర్తిగా నయ౦ కాలేదు
కాని జీర్ణ శక్తి పెరిగి హాయిని ఇచ్చింది. 1940 శీతాకాలం మొదలు 1941 శీతాకాలం వరకు
నాకు అతినిస్త్రాణంగా ఉండేది. చాలా మందకొడిగా ఉండేదాన్ని .
ఫలానా రోగమని
నిర్ణయించ జాలక అయోమయ స్థితిలో ఉండేదాన్ని. వసంత కాలం వచ్చేటప్పటికి రొమ్ములో ఒక
చిన్నగడ్డ కనపడింది. మందకొడితనం వల్ల, నిస్త్రాణంగా ఉండడంవల్ల ముందు ఆ గడ్డని అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. 5 వారాల తర్వాత అది పెరిగి కోడిగుడ్డంత
లావయ్యి చర్మగడ్డ లాగా తయారయింది. చర్మ గడ్డ అంటే కాన్సర్ అన్నమాట. నేను డాక్టర్ని
కనుక, కాన్సర్ కి మామూలుగా చేసే చికిత్సలన్నీ నాకు
అనుభవమే కనుక ఆ చికిత్సలు చేయించుకోవడం నాకెంత మాత్రమూ ఇష్ట౦ లేకపోయింది. ఈ
విషయంలో నాముఖ్య స్నేహితుడైన డాక్టర్ హింద్ హెడి(Dr.Mikkel Hindhede) గారితో సంప్రదించాను. ఆయన ట్రయల్ మైక్రోస్కోప్ వద్దన్నాడు. దాని వల్ల
రక్తవాహికలు తెగి కాన్సర్ ఇంకా వ్యాపిస్తుందని అన్నాడు. అందువల్ల ఆ ప్రయత్నం
మానివేశాను.
ఇక నూటికి నూరు
పాళ్ళు (అంటే 100%) పచ్చి కూరలు తినడమే మార్గమని నిశ్చయించుకున్నాను. ప్రకృతి జీవన
మార్గాలని అన్వేషించాను. ఒక చిన్నదీవిలో నివాస౦ ఏర్పాటు చేసుకున్నాను. రోజు నాలుగైదు గంటలు ఎండలో కూర్చునేదాన్ని. గాలి
వెలుతురు పుష్కళంగా ఉండే గుడారంలో ఉన్నాను. రోజూకు అనేక పర్యాయాలు స్నానం
చేస్తుండేదాన్ని. పూర్తిగాపచ్చి కూరలు ఆహారంగా తీసుకునేదాన్ని. తర్వాత హ్యూమ్లే
గార్డెన్(Humle gardens)శానిటోరియంలో ఈ పద్ధతులే ప్రవేశ
పెట్టాను. ఇలా చేస్తున్నా మొదటి రెండు నెలలు నిస్త్రాణం అలాగే ఉండేది. రొమ్ములోని
గడ్డ ఏమీ తగ్గలేదు. అలాగే ఉండి పోయింది. తర్వాత
మార్పు కనిపించింది. గడ్డ తగ్గడం ఆరంభించింది. నేను కోలుకున్నాను. లోగడ అనేక
సంవత్సరాల నుండి ఎరుగని సుఖ౦, సంతోష౦
అనుభవించడం మొదలుపెట్టాను.
ఇలా ఒక సంవత్సరం చక్కని ఆరోగ్యం అనుభవించాక అయినా
చూద్దాం అని నా స్నేహితుడు హింద్ హెడి(Dr. Hindhede) ఇచ్చిన సలహాననుసరించి
ఉడకపెట్టిన కూరలు,రొట్టె, సగం ఉడికిన కూరలు తినడం ఆరంభించాను. లాభం లేక పోయింది. మూడు నెలల తర్వాత మళ్ళీ
రొమ్ములో సూదిపోట్లు మొదలైనాయి. బాధ చాలా ఎక్కువై౦ది. మళ్ళీ కాన్సర్ పెరగడం మొదలు
పెట్టింది. తిరిగి మళ్ళీ పచ్చి ఆహారం తినడం ప్రారంభించాను. బాధ వెంటనే తగ్గింది.
నిస్త్రాణ అంతగా కనిపించ లేదు. నేను డాక్టర్ని కాబట్టి నా అనుభవం రోగుల తోటి , మానవుల క్షేమం కోసం వినియోగించడం మంచిదని నిశ్చయించుకున్నాను. మరుసటి వేసవిలో
నాకు, నాతోపాటు నలుగురైదుగురు రోగుల కోసం సరిపడే ఇల్లు
అద్దెకు తీసుకున్నాము. మేమందరమూ నూటికి నూరు పాళ్ళు పచ్చి కూరల ఆహారం తినడం
ప్రారంభించాము. చాలా చక్కగా పని చేసింది. కాని నాకు ఈ చికిత్స కొద్ది మందికే పరిమితం
చేయడం ఎంత మాత్రమూ తృప్తిని కలిగించ లేదు. ఈ చికిత్స వల్ల మేలు కలుగుతుందని
లోకానికి ఋజువు చేసి, ఈ ఉద్యమం వ్యాపింప చేయాలంటే పెద్ద ఎత్తున, పెద్దగా ప్రయత్నం
చేయడం మంచిదని నాకనిపించింది. అందుకోసం ఒక వ్యాపార సంస్థ నెలగొల్పి, హ్యూమ్లే
గార్డెన్(Humle gardens) అనే తోట ఇంటిని(farm-house) కొన్నాను. ఆ తోట
ఇల్లు(farm house) నేను స్థాపించ దలచుకున్న శానిటోరియంకి చాలా అనుకూలంగా ఉ౦ది.
శానిటోరియంకి నేనే అధిపతిగా ఉన్నాను. దీనిలో ఉండే రోగులు, డాక్టర్లు, నౌకర్లు అందర౦ కూడా పచ్చి ఆహారం తింటాము. ఇది
స్థాపించి ఇప్పటికీ అంటే 1959 నాటికి ఆరేళ్లయింది.
మంచిదే కాని
నాగరికులమని చెప్పుకునే ఈ కాలపు మానవులకు సమగ్రమైన పచ్చి కూరల ఆహారం ఇంత మేలు
చేయడానికి కారణమేమిటీ? అన్నింటికంటే మొదటిది,ముఖ్యమైనది ప్రకృతి మాత మనకి సరాసరి అందించిన ఆహార౦ పచ్చి ఆహారం. లోకమునందలి
జీవకోటి పుట్టుక, మనుగడలు సూర్య భగవంతుని మీదనే ఆధారపడి ఉన్నాయని
మన౦దరికీ తెలుసు. సూర్యుడే కనుక లేకపోతే ఈ భూమండలమ౦తా చిమ్మచీకటి తోను, గడ గడా వణికి౦చు చల్లటి గాలులతోను నిమిడీకృతమై ఉండేది. ఒక్క జీవి కూడా
ఉండేది కాదు. కాబట్టి ప్రాణమన్నా, సూర్యుని
శక్తి అన్నా ఒకటే. తేడా ఏమీ లేదు. చెట్లు - చేమలు గాలిలో చక్కగా నలుమూలలా
విస్తరించి లక్షలాది తమ పచ్చని ఆకుల ద్వారా సూర్య రశ్మిని గ్రహించి, దానిని తమ
వేళ్ళలో, దుంపలలో, కాయలలో, పళ్ళలో, గింజలలో దాచి ఉంచుతాయని డాక్టర్ హెస్సు లింక్(Dr. Hessulink) చెప్పారు. స్థూల
శరీరులైన మానవులు, మృగాలు సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించ లేరు. అందుకనే
మానవులు, పశువులు కూడా సూర్య రశ్మి కొరకు చెట్లు ఇచ్చే వేళ్ళు(roots like carrots, బీట్), కాయలు, కూరలు, దుంపలు(tubers like potato etc), పళ్ళు(fruits), గింజల(seeds)మీద ఆధార పడి, వాటి ద్వారా సూర్య రశ్మిని గ్రహించవలసిన
అవసరం కలిగి౦ది. చిగుళ్ళు, పచ్చి కూరలు తినడమంటే సూర్యరశ్మిని తినడమే అని అనడంలో సందేహం లేదు.
జురీష్ వాసి యగు
డాక్టర్ చర్ చర్ బెన్నర్ (Dr. Charchar Benner)ఈ రహస్యాన్ని ఎప్పుడో గ్రహించారు.
అణువులు శక్తి వాహకులని హాలండ్ దేశస్థుడైన డాక్టర్ హెస్ లింక్ (Dr.
Hesselink Brandee) చెప్పారు. కాబట్టి తాజా పచ్చి కూరలలో పరిపూర్ణమైన ఆహారముంది.
దాన్ని పెంచాలంటే మన తరం కాదు. ఉడకబెట్టి ఏం చేసినా దాని విలువ తగ్గనన్నా
తగ్గుతుంది లేక పోతే, పూర్తిగా నాశనమన్నా అవుతుంది. వండిన కూరలకి రుచి పచి
అనేది ఏదీ ఉండదు. వాటిలో రుచి కోసం మనం రకరకాలైన వస్తువులని పంచదార, మసాలా, మిర్చి వగైరా వగైరా ఎన్నో మేళవిస్తాం. గోధుమల మొలకలలో పై పొట్టును
తీసివేసి కాని రొట్టెపిండి తయారు చేయము. బియ్యాన్ని, చక్కెరను పాలిష్ చేయించి వాటిని తెల్లగా చేయిస్తాము. ఆపిల్ పండు పై
చర్మాన్ని, లోపలి గింజలని పారవేస్తా౦. బంగాళ దుంపలు, కారట్ల(carrots) మీద ఉన్న పై పొట్టును
తీసివేస్తా౦. అలాగే మాంస౦, చేపలు,గుడ్ల ద్వారా మనకు కావలసిన దాని కన్నా ఎక్కువగా మాంసకృత్తులను పొందుతున్నాము.
కాఫీ, టీ , కోకో మొదలైన ఉద్రేకాన్ని కలిగించే విష పానీయాలని తయారు చేసి త్రాగుతున్నా౦.
అమృత౦తో సమానమైన ద్రాక్షరస౦ నుంచి సారాయిలు(country లిక్కర్), బ్రాందిలు(brandy) మొదలగు మత్తుపదార్థాలని (intoxicants) తయారుచేస్తున్నా౦. ఆహారపు నాళం చెడకుండా ఉండడానికి, కంటికి ఇంపుగా కనిపించడానికి రక రకాలైన రసాయానిక పదార్థాల్ని
ఉపయోగిస్తా౦.
రక రకాల నొప్పులు
తగ్గడం కోసం, నిద్ర పట్టడానికి, ఆందోళన తగ్గడం కోసం, విరేచనాలు అవడానికి ఘాటైన మందులు(powerful
antibiotics or painkillers) వాడుతా౦. ఇవన్నీ శరీర౦లో కలవని అన్య పదార్థాలు.
ముఖ్య౦గా తలనొప్పి పోగొట్టడానికి, విరేచనములు
అవడానికి వాడే మందుబిళ్ళలకి అంతు-పంతు లేదు. డెన్మార్క్ వంటి చిన్న దేశ౦లో తల
నొప్పి తగ్గే మందు బిళ్ళలు నూటాయాభై టన్నులు, విరేచనాల మందు బిళ్ళలు పదిహేను టన్నులు, నిద్ర పట్టే బిళ్ళలు తొమ్మిది టన్నులు తింటున్నారని ఆ దేశపు వైద్యాధికారులు
చెప్పిన లెక్కలవల్ల తేలింది. పెద్ద పెద్ద దేశాల్లో ఎన్ని వేలు , ఎన్ని లక్షల టన్నులు ఈ మందుబిళ్ళలు తింటున్నారో చెప్పలేము. పొగాకులో ఉన్న
నికోటిన్ (nicotene) అనే విష౦ సారాయిలో ఉన్న విషం కన్నా ఘాటై౦ది. దాని వల్ల గుండె దెబ్బ తింటుంది.
గట్టిగా ఉండవలసిన గుండెకాయ మెత్తబడి క్రిందకు జారుతుంది. నికోటిన్ వల్ల గుండె ఆగి
ఎంతో మంది యాభై ఏళ్ళకే (50 yrs) చనిపోవడం మనం
చూస్తున్నా౦. పచ్చి ఆహారం తినేవారికి పొగాకు మీద క్రమంగా అసహ్యం కలుగుతుంది.
రసాయనిక ఎరువులు మితిమీరిగా వాడి భూమిని కూడా చెడగొడుతున్నా౦. రసాయనిక ఎరువుల
వాడుక వల్ల భూమి గుల్ల పడి అది కూడా (భూమి) మానవుల వలె రోగిష్టిలాగా
తయారయ్యే ప్రమాదం ఉ౦ది. అటువంటి భూమిలో పండే పంటలు కూడా రోగిష్టివే అయి మానవుల
ఆహారానికి వినియోగించడానికి వీలు లేకుండా ఉండే ప్రమాదం ఏర్పడవచ్చును.
పచ్చి ఆహారానికి
నేను “అమృతాహారం” వండిన ఆహారానికి “మృతాహార౦” అని నామకరణ చేశాను. శరీరానికి విరుద్ధమైన ఆహారాలు వినియోగించినందు వల్ల అవి
పెద్ద పేగులో చాలా కాలం నిలిచిపోయి మురిగి పోతాయి. కనుక అటువంటివి తినకుండా మనం
జాగ్రత్త పడాలి. అస్వాభావిక౦గా వండిన ఆహార౦ కన్నా స్వాభావికమైన ఆహారమే
శ్రేష్టమైనది. అంతే కాదు, అది అమృతాహార౦. అతి తేలికగా జీర్ణమవుతుంది.
ప్రసవించిన తల్లిపాలు శిశువుకి ఎలా సాయపడతాయో అదేవిధంగా జీర్ణక్రియకు
అమృతాహారం కూడా సాయ పడుతుంది. పచ్చి కూరలు జీర్ణకోశ౦లో కాని పేగుల్లో కాని ఒక
గంటలో జీర్ణమౌతాయి. అవే వండిన కూరలయితే జీర్ణమవడానికి ౩ గంటలు పడతాయి. మలము పాడు వాసన కూడా. దానివల్ల ఏర్పడే రక్తము అపరిశుభ్రంగానూ, విషయుక్తంగానూ ఉంటుంది. అవయవాలని చెడగొడుతుంది. పచ్చి ఆహారం అంటే అమృతాహారము.
అది కూరల రూపంలో ఉన్న సూర్యరశ్మి అన్నమాట. అది విషాన్ని కరిగించి శరీరంనుండి బయటకి
నెట్టివేస్తుంది. పచ్చి ఆహారం జీర్ణ౦ కావడం చాలా తేలిక. దానిలో ఉండే జీవపదార్థాలు, విటమిన్లు సహజ స్థితిలో సరైన పాళ్ళలో ఉండడంవల్ల శరీరంలోని అవయవాలని చెడగొట్టక
పోగా బలపరుస్తాయి. ఇప్పటి మానవులకు కలుగుతున్న పలువిధములైన శరీరపు మనోజాడ్యాలకి
ప్రబల కారణ౦ ప్రస్తుతం మనం తింటున్న ఆహారమేనని కొంచెం ఆలోచించగల వారు సులభంగా
గ్రహించగలరు. ఇప్పుడు, ఇకముందు కూడా మనం ఆరోగ్యంగా జీవించాలని అనుకుంటే
ఇప్పటికంటే ఆరోగ్యప్రదమైన ఆహార౦ తినాలి. ఆరోగ్యప్రదమైన అలవాట్లు అలవరచుకోవాలి.
ప్రాణానికి, ఆరోగ్యానికి సంబంధించినంతవరకు రాజీకి అవకాశం
లేదు. సూటి అయిన ద్రోవలోనే నడవాలి. నూరు పాళ్ళు పచ్చి ఆహారమే తినాలి. రకరకాల
రోగాలలో అది మనకెలా సహాయకారిగా ఉంటుందో ఆలోచిద్దాం.
పచ్చి ఆహారం చేసే
మేలు కొంత వరకు వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య౦, వయస్సు, లోగడ తింటూ వచ్చిన అక్రమ ఆహార౦ మీదా, దురలవాట్లు శరీరాన్ని ఎంతవరకు శిథిల పరచాయో,వాటి మీద ఆధారపడి ఉంటుంది. లోగడ ఎన్ని
దోషాలు చేసినా శరీరం పని పాటలు చేయకలిగే స్థితిలో ఉంటే చక్కగా మనం తినే
పచ్చిఆహారాన్ని కొంత వరకు జీర్ణించుకుని, వంట పట్టించు కోగల శక్తి కనుక ఉంటే, ఏ జన్మలోనో మనం సంపాదించుకున్న రోగాలని , వంశానుగత౦ గా సంక్రమించిన రోగాలను అన్నింటినీ కూడా పచ్చి ఆహారం నయం చేయకలదు.
పక్వాహారముల వల్ల గర్భములో ఉన్న శిశువునకు కూడా అపకారం కలిగే ప్రమాద౦ ఉంది. తిండి
గింజలలో ఉన్న జీవపదార్థ౦ నాశనమగుట వల్ల పలువిధములైన వ్యాధులు శరీర౦లో
అంకురి౦చడానికి వీలు కలదు. అక్రమ ఆహారం తిన్న తల్లి రక్త౦ అపరిశుద్ధమైనందువల్ల
తల్లి నుండి ఆహారం గ్రహించే గర్భ౦లో ఉన్న శిశువును కూడా పలువిధములా
నష్టపరచవచ్చును. శిశువు రోగిష్టిగా పుట్టవచ్చును. పుట్టిన తర్వాత అపరిశుద్ధమైన ఆ తల్లి పాలు త్రాగి
క్రమ౦గా క్షీణించవచ్చును. ఇప్పుడు ప్రపంచ౦లో అన్నిచోట్లా శిశువులు కొందరు
స్వల్ప దుర్బలులుగానూ, కొందరు అధిక
దుర్బలులుగానూ ఉన్నారు. దీని ఫలితం ఎలా పరిణమిస్తుందో ఎవరూ ఊహించలేకుండా ఉన్నారు.
కాబట్టి మానవకోటి పచ్చి ఆహారం ఎంత త్వరగా తినడం ప్రారంభిస్తే అంత త్వరగా మేలు
పొందగలరు. ప్రకృతి పిల్లలకి సహాయకారిగా ఉంటుంది. పచ్చి ఆహారం మొదలుపెట్టగానే
తల్లికి పుష్కలంగా పాలు పడతాయి. బిడ్డకి అనేక విధాలుగా హాయిగా ఉంటుంది.
పాలకి తోడూ బిడ్డలకు నూరిన పళ్ళు, కూరలు పిల్లలకి
పెట్టవచ్చును. కాని పళ్ళూ, కూరలూ ఎప్పుడూ ఒకే సమయంలో పెట్టకూడదు. వేరు వేరు
సమయాల్లో పెట్టాలి. పరిశుభ్రమైన తల్లి పాలు, పండ్లు, కూరలు తింటున్న బిడ్డలలో మనం నమ్మలేనంత మంచి మార్పు మనకి
అతిశ్రీఘ్రంగా కనపడుతుంది. కొన్నినెలలవరకు పూర్తిగా పచ్చి ఆహారం తిన్నబిడ్డలున్న
కొన్ని కుటుంబాలని నేను ఎరుగుదును.
వారి మగ పిల్లలు, ఆడపిల్లలు అందరూ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా,చురుకుగా, ముచ్చటగా కేరింతలు పెడుతూ, ఆడుతూ పాడుతూ ఉండడం నేను చూశాను.
చిన్న పిల్లలు చెడకుండా ఉంటారు కనుక ప్రకృతి వెంటనే వారికి తోడ్పడుతుంది. అందువల్ల
సమగ్రమైన పచ్చి ఆహారం వారికి తక్షణ౦ మేలు చేస్తుంది. యువకులకు, మధ్య వయస్కులకు
కూడా పచ్చి ఆహారం మేలు చేస్తుంది అని అనడంలో సందేహ౦ లేదు. కాని పిల్లల్లో
కనిపించినంత త్వరగా ఆ మేలు పెద్దవాళ్ళలో కనిపించదు. పచ్చి ఆహారం వల్ల పెద్దవాళ్ళలో
వారి మనోవృత్తులు కూడా పూర్తిగా మారిపోతాయి. వారికి నిగ్రహ౦, శాంతి, సౌహార్ద౦, దయ-దాక్షిణ్య౦ మొదలైన సద్గుణ సంపత్తులు
ఏర్పడతాయి. ఇక ముసలివాళ్ళ సంగతి ఏమిటంటారా కొంచెము జబ్బుతో ఉన్న ముసలివాళ్ళు, గొప్ప జబ్బుతో ఉన్న ముసలి వాళ్ళు
పచ్చి ఆహారం తింటే ఏమైనా లాభం కలుగుతుందా లేదా ? ముసలివాళ్ళకి కూడా లాభం కలుగుతుంది. కాని వారు కొంచెం ఓపిక, శ్రద్ధ చూపాలి. ఈ ఆహారం ప్రారంభించిన ప్రథమ దశలో వారు బాగా విశ్రాంతి
తీసుకోవాలి. కొత్త ఆహారానికి , కొత్త అలవాట్లకు, కొత్త జీవితానికి అలవాటు పడే౦తవరకు మొదట కొంచెం
కష్టంగా ఉన్నా కొద్ది రోజులకి వారికి హాయి చిక్కుతుంది. రోజుకి రెండు మూడు
సార్లు చక్కగా విరోచనమవుతుంది. దానివల్ల చాలా మందికి ఎనలేని ఉత్సాహం కలుగుతుంది.
మా శానిటోరియం లో
రోగికి ఉపయోగించే పదార్థాలలో వెల్లుల్లి (garlic) గొప్ప స్థానమును ఆక్రమిస్తుంది. ఫలాహార౦తో పాటు ఒక చిన్న ఎల్లి రెప్ప(one clove of garlic)తినడ౦ చాలా ఉపయోజనకర౦గా ఉ౦టు౦ది. ఒక్క రెప్ప కన్నా
ఫలాహారాముతో పాటు ఐదు నుంచి పది రెప్పలు తినడం మంచిదని నా అభిప్రాయ౦. వెల్లుల్లి క్రిమిసంహారి అని పరిశోధన చేసి అనేకులు గ్రంథాలు వ్రాశారు. ఈ నిజాన్ని మన పూర్వీకులు
ఎప్పుడో తెలుసుకున్నారు. వెల్లుల్లిలో ఎలిసిన్ (Allicin) అనే పదార్థము౦దని అది క్రిముల్ని సంహరించడంలో శ్రేష్టమైనదని 1944 వ
సంవత్సర౦లో అమెరికన్ కెమికల్ సొసైటీ (American Chemical Society) వారి పత్రికలో ఒక వ్యాసంలో ప్రచురించబడింది. ఈ యదార్థాన్ని అనేక ప్రయోగాల్లో
పెన్సిలిన్ తో పోల్చి చూశారు. అన్ని రకాల క్రిములమీద పెన్సిలిన్ వలెనే పని చేస్తుందని తేలింది. పెన్సిలిన్
కన్నా ఘాటుగాను, మితంగాను పని చేస్తుందని అన్నారు. వెల్లుల్లిలోని
వాసన దానిని ధారాళంగా వాడడానికి ప్రతిబంధకంగా ఉ౦ది. పచ్చి కూరల ఆహారం, అందులోను బంగాళ దుంపల ఆహారం దీర్ఘ కీళ్ళ వాతం, కీళ్ళ నొప్పులకి ప్రారంభ దశలో అద్భుతంగా పని
చేస్తుంది. ఇది కాకుండా మూత్రికామ్ల౦ వల్ల ఏర్పడే ఇతర వ్యాధులకి కూడా ఈ పచ్చికూరల
ఆహారం బాగా పని చేస్తుంది. చర్మ వ్యాధులు, మూత్రకోశ౦లో ఉండే రాళ్ళు
(kidneystones), వెంట్రుకలు రాలి పోవడ౦, ఇలా అన్ని రకాల అంటు వ్యాధులు పచ్చి ఆహారం వల్ల
నయమైపోతాయి. వెల్లుల్లి పెద్ద పేగుల్లో ఉన్న మలాన్ని, కుళ్ళనివ్వదు. బుగ్గలో రెండువైపులా ఒక్కొక్క వెల్లుల్లి పరక పెట్టుకుంటే
ఊపిరితిత్తుల పైన ఉన్న భాగాల్లో ఉన్న రోగాలను వెళ్ళగొట్టి రోగాన్ని త్వరగా నయం
చేస్తుంది. మామూలు జలుబుల్లో వెంటనే ఉపయోగిస్తే అమోఘంగా పని చేస్తుంది.
ఆహారనాళం(alimentary canal), ముక్కు, గొంతు, చెవి, windpipe, స్వరపేటికల్లో ఉన్న వాపు , చాలా కాలంగా ఉన్న టాన్సిల్స్, చిగుళ్ళు , చెవిలో ఉన్న వాపులు తొందరగా నయమైపోతాయి.
జీర్ణాశయంలోని
పుండ్లు, వాపులు, పెద్ద, చిన్న పేగుల్లోని వాపులు, రక్త మలాలు వెల్లుల్లి ద్వారా నయమైపోతాయి. గర్భవతులు పచ్చి ఆహారం తింటూ ఉంటే చాలా
కులాసాగా ఉంటారు. సులభంగాను, సుఖంగాను, తొందరగాను నొప్పి లేకుండా ప్రసవిస్తారు. సన్నగా, బలంగా ఉన్న శిశువు తల్లికి సాయపడుతుంది. ప్రసవానంతరము ఒక సంవత్సర౦ పాటు తల్లి
పచ్చి ఆహారం తింటే బిడ్డకు ఆరోగ్యకరమైన, పుష్టికరమైన పాలు పుష్కరంగా లభ్యమవుతాయి. పూర్తిగా పచ్చి ఆహారం తినేవారికి
పొగాకు త్రాగడము,మత్తు పదార్థములు త్రాగడము అసహ్యంగా ఉంటాయి. ఈ
దురాభ్యాసాలను తేలికగా మానవచ్చును. పచ్చి ఆహారం తినువారికి సారాయి రుచిగా ఉండదు.
పొగ త్రాగుడుకి వెల్లుల్లికి సరిపడదు. పచ్చి ఆహారం తినేవారికి ఉద్రేక౦ కలిగించే
పదార్థాల అవసరం ఉండదు.
కాన్సర్
ఏర్పడ్డది అంటే శరీర౦ పూర్తిగా శిథిలమయింది అని అర్థం. అది చివరి దశ. ఈ స్థితిలో
సారుధ్యమైన పచ్చి కూరల ఆహార౦ బాధను తగ్గించి ప్రాణాన్ని కొంత కాలం వరకు
నిలబెట్టడానికి తోడ్పడుతుంది. కాన్సర్ ఏర్పడ్డవెంటనే చికిత్స ప్రారంభిస్తే చాలా
కాలం వరకు జాడ్య౦ కనపడకుండా చేయ కలదు. దీనికి తార్కాణము నేనే. కాని లివర్,
గర్భకోశము మొదలైన ప్రధాన అంగాలలో కాన్సర్ ఏర్పడ రాదు. కాన్సర్ ఏర్పడ్డట్టు
కనుక్కున్న వెంటనే నూటికి నూరు పాళ్ళు పచ్చి కూరల ఆహారం ప్రారంభించడం అతి ముఖ్యం.
ఇక నా రోగాన్ని
గురించి కొద్దిగా చెప్పుతాను. 1942 నుండి 46 వరకూ సమగ్రమైనగా పచ్చి ఆహారం తిని చాలా
ఆరోగ్యంగా ఉన్నాను. 46 వసంత కాలంలో స్వీడన్ దేశం నుంచి కిస్మిస్, ఖర్జూరము, అలసి,అక్రూరమం మొదలైన ఎండు పండ్లు తెప్పించినాను. అవి నాకు
ఉపకారానికి బదులు అపకార౦ చేశాయి. వాటిని నిలవ చేయడానికి విషద్రావకాలు వాడడంవల్ల, మూడు నాలుగు మాసాలు ఉపయోగించినప్పటికీ ఒకనాడు హఠాత్తుగా
విపరీతముగా భరించనలవిరాని బాధ ప్రారంభమై, నయమై మచ్చ పడ్డ చోట మళ్ళీ చిన్న
గడ్డ కనిపించింది. తక్షణమే పచ్చి ఆహారం తీసుకోవడం ప్రారంభించాను. తక్షణమే
గడ్డ మాయమై పోయింది. నా స్నేహితుడైన డాక్టర్ హింద్ హెడి(Dr. Hindhede)
చెప్పిన సలహాకు విపరీత౦గా ట్రయల్ చికిత్స చేయించుకోమని అసలు నాకు వచ్చిన జబ్బు
కాన్సర్ కాదని కొందరు స్నేహితులు నన్ను ప్రోత్సహించడంతో నేను ఆ ట్రయల్ చికిత్స
చేయించుకున్నాను. నయమైన కాన్సర్ మళ్ళీ తిరగబెట్టింది. చంకలో తిరిగి రెండు
చిన్నగడ్డలు ఏర్పడ్డాయి. పచ్చి ఆహారం ప్రారంభించిన ఆరునెలలకి అవి అణగి పోయి సుఖ౦గా
ఉన్నాను. నా శక్తికి మించిన పనులు కూడా నేను చక్కగా నిర్వహించగలిగాను. 1949 లో
మామూలు వైద్య వృత్తి మాని హ్యూమ్లె గార్డెన్(Humle gardens), గార్డెన్ ప్రక్క స్వంతంగా కొనుక్కున్నఒకటి రెండు ఎకరాల పొలంలో రాత్రింబవళ్ళు
పని చేసి నాకు కావలసిన పళ్ళూ, కూరలు
పండించుకున్నాను. రసాయనిక ఎరువులు వాడడం మాని చెత్తా-చెదారము, కంపోస్ట్ ఎరువులు మాత్రమే వాడుతున్నాను. “అమృతాహార౦” అని డచ్చి భాషలో ఒక గ్రంధము వ్రాశాను. అది ఇంకా
ఇంగ్లీష్ భాషలోకి అనువాదం కాలేదు.
ఆ గ్రంధంలో
పచ్చికూరలు ఉపయోగించుకునే పధ్ధతి, వాటిని తయారు
చేసే పధ్ధతి, ఇంకా ఇతర విషయాలు వివరంగా వ్రాశాను. ఆ దేశపు
డాక్టర్లు, ఇక్కడి డాక్టర్లు మా హ్యూమ్లే గార్డెన్(Humle
gardens) కి వచ్చి అక్కడ జరుగుతున్న చికిత్సా విధానాలు నేర్చుకుని అవి వారి
దేశాలలో అవలంబించుచున్నారు. డాక్టర్లు పచ్చి ఆహారం గురించి ఇక్కడికంటే ఇంకా ఎక్కువ
విషయాలు తెలుసుకుని, ఆచరణలో పెట్టి లోకానికి ఎంతో మేలు చేసినవారౌతున్నారు.
ఇప్పుడు మా శానిటోరియంలో సంవత్సరానికి వేయిమంది రోగులు చికిత్స పొందుతున్నారు.
ఇక్కడ రోగులు, డాక్టర్లు, నౌకర్లు అందరూ పచ్చి ఆహారం మాత్రమే తింటారు. వండిన ఆహారం తినేవారు వెంటనే
సరాసరి పచ్చి ఆహారం తినవచ్చును. ఏమీ బాధ లేదు. శరీర బాధలు ఋతువులను బట్టి , కాలమును బట్టి మారుతూ ఉంటాయి. ఈ భోజన౦ రోజూ మూడుసార్లు చేయాలి. ఉదయ౦ ఫలాహార౦,మధ్యాహ్న౦, రాత్రి పూర్తిగా శాఖాహార౦. పళ్ళు కూరలు కలిపి ఎప్పుడూ తినకూడదు. దంత పటుత్వం ఉన్నవాళ్ళు పచ్చి కూరలు
చెక్కు తీయకుండా కొరికి, నమిలి తినాలి. దంత పటుత్వం లేని వాళ్ళు చక్కగా తురిమి
తయారు చేసిన వెంటనే తినాలి. తయారు చేసి నిలువ ఉంచ రాదు. నిలవ ఉంచితే వాటి గుణం
చెడుతుంది. పచ్చి ఆహారం నీళ్ళు నీళ్ళు అయ్యే లోపున నమిలి మ్రింగాలి. తురిమిన పదార్థ౦ కూడా చక్కగా లాలాజల౦తో కలవాలి. మొలకలెత్తిన జొన్న, సజ్జ, మొక్కజొన్న వగైరా ధాన్యాలన్నీ పండ్లతో కలిపి
తినవచ్చును. మేమంతా మా శానిటోరియం లో అప్పుడప్పుడు గుమ్మ పాలు మూడుపూట్లా
త్రాగుతా౦. వెల్లుల్లి ఔషధం లాగా వాడతాం కనక ఉల్లిపాయ ముక్కలు బాగా తింటా౦. బాదా౦, అక్ర్రూర్ , వేరుసెనగ మొదలైన పప్పులు వాడుతా౦. పచ్చి కూరల ఆహారంలో
కాయలు, ఆకుకూరలు, బంగాళాదుంపలు, బీట్రూటు,కారట్టు మొదలైన నిలవగడ్డలూ వాడవచ్చును. ఇవన్నీ చక్కగా తురిమి వాటిలో
తేనే కలుపుకొని తినాలి. జీర్ణ కోశ౦లో పుండు ఉన్నవారు ప్రారంభ దశలోనే ఈ
పథ్యాన్ని మొదలు పెట్టాలి. పచ్చి ఆహారాలు తింటూ, దురలవాట్లు లేకుండా ఉంటే లోపాలు, రోగాలేమీ ఉండవు. అసహ్యకరమైన బరువు ప్రమాదకర౦. అది కూడా ఈ పచ్చి ఆహారం వల్ల
పోతు౦ది. ఈ పథ్యాన్ని అవలంభించినందువల్ల గృహిణులకు సగం పని తగ్గి ఎక్కువ విశ్రాంతి
చిక్కుతుంది. భర్తకి, పిల్లలకి సేవ చేయడానికి అవకాశ౦ హెచ్చి ఆనందం కలుగుతుంది. ఈ ఆహార౦ వల్ల పలుచని నాజూకైన శరీర౦, వంగని నడుము, వయ్యారమైన నడక, తుమ్మెద రెక్కలవలె నల్లని కేశాలు, తళతళలాడే శరీర౦ ఏర్పడి జీవితం సుఖ-సౌఖ్యాలతో పొంగిపోతుంది. శరీర౦ ఆరోగ్యంగా
ఉంటే మనస్సు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. దురాలోచనలు, సదాలోచనలుగా మారుతాయి. ప్రపంచం ఎదురు చూస్తున్న దివ్య సంస్కృతి వృద్ధి
చెందుతుంది. మానవ జీవిత౦, అర్థవంతంగా మారి ఈ భూలోక౦ స్వర్గధామ౦గా మారుతుంది. ఇదే కాన్సర్ వ్యాధికి ఉత్తమమైన మార్గ౦.