Part 11 - విద్యారణ్య స్వాములవారు
మనలో చాలామందికి విద్యారణ్యస్వాములవారు
పరిచయమే అనుకుంటాను. ఈ మహానుభావులే శ్రీ నృసింహ సరస్వతిగారికి కాశీలో గురువుగా ఉండి
ఆయనకి మార్గదర్శకత్వం చేసారు. వీరే హిందూ సామ్రాజ్య మరియు హిందూ మత పతనాన్ని నిరోధించి
లక్ష్మికటాక్షాన్ని పొంది, హరిహర బుక్కా రాయులుచే విజయనగర మహా సామ్రాజ్యానికి బీజం
వేసారు. వీరు శ్రీ విద్య మరియు గాయత్రి ఉపాసకులు.
మహర్షులు, సిద్హులు,
యోగులు మరియు గొప్ప మతాధిపతులు వీరందరూ కూడా దేశభక్తిలో అందరి కన్నాకూడా ముందే ఉంటారు.
సామాన్య ప్రజానీకంలో మరియు కుటిల రాజకీయ నాయకుల దృష్టిలో పైవర్గం వారందరూ కూడా ముక్కుమూసుకుని
అడవులలో సమాజానికి దూరంగా ఉంటూ ఏవో సాధన చేసుకుంటూ ఉంటారు అనే భావన ఉంది. కాని నిజానికి
అది పూర్తిగా అబద్ధం అని చెప్పుకోవాలి. పైన చెప్పిన మహానువభావులందరూ కూడా నిస్వార్ధంగా
దేశం కొరకు, సమాజం కొరకు సమస్త విశ్వమానవాళి యొక్క శ్రేయస్సు కొరకు అహర్నిశలు ఎన్నో రకాలుగా సాధనలు చేస్తూ తద్వారా
సంప్రాప్తించిన సమస్త పుణ్యాన్ని సమాజానికి ధారపోస్తూ ఉంటారు.
వారిని మించిన దేశభక్తులు
ఎవరు లేరు, అందుకే రాజకీయ నాయకులకే కాకుండా సామాన్య ప్రజానికానికి కూడా ఈ మహానుభావులదరు
కూడా ఎందుకు రాజకీయ విషయాలలో జోక్యం చేసుకుంటారు అనే భావన ఉన్నది. తెలుగు భాష క్షుణ్ణంగా
వచ్చినవారికి మరియు మన భారత దేశ ఉన్నతమయిన సంస్కృతి సాంప్రదాయాలు, నాగరికత, ఆధ్యాత్మికత,
మన దేశ చరిత్రలో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే మనకి ఉన్న ప్రామాణిక గ్రంధాల ద్వార ఈ విషయం అర్థం అవుతుంది.
విద్యారణ్య స్వాములవారి
పూర్వనామం మాధవాచార్యులు. మంచి సంపన్న వర్గంలో పుట్టినవారు. వీరు రాఘవేంద్ర స్వామి
మఠానికి మతాధి కారిగా ఉన్నపుడు గాయత్రి ఉపాసన
నియమ నిష్టలతో చాలా కతోరమైన సాధన చేసారు. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి, అక్షరానికి
లక్ష చప్పున 24 లక్షలసార్లు జపం చేసినప్పుడు ఈ మంత్రం సిద్ధిస్తుంది, దీనినే మహా పునశ్చరణ
అంటారు.
మంత్రం సిద్ధించినపుడు, ఉపాసన ఫలించినపుడు ఆ గాయత్రి దేవి సాక్షాత్కారం జరుగుతుంది.
మాధవాచార్యులు ఇటువంటి మహా పునశ్చరణ చే శాక ఎంతో ఆర్తిగా మాత దర్శనం కోసం తపించినా
కూడా ఆయనకి నిరాశే మిగిలింది. అప్పటి చారిత్రాత్మక పరిస్థితులు భారత దేశపు ఉనికికే
ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉన్నాయి. హిందూ మతంలో
ఇటువంటి భిన్నమయిన సంప్రదాయాలు, అనైక్యత, రాజుల మధ్య అంత:కలహాలు, ఇదే అదనుగా తురుష్కులు
భారత దేశం మీద దండయాత్ర చేయడం భారతదేశాన్ని
కొల్లగొట్టడం, హిందువుల ధన, మాన ప్రాణాలను హరించడం, కొన్ని లక్షల మందిని బలవంతంగా భయపెట్టి
మతంలోకి మార్చడం, ఇవన్ని కూడా విద్యారణ్య స్వాములవారిని
కలవపరిచాయి. ఎలాగయినా భారతదేశం ఉనికిని, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన ప్రత్యేకంగా
శ్రీవిద్య గాయత్రి ఉపాసనలు ప్రారంభించారు.
వీటన్నిటికి కూడా ఎంతో ధనం అవసరం కాబట్టి
ఆయన ప్రత్యేకంగా లక్ష్మి సాధన ఎంతో కాలం చేయగా చివరకి లక్ష్మి దేవి ప్రత్యక్షం అయ్యింది.
అప్పుడు స్వామి తన కోరికను వివరించగా లక్ష్మి దేవి ఈ జన్మలో అది నీకు సాధ్యం కాదు,
వచ్చే జన్మలో అది అనుగ్రహిస్తాను అని చెప్పింది. దానికి ఆయన వెంటనే తన పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని
త్యజించి "తల్లి, ఇప్పుడు నేను సన్యసిస్తున్నాను, కాబట్టి నాకిది మరొక జన్మ, నన్ను
అనుగ్రహించు" అని ప్రార్ధించారు. ఆవిడ ఎంతో ప్రసన్నురాలై ఆయనకి ఆ శక్తిని ప్రసాదించింది.
ఆ శక్తి ప్రభావం వాళ్ళ విద్యారణ్య స్వాములవారికి భూగర్భంలో ఉన్న గుప్త నిధి నిక్షేపాలు,
ఖరీదైన రకరకాల నవరత్నాలు కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ఆయన స్వాధీనంలోకి వచ్చేవి.
వాటినే ఆయన హరిహర రాయులు, బుక్క రాయులనే ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చి వారి చేత విజయనగర
సామ్రాజ్య స్థాపనకి నాంది పలికారు.
ఈ కారణాల వల్లనే ఆయన
గాయత్రి సాధన ఫలించక పోవటం వాళ్ళ చాలా నిరాశ పడ్డారు. చుట్టూ ఉన్న భయంకరమైన దుష్ట రాక్షస,
మాయ మరియు అసురి శక్తులను నాశనం చేయడానికి కావలసినంత శక్తిని ఈ సాధన ద్వారా ఆయన సంపాదించటానికి
చివరకి గృహస్థాశ్రమం కూడా త్యజించి సన్యాసం పుచ్చుకున్నారు. ఎంతో బాధతో ఆయన కొంత కాలం కాశీలో గడపడానికి నిశ్చయించి
కాశీలో నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడే ఆయనకి
ఒక తాంత్రికుడు తారసిల్లాడు, ఆ తాంత్రికుడు "వామాచారం"లో భైరవ సాధనలో భైరవుడి
కటాక్షం పొందాడు. ఆయన మాధవచారిని చూసి మహానుభావా మిమ్మల్ని చూడగానే మీరు చాలా గొప్పవారని,
మహా తపస్సంపన్నులు అని, మహా యోగులని తెలుస్తున్నది. కాని ఎందుచేతనో
మీరు చాలా విచారవదనంతో కనిపిస్తున్నారు, అది నా అంతర్దృష్టికి గోచరం అవుతున్నది. స్వామి మీరు ఎందుకంత విచారంగా
ఉన్నారు, దయ చేసి నాకు చెప్పండి నాకు తోచిన సహాయం తప్పకుండా చేస్తాను" అని అన్నారు.
అప్పుడు మాధవాచార్యులు ఈ విధంగా చెప్పారు, "అయ్యా మహానుభావా మీరు కూడా మంచి తాంత్రిక
విద్యలో ప్రవీణులని తెలుస్తూనే ఉనాది. మీరనుకున్నట్లుగానే నాకు ఒక మానసిక వ్యధ ఉన్నది.
దానికి కారణం నాకు తెలియట్లేదు.
నేను ఎంతో నియమ నిష్టలతో గాయత్రి ఉపాసన చేసాను. కఠోర
మయిన నియమాలతో గాయత్రి మంత్రాన్ని ఒక మహా పునశ్చరణ పూర్తి చేసాను కాని ఎందువల్లో కాని
నాకు ఆ తల్లి ప్రసన్నురాలు అవలేదు (ప్రత్యక్షము కాలేదు). కొంత కాలం కాశీవాసం చెయ్యాలని
ఇక్కడకి వచ్చాను" అని పలికారు. అప్పుడు ఆ తాంత్రికుడు "మహానుభావా నేను మీకు
భైరవ ఉపాసన పద్ధతి చెప్తాను, ఆ సాధన వల్ల భైరవుని ప్రత్యక్షం చేసుకుని మీ సమస్యకి పరిష్కారం
అడగండి. తప్పకుండ మీకు పరిష్కారం దొరుకుతుంది. వామాచార సాధనాలు చాల తొందరగా ఫలిస్తాయి,
అదే దక్షిణాచార (సాత్విక పూజలు) పద్ధతిలో చాల కాలం పడుతుంది" అని చెప్పారు. మాధవాచార్యులు
తాంత్రికుడు చెప్పిన విధంగా అర్థరాత్రి శ్మశానంలో ఒంటరిగా భైరవ ఉపాసన మొదలుపెట్టారు.
ఇలా ఆరు నెలలు గడవగా ఒక అర్థరాత్రి సమయంలో "నాయనా మాధవాచార్య , ఎందుకు నా గురించి
సాధన చేస్తున్నావు, నీ సాధన ఫలించింది నేను ఎంతో ప్రసన్నుడను అయ్యాను, నీకేమి కావాలో
చెప్పు" అని ఒక గంభీర స్వరం వినిపించింది. మాధవాచార్యులు కళ్ళు తెరిచి చూడగా అక్కడ
ఆయనకి ఎవరు కనపడలేదు.
అప్పుడు వారు "భైరవా నీవెందుకు నా వెనుక నుండి మాట్లాడుతున్నావు,
ముఖాముఖీ రావచ్చును కదా" అని అడిగారు. దానికి భైరవుడు "స్వామీ, మీరెంతో తపస్సంపన్నులు,
శ్రీ విద్య, గాయత్రి ఉపాసకులు. అటువంటి మీ శక్తీ ముందు అల్పశక్తుడను అయిన నేను మీ ముందుకు రాలేను, మీ శక్తిని నేను తట్టుకోలేను"
అని వివరించారు. "మీ కోరిక ఏమిటో చెప్పండి, నాకు సాధ్యం అయితే చేసిపెడతాను కాని
నా కన్నా కూడా మీరు చాలా శక్తివంతులు".
దానికి మాధవాచార్యులు చాలా ఆశ్చర్యపోయారు. "భైరవ మీ అనుగ్రహాన్ని పొందినందుకు
చాలా సంతోషం. మీరు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను మీరు అన్నట్లుగానే ఒక
మహా పురశ్చరణ చేసాను కాని ఎందుకో ఆ తల్లి నాకు ప్రత్యక్షం కాలేదు. దానికి కారణం నాకు
తెలియట్లేదు, దయచేసి దానికి మీరు సమాధానం చెప్పగలిగితే అదే మీరిచ్చే వరంగా భావిస్తాను"
అని అన్నారు. అందుకు భైరవుడు "ప్రతి మనిషి కూడా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటారు,
వాటిలో కొన్నిసార్లు దుష్కర్మలు చేస్తుంటారు, మహా పర్వతాల పంక్తితో సమానంగా ప్రారబ్ధ
కర్మలు పోగు చేసుకుంటారు. అవి మహా పర్వత శ్రేణిలాగ
వ్యాపించి ఉంటాయి. ఏ సాధన, వ్రతాలు, నోములు చేసినా ప్రారబ్ధ కర్మ పూర్తిగా దగ్ధం కానంత
వరకు మీకు ఫలితం దక్కదు. అందుకు దేవుడిని నిందించి లాభం లేదు, మా నవులు మరల కొత్త దుష్కర్మలు
మాత్రం చెయ్యకూడదు. ఇంకొక పక్క మంచిపనుల వల్ల, దానాల వల్ల ప్రారబ్ధ కర్మలు తగ్గించుకుంటూ
ఉండాలి.
ఇదిగో అటుగా చూడు నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను" అని భైరవుడు చెప్పగా
అటు చూడగా మాధవాచార్యులకి ఎదురుగుండా భగభగా
మండుతున్నటువంటి పర్వతశ్రేణుల వలె ఉన్న ఆయన ప్రారబ్ధ కర్మ కనపడటం, అది మొత్తం భస్మం
అయిపోవటం కనిపించింది. అపుడు భైరవుడు, "స్వామీ చూసారా ఎంతటి వారికైనా ప్రారబ్ధ
కర్మ తప్పదు. ఇపుడు మీ ప్రారబ్ధ కర్మ పూర్తిగా ధ్వంసం అయిపొయింది. మీరిక నిశ్చింతగా
మీ సాధన ప్రారంబించండి, ఆ గాయత్రి మాత మిమ్మల్ని తప్పకుండ అనుగ్రహిస్తుంది, వెళ్లి
రండి" అని చెప్పారు.
మాధవాచార్యులు మరల
మంత్రాలయం వెళ్లి తన దీక్షను పున: ప్రారంబించగా గాయత్రి మాత ప్రసన్నురాలై, ఆయనకి ప్రత్యక్షమయ్యి
ఆయనను సంపూర్ణంగా ఆశీర్వదించింది. దీనివల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఆ దత్తకృపకి మనం
పాత్రులు అవ్వాలంటే శ్రద్ధ సహనంతో, నిదిధ్యాసతో అనగా ప్రతి వస్తువులో భగవంతుడిని దర్శించాలి.
ఆ బ్రహ్మతత్వం సర్వజగత్తులో వ్యాపించి ఉంది అని భావించి నిరంతర సాధన ద్వారా మన ప్రారబ్ధ
కర్మను దహించుకుంటూ కొత్త దుష్కర్మలను చెయ్యకుండా ప్రతి క్షణం ఆ దత్త తత్వానికి అనుసంధానంగా
మన చిత్తాన్ని లగ్నం చెయ్యాలి. అంతే కాని మనం ఎన్ని మంచి పనులు చేసిన కూడా స్వామివారి
అనుగ్రహం కలగట్లేదు అనే సంశయాన్ని, నిరాశని దగ్గరకి రానివ్వకూడదు.