Part - 2
నేను నా రోజు వారీ కార్యక్రమాలలో మునిగిపోయిన విశ్రాంతి దొరికిన సమయములో, శని ఆదివారాలలో అయస్కాంత ప్పురుషుని గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. అప్పుడప్పుడు ఏఖ ముఖి రుద్రాక్ష ఉందా లేదా అని చూస్తున్నాను. ఈ
లోపల 2012 యుగాంతం గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అది ఒక hot topic గా మారిపోయింది. నేను ప్రతి ఆదివారం ఒక బౌద్ధ ఆలయానికి వెళ్తున్దేవాడిని. విశాలమయిన ప్రాంగణం, పెద్ద పెద్ద రావి చెట్లు, పెద్ద ఉద్యానవనం, రకరకాల పుష్పాలు, ధ్యానం చేసుకోడానికి అనువయిన ప్రదేశాలు చాల ఉన్నాయి. ఒక ఆదివారం బుద్ధుడి విగ్రహం దగ్గర కూర్చుని ధ్యానం చేసుకుని కాసేపు బయటికి వచ్చాను. ఒక మూల నుండి ఒక అద్భుతమయిన పుష్ప పరిమళాలు నన్ను అప్రయత్నంగా అటు వైపు నడిపించాయి. గుబురుగా ఉన్న మహా వృక్షాల మధ్య పచ్చటి గడ్డి మీద దివ్యమయిన తేజస్సుతో చిరునవ్వుతో నన్ను రమ్మని పిలుస్తూ అయస్కాంత పురుషుడు కనిపించాడు.
నాకు ఒళ్లంతా ఆనందకరమైన స్పందనలు పెరిగాయి. ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించి నిలబడ్డాను. ఆయన కూర్చోమని సైగ చేసారు. నేల మీద కూర్చోగానే ఒక రకమయిన అలౌకిక ఆనందం నా శరీరమంతా వ్యాపించింది. భూమి అంతా చాలా మృదువుగా మెత్తగా హాయిగా అనిపించింది. అయస్కాంత పురుషుడి సన్నిధిలో నాకు చెప్పలేనంత ఆనందం శాంతి కలిగింది. నాలోని ఆలోచనలు పసిగట్టి "నాకు తెలుసు, గత 6 నెలలుగా నా గురించే ధ్యానిస్తున్నావు. నేను పంపినటువంటి గాఢమైన భావ తరంగాలు నన్ను చేరాయి అందుకే నిన్ను ఇటువైపు ఆకర్షించాను" అని అన్నారు. నేను వినయంగా "మహాత్మా మీరు నాలో ఒక విధమయిన ఆధ్యాత్మిక ఆసక్తిని కలిగించారు. దానితో పాటు ఎన్నో ప్రశ్నలు నాకు కలుగుతున్నాయి. 1962 తరువాత మీరు మళ్లీ భూమండలానికి ఎప్పుడు వచ్చారు" అని ఎంతో ఆత్రుతగా అడిగాను. అప్పుడు ఆయన నవ్వి, "మరల 1987వ
సంవత్సరంలో అంటే 25 సంవత్సరాల తరువాత భూ అయస్కాంత క్షేత్రం కొలవడానికి వచ్చాను.
అప్పుడు సిద్ధపురుషులు, మహర్షులు, యోగులు, గ్రహాంతర వాసులు అందరు కూడా ఆధ్యాత్మిక సమావేశానికి వచ్చారు. వారంతా నా వైపు దృష్టి సారించి ఉన్నారు. అపుడు నేను వారితో ఇలా అన్నాను. మీ అందరి యొక్క తపశ్శక్తి ధారల వాళ్ళ ఈ 25 సంవత్సరాలలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో మంచి మార్పు వచ్చింది. పాజిటివ్ ఎనర్జీ చాలా పెరిగింది. మీరు చేస్తున్న నిస్వార్థ సేవకి గ్రహాంతర వాసులు, నక్షత్రమండల వాసులు భూమి మీద కురిపించిన జాలి, కరుణ, ప్రేమ ఈ
మంచి పరిణామానికి దోహదం చేసాయి. రాను రాను భూమి మీద ప్రశాంతంగా ఆహ్లాదకరమైన శుభ పరిణామాలు
తప్పకుండా కలుగుతాయి.
ప్రతి 5000 సంవత్సరాలకి భూమి యొక్క విద్యుత్ అయస్కాంత క్షేత్రం మారుతుంది. సమస్త మానవుల మానసిక చైతన్యం భూమి యొక్క స్పందనల స్థాయిని పెంచుతాయి. మీరందరు అనుకున్నట్లు ఈ భూమి ఏమి 2012-13లొ అంతం కాదు. అంతం అయ్యేది పురాతనమైన శక్తి మాత్రమే. భూమి యొక్క axis 1987 నుంచి 25 సంవత్సరాల్లో మారుతుంది, దీని వల్ల భౌతికంగా చాలా దుష్పరిణామాలు జరుగుతాయి.
తుఫానులు, భూకంపాలు, అకాల వర్షాలు, మితిమీరిన
వేడి,
సౌరమండలాలో మార్పు, సముద్రాలలో మార్పు, ఆర్ధిక వ్యవస్థలో
విపరీత పరిణామాలు, నియంతల దుష్ట పరిపాలన మొదలైనవి జరుగుతాయి. ప్రజల యొక్క మానసిక చైతన్యంలో, ఆలోచన విధానంలో విపరీత ధోరణులు కనిపిస్తాయి. అల్లకల్లోల పరిస్థితులు, లంచగొండితనం, అరాచకం,మతకలహాలు, ద్వేషాలు, యుద్ధచాయలు, అంత గందరగోళ పరిస్థితి కనపడుతుంది.మరి ఒకవైపు మంచి వారి యొక్క మానసిక చైతన్యం, దైవ చైతన్యంలో కలిసి దుష్ట శక్తుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి, మంచి మార్పు తెచ్చే పరిణామాలకి నాంది పలుకుతాయి. దుష్ట శక్తుల యొక్క అంతం అనేది మీరు అనుకుంటున్న డిసెంబరు 2012 లో జరుగుతుంది అంతే కాని భూమి యొక్క నాశనం కాదు. మంచి జరగడానికి, మంచి మార్పులు రావడానికి
అది ప్రారంభం. దీనంతటికి కారణం ఆత్మ జ్ఞానం పొందిన మీలాంటి మహానుభావులు, ఇంకా కనిపించని అజ్ఞాతంగా ఉన్నటువంటి మానవుల శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్ళ వల్ల ఇదంతా జరుగుతోంది.
ఇది మానవుల నిర్ణయమే కాని దైవ నిర్ణయం కాదు. ఎందుకంటే అన్ని లోకాల కన్నా భూమండలంలోని ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు ఎంచుకోవటానికి అవకాశం ఉంది. కేవలం ప్రారబ్ధ కర్మలు మాత్రం మీరు అనుభవించక తప్పదు.
ఈ భూమండలం భవిష్యత్తు నిర్ణయించేది మానవులు మాత్రమే. అపుడు అందరు సిద్ధపురుషులు ముక్త కంఠంతో తమ హర్షాన్ని వ్యక్తపరచి మేము ఇంకా నిరంతరం కూడా మా తపశ్శక్తి
అంత ధారపోసి ఈ భూమండలాన్ని రక్షించుకుంటామని వాగ్దానం చేసారు.
అపుడు అయస్కాంత పురుషుడు మళ్లీ నీ అవసరం బట్టి నేను కాని, నీ సందేహాలు తీర్చే వేరే వ్యక్తి కాని నిన్ను కలుస్తారు. నువ్వు మాత్రం ధ్యానం చెయ్యడం మర్చిపోకు, సాధ్యమైనంత వరకు ఎక్కువ మందితో ధ్యానం చేసేటట్లుగా ప్రయత్నించు," అని అదృశ్యం అయ్యారు. నేను సంభ్రమాశ్చర్యాలతో జరిగినది, జరుగుతున్నది నిజమా, భ్రాంతియా అని ఆలోచిస్తూ
ఉండిపోయాను.
ఎప్పుడో ఏవో కొన్ని పుస్తకాలలో పురాణకధలలో ఇలాగ జరిగాయి అని వినటమో, చదవటమో జరిగింది.
ఈ కాలంలో కూడా ఇలా జరగడం నాకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఎవరికైనా చెప్పిన కూడా నవ్వుతారే కాని నమ్మడం కష్టం. ప్రశాంతంగా ఉన్న ఒక సరస్సులో ఒక పెద్ద రాయి పడితే ఏ
విధంగా తరంగాలు వస్తాయో, మనస్సు అనే సరస్సులో ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆలోచనలతో కొద్దిగా అలజడి చెందాను. యాంత్రికంగా మళ్లీ నా పనిభారంలో
పడిపోయాను.
ధ్యానం కూడా సరిగా సాగడం లేదు. ఈ
సరి ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఎటువంటి వ్యక్తిని కలుస్తానో అనే ఆసక్తి, జిజ్ఞాస ఎక్కువ అయ్యింది.