N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sunday 31 July 2016

Spiritual Soup-04

Part 4

నేను మాములుగా యాంత్రికంగా విధి నిర్వహణలో మునిగిపోయాను, క్రమక్రమంగా నా స్నేహితులు, తెలిసిన వారు నాలో ఏదో మార్పు చూస్తున్నాం అంటున్నారు. నువ్వు ఇదివరకటి లాగ లేవు, ఎక్కువ కాలం మౌనంగా ఉంటున్నావు ఏం జరిగింది  అని పదే పదే ప్రశ్నించసాగారు. నాకు తోచిన సమాధానం చెప్పి తప్పించుకునేవాడిని. నాలో ఏదో మార్పు వొచ్చినట్లు తెలుస్తోంది. అయస్కాంత పురుషుడు నిజంగానే దివ్యమైన అయస్కాంత శక్తి కలిగి ఉన్నాడు. ఆయన కనిపించినప్పటి నుండి నాలో ఒక వింత చెప్పలేను మంచి అనుభూతి కలుగుతోంది. ధ్యానం ఎక్కువగా చెయ్యసాగాను. ఒక రోజు నిద్రలో ఉండగా స్వప్నంలో ఒక దివ్య కాంతిమయ శరీరంలో ఉన్న ఆకారాన్ని చూసాను, మెల్లగా ఆ ఆకారం స్పష్టంగా కనపడింది. స్వప్నంలోనే ఆనందాశ్చర్యాలతో "యజ్ఞవల్క మహర్షి! మీకు నమస్కారం" అంటున్నాను, ఈలోగా కల చెదిరిపోయింది.

నాకు పూర్తిగా మెలకువ వచ్చింది అప్పటికే తెల్లవారు కావొస్తోంది. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఆఫీసు పని మీద కారులో నేను పట్టణానికి వెళ్ళవలిసి వచ్చింది. నేను కెన్యాలో ఉంటున్నాను. కారు సున్నితంగా నైరోబి పొలిమేర దాటి పరిగెత్తసాగింది. కెన్యా చాల అందమైన దేశము, చల్లటి వాతావరణం, దట్టమైన అరణ్యాలు, ప్రకృతికి మారుపేరు అని చెప్పవచ్చు.

రిఫ్ట్ వాలీ  దాటాక అక్కడ కారు ఆపి ఒక 10 నిమిషాలు ఆ రిఫ్ట్ వాలీ వంతెన దగ్గిర ఆగిపోయాను. చల్లటి గాలి, వ్యూ పాయింట్ కిందన చూస్తే అగాధమయిన లోయ, గుబురు గుబురుగా ఎదిగిన మహా వృక్షాలు అంతా ఏదో లోకంలో ఉన్నట్లుగా కనిపించింది. మెల్ల మెల్లగా ప్రయాణం సాగించాను.  జన సంచారం లేదు, వాహనాల రద్దీ లేదు. చుట్టూ రమణీయమైన దృశ్యాలు, అన్నమయ్య సంగీతం జీవితంలో ఇంత కన్నా ఆనందం ఏమి ఉంటుంది? కొంత దూరం పోయాక కారు యొక్క వేగం క్రమక్రమంగా తగ్గసాగింది. accelator ఎంతగా నొక్కిన కూడా వేగం పెరగడం లేదు. కొద్ది దూరం వెళ్ళాక కారు పూర్తిగా ఆగిపోయింది. చుట్టురా ఎక్కడ జన సంచారం లేదు. కెన్యాలో పరిస్థితులు ఇలాంటి సమయంలో అనుకూలంగా ఉండవు.

దొంగల భయం ఎక్కువ, మెల్లగా కారుని ఎడమ వైపుగా ఆపి దిగాను. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన కారులో చలనం లేదు. ఏమి చేసేది లేక అప్రయత్నంగా ఎడమ వైపు కాలి బాటలో మెల్లగా నడుస్తూ వెళ్ళాను. ఒక 100 గజాలు వెళ్ళాక ఎడమ వైపు చిన్న సెలయేరు నా దృష్టిని ఆకర్షించింది. అప్రయత్నంగా అటువైపు నడిచాను. సెలయేరు నీళ్ళు ఎంతో నిర్మలంగా ఉన్నాయి. అందులో రంగు రంగు చేపలు స్వేచ్చగా ఈదులాడుతున్నాయి. అంతలో నా దృష్టి కుడి వైపున ఉన్న ఒక పెద్ద బండ రాయి మీద పడింది. అక్కడ ఒక వ్యక్తి దివ్య తేజస్సుతో నన్ను రమ్మని సైగ చేసారు. నేను మెల్లగా ఎంతో ఆశ్చర్యంతో ఆనందంతో, కొంత విస్మయంతో ఆయన దగ్గిరకి వెళ్ళాను.
  
ఆయనని చూడగానే ఎంతో ఉద్వేగంతో " యజ్ఞవల్క మహర్షి!" అంటూ సాష్టాంగ ప్రణామం చేసాను. ఆయన చిరునవ్వుతో నన్ను కూర్చోమని సైగ చేసారు. నేను కూర్చున్న కొండ రాయి చదునుగా ఉన్న నా శరీరానికి ఎటువంటి బాధ కలగకుండా ఎంతో మృదువుగా మారిపోయింది. నా ఉద్వేగం చల్లబడింది.అప్పుడు ఆయనతో ఇలా అన్నాను. "మహర్షి, ఆ రోజు మీరు మహర్షుల యొక్క సమావేశానికి వచ్చారు కదా ఆ రోజు నేను చూసిన ప్రదేశం హిమాలయ పర్వతాలే కదా? యజ్ఞాల గురించి, యజ్ఞం యొక్క ప్రభావం మనుషుల మీద ఎలా కలుగుతుంది? భావ శుద్ధి ఎలా జరుగుతుంది? నాకేమి అర్థం కాలేదు దయచేసి కాస్త వివరంగా చెప్పండి" అని అడిగాను. సమాధానంగా " నాయన నాకు సాధ్యమైనంత  వరకు నీకు నీ స్థాయికి అర్థం అయ్యేటట్లుగా చెప్పటానికి ప్రయత్నిస్తాను".

"నాయన నీకు తెలుసు కదా మానవ దేహం పంచ భూతముల కలయిక అని. పంచాతత్వాలు వాటి యొక్క గుణాలు. ఈ పంచ భూతాలను సంఘటిత పరచి వాటిలోని చైతన్య శక్తిని కలిగించేది ప్రాణము. ప్రాణము ఉన్నంత వరకే దేహ చలనం ఉంటుంది. మెదడు పంపించే ఆదేశాలను అవయవాలు పాటిస్తాయి. ఈ పాటించాలనే జ్ఞానాన్ని అవయవాలకి ప్రసాదించేది దైవ శక్తి సుమా"."స్వామి, కొంచెం విపులంగా చెప్తారా" అని అడిగాను. "నీవు నన్ను చూడగానే నమస్కరించాలనే ఆలోచన కలిగినపుడు నీ మెదడు నుంచి నీ రెండు చేతులలో  ఉన్న కణముల యొక్క సమూహానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనే ఆదేశాన్ని పంపినపుడు ఆ ఆదేశాన్ని అర్థం చేసుకుని అదే విధముగా నమస్కార ప్రక్రియ జరగడానికి కేవలము దైవ ప్రేరణ కారణం. మాములుగా ఏదైనా కట్టే దహనం చేసినపుడు పొగ వచ్చినపుడు ఆ పొగ కేవలం కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది.

ఒక యజ్ఞం చేసేటపుడు మంత్రయుక్తంగా ఆహుతులు అగ్నికి ఆవు నెయ్యితో వివిధ రకాల వనమూలికలతో అర్చించినపుడు వివిధ రకాల వనమూలికలలో ఉన్నటువంటి విశిష్టమైన సాత్వికమైన ఆ పదార్థాల యొక్క గుణములు మంచి శక్తి  రూపంలో ఆకాశంలోకి మేఘమండలాన్ని కూడా తాకి సూర్య మండలాన్ని చేరతాయి. సూర్య మండలంలోని వాయువు జలాన్ని శుద్ధిని కలిగిస్తాయి. మరి మన భూమి సౌరమండలం మీదే కదా ఆధారపడింది. అప్పుడు సకాల వర్షాలు కురుస్తాయి. మంత్రముల యొక్క జీవ విద్యుత్, అయస్కాంత తరంగాలు కురిసే నీటి బిందువులను, వీచే వాయువులను ప్రభావితం చేస్తాయి. అటువంటి సకాల వర్షము భూమి మీద పడినపుడు భూమి అంతా కూడా ఒక మంచి అయస్కాంత శక్తితో నిండిపోతుంది. అటువంటి భూమిలో నాటిన విత్తనాలు భూమిలోని ఇసుక రేణువుల నుండి శుద్ధమయిన, ఆరోగ్యవంతమయిన మంచి చైతన్యం కలిగిన శక్తిని గ్రహిస్తాయి. అటువంటి ఆహారాన్ని మనుష్యులు భుజించినపుడు వారిలోని ప్రతి కణములో కూడా పరిశుద్ధమయిన, సమతుల్యమయిన విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.ఆహారము మనస్సు అవుతుంది. ఇటువంటి ఆహరం భుజించిన వారికి మనస్సు సాత్వికంగా ఉంటుంది. వారి యొక్క జటరాగ్ని కూడా పరిశుద్ధమవుతుంది. వారిలో ఇతరుల పట్ల ప్రేమ భావము కలుగుతుంది. అంతర్లీనంగా వారి తేజస్సు వారి చుట్టూ ఉన్నవారిని మంచిగా ప్రభావితులను చేస్తుంది.

అన్నిటికన్నా అతి ప్రతిభావంతమయింది, గొప్పది "ప్రేమ" అనే శక్తి మాత్రమే. వీరి యొక్క ఆధ్యాత్మిక పరిణామక్రమం చాలా వేగంగా పెరుగుతుంది. ఇటువంటి మనుషుల యొక్క సాంగత్యంతో సమాజమే ప్రేమగా మారుతుంది.సమాజం బాగున్నప్పుడు దేశం బాగుపడుతుంది. ఇటువంటి మంచి శుద్దమయిన ప్రేమ అనే చైతన్యం విశ్వాన్నేప్రేమమయంగా మారుస్తుంది. నాయనా ఇదియే "యజ్ఞము" వలన కలిగే ఫలితము.

నువ్వు నన్ను చూసినది హిమాలయ పర్వతాల మీదే. నువ్వు అనుకున్నది నిజమే". అప్పుడు నేను  మరల "మహర్షి, మహర్షులందరూ కూడా భారత దేశంలోనే ఉంటారు కదా, మీరు ఆఫ్రికాలో ఎలా దర్శనం ఇస్తున్నారు. నాకు విపులంగా వివరించండి" అన్నాను. మహర్షి చిరునవ్వుతో " నాయన మేము ప్రకృతిలో మమెకమైపొయినాము, మా ఆత్మ యొక్క చైతన్యం విశ్వం అంతా వ్యాపించి ఉంటుంది.

మాకు మీవలె కాలము, దేశము అనే కాలమానము, దేశమానము  లేదు. మాకు హద్దులు లేవు, విధంగా మహా సముద్రంలో ఒక్క నీటి బిందువు యొక్క గుణగణాలు మహా సముద్రమంత వ్యాపించి ఉన్నాయో అదే విధంగా మాలోని ఆత్మ సృష్టంతా వ్యాపించి ఉంటుంది. కాలము, వాటిలో వచ్చే మార్పులు భూమి మీద జరిగే ప్రళయాలు భూమి యొక్క భౌగోళిక పరిస్థితులను అనూహ్యంగా మార్చివేస్తాయి.కాబట్టి మేమంతా సంకల్ప మాత్రమున భూత, వర్తమాన, భవిష్యత్తు  కాలంలో ప్రయాణం చేయగలుగుతామునేను మరల విధంగా ప్రశ్నించాను "స్వామి, ప్రేమ యొక్క శక్తి చాలా గొప్పదని చెప్పారు. కొంచెం విపులంగా వివరిస్తారా"? సమాధానంగా "అది నాకు వేరొక మహాత్ముడు త్వరలోనే చెప్తారు ఇంకా నీకు సమయం మించి పోయింది. నీ వాహనం బాగుపడింది.నిన్ను పిలిపించింది నేనే. నీకు శుభమవుగాక" అని మహర్షి మెల్లి మెల్లిగా గాలితేర లాగ అదృశ్యం అయిపోయారు.

నేను మరల నా కారు దగ్గిరకి వచ్చేసరికి జన సంచారం లేదు. జరిగినదంతా నెమరు వేసుకుంటూ ignition key తిప్పేసరికి కారు స్టార్ట్ అయ్యింది. మళ్లీ నేను అలౌకికం నుండి లౌకికంగా మారిపోయాను. నా ప్రయాణాన్ని సాగించాను. మనసు నిండా మరి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నా.