ఒకసారి ఈస్టర్ సెలవలకు నేను నా స్నేహితుడు రాంబాబు కారులో నైరోబియా నుండి యుగాండ
వెళ్లడం జరిగింది. రాంబాబుకి యుగాండలోని కొంపాల
పట్టణంలో మందుల వ్యాపారం ఉంది. ఆయనకి తోడుగా ఆయన ఆహ్వానం మేరకు నేను అక్కడికి వెళ్ళడం
జరిగింది. నేను ప్రతినిత్యం క్రమం తప్పకుండ గురుచరిత్ర మరియు సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తుండే వాడిని. ఈస్ట్
ఆఫ్రికాలో ప్రకృతి చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఎక్కడ చూసినా రకరకాల వృక్షాలు,
పచ్చని మైదానాలు, ఆప్యాయంగా పలకరించే మనుషులు, పక్షులు, జంతువులు ప్రయాణంలోనే ఎదురవుతుంటాయి.
ముఖ్యంగా జీబ్రా గుర్రాలు ‘నైవషా’ అనే ఊరు దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మేము
నెమ్మదిగా ‘నైవషా’ తరువాత ‘నకూరు’ అనే ఊరిలో జలారాం బాబా మందిరానికి చేరుకున్నాము.
జలారాం బాబా గుజరాతి దేశంలో జన్మించినటువంటి మహాత్ముడు.
ఆయన ముఖ్యంగా అన్నదాన ప్రియుడు. ఆయనకి ప్రపంచం అంతటా లక్షలాది భక్తులు ఉన్నారు. వీరందరూ వారింటికి వచ్చిన అతిధులకు ఏ ప్రతి ఫలం ఆశించకుండా చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నకూరులో బాబా వారికి పెద్ద ఆలయం కట్టించారు. దానిలో మిగిలిన దేవతా మూర్తులు కూడా ప్రతిష్టించబడ్డారు. 24 గంటలు వేళను బట్టి ఆహరం సమృద్ధిగా దొరుకుతుంది, అలాగే విశ్రాంతి గదులు కూడా దూరప్రయాణం చేసేవారికి సౌకర్యంగా లభిస్తుంటాయి. ఈస్ట్ ఆఫ్రికాలో గుజరాతి సంతతి వారు 1900-01 ఆ ప్రాంతంలో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరికి వ్యాపార దక్షత, దైవ భక్తి చాల మెండుగా ఉంటాయి. వారి సంస్కృతిని, భారతీయ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఆ ఆలయంలో కాసేపు ధ్యానం చేసాక అల్పాహారం సేవించి ప్రయాణం సాగించాము.

ఇక్కడి
వాతావరణము చాల చల్లగా ఉంటుంది. కెరిచో పట్టణంలోకి ప్రవేసిస్తుండగా ఇరుపక్కల కొన్ని
వందల ఎకరాలలో ఉన్న తేయాకు తోటలు ఎంతో సంతోషంగా మాకు స్వాగతం పలికాయి. ఆ తరువాత కిసుము
అనే ఊరిలోకి ప్రవేసించాము. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో గుజరాతి వ్యాపారస్తులు స్థిరపడ్డారు.
కిసుము పొలిమేరలు దాటగానే ఒక అద్భుతమైన అనుభవం మాకు ఎదురయ్యింది. ఇక్కడ మేము భూమధ్య రేఖను దాటాము. మెల్లగా బుసియా అనే ఊర్లోకి
ప్రవేసిన్చాము.
ఇక్కడే కెన్యా మరియు యుగాండ దేశపు సరిహద్దు ప్రాంతము ఉంది. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇటు కెన్యా దేశం, అటు యుగాండ మధ్యలో ఎవరికీ చెందని ప్రాంతము అది (no mans land ). ఇక్కడే విసా ప్రక్రియలు ముగించాక మేము యుగాండ దేశం లోకి ప్రవేసించాము. బుసియా దాటాక ఇగాంగ, తరువాత బోగిరి అనే ఊరిలో టీ తాగి సాయంత్రం కల్లా జింజా మీదుగా కంపాల ప్రవేసించాము. ఈ జింజా పట్టణంలోనే మధ్వాని కుటుంబం ఎన్నో ఏళ్ళ కింద వలసగా వచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించారు. కంపాలాలో రాంబాబు కిబులి అనే ప్రాంతంలో విశాలమయిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మేము వెళ్ళగానే పనివాడు గేటు తీసి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. ఆ విశాలమయిన ఇంట్లో నాకు విడిగా ఒక గదిని కేటాయించారు. ఆ రోజు హాయిగా విశ్రాంతి తెస్సుకున్నాను.

కంపాలాలో
కూడా చాలామంది తెలుగు వాళ్ళు వ్యాపారం మరియు ఉద్యోగ నిమిత్తం స్థిరపడి ఉన్నారు. రెండు
రోజులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళ ఆతిధ్యం తీస్కోడంతో సరిపోయింది. నా పారాయణం మాత్రం
నిర్విఘ్నంగా సాగుతోంది. మూడవ రోజు కొన్ని తెలుగు సినిమా వీడియోలు తీస్కుని ఇంటికి
వచ్చాము. ఆ రోజు రాత్రి విడిగా ఉన్న గెస్ట్ రూమ్ లో ఉన్న టెలివీడియోలో తీరికగా మేము
తెచ్చిన తెలుగు సినిమాలు చూస్తూ ఉండిపోయాము. అలసట వలన రాంబాబు మధ్యలోనే వెళ్ళిపోయాడు.
నాకు కూడా నిద్ర రావటంతో నిద్రకు ఉపక్రమించాను. మంచి నిద్రపడుతుండగా నాకు చెవిలో గుసగుసలుగా
ఒక హెచ్చరిక వినపడింది. "ఇక్కడ పడుకోవద్దు, లేచి నీ గదిలోకి వెళ్ళు" అని
పదే పదే తక్కువ స్థాయిలో ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.
ఒకసారి కళ్ళు తెరిచి లేచి కూర్చుని అంతా నా భ్రమే అని బద్దకంగా మళ్లీ నిద్రకు ఉపక్రమించాను. మరలా అదే హెచ్చరిక. ఇలా 3,4 సార్లు జరిగింది. నాకు నిద్రమత్తు వదిలిపోయింది. ఒక్కసారిగా ఏదో ఒక తెలియని స్థితిలో లేచి నా మెల్లగా నా గదిలోకి వెళ్ళిపోయాను. కాని జాగ్రుదావస్తలో కి వచాను. ఇల్లంతా తిరుగాను, కిటికిలోంచి బయట అంతా చూసాను. మెదడు చాల చురుకుగా పని చెయ్యడం మొదలుపెట్టింది. ఆ రాత్రి ఏదో ఒక ప్రమాదం జరగబోతోంది అనిపించింది. కాని ఏమి చెయ్యగలను, కాసేపు దత్తుడిని, బాబాని గాధంగా తల్చుకున్నాను. నేను తెచ్చుకున్న రెండు బ్రీఫ్ కేసులు నేను పడుకున్న మంచానికి కాళ్ళ వైపు ఒకటి, తల భాగం వైపు ఒకటి పెట్టుకున్నాను. రాంబాబు గాడంగా నిద్రపోతున్నాడు. ఎం జరుగుతుందో అని ఆలోచిస్తూ తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.

తెల్లవారగానే
రాంబాబు ఇంటిలోని పనివాడు నా గదిలోకి వచ్చి "Mr సాయిరాం, ప్లీజ్ గెట్ అప్"
అని కొంత ఆందోళనతో నన్ను నిద్రలేపాడు. అతని అరుపుకి నా నిద్రమత్తు వదిలిపోయింది. వాడు
రాంబాబుని లేపడానికి వెళ్ళిపోయాడు. తల భారంగా అనిపించింది, ఒక గమ్మత్తైన వాసన గదిని
ఆక్రమించింది. నేను మెల్లగా తూలుతూ మంచం కింద చూసే సరికి నా రెండు పెట్టెలు మాయం అయిపోయాయి.
నేను అంతకు ముందు పడుకున్న గదిలోకి వెళ్లేసరికి ఒక విధమైన దిగ్భ్రాంతి చెందాను.
అక్కడ టెలివీడియో కూడా మాయం అయ్యింది. ఆ తరువాత ఒక పెద్ద మ్యూజిక్ సిస్టం, చిన్న చిన్న వస్తువులు కూడా దొంగతనం చేయబడ్డాయి. ముందు తలుపు బార్ల తెరిచివుంది. అప్పటికి నాకు ఇంట్లో దొంగలు పడ్డారు అనే విషయం బోధపడింది. నేను బయటికి వెళ్లి ఇంటి చుట్టూ వెతకగా నా బ్రీఫ్ కేసులు, రాంబాబు బ్రీఫ్ కేసులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. నేను తెచ్చుకున్న డబ్బులు అన్ని కూడా పోయాయి. అదృష్టం ఏంటంటే నా పాస్ పోర్ట్ మాత్రం ఆ దొంగ నా మీద దయతో వొదిలిపెట్టి వెళ్ళాడు. నేను ఎంతో ఆర్ద్రతతో ఆ దత్తాత్రేయుడికి, బాబాకి ఎన్నో రకాలుగా కృతఙ్ఞతలు చెప్పుకున్నాను.
ముందే నన్ను హెచ్చరించి నా గదిలోకి వెళ్ళేవరకు కూడా ఆ కరుణామయుడు ఊరుకోలేదు. అక్కడే పడుకుని ఉంటే ఆ దొంగల చేతిలో నేను మరణించి ఉండేవాడినేమో. నా ప్రారబ్ధ కర్మ పోగొట్టుకున్న డబ్బుతో కొంత కరిగిపోయింది. ఈ విధంగా ఒక అద్భుతమయిన లీలను ప్రదర్శించి భక్తులను ఆదుకుంటారు ఆ భగవంతుడు. ఈ విధంగా ఆయన నా హృదయంలో నిలచిపోయారు.