ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్ తన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా అతను
తన నాయకత్వ లక్షణాలు చూపుతూ అధైర్య పడకుండా తగినట్టుగా ప్రణాళికలు
రచిస్తూ వున్నాడు.
కెప్టెన్ గా మరీనా ఫిలియాస్ ఫాగ్ లోగడ మనం చెప్పుకున్నట్లుగా 45 నిముషాలు ఆలస్యంగా
వెళ్లినందుకు చైనా అనే ఓడ వీళ్ళు లివర్ పూల్ కి వెళ్ళవలసినది మిస్ అయిపోయారు.
అయితే ఫిలియాస్ ఫిలియాస్ ఫాగ్ మాత్రం తన ప్రయత్నాలని తాను చేస్తూ ఆఖరికి పారిస్ కి వెళ్లే కార్గో షిప్ ని ఎలాగో ఎక్కి, ప్రయాణికుడికి 2000 పౌండ్స్ చొప్పున నలుగురికీ పే చేయటం, ఆ ఓడ పేరు H S (Hispilania )ఫిలానియా. ఆ ఓడ ఎక్కాక ఆ నావికులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ నలుగురు ప్రయాణీకులనీ లివర్ పూల్ చేర్చేలా ఒప్పుకోవటగం, ఆ నావికులందరూ కలిసి, ఓడ నడిపే కెప్టెన్ ని బంధించి, గదిలో పెట్టి తాళం వేయటం తెలుసుకున్నాం.
ఈ విధంగా ఆగమేఘాలమీద ఆ కార్గో ఓడ హైస్పీలనియా (Hispilania), లివర్ పూల్ దిశగా ప్రయాణించింది. అందరూ ఆశ్చర్య పడేలా ఫిలియాస్ ఫాగ్ ఆ ఓడకి కెప్టెన్ గా బాధ్యత వవహించాడు. పడవ నడిపే నావికులు కూడా ఫిలియాస్ ని చూసి చాలా ఆశ్చర్య పడ్డారు.
డిటెక్టివ్ ఫిక్స్ మాత్రం ఇలా అనుకున్నాడు మనసులో. ఇతడు మామూలు దొంగ కాదు. సముద్రపు దొంగ అయివుంటాడు. ఇతడేమిటి కార్గో షిప్ లో వెళ్ళాడు. పైగా పారిస్ వెళ్లాల్సిన ఓడలో బోల్డంత డబ్బు చెల్లించి, లివర్ పూల్ దిశగా తానే కేప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాడు. లివర్ పూల్ కెళ్ళి అక్కడినుంచి ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడు. అదేమిటో నాకేమీ అర్ధం కావటంలేదు. మళ్ళీ ఇంగ్లాండ్ కి వెళ్తున్నాడేమిటి? నాకేమీటీ. అర్ధం కావటం లేదు, అని బుర్రబద్దలుకొట్టుకుంటున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆరోజు డిసెంబర్ 10 వ తేదీ. వీళ్ళు న్యూయార్క్ ఓడరేవు దగ్గర దిగి లివర్ పూల్ కివెళ్లాలనుకున్నపుడు అది డిసెంబర్ 20 వరకు ఏ ఓడ బయలు దేరదన్నపుడు, మరి పందెం ఓడిపోతాడు కదా! 21 వ తేదీ కల్లా రిఫార్మ్స్ క్లబ్లోకి సాయంత్రం 5 PM కల్లా వెళ్ళాలి కదా! అందుకే ఫిలియాస్ ఫాగ్ గారు ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోక తప్పలేదు. సరిగ్గా డిసెంబర్ 14 న ఫిలియాస్ ఫాగ్ ఓడ కి కెప్టెన్ గా వ్యవహరించి, అతి చాకచక్యంగా ఆ ఓడని లివర్ పూల్; వైపుగా అట్లాటిక్ మహా సముద్రం ద్వారా ప్రయాణించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణం ఏమాత్రం సహకరించట్లేదు. ఓడ చాలా వేగంగా వెళ్తోంది. పాస్ పర్ట్ ఏదో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఫిలియాస్ ఫాగ్ చాలా గంభీరంగా వున్నాడు. వాతావారణం ప్రతికూలంగా వుంది కాబట్టి అతను తన మనసునంతా ప్రయాణం దిశగా కేంద్రీకరించి ఓడను నడుపుతున్నాడు. ఈలోగా ఆ నావికుల్లో ఒకడు వచ్చి ఏమండీ! ఇంత వేగంగా ఓడను నడుపుతున్నాము. మనకు బొగ్గు నిల్వలన్నీ చాలా తగ్గి పోయాయి.ఇంత వేగంగా ప్రయాణం చేస్తే మన ఓడలో ఏమాత్రం బొగ్గు మిగలదు. ప్రయాణం మధ్యలో నిలప వలసివస్తుంది. ప్రయాణం లివర్ పూల్ దాకా వెళ్ళటం కష్టం అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడెలా! ఎలా వెళ్ళటం అబ్బా! అని అందరూ అనుకుంటూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్ మాత్రం చాలా గంభీరంగా, ఎటువంటి పరిస్థితిలోనూ ఈ వేగం తగ్గించటానికి వీలులేదు.మీరు ఒకపని చేయండి. ఈ ఓడమీద చెక్కతో చేసిన స్తంబాలు, కుర్చీలు వంటి వాటిని విరక్కొట్టండి. వాటిని మనం కలప లాగా వాడుకుందాం. కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఈ వేగాన్ని తగ్గించటానికి వీలులేదు, అని దృడంగా చెప్పాడు. ఎందుకంటె ఆ ప్రయాణానికి చాలా డబ్బు అతను ఇస్తున్నాడు కాబట్టి ఆ నావికులందరూ కూడా, ఆ ఓడలో చెక్కతో చేసిన వస్తువులనన్నింటినీ విరగకొట్టి, కలపలాగా, వాడుకుంటున్నారు. కానీ అట్లాంటిక్ మహాసముద్రంలో చాలా దూరం వరకు వచ్చేసారు. కాసేపట్లో ఒక నావికుడు వచ్చి, అయ్యా, ఏర్పాటు చేసిన కలప అంతా అయిపోయింది. ఇంకా తగల బెట్టడానికి ఏమీ లేదు. దగ్గరలో ఉన్న ద్వీపం దగ్గర ఆ పడవని ఆపారు. ఫిలియాస్ ఫాగ్ ఎంతో ధైర్యంగా ఆ ఓడని దిగి, పక్కనే వున్న క్వీన్ స్టోన్అనే స్టేషన్ కి వెళ్లి, అక్కణ్ణించీ డబ్లిన్ వెళ్లి, అక్కణ్ణుంచి ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయం చేసుకున్నాడు. ఎలాగైతే
నేమి వాళ్ళు 20 డిసెంబర్ కి అనుకున్న గమ్యస్థానం లివర్ పూల్ కి చేరుకున్నారు. పాస్ పర్ట్ కి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటె తన యజమాని 21 డిసెంబర్ కల్లా రిఫార్మ్స్ క్లబ్ కి చేరుకుంటాడు. లివర్ పూల్ నుంచి ఆరుగంటల ప్రయాణమే కదా అని సంతోషపడుతూ వున్నాడు.ఈలోగా డిటెక్టివ్ ఫిక్స్ చాలా ఆనందంగా ఉన్నాడు. అతను వచ్చాడు. వీళ్లంతా సంతోషంగా ఉన్నారు. ఫిలియాస్ ఫాగ్ దగ్గరకెళ్ళి మీ పేరు ఫిలియాస్ ఫాగ్ కదా, అని అడిగాడు. డిటెక్టివ్ ఫిక్స్. ఒక్కింత ఆశ్చర్యడ్పడ్డాడు ఫిలియాస్ ఫాగ్ అలా అడగటంతో. అవును అన్నాడు ఫిలియాస్ ఫాగ్. మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తున్నాను. బ్యాంకు అఫ్ ఇంగ్లాండ్ లో దొంగతనం చేశారు. అరెస్ట్ వారెంట్ చేతికి రావాలని మీ చుట్టూ తిరుగుతున్నాను . మిమ్మల్నిపుడు
అరెస్ట్ చేస్తున్నాను, అని అనగానే అందరూ చాలా ఆశ్చర్య పడ్డారు. ఫిలియాస్ ఫాగ్ కూడా ఒక్క క్షణం అవాక్కయ్యాడు. కానీ ఒకరకమైన నిస్సహాయ స్థితిలో వున్నాడు యిపుడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఫిలియాస్ ఫాగ్ కి చాలా కోపం వచ్చింది మొట్టమొదటి సారి. ఫిలియాస్ ఫాగ్
డిటెక్టివ్ ఫిక్స్ తో నీ అంత ద్రోహి ఉంటాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను నా స్నేహితుడిగా భావించి, నీ కోసం నేను నా డబ్బులు ఖర్చు చేసి, నిన్ను ఇంతవరకూ తీసుకుని వచ్చాను. ఇంత విశ్వాసఘాతకుడివి అని నేనెప్పుడూ అనుకోలేదు, అని చాలా గట్టిగా కోప్పడ్డాడు. మనసులో డిటెక్టివ్ ఫిక్స్ నిజంగానే ఫిలియాస్ ఫాగ్ మంచివాడిలాగే ఉన్నాడు. కానీ నేను ఏం చేయగలను.
నేను న్యాయంగా నా డ్యూటీ చేస్తున్నాను. ఈ హఠాత్పరిణామం చూసి మేడం ఔదా వెక్కి వెక్కి ఏడుస్తూ పాస్ పర్ట్ భోజంపై తలవాల్చి తన దుఃఖాన్ని ప్రకటిస్తోంది. ఫిలియాస్ ఫాగ్ ఏమీ చేయలేని పరిస్థితిలో జైల్లో బంధింప బడ్డాడు. తన సర్వస్వం అంతా పోగుట్టుకున్నాడు. ఏంచేయాలి. ఒక మంచి అవకాశం దొరికితే బాగుండును కదా అని అనుకున్నాడు. అతడు
విజయానికి చాలా చేరువలో ఉన్నాడు. విధి ఎంత విచిత్రమైనది కదా అని అనుకున్నాడు. నేను దొంగని అని భ్రమించి, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఆలోచిస్తూ ఉండగా, కొద్దీ క్షణాల్లోనే పాస్ పర్ట్ , ఔదా, గబగబా పరుగెత్తుకుంటూ ఫిలియాస్ ఫాగ్ ఉన్న జైలు దగ్గరికి వచ్చారు. వెంటనే
వెనుకే డిటెక్టివ్ ఫిక్స్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఫిలియాస్ ఫాగ్ గారూ! మీరు వెళ్లిపోవచ్చు. మీరు స్వేచ్ఛా జీవి. బ్యాంకులో దొంగతనం చేసిన అసలైన దొంగని మూడురోజుల క్రితమే అరెస్ట్ చేశారు. కాబట్టి మీరు ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అని చెప్పగానే, ఫిలియాస్ ఫాగ్ బయటికి
వచ్చాడు. కానీ అతనికి చాలా కోపంగా ఉంది. ఏమీ చేయని నేరానికి ఇలా చేస్తాడా అని, ముందు ఎడమ చేత్తో తర్వాత కుడిచేత్తో డిటెక్టివ్ ఫిక్స్ డొక్కలో పొడిచాడు గట్టిగా. పిడి గుద్దులు గుద్దాడు. ఆ దెబ్బలకి డిటెక్టివ్ ఫిక్స్ ఒక్కసారిగా కిందపడిపోయాడు.
***********