గాయత్రి మంత్ర మహిమ
గుంటూరులో కొద్ది కాలం క్రిందట ఒక సద్బ్రాహ్మణుడు రెండు వైపులా మంచి నీళ్ళ బిందెలతో కావడి మోసుకుంటూ మంచి నీటి కొరత ఉన్న ఇళ్ళలో ఈ మంచి మంచి నీళ్ళు చేర వేస్తూ ఉండే వాడు. అతడు ఆ ఊళ్లోనే ఉన్న ఒక సంపన్న కుటుంబీకునికి కూడా ఈ మంచి నీళ్ళు సరఫరా చేస్తుండేవాడు. అతడు చాలా నిరాడంబరుడిగా, నిజాయితీపరుడిగా, మితభాషిగా ఉండేవాడు.
ఆ సంపన్న యజమాని కొడుకు గుంటూరులో ఒక కర్మాగారాన్ని స్థాపించి దానికి కావలసిన యంత్రాలన్నిటినీ
కూడా జర్మనీదేశం నుంచి దిగుమతి చేసుకున్నాడు.
ఆ యంత్రాలన్నీ స్థాపించినాక ఒక మంచి ముహూర్తానఆ యంత్రాలెలా పని చేస్తాయో తెలుసుకోవాలని ఆ యంత్రానికి సంబంధించిన ఒక మీట (ఎలక్ట్రిక్ స్విచ్) నొక్కాడు. ఏం జరిగిందో తెలియదు కాని మీట నొక్కిన తర్వాత ఆ యంత్రాలలో ఎటువంటి కలయిక లేనే లేదు మరి చాలా డబ్బు

వెచ్చించి ఆయంత్రాలన్నీ దిగుమతి చేసుకున్నారు అవి పని చేయక పోవడంతో చాలా ఆందోళన చెందారు. మళ్ళీ ఆ technicians ని జర్మనీ నుంచి పిలిపించాలంటే బోలెడంత ఖర్చుతోకూడిన పని.
అందుకోసం మన భారతీయ దేశంలో IIT రంగంలో ఉన్న నిపుణులని పిలిపించి, వాళ్ళతో యంత్రాలని పరిశీలించి
వాటిలో ఉన్న లోపాలని సరి దిద్దమనిచెప్పారు.
వారు అహర్నిశలూ చాలా కృషి చేశారు. వారం రోజుల పాటు ఎంతో కృషి చేసినా ఆ యంత్రంలో ఎటువంటి చలనం లేదు. "అయ్యో !" ఇంత డబ్బు పోసి మనం ఈయంత్రాలని తెప్పించాము ఓరి భగవంతుడా ! ఇవేమో ఇప్పుడు పని చేయడం లేదు . మరి దేశంలో ఉన్న IIT శాస్త్రజ్ఞులని కూడా పిలిపించా. మరి వారి వల్ల కూడా ఏమికాలేదు . మరి ఏం చేయాలా అని ఆలోచిస్తూ చాలా దిగులుగా ఉన్నాడు.
అప్పుడు ఒక రోజు ఈ మంచి నీళ్ళని సరఫరా చేస్తున్న ఆ బ్రాహ్మణుడు ఈ గృహ యజమానినిచూసి , ఏమిటండీ మీరంత విచారంగా దీనంగా ఉన్నారు ?నేను రోజూ వస్తున్నాను. మీకు మంచి నీళ్ళు సరఫరా చేస్తున్నాను. మీ మోహంలో ఇంత విచారం, ఇంత దైన్యంనాకెప్పుడూ కనిపించ లేదు.
ఏమిటీ విశేషం ? మీ కుమారుడు దిగుమతి చేసుకున్న ఆ యంత్రాలు పని చేయడం లేదని మీరు దిగులు పడి ఉన్నారు కదా ! అనిప్రశ్నించాడు. ఆయన చాలా ఆశ్చర్య పోయారు . ఇతనికి ఈ విషయం ఎలా తెలిసింది అన్న సంగతి ఆయనకి అంతు పట్టలేదు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు . మీరు చాలా మందిని వాటి లోపాలు కనుక్కోవాలని పిలిపించారు.
మరి వాళ్ళ వల్ల ఏమీ కాలేదు కదా ! కాని అక్కడ సమస్యఅన్నది ఏమీ లేదు . కాని ఫలానా ఫలానా చోట ఒక చిన్న స్క్రూ (screw ) ఊడిపోయింది. మీరు కనుక ఆ screw తెప్పించి వేస్తే యంత్రం తప్పకుండా పని చేస్తుంది అనిచెప్పాడు .
ఆ మాటలు విని ఆ గృహ యజమాని చాలా ఆశ్చర్య పడి పోయాడు . ఆయన వెంటనే తన కుమారున్ని పిలిపించి అతనితో చెప్పితే అతను కూడా అంత కన్నా ఆశ్చర్య పడి పోయాడు. మామూలుగా నీళ్ళ బిందెలు మోసే ఈ మనిషికి సాంకేతిక విద్య గురించి ఏమి తెలుసు ? ఇంత high technology అతనికి తెలియదు కదా ! ఇతను ఆ యంత్రాలని చూడ లేదు. వాటి జ్ఞానం కూడా లేదు. మరి ఎలా చెప్పాడు అని అనుకున్నా సరేలే ! చూద్దాం ! ఎక్కడ స్క్రూ పోయిందో ఆ భాగం కూడా చెప్పాడు.
అనిఆశ్చర్య పోయి వెంటనే వెళ్లి పరిశీలించగా ఆ బ్రాహ్మణుడు చెప్పిన ఆ ప్రదేశం లోనే స్క్రూ లేక పోవడం గమనించి అంతకన్నా ఆశ్చర్య పోయారు ఆ తండ్రి కొడుకులు .ఆ స్క్రూవిలువ ఒక్క రూపాయి కూడా ఉండదు .

అతను వెంటనే ఆ పరిమాణంలో ఉన్నటువంటి ఒక చిన్న స్క్రూ తెచ్చి బిగించి, మీట నొక్కగానే (స్విచ్ ఆన్) అద్భుతంగా ఆ యంత్రం పని చేయడం మొదలు పెట్టింది దానితోఅతని బుర్ర తిరిగి పోయింది.ఇదేమిటీ? నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టి IIT నుంచి శాస్త్రజ్ఞులని పిలిపించాను. పాపం వాళ్లు కూడా అహర్నిశలు కష్ట పడినా ఏమీ కనుక్కోలేక పోయారు మరి యంత్రాలని చూడ లేదు. యంత్ర భాగం లో ఫలానా చోట ఒక స్క్రూ(screw) ఊడి పోయింది అని ఆ బ్రాహ్మణుడు ఎలా చెప్పా గలిగాడు అని ఆశ్చర్యపోయి ఎంతో వినయంగా అతని దగ్గరకి పరిగెత్తుకుని వెళ్లి ఆ గృహ యజమాని , అందరు కూడా అడిగారు. మరి ఏమిటండీ ! మీకు శాస్త్ర పరిజ్ఞానం కూడా లేదు . యంత్రాలనికూడా చూడ లేదు. అలాంటప్పుడు మీరు అంత ఖచ్చితంగా ఫలానా చోట ఒక స్క్రూ ఊడి పోయిందని ఎలా చెప్ప గలిగారు ? అదేమిటో మాకు చెప్పండి అని ఎంతోవినయంగా ప్రాధేయ పడగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. నేను అహర్నిశలూ , కావడి మోస్తున్నప్పుడు కూడా మీ అందరికీ నీళ్ళు సరఫరా చేస్తున్నప్పుడు , 24గంటలూ నేను గాయత్రి మంత్ర మహా జపాన్ని జపిస్తూ ఉంటాను . నాకు ఉపనయనం అయినప్పట్నుంచి అది నేను చేస్తున్న ప్రక్రియ.
దాని వల్ల నేను కొంచెం ఆలోచించగాఆ విషయం నాకు తెలిసి పోయింది. నాకు తెలిసింది నేను మీకు చెప్పాను . అంత కన్నా నా దగ్గర వేరే రహస్యం ఏమీ లేదు . అప్పుడు వాళ్ళందరూ కూడాఈ గాయత్రిమంత్రం లో ఇంత మహిమ ఉందా అని చాలా ఆశ్చర్య పోయారు.

ఇది నిజంగా జరిగిన సంఘటన.
ఊహించి వ్రాసినది కాదు.
ఈ సంఘటన గాయత్రి పరివార్ వాళ్లు ప్రచురించిన 'మహా శ్వాస విజ్ఞాన్ ' అనే మాస పత్రిక లో చదివాను. అదిబహుశా తెలుగు లోనికి మారెళ్ల రామ కృష్ణ గారు అనువదించారు.
అదే సంఘటన నేను మీతో అంటే వెబ్ సైట్ పాఠకు లందరితో పంచుకున్నాను .