N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sunday, 14 May 2023

80 రోజుల్లో భూప్రదక్షిణ - అధ్యాయం 2

                       

                                  ఫిలియాస్ ఫాగ్ ,  జోన్ పాస్ పర్ట్

అక్టోబర్ 9 : స్కాట్లాండ్ యార్డ్ డిటెక్టివ్ ఫిక్స్ ఒక నిర్ణయానికి వచ్చేసాడు. రిఫార్మ్స్ క్లబ్ లో ఒక పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నఫిలియాస్ ఫాగ్ అనే అతను బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ నుంచి  55౦౦౦ పౌండ్స్ దొంగలించాడని నిర్ధారణకు వచ్చేసాడు డిటెక్టివ్ ఫిక్స్. అతను ఎలాగైనా సరే ఈ ఫిలియాస్ ఫాగ్ వెంటబడి, పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసి 2000 పౌండ్స్ ని తీసుకోవాలనే  పథకంలో ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఫిలియాస్ ఫాగ్ కి కానీ, జోన్ పాస్ పర్ట్ కి  కానీ ఏమీ తెలియవు. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఇటలీ చేరుకుని, మంగోలియా అనే ఓడలో బొంబాయి కి వెళ్ళవలసింది అన్నమాట. ఎలాగైతే నేమి ఇటలీ లో మంగోలియా ఓడని వాళ్ళు ఎక్కారు. డిటెక్టివ్ ఫిక్స్ ఎలాగైతేనేమి వాళ్ళని పట్టుకోవాలని అక్కడికి చేరాడు. అలా చేరుకొని ఆ ప్రయాణికుల్ని బాగా  పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతనికి హఠాత్తుగా సూయెజ్ దగ్గర ఫిలియాస్ ఫాగ్ మరియు జోన్ పాస్ పర్ట్  వాళ్ళని కనుగొన్నాడు. అక్కడ సూయెజ్ లో వాళ్ళని పట్టుకొని సంభాషణలు మొదలు పెట్టాడు. అభివాదాలు చేసి "ఏమిటీ మీరు యిక్కడ సూయెజ్ లో బోలెడు చూడవలసినవి చాలా ప్రదేశాలున్నాయి కదా. మరి మీరు ఇవేవీ చూడకుండా  ఇంత హడావిడిగా ఉన్నారేంటి?" అని ప్రశ్నించాడు. 

దానికి సమాధానంగా జోన్ పాస్ పర్ట్, "ఏం   లేదండి, మా యజమాని గారు ఈ 80 రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ చేయాలనుకుంటున్నారు. నాకూ చూడాలని ఉంటుంది కానీ మరి నేను మా యజమానితో పాటు వెళ్ళాలి కదా, అందుకే నాకు ఈ సూయెజ్ ని చూసే అవకాశం లేదు", అని చెప్పాడు. 

 డిటెక్టివ్ ఫిక్స్ కి తన అనుమానం రూడి అయింది. ఏమీతెలియని వాడిలా, "అదేమిటీ ? మీ యజమాని గారి దగ్గర చాలా డబ్బులున్నట్టున్నాయి కదా! " 

"చాలా ధనవంతులు అయినా ఇదేమిటయ్యా ? ఇన్నిమంచి మంచి ప్రదేశాలు చూడకుండా, 80 రోజుల్లో భూప్రదక్షిణ చేస్తే ఏం వస్తుంది?  దానివల్ల ఏం లాభం? ఎందుకు మీ యజమాని అంత ఆత్రుత పడుతున్నాడు?" అని అడిగాడు.          

జోన్ పాస్ పర్ట్,   "ఏమోనండీ నాకేం తెలీదు. నేనిప్పుడు గబగబా మా యజమాని దగ్గరికి వెళ్ళాలి. ఔను ఇంతకీ మీరు..... మీరు ........ అంటూంటే 

"నేను ఫిక్స్ ని. నన్ను ఫిక్స్ " అని పిలుస్తే చాలు. 

"నా పేరు జోన్ పాస్ పర్ట్  అని తనను తాను  పరిచయం చేసుకున్నాడు. అయితే మరి నేను వెళ్ళొస్తాను" అని చెప్పి వెళుతుంటే బహుశా "నేను కూడా నీతో పాటు వస్తానని అనుకుంటాను, మళ్ళీ మనం కలుద్దామ ఆని" చెప్పాడు ఫిక్స్.

అక్టోబర్ 10. : మొత్తానికి సూయెజ్ నుంచి కూడా బొంబాయి దిశగా ప్రయాణం సాగించింది. డిటెక్టివ్ ఫిక్స్ ఆలోచిస్తూ ఉన్నాడు. తనకి టెలిగ్రామ్  వస్తే కానీ అతను ఫిలియాస్ ఫాగ్ ని అరెస్ట్ చేయడానికి కుదరనే కుదరదు.  ఏమిటబ్బా, ఇతనితో పాటు నేను కూడా వెళ్ళవలసి వస్తుంది. టెలిగ్రామ్ ఇంకా రాలేదు  అని  అతను పరి పరి విదాలు ఆలోచిస్తూ అతను కూడా ఆ ఓడలో ప్రయాణం సాగించాడు. 

అక్టోబర్ 2౦: మంగోలియా ఓడ బొంబాయి తీరాన్ని చేరుకుంటుంది. ఈలోగా ఫిలియాస్ ఫాగ్ గారు తన చిన్న నోట్ బుక్ లో తన ప్రయాణ ప్రణాళికని రాసుకుంటున్నాడు. ఏ రోజు ఎన్ని గంటలకు ఎక్కడ తిరిగాడో, ఏ ఓడ ఎక్కాడు, ఏ విధమైన ప్రయాణం చేస్తున్నాడని , అన్నిరాసుకుంటున్నాడు.

జోన్ పాస్ పర్ట్    కూడా ఆలోచిస్తున్నాడు. మా మాస్టర్ గారు రెండు రోజుల ముందే ఉన్నారు. మా యజమానిగారు అనుకున్న దానికన్నా, కానీ ఎలాగైనా సరే ఈయన ఒప్పందం గెలవాలి లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. వాతావరణం సరిగ్గా లేక పోయినా , రైలు లైన్ సరిగ్గా లేక పోయినా చాలా కష్టం కదా ! అని తన పెట్టెలో తన యజమాని పెట్టిన ఇరవై వేల పౌండ్స్ గురించి జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాడు. ఇవేవి  పట్టనట్టుగా ఫిలియాస్ఫాగ్ నోట్ బుక్ లో అన్ని వివరాలు రాసుకుంటూ తోటి ప్రయాణీకులతో చక్కగా పేకాట ఆడుతూ సరదాగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఏమీ పట్టనట్టుగా యిలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా 20 అక్టోబర్ న  బొంబాయి కి ఈ మంగోలియా అనే ఓడ చేరింది. ఫిలియాస్ ఫాగ్ , జోన్ పాస్ పర్ట్ ఇద్దరూ కూడా బొంబాయి స్టేషన్ కి వెళ్లారు. అనుకున్న ప్రకారమే ఆ రైలు సిద్ధంగా ఉంది. ఆ రైలు ఎక్కారు. వారు అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అంతా బాగుంది అని  అనుకున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక ఆ ఇంజిన్ డ్రైవర్, రైలు ఆపి ప్రయాణీకులను ఉద్దేశించి, "ఈ ప్రయాణం ఇంకా ముందుకి సాగదు. ముందు మరమ్మత్తులు సాగుతున్నాయి. రైల్వే ట్రాక్ ఇంకా పూర్తిగా వేయలేదు.ముందు స్టేషన్ కి మీరు  వెళ్లాలంటే యిక్కడే దిగి మీ ప్రయాణాలు మీరు చేసుకోవాలి", అని చెప్పాడు. 

దాంతో జోన్ పాస్ పర్ట్ కి చాలా దిగులు వేసింది"అయ్యో! భగవంతుడా !" ఏమిటి ఇలా జరుగుతోంది! అని అనుకున్నాడు. అయితే ప్రయాణీకులంతా ఎవరి ప్రయాణ సన్నాహాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు అక్కడినుంచి కలకత్తా మీదుగా అలాహాబాదు వెళ్లాలన్నమాట. అర్ధాంతరంగా రైలు ఆగింది. నింపాదిగా ఉన్నాడు ఫిలియాస్ ఫాగ్. డిటెక్టివ్ ఫిక్స్ కూడా ఆలోచిస్తున్నాడు. మిగిలిన ప్రయాణీకులని గమనిస్తూ ఉన్నాడు. కొంతమంది ఎడ్లబండిలో వెళ్తున్నారు. కొంతమంది రిక్షాలో వెళ్లిపోతున్నారు.  అక్కడే ఏనుగు నడిపే వాడు ఉన్నాడు.  ఫిలియాస్ ఫాగ్ అతని దగ్గరికి వెళ్లి బేరం మొదలు పెట్టాడు. అలాహాబాద్ వెళ్ళాలి మేము. నువ్వు చూస్తున్నావు కదా ఈ ఏనుగుని నేను కొంటాను. నీకు కావలసిన డబ్బు ఇస్తాను. నువ్వే మమ్మల్ని అలాహాబాద్ చేర్చాలి, అని బేరం పెట్టాడు. ఆ మావటి వాడు తాను అనుకున్నదాని కన్నా ఫిలియాస్ ఫాగ్ ఎక్కువ ధనం ఇస్తానని అనగానే, ఆ ఏనుగుని అమ్మేశాడు. కానీ మరి తాను మావటి వాడుగా వుండి  అలాహాబాద్ వస్తాను అని అన్నాడు. ఇలా జరుగుతూ కొంతదూరం ప్రయాణం చేసే సరికి, పెద్ద అడవిలోకి ప్రవేశించారు. సింహాల అరుపులు వినిపిస్తున్నాయి. చీకటిగా ఉంది. ఆ అందమైన ఏనుగు పేరు పూని. మావటివాఁడు దానికి కొంత విశ్రాంతి యివ్వాలని ఒక చెట్టు కింద ఆపారు. ఆ చీకట్లో వాళ్ళు అలాగే ఉండిపోయారు. అలా ఎవరి ఆలోచనల్లో  వారు ఉండగా పెద్ద కోలాహలం, అరుపులు, కేకలు, డప్పులు, వాయిద్యాలు, మోతలుఅన్నీ వినిపిస్తున్నాయి. 

వీళ్ళందరూ ఆశ్చర్య పడ్డారు ఏమిటా హడావిడి అని. అదేమిటో నేను కనుక్కుని వస్తానని, మీరిక్కడ ఉండండని మావటి వాడు దగ్గరలో ఆ కోలాహలం కనిపిస్తున్న ఆ ఊరి వైపుగా వెళ్ళాడు. అక్కడంతా జనాలు ఉన్నారు. దూరంగా కాగడాల వెలుతురు. ఆ వెలుగులో కొన్ని దృశ్యాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ హుషారుగా, పిచ్చి పెట్టినట్లుగా గంతులు వేస్తున్నారు. మామూలు పరిస్థితిలో వున్నట్టుగా నాకు కనిపించటంలేదు. ఈ లోగా మావటివాఁడు వచ్చాడు. "అయ్యా! ఈ వూళ్ళో ముసలి రాజుగారు చనిపోయారు. ఆయనని దహనం చేయాలి". 

"అయితే మరి అంత హడావిడి ఏమిటి? ఆ జనం అంతా బాగా తాగినట్లుగా నృత్యాలు చేస్తున్నారు, అరుపులు, కేకలు ఏమిటి? అంటే..... 

"ఏమీలేదు.... భార్యను కూడా దహనం చేస్తారు. ఈ ముసలి రాజుగారి భార్య చాలా చిన్నది. బొంబాయిలో ఒక ధనవంతుడైన వర్తకుడి కుటుంబంలో పుట్టింది; పాశ్చాత్య  విద్యలన్నీ నేర్చుకుంది. ఆంగ్ల భాష అనర్గళంగా మాట్లాడగలదు . యూరోపియన్ పద్ధతులన్నీ తెలుసు. తండ్రి పోయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో  ఈ ముసలి రాజుగారితో వివాహం అయి, యువరాణి అయింది. పెళ్ళైన మూడు నెలలకే ఆ ముసలి రాజు గారు  చనిపోయారుట. ఆయన చితి మీద దహనం చేయడానికి యువరాణిని కూడా తీసుకొచ్చారు. అందుకే అక్కడ, అరుపులు, కేకల తో, తాగి నృత్యాలు చేస్తున్నారు" అంటూ మావటివాఁడు విషయం చెప్పేసరికి ఫిలియాస్ ఫాగ్ కి చాలా కోపం వచ్చింది. "ఇదేమిటి? ఈ వింతఆచారం ఏమిటి? అమానుషం. మానవులు బతికున్న ఆ అమ్మాయ్హిని సజీవంగా దహనం చేయడం ఏమిటి? ఎలాగైనా సరే ఆ అమ్మాయిని రక్షించే తీరుతాను" అనిచెప్పాడు. దానికి సమాధానంగా ఆ మావటివాఁడు, " బాబూ! అక్కడికి వెళ్లారంటే, మీమాట విన్నారంటే వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని చంపేస్తారు. ఇది ఎప్పడినించో వస్తున్న ఆచారం. మీరు చెప్పినట్లు ఎవరూ వినరు, జాగ్రత్త " అన్నాడు

"నేను మిమ్మల్నెవరినీ రమ్మనటం లేదు. నేనొక్కడినే వెళ్లి ఆమెని రక్షిస్తాను అని ఫిలియాస్ ఫాగ్ చెప్పాడు. దానికి సమాధానంగా

జోన్ పాస్ పర్ట్ " అయ్యా! నేను కూడా మీతో పాటు మీకు సహాయంగా వస్తాను" అని చెప్పటం జరిగింది. 

ఆ యువరాణి గారి పేరు ఔదా! జోన్ పాస్పర్ట్,  ఫిలియాస్ ఫాగ్ ఈ ఇద్దరూ కూడా ఆ యువరాణి ని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నారు. జనం అంతా విపరీతంగా ఉన్నారు. తెల్లవారేసరికి ఈ సతీ సహగమనం చేసేయాలి. జనం అంతా చాలా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. యిప్పుడు కనక వెళ్తే  ప్రమాదం అని గమనించారు.  ఫిలియాస్ ఫాగ్ చాలా సేపు చూసాడు. అతనిలో ఒక్కసారిగా ఆవేశం వచ్చేసింది. వెంటనే అతను ఆ జనం మధ్యలోకి ఉరికాడు. ఈలోగా జనం అంతా ఆశ్చర్యపోతూ అరుపులు, కేకలూ మొదలు పెట్టారు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసేసరికి ప్రజలకీ, ఫిలియాస్ ఫాగ్ కి, ఈ యిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ చనిపోయారన్న ఆ ముసలి రాజావారు నిజానికి చని పోలేదు. అతడు అమాంతంగా చితినుండి లేచి, ముందే కట్టలు విప్పుకున్నాడు కాబోలు, ఔదా ని చేతితో పట్టుకుని జనానికి దూరంగా అక్కడి నుంచి వేగంగా పరుగెత్తి పారి పోసాగారు. కాసేపటికి ఫిలియాస్ ఫాగ్ కి అర్ధమైంది, ఆశ్చర్యం వేసింది.  ఆ పరుగెత్తి వెళ్ళిపోతున్నవాడు జోన్ పాస్ పర్ట్ అని . లోగడ యితడు ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు కదా? అన్నింట్లో అనుభవం ఉంది. అన్ని వృత్తుల్లో ఉన్నాడు. అని గమనించి తాను కూడా బయలుదేరి ఆ ఫూని, ఆ ఏనుగు పేరు ఫూని అని చెప్పున్నాము కదా! అక్కడికి బయల్దేరారు. ఆ చీకట్లో అందరూ, తమ ప్రయాణాన్ని సాగించి, తెల్లవారు ఝామున అలాహాబాద్ కి చేరారు. అలాహాబాద్ నించి వారు కలకత్తా కి వెళ్ళాలి. ఫిలియాస్ ఫాగ్ చాలా సంతోషించి ఆ మావటి వాడితో, " ఈ ఏనుగుని నీకు బహుమతిగా యిచ్చేస్తున్నాను. నువ్వు నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు". అని చెప్పాడు.

 ఆ మావటివాఁడు పదే పదే కృతజ్ఞతలు చెప్తూ చాలా చాలా సంతోషించాడు.  మళ్ళీ ఆ ఏనుగుకి  యజమాని అయ్యాడు కదా! హాయిగా ఆ ఏనుగు మీద తిరిగి వెనక్కి వెళ్ళి పోయాడు. 

ఔదా రాణికి అప్పుడప్పుడే తెలివి వచ్చింది. హౌరాకి వెళ్ళవలసిన రైలు సమయానికి వచ్చింది. రైల్లోకి ఎక్కాక జరిగిన సంగతంతా ఫిలియాస్ ఫాగ్, మరియు, జోన్ పాస్ పర్ట్ లు వివరించగా ఔదా రాణి గారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతో కృతజ్ఞతా భావం గుబాళించింది. అదేమిటి, ముక్కూ మొహం ఎలియని ఈ పరదేశీయులు ప్రాణాలకు తెగించి నన్ను ఈ విధంగా రక్షించారు... అని కృతజ్ఞతా భావం కలిగి ఉంది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ తెల్లవారు ఝాము అయ్యేసరికి హౌరాలో దిగారు. కలకత్తా నుంచీ వాళ్ళు హాంగ్ కాంగ్  వెళ్లే ఓడను పట్టుకోవాలన్నమాట. అదృష్టం కొద్దీ వీళ్ళు వెళ్లే సరికి ఆ ఓడ  మధ్యాన్నం 12 గంటలకు బయలు దేరుతుందని చెప్పారు. వీళ్ళకి సమయం చాలా ఉందన్న మాట. 

  


మరి ఈ సమాచారం డిటెక్టివ్ ఫిక్స్ కి ఎలా తెగెలిసిందో తెలియదు కానీ అతను కూడా వీళ్ళతో పాటు ఇదే ఓడ ఎక్కి హాంగ్  కాంగ్ కి బయలు దేరాడు. హాంగ్ కాంగ్ కి బయలు దేరిన ఓడ కొంత సమయం సింగపూర్ లో ఆగింది. డిటెక్టివ్ ఫిక్స్ ఒకటే మదన పడ సాగాడు. ఏమిటీ టెలిగ్రామ్ ఇంకా  రానే రాలేదు. మరి టెలిగ్రామ్ వస్తే కానీ నేనేమీ చేయలేను. హాంగ్ కాంగ్ కూడా ప్రస్తుతం బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉంది కదా!. బహుశా నేను హాంగ్గ్ కాంగ్ వెళ్లేసరికి టెలిగ్రామ్ వచ్చే ఉంటుంది. ఎలాగైనా సరే నేను ఫిలియాస్ ఫాగ్ ని అరెస్ట్ చేయిస్తాను అనే తన పధకాలు తాను వేసుకుంటూనే ఉన్నాడు. అయితే స్ ఫాగ్ ని అరెస్ట్ చేయిస్తాను అనే తన పధకాలు తాను వేసుకుంటూనే ఉన్నాడు. అయితే హాంగ్ కాంగ్ నించే వాళ్ళు జపాన్  వెళ్ళవలసిన ఓడ ఎక్కాల్సింది. కానీ దురదృష్ట వశాత్తు వాతావరణ పరిస్థితులు సరిగా లేనందు వలన వీళ్ళెక్కిన ఓడ ఒక రోజు ఆలస్యంగా హాంగ్కాంగ్ కి చేరింది. అప్పుడు జోన్ పాస్ పర్ట్ చాలా నిరుత్సాహపడ్డాడు.

"అయ్యో! నా యజమాని పందెం ఓడిపోతాడేమో! ఇప్పుడెలా? ఒకరోజు మనకి పోయింది". అంటే ఫిలియాస్ ఫాగ్ ఎటువంటి త్రొట్రుపాటు లేకుండా, ఆ పార్టీలోనే ఒక చోట వున్న  యజమాని దగ్గరకెళ్ళి ,యోక్లోహోమాకి వెళ్లే ఓడ ఎప్పుడు బయలు దేరుతుంది?" అని అడిగాడు. "

"రేపు పొద్దున్నే బయలు దేరుతుంది. ఎందుకంటె ఈ ఓడలో కొన్ని మరమత్తులు జరగాల్సి ఉన్నాయి  ఆ మరమ్మత్తులన్నీ  చేసే సరికి ఆలస్యమవుతుంది. అవన్నీ అయ్యాక బయలు దేరుతాము,"అని చెప్పాడు ఆ బోటు యజమాని. అంటే వీళ్ళు ఈ ఓడ ఎక్కి యొకఁలోహోమా అంటే జపాను చేరి అక్కడ హాంగ్  కాంగ్ తప్పిపోయిన ఓడ ఎక్కి పై (ముందు) ప్రయాణం చేసుకోవాలన్న మాట. ఆ పడవ యజమాని అలా చెప్పేసరికి జోన్ పాస్ పర్ట్  ఎందుకో సంతోషించాడు. ఆ పడవ యజమానికి ధన్యవాదాలు చెప్పాడు. ఫిలియాస్ ఫాగ్ కొంచెం ఆశ్చర్యపడ్డా బయటికి ఏమీ మాట్లాడలేదు. ఈ విధంగా వారంతా వెనక్కి వెళ్లిపోయారు. అంటే 6 నవంబర్ న వాళ్ళు చేరి ఆ ఓడని ఎక్కవలసిందే . కానీ వాతావరణం ప్రతికూలంగా ఉండటం వలన వాళ్ళు 7 నవంబర్ కి చేరేసరికి ఆ ఓడ వాళ్ళని వదిలేసి హాంగ్ కాంగ్ కి వెళ్ళిపోయింది. అందుకే ఫిలియాస్ ఫాగ్ యింకొక ఓడని ఎక్కి హాంగ్ కాంగ్ కి వెళ్లి అక్కడ ఆ పెద్ద ఓడని ఎక్కాలని ప్రయత్నం అన్నమాట. ఈ వివరాలన్నీ ఫిలియాస్ ఫాగ్ తన నోట్ బుక్ డైరీ లో ఎప్పటికప్పుడు రాసుకుంటూ వున్నారు.