రాంలాల్ ప్రభుజి
లీల - మోహిని కథ - Part 2
“అలా చూస్తూ నిలబడ్డారేమిటీ! లోపలకి రండి” అని ఆవిడ ఆహ్వానించింది. చక్కటి పళ్ళవరస చిరునవ్వు నవ్వుతుంటే తళుక్కుమని
మెరుస్తూ ఆకర్షిస్తున్నాయి. ఆమె యొక్క ప్రతి అణువులో అందం అలా ఉట్టి పడుతూ ఉంది. ఆ
నడక... ఆ మాట ... ఆ ఎత్తు... ఆ అవయవ సౌష్టవం..... వర్ణించలేనంత అందంగా ఉంది.
ఏదో ప్రబంధ కావ్యంలో ఆవిడ నాయిక మాదిరిగా, ఒక గ్రీకు సౌందర్యరాశిలాగా అతనికి కనిపించసాగింది. ఏమిటి నేను ఎందుకు ఇలా
ఆలోచిస్తున్నాను?నాకు ఈ రోజు ఏమైంది? అని అతను మనస్సులో అనుకుoటున్నాడు. లోపలకు
అడుగుపెట్టగానే దాదాపు ఒక పన్నెండు అంగుళాల దళసరి మెత్తటి తివాచి క్రింద నేలమీద
పరచి ఉంది. అలాగే పెద్ద రాజోచిత సింహాసనాలు అక్కడ ఉన్నాయి. అదంతా
మెత్తటి మక్మల్ బట్టతో అలంకరించినట్టుగా ఉంది. అతన్ని ఆ ఆసనం మీద కూర్చోమని
చెప్పి, ఆవిడ ఎదురుగా ఉన్న ఆ ఆసనం మీద కూర్చుని, “ఏమిటీ ఆలోచిస్తున్నారు? పరధ్యానoలో ఉన్నారు. మీ చుట్టూ ఉన్న అందాన్ని మీరు ఆస్వాదించకుండా ఏవేవో పాత
ఆలోచనలలోకి మీరు ఎందుకు వెళుతున్నారు?” అని ప్రశ్నించింది.
తను ఆలోచిస్తున్నట్టూగా ఆవిడ ఎలా
గ్రహించింది ! అన్నది కూడా అతనికి కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఎవరైనా
ఒక అపరిచిత వ్యక్తి, అందులో ఒక అందమైన స్త్రీ ఎదురుగా ఉన్నపుడు తేరిపారిగా
వారిని చూడటం అనేది సభ్య ప్రపంచంలో జరగదు కదా! మరి తను సభ్య ప్రపంచం లోంచి
వచ్చినవాడైఉండి కూడా ఆ సభ్యతను మరిచి ఆమెను అదే తేరిపారిగా చూడడం ఏమాత్రం ఉచితంగా
ఉంటుంది? అని అనుకుని కూడా ఆమెను నఖశిఖ పర్యంతం చూస్తూనే
ఉన్నాడు. దాదాపు ఆవిడ ఐదు అడుగుల ఆరు ఏడు అంగుళాలు ఉంటుంది. చక్కటి శరీర సౌష్టవం.
పాల రాయి మాదిరి వంటి సున్నితమైన అందమైన మెరుస్తున్నటువంటి చర్మం, చక్కటి పళ్ళ వరుస, నల్లటి శిరోజాలు, అద్భుతమైన సమ్మోహనాశక్తి కలిగిటువంటి కళ్ళు,నవ్వుతున్నప్పుడు ఆ నవ్వులో ఒక రకమైన సమ్మోహనశక్తి కలిగిన ఒక జీర ఆ గొంతులో
నుంచి రావటం, ఇవన్ని తాను అసలు తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒక
సమ్మోహనాశక్తి, ఏదో ఒక ఆకర్షణాశక్తి అతన్ని బలంగా ఆమె వైపు
లాగసాగింది. అతను సభ్యత అనేది పాపం మరిచిపోయాడు అని తెలుసుకున్నాడు. కాబట్టి కొంచెo సిగ్గు కూడా పడుతూ ఉన్నాడు అప్పుడు కొంత ధైర్యం తెచ్చుకుని అతను, “ఎవరు మీరు? ఎందుకు మీరు నన్ను ఇలా మీ దగ్గరకి రప్పించుకున్నారు? నా దగ్గర నుంచి తీసుకున్న పెన్ను నాకు ఇవ్వకుండా ఎoదుకు మీ వెంట పరిగెత్తించేటట్లు చేసారు? అసలు మనం ఎక్కడకి వచ్చాము? ఈ భవనం ఏమిటి? ఈ ఉద్యానవనం ఏమిటి? అసలు మీరు ఎవరో, ఏమిటో నాకేమీ అర్ధం కావటం లేదు అంతా
అయోమయంగా ఉంది. కాని ఒకటి మాత్రం నాకు తెలుస్తుంది. మీరు మనవ మాత్రులు కారు”అని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. ఏమిటీ ఇదంతా? ఈ కథ అంతా నాకు అర్ధం కావటం లేదు దయచేసి కొంచెం చెప్పండి అన్నాడు. దానికి
సమాధానంగా ఆవిడ పకపకా నవ్వి ఇలా అన్నది “మొత్తానికి నువ్వు చాలా తెలివిగలవాడివే. అందమే కాదు తెలివితేటలు కూడా ఉన్నాయి.
అందుకే నేను నీ వంటే ఆకర్షిoపబడ్డాను” నిజమే నేను నువ్వు అనుకుంటున్నట్టుగా మానవమాత్రురాలను మాత్రం కాదు.
అయితేనేం? ప్రస్తుతం మనిషి అవునా కాదా అనే ప్రశ్నఎoదుకు? ఏం సంబంధం ఉన్నది? ఎదురుగుండా ఒక అద్భుతమైన సౌందర్యరాశి ఉంది. ప్రపంచంలో
చాలా శక్తి వంతురాలు. ఎంతో ధనం ఉంది. మనుషులకి కావలసింది ఏమిటీ? వారికి కావల్సింది అంతా వారి కోరికలన్నీఅనుభవించటమే కదా! వాళ్ళకి ఐశ్వర్యం, కీర్తి-ప్రతిష్టలు,అందమైన వస్తువులు, అందమైన భార్య కావాలి. సంఘంలో హోదా ఉండాలి. వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేసే
అధికారం ఉండాలి. ఇదేగా ప్రస్తుతం మనుషులంతా కోరుకునేది. అవన్నీ కూడా నేను నీకు
సమర్పించగలను. కాబట్టి ప్రస్తుతం నేను ఎవరని అన్నది ఆలోచించటం మరిచి పో! ఇప్పుడు
జరగవలసింది, ముందు జరగబోయేది అది నువ్వు ఆలొచించుకో! నేను
చెప్పినట్టుగా మనిషికి కావలసిన సర్వ సంపదనీ, కోరికలనీ క్షణం లో తీర్చగల శక్తి నా దగ్గర ఉంది. నీకు ఏం కావాలో చెప్పు. నీ
జీవితాన్ని స్వర్గమయం చేస్తాను. నీకు ఏం కావాలో అది నేను క్షణంలో
సమకూర్చుతాను. ప్రస్తుతం దాని గురించి ఆలొచించు. నీ అదృష్టo మరి నిన్ను వెతుక్కుంటూ వచ్చిoది కదా! దానికి నువ్వు గర్వ పడాలి. సంతోషించాలి, ఆనందించాలి, ఆస్వాదించాలి కాబట్టి మిగితావన్నీ నీవు
మరిచి పో !”.అని చెప్పింది. వెంటనే రవి కాంతు అది ఎలా
సాధ్యం అవుతుంది? నీవు ఎవరో, నీ చరిత్ర ఏమిటో , ఇవన్నీ తెలుసుకోకుoడా మన ఇద్దరికీ సంబంధం ఎలా ఏర్పడుతుంది? మనస్ఫూర్తిగా కదా మనకి సంబంధం ఏర్పడాలి. మనిద్దరం ఆనందించాలంటే పరస్పర అవగాహన
అంటూ కొంత ఉండాలి కదా! నేను మానవమాత్రుడిని. మరి నువ్వు మానవమాత్రురాలిని కాదని
చెప్తున్నప్పుడు మనిద్దరికి అసలు పొత్తు ఎలా కుదురుతుంది? ఇవన్నీ మనం ఆలొచించవలసిన
ప్రశ్నలే కదా! ఇలా ఆలోచించటం నా సంస్కారంలోనే ఉంది, నా స్వభావంలోనే ఉంది కాబట్టి
నేను మిమ్మల్ని అడిగాను. దయచేసి మీ సంగతి నాకు చెప్పండి అని చాలా మర్యాదగా
అడిగాడు. దానికి ఆ అమ్మాయి నవ్వుతూ సరే ప్రస్తుతానికి నన్ను మోహిని అని పిలువు
చాలు. నీకు అందంతోపాటు సంస్కారం కూడా ఉంది. మామూలు మనుషులలో లేనటువంటి మంచి
సంస్కారాలు నీ దగ్గర ఉన్నయి కాబట్టే నువ్వంటే నాకు ప్రేమే కాదు కొంచెం గౌరవం కూడా
ఉంది. మామూలు తుచ్ఛ మానవుల కన్నా నువ్వు కొన్ని మెట్లు పైననే ఉన్నావు.
అందుకే నువ్వు నాకు నచ్ఛావు సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు? తరవాత మాట్లాడుకుందాం.
నేను ఎవరినో, ఏమిటో తరవాత చెప్తాను. నువ్వు చాలా అద్భుతంగా వయోలిన్ వాయిస్తావు
కదా! ఒక్కసారి నీ వయోలిన్ వినాలని వుంది అని యెంతో ప్రేమగా అడిగేసరికి రవికాంత్
ఆశ్చర్యపడ్డాడు. అదేమిటి ఈ అమ్మాయి ముక్కు మొహం నేను ఎప్పూడూ చూడలేదు
మొట్టమొదటిసారి కదా కలుస్తున్నాను అయినా మరి నా సంగతులన్నీ ఎలా తెలుస్తున్నాయి?
నేను వయోలిన్ వాయిస్తాను అని ఈ అమ్మాయికి ఎలా తెలుసు?అని మనస్సులో
ఆలోచిస్తున్నాడు. నీ ఆలొచనలన్నీ నాకు తెలిసిపోతున్నాయి. నువ్వు వయోలిన్
వాయిస్తావని నాకు ఎలా తెలిసింది? అని అనుకుంటున్నావా నాకు అన్నీ తెలుసు. నేనే
పనైనా క్షణంలో చేయగలను. మనుషులు ఏం ఆలొచిస్తున్నారో కూడా నాకు తెలుస్తూ ఉంటాయి.
ఇవన్నీ వదిలేసేయి. నువ్వు నాకు ఒక మంచి పాటని వినిపిస్తావా లేదా అని అడిగింది. అది
ఎలా కుదురుతుంది నేను నా వయోలిన్ పెట్టెని నాతో తీసుకురాలేదు. అది ఎక్కడో నా
గదిలో ఉంది. నేను నా వయోలిన్ తో తప్ప వేరే వాళ్ళ వయోలిన్ తో వాయించలేను. మరి అది
ఇప్పుడు ఎలా సాధ్యం? అని అతడు అడిగాడు. అది ఎలా సాధ్యమా? అని ఆవిడ చప్పున లేచి
ఒక్క క్షణంలో తన కుర్చీ మించి దిగి ఎదురుగుండా ఉన్న గోడ లోంచి ఆవిడ అద్రుశ్యం
అయిపోయింది.
(మిగతాది వచ్చే భాగంలో)