కణ్వద మహర్షి- కణ సిద్ధాంతం
జన్యు కణాల
గురించి మరి కొంత సమాచారం నేను కణ్వద మహర్షిగారితో సంభాషించాక అదంతా నెమరు
వేస్తూ DNA గురించి ఎంతో ఆసక్తిగా చాలా విషయాలు తెలుసుకోవాలని పదే పదే దాని
గురించి ఆలోచిస్తుండేవాడిని.
ఒక రోజు కంపాలలో
(అంటే ఉగాండా యొక్క రాజధాని) ఒక ఉద్యానవనానికి (Botanical gardens) వెళ్లాను.
అద్భుతం ఏమిటంటే అక్కడ ఒక రుద్రాక్ష వృక్షం ఉంది. అక్కడ కొంత మేర వరకు దట్టమైన
అడవి ప్రాంతమున్నది. అక్కడే ఒక ఏకాంత ప్రదేశం చూసుకుని, అక్కడకి వెళ్లి ఒక విరిగిన
వృక్షపు మాను (కొమ్మ) మీద కూర్చుని జన్యు కణాల గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు
ఎదురుగా నాకు కణ్వద మహర్షి ప్రత్యక్షమయ్యారు. ఎటువంటి సంభాషణలు జరపకుండానే నాయనా !
నీవు జన్యు కణాల గురించే ఆలోచిస్తున్నావు కదా ! నేను వాటి గురించే మరి కొన్ని
వివరాలు చెప్పడానికి వచ్చాను అని సరాసరి అసలు విషయానికే వచ్చేశారు. నాయనా ! లాహిరి
! ఈ రోజు నీ జీవితంలో మరపు రాని అద్భుతమైన రోజుగా భావించ వచ్చును. అయితే
ప్రస్తుతం నీవు కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నావు. అది కొంచెం తగ్గించుకొని మనస్సుని
ప్రశాంతంగా పెట్టుకో. అప్పుడే నేను
చెప్పిన విషయాలు నీకు బోధ పడతాయి.
నేను చెప్పబోయే విషయాలు మన సనాతన విజ్ఞానానికి మరియూ ఆధునిక విజ్ఞానానికి ఒక
వారధి లాగా (ఒక వంతెనలాగా like bridge) ఉండి పోతుంది. ముందు ముందు ఈ విషయాలన్నీ కూడా నీవు చాలా మందికి
చెప్పవలసి వస్తుంది. ఎంతో మంది అపరిచిత వ్యక్తులు నీకు పరిచిత వ్యక్తుల్లాగా
కనిపిస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా మనస్సుని ప్రశాంత
పరచుకొని వినవలసిందిగా ఆయన నన్ను కోరారు. నేను చెప్పబోయే ఈ విజ్ఞాన పరమైనటువంటి
విషయాలు నీవు మీ వెబ్ సైట్ లో పొందు పరచు. ఆసక్తి ఉన్నవారు, ఈ విజ్ఞానాన్ని మనసారా
కోరుకునేవారు ఏదో ఒక రోజు మీ వెబ్ సైట్ లోని ఈ విషయాలన్నీ చదువుతారు. వారు నేను
చెప్పినటువంటి ఈ విజ్ఞానపరమైన విషయాలు మరియూ ఈ ఆధునిక శాస్త్రజ్ఞులు
చెప్పుతున్నటువంటి విషయాలను, ఈ రెండిటినీ అర్థం చేసుకుని సత్యమనేది ఒక్కటే
వాక్కుగా బయటకి వస్తుందని తెలుసుకుంటారు. అంటే నేను ఎప్పుడో ఏ విజ్ఞాన పరమైన
శాస్త్రీయ పరికరాలు లేకుండా, ఏ విషయమైతే చెప్పానో అదే విషయాన్ని ఇప్పుడు అత్యాధునిక యుగంలో, భౌతిక శాస్త్రజ్ఞులు కనిపెట్టినటువంటి ఆధునిక పరికరాల
ద్వారా నేను చెప్పినది నిజమేనని వారు అంగీకరిస్తారు.
ఇప్పుడు ఈ విషయాలన్నీ చదివే కొంత మందికి శాస్త్ర పరిజ్ఞానం ఉండవచ్చును
కొంతమందికి లేక పోవచ్చును. వారందరూ కూడా సత్యం ఒక్కటే అనే విషయాన్ని
నిర్దారించుకుంటారు. అందుకోసమే నేను నీకు ఈ విషయాలన్నీ చెప్పుతున్నాను. జాగ్రత్తగా
విను. నేను చెప్పినటువంటి ఈ పై భూమికలోని విషయాలు నమ్మ శక్యంగా లేనప్పటికీ
ఇదంతా వారు చదువుతున్నప్పుడు ఆహా ! ఇవన్నీ మనం నమ్మశక్యంగా లేవే ! అని చెప్పుకున్నాము, కాని శాస్త్రజ్ఞులు కూడా ఇవే చెప్తున్నారు అని
వాళ్ళు ఎంతో ఆశ్చర్య పోతారు. మానవుని జన్యు కణం ఎంతో అద్భుతమైనదే కాకుండా చాలా
అందంగా కూడా ఉంటుంది. ప్రకృతియే దాన్ని ఎంతో అందంగా, సమతూకంగా నిర్మించింది.
దీనిలో పనికిరానిదంటూ ఏమీ లేదు. కొన్ని కోట్ల భాగాలు కూడా ఏదో ఒక ఉపయోగకరమైన
విధులని నిర్వహిస్తూ ఉంటాయి.
ఇప్పుడు అధునాతనంగా శాస్త్రజ్ఞులు అనుకుంటున్నట్టుగా
దీనిలో ఏదీ కూడా పనికిరాని చెత్త పదార్థంగా లేదు. అన్నీ పనికివస్తాయి. ఏదైతే
శాస్త్రజ్ఞులు గందరగోళంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది అని అనుకుంటున్నారో అవన్నీ
భ్రమలేనని ముందు ముందు వాళ్లకి తెలుస్తుంది. అద్భుతమైన ప్రకృతి నిర్మాణంలో
అస్తవ్యస్తమంటూ ఏదైనా ఉండడానికి ఆస్కారం లేదు. కాకపొతే పై భూమికలో ఉన్న ఈ విషయాలు
క్రింది భూమికలో ఉన్నవాళ్ళు విమర్శించేటప్పుడు , ప్రయోగాలు చేసేటప్పుడు వారికి ఈ
పరిస్థితి అంతా గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. అది వాస్తవమే. కాని శాస్త్రజ్ఞులు చాలా కాలం వరకు ఈ జన్యు కణం ఒక దారపు పోగు వలే
తిన్నగా ఉంటుంది అని భావించే వారు. ఈ జన్యుకణం అనేది తిన్నగా దారపు ప్రోగు లాగా
ఉండదు (it is not straight strand but it is like a loop) దీని కొసలు కాస్త వంకరగా
ఉంటాయి అంటే loop మాదిరిగా ఉంటాయి అనే అద్భుత విషయాన్ని వాళ్ళు ఈ మధ్యనే
కనుక్కున్నారు. అయితే ఈ విషయం నేనెప్పుడో చెప్పాను. దాని గురించిన ప్రస్తావన ఈ
మధ్య వెలువడిన “శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం” లో ( 3rd Chapter) వివరించ బడింది.(కానద మహర్షి) మన శరీరంలో కనబడనటువంటి సూక్ష్మమైన
కణాలకంటే అతి సూక్ష్మమైన కణాలు ఉంటాయి.
వాటిని జన్యు కణాలు అని అంటారు. దాంట్లోంచి విద్యుదయస్కాంత రవ్వలు బయటకి
వస్తుంటాయి. ఈ జన్యు కణం మత్స్యాకారంలో ఉంటుంది అంటే కాస్త వంకరగా ఉంటుంది అని
చెప్పాను దానిని ఇంగ్లిష్ లో loop అని అంటారు. అయితే మనిషి యోక్క ఆయుర్దాయం తగ్గుతున్నప్పుడు ఈ జన్యు కణం
యొక్క పరిమాణం కూడా తగ్గుతుంది అని వాళ్ళు గ్రహించారు. కొద్ది వంకరగా, లూపులాగా ఉన్న జన్యు కణాలు కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి. వీటి కొసలు ఒక దాని
మీద ఒకటి కప్పబడి ఉంటాయి. ఈ విధంగా కొన్ని కోట్ల జన్యుకణాలు ఒక దాన్నొకటి
స్పర్శిస్తూ ఉంటాయి. ఈ వంకరగా లేక లూపు లాగా ఉన్న జన్యు కణంలో ఒక అద్భుతమైన
విద్యుదయస్కాంతం ప్రవహిస్తూ ఉంటుంది. ఒక కొస నుండి ఇంకొక కొసకు, దాని నుండి ఇంకొక కొసకు, ఈ మాదిరిగా అనేక కోట్ల సంఖ్యలో ఉన్న జన్యు కణాలు తమ ప్రకంపనల ద్వారా
సమాచారాన్ని మెదడు ద్వారా ఒక న్యూరాన్ (neuron) మరియూ ఇంకొక న్యూరాన్ కి (neuron), శరీరంలో ఉన్న కండరాలకి (muscles) ఈ సమాచారం ప్రకంపనల ద్వారా పంపిస్తూ ఉంటాయి. అంటే ఈ శరీరంలో జరిగే
విధులన్నిటికీ ఈ విద్యుత్ అయస్కాంతం యొక్క పాత్ర ఎంతో ఉంది. ఈ విధంగా ఈ విద్యుత్
అయస్కాంతం జన్యు కణం యొక్క కొసను ఇంకొక జన్యు కణం యొక్క మొదలు, దాని యొక్క కొస
దాని ప్రక్కన ఉన్న జన్యు కణం యొక్క మొదలు ఈ విధంగా ఒక దాన్నొకటి స్పర్శించుకుంటూ
అవి తక్షణమే సమాచారాన్ని మిగతా అవయవాలకి ప్రసరింప చేస్తూ ఉంటాయి. అంటే ఈ విద్యుత్
అయస్కాంతానికి అంత ప్రముఖమైన పాత్ర ఉందన్న మాట. అయితే ఈ విద్యుదయస్కాంతం ఎంతో
సూక్ష్మాతి సూక్ష్మమైనది. అది ఆధునిక పరికరాలకి అందనిది. దీని శక్తిని అంచనా
వేయడానికి కాని, కొలవడానికి కాని ప్రస్తుతం అధునాతనమైన పరికరం ఇంకా
కనుక్కోబడ లేదు. ఈ విద్యుదయస్కాంతం యొక్క ప్రవాహం నిరాటంకంగా (free flow) ఉంటుంది అని, DNA ఒక అద్భుతమైనటువంటి సూపర్ కండక్టర్ లాగా ఉంటుంది.
మరి ఎప్పుడైతే మనం జన్యు కణాన్ని ఒక అయస్కాంతం అని అనుకుంటున్నామో అప్పుడు
దానికి తప్పకుండా అయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా ! ఈ విద్యుదయస్కాంతం ఒక లూపులాగా
ఉండే జన్యుకణంలో చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ కొన్ని కోట్ల జన్యు కణాలు ఆయస్కాంతం
లాగా పని చేస్తాయి కాబట్టి ఈ సామూహిక జన్యు కణాల అయస్కాంత క్షేత్రం చాలా విస్తారంగా, ప్రభావితంగా ఉంటుంది. అయితే ఈ విద్యుదయస్కాంతం దైవిక శక్తికి
సంబంధించినది. ప్రయోగ శాలలో తయారుచేసే అయస్కాంతానికి భిన్నంగా ఉంటుంది.
ఎప్పుడైతే
మన మానవ శరీరం ఒక అయస్కాంతం అని అనుకుంటామో అప్పుడు దీనికి కూడా అయస్కాంత ధర్మాలు
ఉంటాయి కదా! ఎప్పుడైతే ఒక విద్యుదయస్కాంత క్షేత్రానికి దగ్గరగా మరొక అయస్కాంత
క్షేత్రం వచ్చినప్పుడు వాటిలో ఒక చర్య జరుగుతుంది. మరి దాన్నేbasic physics లో inductance అని అంటారు. inductance అంటే ఒక అద్భుతమైన స్థలం లేక మేజిక్
స్పేస్ అని చెప్పవచ్చును. ఇక్కడ ఈ magic space లో ఈ రెండు అయస్కాంత క్షేత్రాలకి
అనుసంధానం జరిగి అవి ఒక దానితో నొకటి పెన వేసుకున్నట్టుగా అయిపోయి సమాచారాన్ని
ప్రకంపనల ద్వారా అవి పంపించుకుంటూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే అవి ఈ విధంగా
సంభాషించుకుంటూ ఉంటాయి. అవి సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటూ ఉంటాయి.
ఈ విధంగా మానవ జన్యు కణం ఒక ఆయస్కాంతము.
మరి మన భూమి కూడా ఒక అయస్కాంతమే కదా! ఎప్పుడైతే మనుష్యుల జన్యు
కణాలనుంచి నుంచి వెలువడిన సామూహిక అయస్కాంత క్షేత్రం దగ్గరలో ఉన్న భూమి యొక్క
అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు పైన చెప్పిన భౌతిక శాస్త్రపు ధర్మమే అనుకోండి
లేక సూత్రమే అనుకోండి పైన చెప్పిన విధంగా వాటిలో సమాచార మార్పిడి
జరుగుతుంది. ఈ విధంగా సమాచారాన్ని పంపించి అవి సంభాషించుకుంటాయి. ఇప్పుడు అర్థం
అవుతుంది కదా భూమికి మనుష్యుల యొక్క జన్యు కణాలకి కల దగ్గరి సంబంధం! నేను చాలా ఆశ్చర్య పోయాను. ఈ మనుష్యుల యొక్క జన్యు కణాల సామూహిక
అయస్కాంత క్షేత్రాన్ని బట్టి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం తదనుగుణంగా మారుతూ
ఉంటుంది.
ఈ విధంగా పరస్పరమూ ఒక దాని నొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా
భూమినుండి బయల్పడే ప్రకంపనల ద్వారా అవి మనుష్యుల యొక్క జన్యు కణాలతో మాట్లాడుతూ
ఉంటాయి. ఆలోచన అన్నది కూడా ఒక ప్రకంపనయే కదా ! ఈ విధంగా 1987 లో సామూహిక ఆధ్యాత్మిక సమావేశం భారత దేశంలోని హిమాలయ పర్వత
ప్రదేశంలో శంబల అనే ప్రదేశంలో జరిగింది. ఆ సమావేశానికి వచ్చినటువంటి మహర్షులు
విశ్వామిత్రుడు, జమదగ్ని, పరశురాముడు, విపులాలుడు, నేను అంటే కణ్వద, వసిష్టుడు,
ఇంకా ఎంతో మంది మహర్షులే కాకుండా గ్రహాంతర వాసులు మరియూ అయస్కాంత క్షేత్రానికి అధిపతియైన
ఇంద్రుడు కూడా రావడం జరిగింది.
వారు ఈ భూమి
యొక్క అయస్కాంత క్షేత్రపు ధన విద్యుత్తూ,ఋణ విద్యుత్తుని (polarities)) కొలవడానికి
వచ్చిన ఇంద్రునితో తమ తపస్సుతో, మంచి ఆలోచనలతో , ఆశీర్వాదంతో ఈ భూమి యొక్క ధన
విద్యుత్తూ, ఋణ విద్యుత్తూ (polarities) రెండూ కూడా సమంగా ఉండేటట్టుగా మేము ప్రయత్నిస్తాము కాబట్టి మీరు ఈ
భూమిని కాపాడవలసిందని ప్రార్థించారు. ఈ విశ్వ మానవ సామూహిక చైతన్యం ఈ భూమి యొక్క
అయస్కాంత క్షేత్రాన్ని సమతూకంగా ఉండే దిశగా మారుస్తుంది అని అప్పుడే వాళ్ళు
గ్రహించారు, చెప్పారు కూడా. దీన్ని “pole shifting” అని కూడా అంటారు.
1987లో మొదలయ్యి నిరంతరమూ సజ్జనులు, సన్మార్గులు, మహర్షులు, మహాత్ములు
పంపిస్తున్నటువంటి శక్తివంతమైన విద్యుదయస్కాంత భావ ప్రసారాలు, ప్రకంపనలు వారి
యొక్క ఆలోచన రూపాన్ని దాల్చి ఈ భూ మండలాన్ని,వాటి యొక్క ఆయస్కాంత క్షేత్రాన్ని సమతూకంగా ఉండేటట్టుగా (Equillibriance) ప్రభావితం చేస్తున్నాయి. నేను నీకు లోగడే చెప్పాను కదా ఒక అయస్కాంత క్షేత్రం
ఇంకొక అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుందని. ఇక్కడ మనుష్యుల యొక్క ఆలోచనలు
విద్యుదయస్కాంత ప్రకంపనల మాదిరిగానే ఉంటాయి. ఇవి మరి భూమిని ఉద్దేశించి
మాట్లాడినప్పుడు కాని , భూమికి దగ్గరగా ఉండి భూమిని ఆశీర్వదించినప్పుడు కాని ఒక
అద్భుతమైనటువంటి, కంటికి కనిపించనట్టి సూక్ష్మాతి సూక్ష్మమైన భూమికలో భూమి
యొక్క అయస్కాంత క్షేత్రంలో ఒక మంచి మార్పు వస్తుంది. అయితే ఈ మంచి మార్పు
వచ్చే ముందుగా మనకి భౌతికంగా ఎన్నో అనర్థాలు కనిపిస్తాయి. భూకంపాలు, ప్రళయాలు
మనుషుల ఆలోచనల్లో అనేకమైన మార్పులు మనకి కనిపిస్తూ ఉంటాయి. దీని తర్వాత మనుషుల
యొక్క సామూహిక చైతన్యం మంచిగా కనక ఉంటె త్వరలోనే భూమి మీద తప్పకుండా శాంతి
వాతావరణం ఏర్పడుతుంది.
అందుకే లాహిరి, ఈ భూమ్మీద చాలా ప్రదేశాల్లో ఎన్నో యజ్ఞాలు, యాగాలు, తపస్సు
మూలంగా వచ్చిన శక్తిని భూమికి ధార పోస్తున్నారు అని వివరించగా నేను చాలా ఆశ్చర్య
పడ్డాను, సంతోషించాను కూడా. అతి క్లిష్టమైన ఈ విషయాన్ని ఎంత చక్కగా శాస్త్రీయ
పరంగా చెప్పారో అని నేననుకున్నాను. మరి చైతన్యమంటే ఏమిటీ? మన ఆలోచనలే కదా !
మరి ఆలోచన అంటే ఏమిటీ? అది ఒక విద్యుత్ప్రకంపనయే కదా ! మనం ఏమైనా
మాట్లాడుతున్నప్పుడు లోపల న్యూరాన్ (neuron) అనే కణం నుంచే కదా ఒక విద్యుత్ప్రకంపన
(Electric impulse) బయలుదేరి అది ఒక
ఆలోచన రూపంగా, వాక్కు రూపంగా బయటకు వస్తుంది అని నాలో నేను చెప్పుకున్నాను. ఇంకోక్కసారి
మరి కాస్త వివరంగా చెప్తారా ? అని అడిగాను.
సామూహిక విశ్వ మానవ చైతన్యము
సామూహిక విశ్వ
మానవ చైతన్యమంటే కూడా ఒక అద్భుతమైనటువంటి గొప్ప శక్తి గల అయస్కాంత క్షేత్రమే.
సామూహిక విశ్వ మానవ చైతన్యము, విశ్వ మానవ కల్యాణం గురించి ఆలోచించినప్పుడు ఈ
అద్భుతమైన అయస్కాంత శక్తి , భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని మార్చి వేసి భూమి
యొక్క ధన మరియూ ఋణ విద్యుత్తుల్ని(polarities) సమతూకం చేసినప్పుడు ఈ విశ్వమంతా, ఈ భూగోళ మంతా, ఈ భూ ప్రపంచమంతా కూడా
విశ్వ శాంతి స్థాపన జరుగుతుంది. ప్రజలంతా ఎంతో ప్రేమగా ఉంటూ, పరస్పర సహాయం
చేసుకుంటూ ఎటువంటి తారతమ్యాలు లేకుండా శాంతియుతంగా జీవిస్తూ ఉంటారు.
అందుకని
మేమంతా కూడా మా మా తపశ్శక్తి ప్రసరింప జేసి మనుషుల్లో ఉన్నటువంటి మంచిని జ్ఞాపకం
చేస్తూ ఉంటాము. దీని వల్ల మనుషుల్లో అద్భుతమైనటువంటి ఒక రకమైన మార్పు వస్తుంటుంది.
1987 వ సంవత్సరంనుంచి ఆధ్యాత్మిక బీజాలు, వారి హృదయాల్లో నిక్షిప్తించడం జరిగింది.
అందుకనే చాలా మంది మానవులు యజ్ఞాలు చేయడం, ప్రకృతి వైద్యాన్ని లేక ఆయుర్వేద
వైద్యాన్ని ఉపయోగించడం, సత్సంగాలని చేస్తూ ప్రజలను మంచి మార్గం లోనికి తీసుకు
రావడం అవే చేస్తున్నారు అని ఆయన బోధించి తన ప్రసంగాన్ని కాసేపు ఆపారు.