N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Tuesday 16 February 2016

Mohini Katha-03


శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ – Part ౩

ఈ సంఘటనకి రవి కాంతు కొంచెం బిత్తరపడ్డాడు అదేమిటీ  ఎదురుగుండా నాకు అంత గోడ కనిపిస్తుండగా ఈ గోడలోంచి ఆవిడ ఎలా దూసుకుపోయింది? నా అనుమానం నిజం అయ్యింది.  ఈవిడ మనిషి కాదు. మనిషికి ఇదంతా సాధ్యం కాదు కదా! అని ఆలోచిస్తుండగానే  ఆవిడ క్షణంలో గోడలోంచి ఇటువైపు ప్రవేశించి అతని దగ్గరికి చేరి అతని వయోలిన్ డబ్బా పెట్టెని అందించింది. అతను ఆశ్చర్యపోయాడు. అది తనదే ఎక్కడో హైదర్బస్తీలోని తన అన్నగారి గదిలో తాను ఎక్కడో మూల దాచిపెట్టుకున్న వయోలిన్ డబ్బాని ఆవిడ ఎలా తీసుకువచ్చిందబ్బా? అని కొద్దిగా ఆశ్చర్యం పడడమే కాకుండా కొంచెం భయపడ్డాడు కూడా.  దానికావిడ నవ్వుతూ ఏం ఫరవాలేదు!  నాకు ఉన్న చాలా చిన్న శక్తిని మాత్రమే ఉపయోగించాను అంతే.  అయినా ఇవన్నీ మరిచిపోదాం. చక్కగా ఒక పాట పాడు. ఫలానా పాట  నాకు ఎంతో ఇష్టం అని చెప్పగా అతడు మరింత ఆశ్చర్యపడిపోయి ఆ వయొలిన్ బయటకు తీసి ఆవిడ కోరిక ప్రకారం ఆమెకి కావల్సిన పాటని వయొలిన్ మీద వాయించాడు.

             అంతా అయిపోయినాక సరే! మరి నీ వయొలిన్ డబ్బాని నేను అక్కడ గదిలో పెట్టేస్తాను. ఏం ఫరవాలేదు! నేను ఎవరు, ఏమిటి అని అడుగుతున్నావు కదా నన్ను ప్రస్తుతానికి “మోహిని” అను అని పిలు. నేను అట్లాగే పలుకుతాను. నువ్వు అనుకున్నట్టుగా నేను మానవమాత్రురాలిని కాదు. మాది వేరే లోకం. మమ్మల్నిఎంతో మంది ఎన్నోరకాలుగా పిలుస్తూ ఉంటారు. కొంత మంది కామినీ పిశాచి అంటారు, ఢాకిని పిశాచి అంటారు, ఆత్మ అంటారు అలా  ఎన్నో పేర్లు పెట్టారు. ఇవన్నీ మానవులు పెట్టిన పేర్లే. అవన్నీ ఆలోచించి నువ్వు తెలుసుకుని ఏమి లాభం? నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమ ఎంత గాఢంగా ఉందంటే నీ కోసం నేను ఏమన్నా చెయ్యగలను.  నువ్వు రాజకీయాల్లో ప్రవేశించి, ఒక నాయకుడుగా గెలవాలంటే ఓటుకి నువ్వు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టదలచుకున్నావో చెప్పు. నేను అంత ధనాన్ని నీకిస్తాను. ఓటుకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు, పది వేల  రూపాయల వరకు నేను ఇవ్వగలను. బంగారాన్నయినా నేను నీకు క్షణంలో ఇవ్వగలను. నేను తలచుకుంటే దేశానికి నిన్ను ప్రధానిగా కూడా చెయ్యగలను. ఈ దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే నిన్ను సార్వభౌముడ్ని చేసేంతశక్తి నాకుంది. అయితే నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నీ దగ్గర ఆశించేది ప్రేమ మాత్రమే. నాకింక ఏమి అక్కర్లేదు. ఇందులో నాకు స్వార్ధం కూడా ఏమి లేదు నువ్వు నాతో పాటు కొన్నాళ్ళు సంసారం చెయ్యి. మనిద్దరం కలిసి మెలసి భార్యా భర్తల్లా ఉందాం. నీకు స్వర్గం ఏమిటో చూపిస్తాను స్వర్గపుటంచుల దగ్గర తీసుకువెళ్తాను. కాబట్టి నువ్వు నా ప్రేమ సామ్రాజ్యానికి అధిపతిగా రావాలి అని కోరింది. దానికి రవి కాంత్ బిత్తరపోయాడు. ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. అతను ఈ విధంగా అన్నాడు నేను మనిషిని. నువ్వు మరి మనిషివి కాదు కదా! మన ఇద్దరికి సంబంధం ఎలా కుదురుతుంది? మీ అనుభూతులూ మీ అనుభవాలు పై స్థాయిలో ఉంటాయి. మనుషులమైన మేము చాలా క్రింది స్థాయిలోనే ఉంటాము. అటువంటప్పుడు  మన ఇద్దరికి పొత్తు ఎలా కుదురుతుంది?భార్యా భర్తలుగా మనిద్దరం సంసారం ఎలా చెయ్యగలుగుతాము? నీకు మామూలుగా అనిపించే అనుభూతి నాకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అది భరించగలిగే శక్తి నా మానవ శరీరానికి ఉండదు కదా! మరి నువ్వు కామినీవి అంటున్నావు. బహుశా కామినీ పిశాచివే కావచ్చు. మరి పిశాచిగా ఉన్న నీకూ ,  మామూలుగా మనీషిగా ఉన్న నామానవ ఇంద్రియాలకీనూ ఎలా పొత్తు కుదురుతుంది? అప్పుడు నేను చాలా కోల్పోవల్సివస్తుంది కదా! శారీరకపరంగా నేను చాలా కష్టపడవల్సివస్తుంది. నా ఆయువు కూడా తీరిపొతుంది తొందరగా. కాబట్టి దయచేసి నన్ను వదిలిపేట్టేసేయ్. ఒక మనిషికి, ఒక పిశాచానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఉండకూడదు. అది సహజ సిద్ధంగా జరిగేది కాదు.  దాని వల్ల నీకు ఫరవాలేదు కాని నేను చాలా ప్రమాదంలో చిక్కుకుంటాను. నేను తొందరగానే మృత్యుగృహం లోకి వెళ్ళవల్సివస్తుంది.
దానికి  ఆవిడ నవ్వి “నేను ఇచ్చే స్వర్గ సుఖాల ముందు నీవు ఎన్నివేల జన్మలలో అనుభవించే సుఖాలు ఎంత?”
“అది నిజమే. మా అనుభూతులు,  మా అనుభవాలు మా స్థాయిలో ఉంటాయి. మా ప్రకంపనలు కూడ మీ సూక్శ్మ ప్రకంపనలకన్నా ఎన్నో రెట్లు వేగంగా ఉంటాయి. ఆ వేగం వల్ల వచ్చే ఆ శక్తికి ఏమానవమాత్రుని యొక్క శరీరం కూడా ఎక్కువ కాలం నిలబడదు. అయినా నువ్వు కొల్పోయేదేముంది ?ఏమి లేదు కదా! నువ్వు మనిషిగా మహా అంటే ఆరోగ్యవంతంగా అరవై ఏళ్ళూ ,డెబ్బయి ఏళ్ళు బ్రతుకుతావు. ఈ అరవై  డెబ్బయి ఏళ్ళల్లో నువ్వు మనిషిగా  అనుభవించేసౌఖ్యం ఎంత మాత్రం?మహా అంటే ముప్పై ఏళ్ళు. అందులో కూడా ఎన్ని రకాల బాధలు, సంసార బరువు బాధ్యతలు, తాపత్రయాలు, జబ్బులు ఇలా నీవు  అనుభవించేదేమిటీ? ఏమీ లేదు. అదే నాతో కనుక నీవు కొంత కాలమైనా గడిపితే నేనిచ్చే స్వర్గ సుఖాలు నీవు కొన్నివేల జన్మలు ఎత్తినా పొందలేవు. ఇంత సుఖాన్ని నేనిస్తున్నపుడు నీ ఆయువు కొంచెం తగ్గిపోతే ఏమిటీ ఎన్నో వేల జన్మల్లో నీవు పొందబోయే సుఖాల్ని ఈ జన్మలోనే పొందుతున్నప్పుడు? నీకు ఈ క్షణంలో ఏమి  కావాలన్నా, ఎటువంటి సుఖాలన్నా నేను తప్పకుండా అందజేస్తాను.  దానికి ఏమంటావు?” అని అడిగింది.
“అమ్మా మోహినీ! మీరు దయచేసి నన్ను వదిలిపెట్టేయండి. మీరు చెప్పిన సౌఖ్యాలు కావాలని  నాకన్నా కొన్ని వేల మంది ఎదురుచూస్తూ ఉన్నారు. వారందరూ కూడా నువ్వు చెప్పినట్టు వింటారు. కాబట్టి నువ్వు వారి పొత్తు పొందటంలో అర్ధం వుంది. అంతే కానీ ఇష్టం లేని నాతో నీకు ఎటువంటి పొత్తు కుదురుతుంది చెప్పు ? నన్ను బాధ పెట్టి నువ్వు సుఖ పడలేవు కదా! కాబట్టి  నా జోలికి రాకు, నన్ను వదిలి పెట్టేసేయి. మరి నేను ఇల్లు వదిలిపెట్టి  ఎంతకాలం అయ్యిందో కూడా నాకు గుర్తుకు రావడం లేదు.  అక్కడ మా అన్నగారు మరియు మిత్రులందరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్యే నేను హైదరాబాదు పట్టణానికి ఉద్యోగానికి వచ్చాను. నీకు తెలుసుకదా!  కాబట్టి  దయచేసి నన్ను వదిలి పెట్టేసేయి” అని అన్నాడు.
“ సరే! నువ్వు నేనెంత ప్రేమగా చెప్పినా కూడా నా మాట వినడం లేదు. నీ మీద నాకు పట్టుదల ఇంకా బాగా పెరిగింది. ఎలాగైనా సరే నువ్వు నేను చెప్పినట్టుగా నేను చెప్పిన ఒప్పందాన్ని అంగీకరించాలి. ఐతే నేను అందరిలాగా బాధ పెట్టే మోహినీని కాదు. నాకు కూడ ఎంతో కొంత సంస్కారం వుంది కాబట్టి నీకు కొంత వ్యవధి ఇస్తున్నాను. నువ్వు ఆలొచించుకో. నేను తలచుకుంటే ఈ క్షణంలో నిన్ను నేను ఏమన్నా చెయ్యగలను.  నా శక్తి సామర్ధ్యాలన్నీ కూడా చూసావు నువ్వు. ఒప్పుకోకపోయినా  నేను బలవంతంగా నిన్ను అనుభవించగలను. నా ముందు నువ్వు ఎందుకూ పనికిరావు. చాలా అల్పుడివి. నీకు శక్తి కూడ చాలా తక్కువ. అయినా కూడ  నాకు సంస్కారం వుంది. నేను  నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నీకు కొంత వ్యవధి ఇస్తున్నాను. సరే! ఇప్పుడు నువ్వు బయలుదేరు.”అని అన్నది.
 “మరి నేను ఎక్కడ ఉన్నానో,  ఎంత దూరం లో ఉన్నానో, ఈ ప్రదేశం ఏమిటో నాకు తెలియదు మరి బస్సు ఎక్కి వెళ్ళాలంటే కూడ నా దగ్గర డబ్బులు లేవు” అని అతను అన్నాడు.
“ఏం భయపడకు. నేను నిన్ను స్వయంగా బస్సు ఎక్కిస్తాను. నేను నీకు కనిపిస్తూ ఉంటాను కాని వేరే ఎవ్వరికీ  కనిపించను. నేను నీ పక్కన  ఉండగా నిన్ను ఎవ్వరూ డబ్బులు అడగరు. నువ్వు ఎక్కడ దిగాలో అక్కడ దిగి వెళ్ళీపో. అక్కడ నుంచి నేను కూడ వెళ్ళిపోతాను. త్వరలోనే నేను  నీకు కనిపిస్తాను ఈ లోగా నువ్వు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. నువ్వు కాదన్నాకూడ నేను మాత్రం నిన్ను వదిలి పెట్టే ప్రసక్తి లేదు కాబట్టి ఆలోచించుకొని చెప్పు అని చెప్పింది. 
         తరవాత ఆమె ముందు వెళ్తుండగా ఇతను ఆమె వెంట వెళ్తూ రోడ్డు మీదకి వచ్చి బస్సు ఎక్కి కూర్చున్నాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే ఆమె అతనికి ఒక్కడికే కనిపిస్తుంది ఎవ్వరికి కనపడటం లేదు. కండక్టరు వచ్చాడు కానీ టిక్కెట్టు డబ్బులు అడగలేదు. సరే మెల్లగా ఆమె వెళ్ళిపోయింది. నేను మెల్లగా రాణీగంజ్ బస్టాప్ లో దిగాను.  నేను మరి ఆమెతో వెళ్లి ఎన్ని రోజులయ్యిందో, ఎన్ని గంటలయ్యిందో తెలీదు. ఆ కాలమానం నేను పూర్తిగా మరిచిపోయాను.  అక్కడ దిగాను. దిగగానే ఎందుకో చాలా నీరసం అనిపించింది. చుట్టూ చూశాను. జనం అంతా  ఉన్నారు. అనుకోకుండా అక్కడ మా అన్నగారి స్నేహితులు కనిపించారు.  వాళ్ళంతా పరుగు పరుగున నా దగ్గరకి వచ్చి నీ కోసం వెతుకుతున్నాము. ఎక్కడికి వెళ్ళావయ్యా? అయినా ఏమిటి నీ బట్టలన్నీఇంత మాసిపోయినాయి, గడ్డం పెరిగిపోయింది.  ఏమిటి ఇలా వున్నావు? చాలా నీరసపడిపోయి ఉన్నావు. మీ అన్నయ్య చాలా కంగారు పడుతున్నాడు. పద! పద! అని చెప్పి అతన్ని హైదర్బస్తీలోని వాళ్ళింటికి తీసుకువెళ్ళారు. రవికాంత్ అన్నగారు అక్కడ ఏజిఓ ఆఫీసులో పనిచేస్తున్నారు. కొంతమంది బ్రహ్మచారులు అందరు కలిసి హైదర్బస్తీ లో రూమ్ తీసుకున్నారు. హైదర్బస్తీ  అంటే జీర దగ్గర బైబుల్ హౌస్ వద్ద ఉన్నటువంటి ఒక కాలనీ. అక్కడే ఒక మిద్దె మీద ఒక పోర్షన్ లో ఉంటున్నారు వారి అన్నగారు ఇంకొక ఇద్దరు మిత్రులు ఉద్యోగాని కోసం వచ్చిన  రవి కాంతు. ఈ నలుగురు బ్రహ్మచారులు అక్కడే వుండి వంట చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. రవికాంతు రోజు ప్రొద్దున్నే లేచి వివిధ  కంపెనీలకి దరఖాస్తులు వ్రాసి దగ్గరలో ఉన్నరాణిగంజ్ పోస్టాఫీసుకు వెళ్ళి అవి పోస్టు చేసి వస్తూ వుండే వాడు. అతన్ని చూడగానే అన్నగారు గాబరాగా తమ్ముడి దగ్గరకి వచ్చి ఏమిటి రా ఎక్కడకి వెళ్లావు? అనగా అన్నయ్యా! నన్నుప్రస్తుతం ఏమి అడగవద్దు.  నాకు నిద్ర ముంచుకువస్తోంది. ఆకలి వేస్తుంది. ముందుగా ఏమన్నా తెప్పించండి తినడానికి అని అన్నాడు. అందరూ అలాగే అని చెప్పి స్నేహితుడు ఒకడు సైకిలు మీద హైదెర్బస్త్తీ నుండి ట్యాంక్ బండ్ మీదుగా  సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక  హూటల్ గోపికి (AIR ప్రక్కన) గబగబా వెళ్ళి కొన్ని ఇడ్లీలు పార్సల్ తీసుకుని వచ్చాడు. ఆబగా గబ గబా ఆ ఇడ్లీలు అన్నీ తినేసి అన్నయ్యా! నాకు ఇవి సరిపోలేదు, ఆకలి తీరలేదు.  మరి కొంత టిఫిన్ తెప్పించు అని చెప్పగా మళ్ళీ గోపి హోటల్ నుంచి కొంత టిఫిన్ తెప్పించారు. అన్నగారు చాలా ఆశ్చర్య పడుతున్నాడు ఏంటి వీడికింత ఆకలి? ఎప్పుడూ ఇలా ఉండదే! మరి ఇప్పుడేమయింది? నాకేమీ అర్థం కావడం లేదు. సాధారణంగా వీడు కొంచమేతింటాడు మరి ఏమిటి ఇలా అయిపోయింది? అని అనుకుంటుండగా అన్నయ్యా! నేను విశ్రాంతి తీసుకోవాలి. విషయాలు తరవాత చెప్తాను. ముందుగా నేను కాసేపు పడుకోవాలి అని చెప్పి అతను గాఢంగా నిద్రపోయాడు.                                          (మిగతాది వచ్చే భాగంలో)