N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Friday 5 February 2016

Kanvadah Maharshi - An autobiography of a Yogi

కణ్వద  మహర్షి- కణ సిద్ధాంతం – ప్రఖ్యాత శాస్త్రవేత్త లూథర్ బర్బంక్ చేసిన అద్భుత సృష్టి

కణ్వద  మహర్షితో పరిచయమయ్యాక ఆయన చెప్పిన విషయాలగురించి నేను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆయన చెప్పిన ప్రకారం,ఒకసారి ధ్యాన స్థితిలో ఉండి ఆయన చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఉండగా అంటే ముఖ్యంగా  జన్యు కణాలతో (genes), స్టెమ్ సెల్ల్స్(stem cells) తో మాట్లాడితే ఎటువంటి అవయవ లోపాలున్నా అవి సరి దిద్ద బడతాయి అని ఆయన  చెప్పిన విషయాలు నేను ఆలోచిస్తుండగా నాకు స్వామి పరమహంస యోగానంద గారు Yogada Satsang Society) తెలుగులో  రచించిన “ఒక యోగి ఆత్మ కథ” (“An autobiography of a Yogi”) అనే పుస్తకం గుర్తుకి వచ్చింది. అందులో శ్రీ పరమహంస యోగానంద గారు ఒక అద్భుతమైన సందర్భాన్ని ప్రస్తావించారు.


కాలిఫోర్నియాలో లూథర్ బర్బంక్ అనే మహాశయుడు ఉండేవాడు. ఆయనకి ఉద్యానవనము, పూలమొక్కలు అన్నా చాలా  ప్రాణం. ఆయన తన ఉద్యానవనం లో కొన్నిరకాల కాక్టస్ మొక్కలు అంటే మనం బ్రమ్మజేముడు అని అంటాము, దానికి అన్నీ ముళ్ళే ఉంటాయి, ఎడారిలో పెరుగుతుంటాయి ఆ మొక్కలు అది అన్న మాట, అలాగే రక రకాలైన గులాబీ మొక్కలు పెంచుతుండే వాడు. 

ఆయన ఈ మొక్కలని ఎంత ప్రేమించేవాడంటే, ఆయన  ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆ ఉద్యాననానికి వెళ్లి  ఆ మొక్కలతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుండే వాడు. ప్రత్యేకంగా ఆ కాక్టస్ మొక్కలతో  ఆయన, “ఎందుకు నీకీ ముళ్ళు? అనవసరం కదా! నీకు రక్షణకి నేను ఉన్నాను కదా! కాబట్టి ఈ ముళ్ళని పడేయి” అనే భావంతో అని ప్రతి నిత్యం మాట్లాడుతూ ఉండేవాడు. అలాగే ఆ గులాబీ మొక్కల దగ్గరకి వెళ్లి నీ అందమైన మొక్కకి ముళ్ళు ఎందుకు? అక్ఖర్లేదు. నేనున్నాను కదా!  నిన్ను నేను కాపాడుకుంటాను. నీకు రక్షణ ఇస్తాను అని ఎంతో ప్రేమ పూర్వకంగా ప్రతి నిత్యం ఆ మొక్కలతో మాట్లాడుతూ ఉండే వాడు. ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఏమిటంటే ఆ కాక్టస్ మొక్క ద్వారా పుట్టిన అంటే మొలకెత్తిన కొత్త పిల్ల కాక్టస్ మొక్కకి ముళ్ళు లేనే లేవు అదే విధంగా కొత్తగా మొలకెత్తిన ఆ పిల్లగులాబీ మొక్కలు కూడా అస్సలు ముళ్ళు లేకుండానే  వచ్చాయి. ఇటువంటి  అద్భుతమైన సృష్టిని  ఈలోకంలో చూసినటువంటి శాస్త్రవేత్తలంతా చాలా  ఆశ్చర్య పడి పోయారు. కొన్ని గులాబీ మొక్కలకి లూథర్ బర్బంక్  అని పేరు కూడా పెట్టారు. అంటే కణ్వద మహర్షి చెప్పినట్టుగానే మరి ఎంతో ప్రేమపూర్వకంగా నిరంతరమూ  మాట్లాడుతున్నప్పుడు  అవి స్టెమ్ సెల్ల్స్ ని, జన్యు కణాలని ప్రభావితం చేసి, ఆయన ఆదేశాల ప్రకారమే కొత్తగా పుట్టిన మొక్కలు ముళ్ళు లేకుండా పుట్టేటట్టుగా చేశాయి. 

కాబట్టి కణ్వద మహర్షి చెప్పిన సిద్ధాంతం రుజువు చేయబడింది ఈవిధంగా అని నేను గ్రహించాను. ఆయన చెప్పినట్టుగానే ధ్యాన స్థితిలో వెళ్లి మనకి కలిగే ప్రశ్నలని గురించి పదే పదే ఆలోచిస్తున్నప్పుడు, మన ఆసక్తి చాలా  గాఢంగా, నిజాయితీగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాతావరణంలో నిక్షింప బడి ఉన్న సమాధానాలన్నీ కూడా శక్తిపాతం లాగా వచ్చి మన సందేహాలన్నీకూడా  నివృత్తి చేయ బడతాయి అని నేను గ్రహించాను.

శ్రీ పరమ హంస యోగానంద గారు (యోగదా సత్సంగ్ సొసైటీ Yogada Satsang Society) రచించిన ఈ పుస్తకం  “An autobiography of a Yogi” అన్ని భాషలలో అనువదించబడింది. ఈ పుస్తకం ప్రపంచంలో ప్రఖ్యాతి చెందింది. కొన్ని విశ్వ విద్యాలయాలలో ఈ పుస్తకం పాఠ్య పుస్తకం లాగా వాడబడుతుంది. శాస్త్రవేత్తలు మరియూ, para psychology లో ఆసక్తి ఉన్న విద్యార్థులు, ప్రజలూ దీన్నిరిఫరెన్స్ పుస్తకం (Referrence Book) లాగా వాడుతూ ఉంటారు.