ఈ భగవంతుడి సృష్టి ఎంత వైరుధ్యమైనది, ఇంత అందమైన గులాబి మొక్కలకి ముళ్ళని కూడా ప్రసాదించాడు కదా" అని నీవు మనస్సులో ఆలోచిస్తున్నావు కదా ఈ గులాబీలు అందరికీ ఇష్టం అవుతాయి కాని దానికున్న ముళ్ళు ఎవరికీ ఇష్టం ఉండదు. అయితే నేను నా ప్రయోగాల ద్వారా ఈ పూల రంగుని మార్చ వచ్చునని ముళ్ళు కూడా లేకుండా గులాబీ మొక్కని సృష్టించ వచ్చునని కనుక్కున్నాను గులాబీ మొక్క విత్తనం ప్రారంభ దశలో కణ విభజన జరిగే సమయం లోనే ఆ జన్యు కణాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం మార్చ గలిగితే ఆ మొక్కలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. రంగు మారి పోతుంది ఆ మొక్కకి ముళ్ళు కూడా ఉండవు.
అదే విధంగా మానవులలో కూడా చేయ వచ్చును.
ఏ విధంగా అయితే అందమైన గులాబీకి ముళ్ళు ఉండడం మనకి ఇష్టం ఉండదో అదే విధంగా అందమైన శిశువుకి జబ్బులు ఉండడమూ , వంశ పారంపర్యంగా (hereditory) వచ్చే మధుమేహం) diabetes, గుండె జబ్బులులాంటివి మనకి ఇష్టం ఉండవు కదా ! దాన్ని ఎలా మారుస్తారు? మీరు చెప్పిన ప్రక్రియ సర్వ సాధారణంగా ఉంది. ప్రత్యేకంగా లేదు . నాకిక్కడ ఏమీ అర్థం కాలేదు. ఉండు నాయనా ! ఈ విషయాలు అంత తొందరగా అర్థం కావు. విడమరచి చెప్తాను.
ఏ విధంగా అయితే అందమైన గులాబీకి ముళ్ళు ఉండడం మనకి ఇష్టం ఉండదో అదే విధంగా అందమైన శిశువుకి జబ్బులు ఉండడమూ , వంశ పారంపర్యంగా (hereditory) వచ్చే మధుమేహం) diabetes, గుండె జబ్బులులాంటివి మనకి ఇష్టం ఉండవు కదా ! దాన్ని ఎలా మారుస్తారు? మీరు చెప్పిన ప్రక్రియ సర్వ సాధారణంగా ఉంది. ప్రత్యేకంగా లేదు . నాకిక్కడ ఏమీ అర్థం కాలేదు. ఉండు నాయనా ! ఈ విషయాలు అంత తొందరగా అర్థం కావు. విడమరచి చెప్తాను.
శిశువు పుట్టినప్పుడు వంశ పారంపర్యంగా (hereditory) కొన్ని జబ్బులు (diseases) వస్తుంటాయి. ఉదాహరణకి మధుమేహం (డయాబెటిస్), గుండె జబ్బులు వంశ పారంపర్యంగా తర తరాలుగా (generations to generations) వస్తాయి అన్నగట్టి అభిప్రాయం యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో అణువణువులో నిండి ఉన్నది కాబట్టి ప్రతీ కణంలో ఇదే సమాచారం నిండి ఉంటుంది. నీకు ఇదివరకే చెప్పాను ప్రతి కణంలో neutrons, protons, electrons మధ్య ఖాళీ స్థలం ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఆ స్పేస్ లో శక్తి ఉంటుంది ఆ ఎనర్జీ లో ఎన్నో వివరాలు నిండి ఉంటాయి. పూర్వ జన్మ వాసనలు, అనుభవాలు అన్నీ అందులోనే ఉంటాయి. మధుమేహంతో బాధ పడే తల్లి దండ్రులకి, వారికి పుట్టబోయే శిశువుకి కూడా ఆ వ్యాధి సంభవిస్తుంది అన్న అభిప్రాయంతో ఉన్న వారి ఆలోచనలు , మిగతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఈ వైద్యుల అభిప్రాయాలు (మెడికల్ సైన్స్), ఈ ఫలానా వ్యాధి వంశ పారంపర్యంగా (hereditory) వస్తాయనే ఒక అభిప్రాయం మీ మనస్సులో గాఢమ్ గా నాటుకు పోతుందో దేహంలో ఉన్న కొన్ని కోట్ల కణాల్లో ఇదే సమాచారం (information ) నిక్షిప్తమై ఉండి పోతుంది ఇటువంటి ఆలోచనలకి చాలా శక్తి ఉంటుంది (Thoughts are very
influentive) ఆ జబ్బులు పుట్ట బోయే శిశువుకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నేను లోగడ చెప్పినట్టుగా కణ విభజన జరగక ముందే అంటే పిండ రూపంలో మొలకెత్తే దశలో ఉన్నప్పుడే తర తరాలుగా, వంశ పారంపర్యంగా (hereditory) మధు మేహము (diabetes), గుండె జబ్బులు(heart diseases) వస్తాయన్న విషయాన్ని మార్చ గలిగితే ఆరోగ్యవంతుడైన శిశువు జన్మిస్తాడు. జన్యు కణం, stemcell ,మెదడు అన్నీ ఒక axis లో ఉండి వాటికి అనుసంధానం ఉంటుంది. ఎవరైనా ఇటువంటి మధుమేహం (డయాబెటిస్) జబ్బు రాకూడదు. ఈ సమాచారం (information ) మార్చు .
ఆరోగ్యవంతుడైన శిశువు కావాలి , వంశ పారంపర్యంగా జబ్బులు (hereditory
diseases ) వస్తాయన్న సమాచారం (information) మార్చు అని ఎవరైనా అప్లికేషను (application) పెట్టుకున్నారా ? అని జన్యు కణం stemcell ని అడుగుతుంది. "లేదు" నాకెవరూ ఏమీ చెప్పలేదు అని stemcell జవాబు చెప్తుంది.ఆ విషయం మెదడులో, genes లో స్థిరంగా ఉండి పోతుంది . దీని మూలంగా పుట్టబోయే శిశువుకి వంశ పారంపర్యంగా వ్యాధులు (hereditory diseases) వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఈ తరం (generation) లో రాకపోయినా ముందు తరం (next generation) లో వచ్చే అవకాశాలు ఉంటాయి. నీకిదివరకే చెప్పాను పిండ రూపంలో ఉన్నప్పుడే కణ విభజన జరుగుతుంది కదా ! శుక్రము, అండము రెండు కలిసి zygote అవుతుంది. ఆ రెండు ఒకటయ్యే సమయంలో ఎవరైతే ఆ information మార్చ గలుగుతారో అప్పుడు ఆ జన్యు కణం ఈ ఇన్ఫర్మేషన్ మార్చు అని నీకేమైనా సందేశం వచ్చిందా అని stemcell ని అడుగుతుంది . అప్పుడు అవును ఆ ఇన్ఫర్మేషన్ మార్చు నాకు ఆరోగ్యవంతుడైన శిశువు కావాలి అని సందేశం వచ్చింది అని stemcell జవాబు చెప్తుంది. 'తథాస్తు' అని ఆ ఇన్ఫర్మేషన్ మార్చేస్తారు వెంటనే ఈ విషయం మెదడులో, జన్యు కణం లో నిక్షిప్తమై పోయి ఆ పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా పుట్టడమే కాకుండా ఈ వంశ పారంపర్యంగా
(hereditory diseases ) వచ్చే జబ్బులు రావు.
ఈ ప్రక్రియ గురించి నీకు అప్పుడే చెప్పాను. మళ్ళీ వక్కాణించి చెప్తున్నాను.
కొన్ని కొన్ని విషయాలు రెండు, మూడు సార్లు చెప్తేనే కాని అర్థం కావు. చాదస్తంగా చెప్తున్నాను అని అనుకోవద్దు. ఇటువంటి మార్పులు కలుగుతాయి కాబట్టే ఎన్నో సంస్కారాలు అంటే గర్భ దానమూ, సీమంతమూ, బారసాల లాంటి సంస్కారాలు మొదలు పెట్టారు. గర్భవతి ఐన స్త్రీలు మంచి పురాణ కథలు చదవడమూ, వినడమూ, మంచి స్పందనలు కలిగించే గాయత్రి మంత్రమూ. దేవుడి మంత్రాలు వినడమూ చేస్తే మంచి స్పందనలు శిశువులో కలుగుతాయి. ఆలోచనలే కదా స్పందనరూపంలో ఉంటాయి (Thoughts are nothing but vibrations) సాత్విక ఆహారం తీసుకోవడం వాళ్ళ శిశువు ఉన్నత సంస్కారాలతో పుడుతుంది. అని చెప్పారు. అవును స్వామి ! మీరు చెప్పింది నిజమే. నాకు గుర్తు వచ్చింది హిరణ్య కశిపుడు నీకు తెలుసు కదా నారద మహర్షి హిరణ్య కశిపుని భార్యైన లీలావతికి నారదుని ఆశ్రమంలో ఉన్నప్పుడు నారదుడు మహా విష్ణువు గురించి చెప్తున్నప్పుడు లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఆ మాటలు అనే స్పందనలకి ప్రభావితుడైనాడు కదా అప్పుడు ప్రహ్లాదుని కణ కణంలో విష్ణువు యొక్క తత్త్వం నిండి పోయింది కదా ! ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అభిమన్యుడి కథ కూడా నీకు తెలిసే ఉంటుంది కదా .ఇవన్నీ శాస్త్రీయపరంగానే మన మహర్షులు, శాస్త్రజ్ఞులు మనకు చెప్పారు. దీని మీద పాశ్చాత్య శాస్త్రజ్ఞులు యెన్నో పరిశోధనలు చేసి ఇవన్నీ నూటికి నోరు పాళ్ళు (100%) నిజమని చెప్పారు. ఒక విధమైనటువంటి స్వరం తో మనం సంగీతం పాడుతున్నప్పుడు కొన్ని స్వరాలు పైకి, కొన్ని క్రిందకి , కొన్ని సాగదీస్తూ పాడుతాము. అలాగే ఈ మంత్రాలూ కూడా చదవడమో , మాట్లాడుతున్నప్పుడు ప్రేమతో గర్భంలో పెరుగుతున్నటువంటి కణాన్ని ఉద్దేశించి నట్లయితే ఉన్నత సంస్కారాలతో శిశువు జన్మించి సమాజానికి ఉపయోగ పడే లాగా అద్భుతంగా ఆ మానవ మొక్క పెరుగుతుంది.
ఇటువంటి విషయాలు తక్కువ భూమికలో ఉన్నవారికి రెండు, మూడు సార్లు చెప్తే కాని అర్థం కావు. కొంచెం పై భూమికలో ఉన్న ఉన్నవాళ్ళు విమర్శన చేసుకుంటే సరిగ్గా అర్థమవుతాయి.
ఇవన్నీ కూడా నీవు ఆధ్యాత్మిక విశేషాలు, అనుభవాల్లో చాలా చక్కగా చెప్పావు. నేను చెప్తున్న విషయాలు కూడా సమగ్రంగా చదివి ఆలోచిస్తే నీకే విషయం తేట తెల్లమవుతుంది కాబట్టి విశ్లేషణ చేసుకోక తప్పదు.
ఎప్పుడైతే హృదయ కవాటాలు సరిగ్గా పని చేయక, వాటి విధులు అవి నిర్వర్తించలేనప్పుడు ఇటువంటి ప్రక్రియలు చేస్తే అనతికాలం లోనే అవయవ నిర్మాణ లోపాలు సరి దిద్దుకుని మామూలుగా అయిపోయి హృదయం చక్కగా పని చేస్తూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో మళ్ళీ మామూలు జీవితం గడప వచ్చును. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను . Louis Hay అనే ఆవిడ కాన్సర్తో బాధ పడ్తుండేది. డాక్టర్లు ఆవిడ ఆయుర్దాయం నేడో ,రేపో ముగిసిపోవచ్చును అని ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు ఆవిడ దృఢ నిశ్చయం చేసుకుని కణాలతో మాట్లాడడం మొదలు పెట్టింది. కొన్ని రోజుల్లోనే ఆవిడ ఆ డాక్టర్లకే ఆశ్చర్యం కలిగించేలా వ్యాధి నివారణ చేసుకుంది. దాని మీద చాలా పుస్తకాలు కూడా వచ్చాయి. అలాగే ఎంతో మంది మహానుభావులు కూడా వాళ్ళ రోగాలని తగ్గించుకున్నారు. కాకపొతే అవేవి బయటకి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు అని ఆయన విశదీకరించారు.
ఏ విధంగా నీవు కంప్యూటర్ లో రక రకాల folders లో ఫైల్స్ పెట్టు కుంటావో అదే విధంగా గడ్డి పరకల రెప రెపల ధ్వని కూడా ఆకాశం లో ప్రతిధ్వనిస్తుంది.అని నేను ఇదివరకే నీకు చెప్పాను. అది క్రిస్టలైన్ గ్రిడ్ (crystalline grid) లో నిక్షిప్తమై ఉంటాయి. వీటన్నిటినీ
'ఆకాశిక రికార్డు' అని మన వాళ్ళు చెప్తుంటారు. దీని గురించి Lobsung, అయస్కాంత వ్యక్తి కూడా ఎన్నో సార్లు చెప్తుంటారు.
ప్రతి మనిషి యొక్క జీవితం గురించిన రికార్డు ఆకాశిక రికార్డులో ఆకాశ తత్వంలో ఉంటుంది. మీరు ఎత్తినట్టి కోటి జన్మల్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో, మీ అనుభవాలే అనుకోండి , మీ కష్టాలే అనుకోండి , బాధలే అనుకోండి , మీ కౌశల్యం అనుకోండి , మీరు చేసినటువంటి మంచి కాని, చెడు కాని అన్నీ కూడా ఆకాశిక రికార్డు అనబడే ఆకాశం లోనే మీకు సంబంధించిన ఒక ఫోల్డర్ లో కాని , ఫైల్లో కాని నిక్షిప్తమై ఉంటాయి. దానిలోని సమాచారం మీకు కావాలని గట్టిగా మీరు తలచు కున్నప్పుడు తప్పకుండా మీకు తెలుస్తుంది. నీకు ఇదివరకే చెప్పాను కదా ! అందుకనే ఒకటే విషయాన్ని నాలుగు రకాలుగా చెప్పవలసి వస్తుంది. అనగా స్వామీ ! "మీరు మళ్ళీ dimensions (భూమికలు) అని అంటున్నారు. అదేమిటో కాస్త వివరంగా చెప్తారా", అని అడిగాను. 'నాయనా ! " చాలా మంచి ప్రశ్న అడిగావు. తప్పకుండా నీకు అర్థమయ్యే రీతిలో చక్కని ఉదాహరణలతో చెప్తాను. జాగ్రత్తగా విను " అని ఇలా చెప్పారు.
ఎనర్జీ అంటే ఏమిటీ ? శక్తి అని చెప్పుకుంటాము.
ఈ శక్తి అనేది ఎప్పుడూ ఒకటే రూపంలో ఉండదు. మల్టీ-dimension లో ఉంటుంది. ఏవిధంగా అయితే మన విద్యుత్తుని మనం తయారు చేస్తున్నామో అంటే turbines ఉంటాయి ఒక పెద్ద transformer ఉంటుంది. . బాగా ఫోర్సు గా నీళ్ళు turbines మీద పడి విద్యుత్తు తయారు అవుతుంది కదా ! అయితే ఈ విద్యుత్తు అనేది కూడా ఒక శక్తియే కదా ! అదే విద్యుచ్చక్తి. ఈ శక్తి geyser లో ప్రవేశ పెట్టినప్పుడు ఏమవుతుంది ? నీళ్ళు వేడెక్కుతాయి. అదే శక్తి refrigerator లో ప్రవేశ పెట్టినప్పుడు అందులో పెట్టిన పదార్థాలు చల్లగా ఉంటాయి. ఇదే శక్తి ఫ్యాన్ లో ప్రవేశ పెట్టినప్పుడు ఫ్యాన్ రెక్కలు గిర గిరా తిరుగుతూ మనకి గాలి ఇస్తుంది. అదే A .C లో ప్రవేశ పెట్టినప్పుడు గది మొత్తం చల్లబడుతుంది. అదే శక్తి సౌండ్ సిస్టం లో ప్రవేశ పెట్టినప్పుడు ఆ ప్రకంపనలు ధ్వని రూపంలో బయట పడతాయి ఇలా మీ నిత్య జీవితం నుంచి ఎన్నో ఉదాహరణలు నేను చెప్పగలను . ఒక పెద్ద మెషిన్ నడపాలంటే విద్యుచ్ఛక్తి అవసరం కదా ! మరి ఒకటే శక్తి ఇన్ని రకాలుగా ఎలా మారుతుంది ? ఇన్ని రకాలుగా ఎలా ఉపయోగ పడుతుంది ? ఇది మల్టీ dimensional ఎనర్జీ నే కదా ! ఒకే ఎనర్జీ ఒక వస్తువుని వేడి చేస్తుంది ,చల్లదనం ఇస్తుంది. అదే ఎనర్జీ గాలిని ఇస్తుంది. అదే ఎనర్జీ పరిసర ప్రాంతాలని చల్ల బరుస్తుంది. అదే ఎనర్జీ మీరు కంప్యూటర్లు వాడడానికి ఉపయోగించ వచ్చు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దీని కన్నా మంచి ఉదాహరణ నాకు దొరకదు.
కాబట్టి ఎనర్జీ అన్నది ఎప్పుడూ మల్టీ-డైమెన్షన్ (multi -dimension )లో ఉంటుంది. ఒకటే వస్తువుని మనం ఎన్ని రకాలుగానైనా వాడ వచ్చును . మల్టీ-డైమెన్షన్ (multi -dimension) అంటే ఇదే నాయనా ! ఒక విషయాన్ని మనం ఒకటే కోణంలో ఆలోచించినప్పుడు దీన్నే లినియర్ థింకింగ్ అని అంటారు. తక్కువ భూమికలో ఉంటాము. వివిధ కోణాల్లో చూసినప్పుడు బ్రాడ్ థింకింగ్ అని అంటారు (Narrow and
Broad thinking) ఆ విషయ పరిజ్ఞానం మనం తెలుసుకున్నప్పుడు దాని ఉపయోగాల గురించి మనకు తెలుస్తుంది కదా. దాన్ని dimensions (భూమికలు) అంటారు అని ఆయన చెప్పారు .
"మహాత్మా ! చాలా విషయాలు చెప్పారు. మిమ్మల్ని పదే పదే ప్రశ్నలు వేసి వేధించటం నాకు తప్పటం లేదు. మీరు నన్ను వేరే వాళ్లకి చెప్పమన్నారు. వేరే వాళ్లకి చెప్పాలంటే ముందు నేనే సరిగ్గా ఆర్థం చేసుకోవాలి కదా ! అందుకనే పదే పదే నేను మిమ్మల్ని అన్ని సార్లు అడగాల్సి వచ్చింది అని చెప్పాను.
అవును నిజమే. ముందు నీవర్థం చేసుకుంటేనే వేరే వాళ్ళ సందేహాలు తీర్చ గలుగుతావు. నేను చెప్పినవన్నీ చక్కగా విశ్లేషణ చేసుకో అని చెప్పి అదృశ్యమై పోయారు.