శ్రీ
రాంలాల్ ప్రభు – మోహిని కథ- 6
ఈ విధంగా ఆ డాక్టర్ గారి కామ,
క్రోధ, లోభ, మోహ మద మాత్సర్యాలు మరియూ ఆమె చేసుకున్న ప్రారబ్ధ కర్మలన్నీ కూడా నేను
గ్రహించాను. ఆ బాధకి తట్టుకోలేక నేను తెల్లవారుఝామున ఒక పాడుబడ్డ బావిలో దూకి
ఆత్మహత్య చేసుకున్నాను. కాని భగవంతుని విధి విధానం బట్టి ఆత్మా హత్య చేసుకోవడం
పాపం కదా ! మన కర్మలు మనం అనుభవించడమే మంచిది కదా ! ఈ విధంగా నాకు పిశాచ జన్మ
వచ్చింది. కాని పూర్వ జన్మలో ఉన్న జ్ఞానం నశించ లేదు. నా సహజమైన సంస్కారాలు
నాదగ్గరే ఉన్నాయి. నామీద నేను ప్రయోగించుకున్న విధి విధానం వల్ల డాక్టర్ గారి
కామపరమైన కోరికలన్నీ కూడా నేను భరించవలసి వచ్చింది.
నాలో ఉన్న విజ్ఞానము,
సంస్కారము ఉన్నప్పటికీ కూడా ఈ డాక్టర్ గారి తీరని కోరికలు నేను గ్రహించడంతోటి ఈ
విషయంలో నేను ఎంత ప్రయత్నం చేసినా నన్ను నేను నిగ్రహించుకోలేక పోతున్నాను. ఈ మా
పిశాచి లోకంలో ఒక మంత్రగాడు ‘బాణావతి’ అనే ప్రయోగం చేసినప్పుడు అతను పంపిన
స్పందనలకి ఆకర్షించబడి నేను ఈ రకంగా నీ దగ్గరకి రావడం జరిగింది అని ఆవిడ తన కథ
అంతా ఇలా సవిస్తరంగా చెప్పింది. దానికి అతను మరి దీనికి విరుగుడు ఏమన్నా ఉన్నదా?
అని ప్రశ్నించాడు.
ఈ విధంగా ఆవిడ తన కథంతా రవికాంత్ కి వివరించింది. దీనికి ఏమైనా ముక్తి మార్గం ఉందా?
అనే ప్రశ్నకి ఆవిడ ఇలాసమాధానం ఇచ్చింది.ఏ విధంగా మానవులు క్షణ క్షణానికి చావంటే భయపడతారో అదేవిధంగా మా పిశాచాలకి పిశాచీజన్మనుంచి విముక్తి కలిగేటప్పుడు చెప్ప రానంత బాధగా ఉంటుంది. అయినా నీవు ఈ ప్రశ్నలన్నీ నన్ను ఎందుకుఅడుగుతున్నావో,. నీకు నా విషయాలన్నీ నేనెందుకు చెప్పుతున్నానో కూడా నాకేమీ తెలియడం లేదు, అర్థం కావడంలేదు. నీలో ఉన్న సంస్కారాలని నేను మెచ్చు కుంటున్నాను కదా ! బహుశా
అందుకనే నీకు అన్ని విషయాలుచెప్పుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది.ఆ రోజు ఆ గదిలో వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారు. రవికాంత్ అన్నగారు, ఆయనమిత్రులు ఎక్కడికో బయటకి వెళ్ళారు. మనం చాలా సేపు యేవో విషయాలు మాట్లాడుకున్నాము.నా నుంచి నీవుచాలా సమాచారం గ్రహించావు. ఇక నా సంగతి కూడా చూడు అని చెప్పింది. ఆవిడ హావభావాలన్నీ కూడా మారిపోయి,ఆమె ఒక ప్రేమికురాలిగా మారిపోయింది. కామంతో ఆవిడ శరీరం దహించుకు పోసాగింది. ఇక నేను ఒక్క క్షణం కూడాభరించలేను, నిగ్రహంగా ఉండలేను అని చెప్పి అతన్ని గాడంగా కౌగలించుకుని, బుగ్గల మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది.పిశాచాల యొక్క అనుభూతులు, అనుభవాలు చాలా పై స్థాయిలో ఉంటాయి కాబట్టి రవికాంత్ ఆ ధాటికి తట్టుకోలేకపోయాడు. అలాగే ముక్కుతూ, మూలుగుతూ నిస్త్రాణంగా పడిపోయాడు. కొంత సేపట్లో వాళ్ళ అన్నగారు వచ్చిచూసేసరికి అతని చుట్టూ దుప్పటి గట్టిగా చుట్టబడి ఉంది. అతి బలవంతంగా ఆ దుప్పటి లాగి చూడగా, అతని బుగ్గంతాగాట్లతో నిండి, అపస్మారక స్థితిలో తమ్ముడు రవికాంత్ కనిపించాడు. వెంటనే నీళ్ళు తెచ్చి ముఖంమీద చల్లి సకలపరిచర్యలు చేయగా మెల్లగా నీరసంగా తేరుకున్నాడు. ఏమిట్రాఇదంతా? అని అన్నగారు అడిగారు. ఏముందిఅన్నయ్యా ! మీరంతా బయటకి వెళ్లి పోయాక ఆవిడ వచ్చింది. ఇదంతా ఎప్పుడూ జరిగే తంతే కదా! కొత్తేముంది? అనిఅనగా వాళ్ళందరికీ ఏం చేయాలో ఏమీ పాలుపోలేదు. అప్పటికే మాంత్రికులని, తాంత్రికులని, యోగులను,సాధువులనూ, అందరినీ కలిసి ఎన్ని విధాల ప్రయత్నాలు చేయాలో అన్ని విధాల చేశి చూశారు. బంధు మిత్రులసలహాలు కూడా తీసుకోవడం అయింది . ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించ లేదు. ఏం చేయాలో తెలియక దిక్కు లేనిస్థితిలో ఉండి పోయారు. ఏమిటీ భగవంతుడు సర్వ శక్తిమంతుడు అని మనమంతా అనుకుంటాము కదా! అన్నిరకాలుగా, అన్ని దేవతలకి పూజలు చేశాము, వ్రతాలు చేశాము, తాయత్తులు కట్టించాము, మరి ఏం చేసినా ఈబాణావతి కామ పిశాచాని ధాటికి తట్టుకోలేకుండా ఉన్నాము అని పాపం వాళ్ళు చాలా బెంబేలు పడి పోయారు.రవికాంత్ ఆరోగ్యం కూడా చాలా మటుకు క్షీణించుకు పోయింది. కాని అతనిలో ఏదో తెలియని విజ్ఞానం ఎంతో కొంతపెరిగినట్టు తెలుస్తూనే ఉంది. అక్కడ మోహిని కూడా ఇతని అవస్థకి బాధ పడుతూనే ఉంది.
"నన్ను క్షమించు! నేనుకూడా ఏమీ చేయలేక పోతున్నాను. ఈ కామ వాసనలని నేను తట్టుకోలేక మరి నీ మీదకి నేను నా శక్తిని ప్రయోగించవలసి వస్తుంది" అని ఆవిడ కూడా పాపం ఏడుస్తూ ఉన్నది. ఇదంతా చాలా అయోమయంగా ఉంది. పిశాచాలకి కూడాఇలా సానుభూతి ఉంటుందని వీళ్ళు రవికాంత్ ద్వారా విన్నాక చాలా ఆశ్చర్య పోయారు. ఏం చేయాలో తెలియక దిక్కులేని పరిస్థితిలో ఉండగా వీళ్ళున్నగది మేడలో రెండవ అంతస్తు నుండి ఎవరో ఎంతో భక్తి భావంతో చేస్తున్న భజనవారికి వినిపించింది. ఇదేమిటీ? ఇన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నాము మరి మనం ఎప్పుడు కూడా ఇదిగమనించలేదు. ఎవరు ఈ భజనలు పాడుతున్నారో చూద్దాం అని అనుకుని వాళ్ళు భజనలు చేస్తున్న వారింటికివెళ్ళారు. అక్కడ అయిదారుగురు మాత్రమే కూర్చుని భజన చేస్తున్నారు. ఆ గదిలో ఒకఫోటోలో అవధూత లాంటి ఒకస్వామి ఫోటో పెట్టుకుని, దానికి మాల వేసి , ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు భజనలు చేస్తున్నారు. వీళ్ళు కూడా వెళ్లిఅక్కడ కూర్చున్న తర్వాత ఏదో తెలియని ప్రశాంతత వారికి కలిగింది. వాళ్ళు పడుతున్న బాధలన్నీ మరిచిపోయిచక్కగా వాళ్ళు ఆ భజనలో లీనమై పోయినారు. భజన పూర్తైనాక వాళ్ళు ఆ ఫోటోలో ఉన్న ఆ స్వామిని తదేకంగాచూస్తుండగా ఎవరీ అ ద్భుతమైన వ్య క్తి? ఎవరీ మహాపురుషుడు? మేము ఎప్పుడూ ఈ మహా పురుషున్ని చూడలేదు అని వాళ్ళ మనస్సులో వాళ్ళు అనుకుంటున్నారు. పూజ ,భజనలు అయిపోయాక తీర్థ ప్రసాదాలు తీసుకున్నాకఈ స్వామి ఎవరు ? అని వాళ్ళు అడిగారు. ఈయన పేరు శ్రీ రాంలాల్ ప్రభువు. ఈయన సాక్షాత్తు భగవాన్దత్తాత్రేయుని అంశం అని చెప్పుకుంటాము. ఈయన గురువుగారు విశ్వేశ్వర మహా ప్రభు. ఆయన కూడా దత్తునియొక్క అవతారమే అనే భావనతో ఈ మూడేళ్ళుగా ఈ సిద్ధ పురుషుని పూజిస్తున్నాము. సిద్ధ పురుషుడు అనే మాటవిని రవికాంత్ అన్నగారు మరి సిద్ధ పురుషునికి యోగికి తేడా ఏమిటీ అని ప్రశ్నించాడు. సిద్ధ పురుషుడు అనగా అష్టసిద్ధులు సాధించిన వారు . అయితే వాళ్ళు తమకున్న శక్తులని అవసరం పడినప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు తప్పఅందరినీ ఆకర్షించడానికి వారు ఈ విద్యలని ప్రదర్శించరు. మా అందరికీ కూడా ఎన్నో అనుభవాలు జరిగాయి. మేము ఈ మధ్యే ఇక్కడకి వచ్చాము. ప్రతి గురువారం నాడు తప్పకుండా మేము కొంతగా మంది కలిసి శ్రీ రాంలాల్ ప్రభువుగారి సత్సంగం చేస్తూ ఉంటాము అని వివరించారు.
అప్పుడు రవికాంత్ అన్నగారు తన తమ్ముడి సంగతి అంతా చెప్పి ఏమండీ ! స్వామి
వారికి పూజ చేసిన పూలు మాకివ్వగాలరా? అని అడిగాడు. అయ్యో ! తప్పకుండా ఇస్తాము
తీసుకెళ్ళండి అని చెప్పి వారు బంతి పూల మాలని రవి కాంత్ కి ఇచ్చారు. అది
కొన్ని పువ్వులతో మాత్రమే మాలలాగా కట్టబడి ఉంది మిగతా పువ్వుల
కోసం చూడగా మేము వెనక తులసీ కోటలో వేశాము అనగా మెల్లగా అవి కూడా వాళ్ళు గ్రహించి ,
ఆ రోజు వాళ్ళలో వాళ్ళు చర్చించుకుని రవికాంత్ మేడలో , చేతులకి ఆ పూజ చేసిన
పూలదండలని కట్టారు. యదా ప్రకారంగా ఆ రోజు వాళ్ళందరూ నిద్ర పోయాక అర్ధ రాత్రి
రవికాంత్ కి ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది. చూడగా ఆ కిటికీ దగ్గర మోహిని
కనిపించింది. ఆమె చాలా రౌద్రంగా ఉంది. "ఓహో ! నీవు నన్ను నమ్మించి , నాతో
చక్కగా మాట్లాడి, నా కథనంతా తెలుసుకున్నావు. నిజంగా మీ మనుష్యులు నమ్మకద్రోహులు.
కొంచెం కూడా మీకు విశ్వాసమనేది లేదు. కృతజ్ఞత అన్నది అసలే లేదు. నిన్ను ఎంతో
గాడంగా ప్రేమించి, నీ చుట్టూతా తిరుగుతున్నందువల్ల నన్ను చాలా తేలికగా
చూస్తున్నావు. అయితే ఏమిటీ ఆ మాలలు తెచ్చి మీ అన్నగారు నిన్నలంకరింప చేసినంత
మాత్రాన నేను నిన్నేమీ చేయలేనని అనుకుంటున్నావా? ఇప్పటిదాకా నిన్నేమీ అనకుండా
మంచిగా ప్రేమగా చూసుకున్నాను. నా అసలు తత్వాన్ని బయట పెట్టితే నేను నిన్ను ఒక్క
క్షణంలో నాశనం చేయగలను.
చూడూ ! నా శక్తి" అని ఆ మోహిని అన్నది.
అప్పుడు “బాగానే ఉంది ప్రతీ సారి గదిలోకి వస్తుంటావు కదా ! మరి ఈసారి
ఎందుకు గదిలోకి రాలేక పోతున్నావు?" అని రవికాంత్ ఆ
మోహినిని ప్రశ్నించాడు.
“అవును. నిజమే ! నీవు చెప్పినదాంట్లో కొంత వాస్తవముంది. మరి ఇంత కాలం ఈ
పూలతో ఏ మహా పురుషున్ని పూజించారో ఆతను సాక్షాత్తు ఒక సిద్ధ పురుషుడు కాబట్టి నేను
నీ దగ్గరకి రాలేక పోతున్నాను.. ఈ పూలకి చాలా ప్రభావం ఉంది. ఆ స్వామి వారిని ఈ పువ్వులతో
వాళ్ళు ఎంతో శ్రద్ధా భక్తులతో పూజించారు కాబట్టి దీనికి కొంత మేర వరకు చాలా
శక్తి ఉంటుంది అందుకనే నేను రాలేక పోతున్నాను. అయినా నాదగ్గర ఎన్నో ఉపాయాలు
ఉన్నాయి. చూడు! నేనేం చేస్తానో” అని చెప్పి ఆవిడ తన చేతులు గాలిలో
కదిలించగా, అకస్మాత్తుగా రవికాంత్ తనకి తెలియకుండానే తన మెడలో ఉన్న పూల
దండను, చేతికి ఉన్న పూల దండలు తీసి వేసి బయటకి విసిరి వేశాడు. అప్పుడు ఆవిడ
ధైర్యంగా లోపలకు వచ్చింది. మంచం మీద కూర్చుంది. చూడూ! ఇప్పుడు నీవు ఆశక్తుడివి.
ఇప్పుడు నీ దగ్గర ఆ మహిమ చూపించే పువ్వులు లేనే లేవు. ఇప్పుడు తలచుకుంటే నిన్ను
నేనేమైనా చేయ గలను. ఒక్క క్షణంలో నీ జీవితాన్ని నేను అంతం చేయ గలను. కాని నీవంటే
నా కెందుకో జాలి, ప్రేమ, సానుభూతి ఉన్నాయి.ఎందుకు నన్నింత అన్యాయం
చేస్తున్నావు? నేను నిన్ను ఎంత ప్రేమించాను? నేను నిన్ను ఎంత గాడంగా
విశ్వసించాను? ఎందుకు నా ప్రేమని నీవు తిరస్కరిస్తున్నావు ? నీవు తిరస్కరిస్తున్న
కొద్ది నాకు నీ మీద ఇంకా ఇంకా చాలా పట్టుదలగా ఉంది. ఎత్తి పరిస్థితులలో కూడా
నిన్ను మాత్రం నేను వదిలి పెట్టేది లేదు.
ఇక నుంచి నీవు ఈ దుర్మార్గపు ఆలోచనలు
మానేయి. మీ అన్నగారికి ,వాళ్ళందరికీ చెప్పు వాళ్ళు నన్నేమీ చేయాలేరని.
నీవు చూశావు కదా నా శక్తిని. నా శక్తి తో ఆ మహిమ గల పూలని నీ చేతే నేను అవతల
దూరంగా విసిరి వేయించగలను. నీవేం చేయ గలవు? ఇప్పుడు నీవు ఆశక్తుడివి
కాబట్టి నేను నీమీద బల ప్రయోగమేమీ చేయ దలచు కో లేదు. కొంత సమయమిస్తున్నాను . నీవు
ఆలోచించు. నీకు నేను ఎంతగా టైం ఇస్తున్నానో చూడు.నేను నిన్ను ఎంతగా
ప్రేమిస్తున్నానంటే ఏ మానవ కన్య కూడా అంత త్రికరణ శుద్ధిగా నిన్ను
ప్రేమించదు. ఆలోచించుకో. నేను మళ్ళీ వస్తాను. ఈ సారి కనుక ఇలాంటి
దుర్మార్గపు ఆలోచనలు నీవు చేస్తే నేను మాత్రం ఇంకా ఊరుకునేది లేదు జాగ్రత్త ! అని
చెప్పి ఆవిడ కోపంగా అక్కడనుంచి వెళ్ళిపోయింది. రవికాంత్ దిగ్భ్రాంతి పడి
పోయినాడు.