ప్రియమైన దత్త బంధువులారా, పాఠకులారా మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. మీ పూర్తి సహాయ సహకారాలతో మన వెబ్ సైట్ రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. మనకి ఒక లక్ష పైన VISITORS వచ్చారు.
అందుకోసం మా సంతోషాన్ని మీఅందరికీ వ్యక్తపరుస్తున్నాను. చాలామంది పాఠకులు శ్రీ స్వామినారాయణ పావన చరిత్రని కూడా విశేషంగా ఆదరించి చాలా భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉన్నారు. శ్రీ స్వామినారాయణ గారి కృపా కటాక్షాలు మీ అందరి మీదా ఉండాలని మేము ప్రార్ధిస్తున్నాము. ఈ కలియుగంలో అసలు దేవుడంటే ఏమిటి? ఆ దేవుడుకి నిర్వచనం ఏమిటి? దేవుడు ఎలా ఉంటాడు? ఎలా ఉండాలి? అనే విషయంలో మన భారతదేశంలో చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. కొన్ని సార్లు మనమంతా కాస్త తికమక పడుతూ ఉంటాం కూడా. నేనుకూడా అటువంటి స్థితిలోనే చాలా కాలం ఉన్నాను. ఎప్పుడైతే నేను శ్రీ స్వామినారాయణ పావన చరిత్ర చదవటం, వినటం ప్రారంభించానో నా ప్రశ్నలన్నింటికీ కూడా ఆయన అవతారమే, ఆయన చేసిన లీలలే సమాధానాలుగా వచ్చాయి. ఓహో దేవుడంటే ఇలా ఉంటాడా? ఇలా ఉండాలా? అనే ఒక స్పష్టమైన, స్థిరమైన, ధృడమైన అభిప్రాయం మనలో చాలామందికి కలిగింది. ఎందుకంటే చాలా మంది కూడా నాతో ఫోన్లో మాట్లాడి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్ని మనసులో పెట్టుకుని తెలుగు భాష చదవటం రాని వారి కోసం, చత్వారం ఉన్నవారి కోసం, జీవితంలో యాంత్రికంగా చాలా బిజీ గా ఉన్నవారి కోసం మాకు ప్రత్యేకంగా శ్రీ స్వామినారాయణ గారి చరిత్రని శ్రవణ గ్రంథం అంటే ఆడియో వెర్షన్ లో రికార్డు చెయ్యాలనే సంకల్పం కలిగింది.
ఇది మరి చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. అందులో ఇక్కడ చదివేవారు పాపం ఏమీ పుచ్చుకోరు. కేవలం స్టూడియో ఖర్చులు, ఆ తరువాత డీవీడీ లు కొనడం, ఆ స్టికర్ ప్రింటింగ్ వీటికి ఎంతోకొంత ఖర్చు అవుతుంది. కనీసం ఒక 30,000 రూ. ఎందుకంటే ఎవరూ ఏమీ డబ్బులు తీసుకోకుండా వారి వంతు సేవ చేస్తునందువల్ల ఈమాత్రం ఖర్చు అవుతుంది. శ్రీ స్వామినారాయణ కధ చదివిన పాఠకులందరికీ ఒక విన్నపం. ఎవరికైనా దీనిలో భాగస్వామ్యం పంచుకోవాలి,స్వామి వారి ఈ పావన చరిత్ర మనుషుల్లో ఎంతోకొంత మార్పు తీసుకురావడానికి మనం దోహదపడదాం అనే ఒక సత్సంకల్పం ఉన్నవారు, విరాళాలు ఇవ్వదలచుకున్నవారు మా వెబ్ సైట్ లో ఉన్న EMail ID కి కానీ లేకపోతే అక్కడ ఉన్న సాయిరాం సెల్ నెంబర్ కి కానీ సంప్రదించవచ్చును. ఇటువంటి మంచి అవకాశం జీవితంలో రావటం చాలా అరుదు.
కాబట్టి నిర్మలమైన మనస్సుతో, సహృదయంతో ఒక మంచి సంకల్పంతో ఈ సేవలో పాల్గొనదలచినవారికి ఇదే మా ఆహ్వానం. ఇది అందరికీ శ్రీ స్వామినారాయణ గారు స్వయంగా ప్రసాదిస్తున్నటువంటి ఒక అద్భుతమైన వరంగా మనమంతా భావించవలసి వస్తుంది.
భవదీయుడు
నండూరి శ్రీ సాయిరాం.
9701268716