ఆలోచనలకు గల అద్భుతమైన శక్తి ( Power of Thoughts)
ఒక సారి ఒక
బాటసారి దారి తప్పి ఒక ఎడారిలో వెళ్ళాడు. అతను ఎంత నడిచినా కూడా అక్కడ కనుచూపు
మేరలో ఇసుక తిన్నెలు తప్ప ఏమీ కనిపించడం లేదు. మెల్ల మెల్లగా ఎండ ఎక్కువ
కాసాగింది. ఎక్కడైనా కాసేపు కూర్చుందాము అని అనుకుంటే ఎక్కడా నీడ అన్నమాట లేదు.
గత్యంతరం లేక అతను అలాగే ముందుకి వెళ్ళసాగాడు. కనుచూపు మేరలో అతనికి ఒక గ్రామం
కాని జలాశయం కాని కనిపించ లేదు. తానూ దారి తప్పి ఎడారిలో ప్రవేశించానని అప్పుడు
అతనికి అర్థం అయింది. ఎండ అతన్ని బాధించ సాగింది. చెమటలు పడ్తుండాలి. ఒళ్ళంతా మండ
సాగింది. పాదాలు మండుతున్నాయి, గొంతు ఎండుకు పోయింది, నాలుక పిడుచుకుకట్టుకు పోయింది.
అప్పుడు అతను ఇలా
అనుకున్నాడు. అయ్యో ! నేను దారి తప్పి ఈ ఎడారిలో ప్రవేశించాను. ఈ ఎండ నన్ను విపరీతంగా బాధిస్తున్నది.
ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఎండను నేను తట్టుకోలేక పోతున్నాను. ఎక్కడైనా కను చూపు మేరలో ఒక వృక్షం ఉంటె బాగుండును. కనీసం వృక్షపు ఛాయలోనైనా నేను కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చును. అని అతను మనస్సులో చాలా ద్రుఢ౦గా సంకల్పం చేసుకున్నాడు. కొద్దిసేపటిలో ఆశ్చర్యంగా అతనికి ఒక పే....ద్ద.. చెట్టు కనిపించింది. దాన్ని చూడగానే అతనికి పట్టలేని సంతోషం కలిగింది. మెల్లగా లేని ఓపిక తెచ్చుకుని అతను ఆ మహా వృక్షం వైపు నడిచి, ఆ వృక్షపు నీడలో హాయిగా సేద తీర్చుకోసాగాడు. ఒక అర గంట అయ్యాక అతని సేద తీరి , ప్రాణం కుదుట పడి హాయిగా అనిపించింది. అతనికి విపరీతంగా దాహం వేస్తూ ఉండాలి. దేవుడా ! నీవు నన్ను కరుణించి ఒక వృక్షాన్ని ఇక్కడ చూపించావు. దాని నీడలో నా అలసట తీరి ప్రాణం హాయిగా ఉంది. ఇప్పుడు నాకు విపరీతంగా దాహంగా ఉంది. చల్లటి నీళ్ళు కానీ, పానీయం కాని ఉంటె ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు.
ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఎండను నేను తట్టుకోలేక పోతున్నాను. ఎక్కడైనా కను చూపు మేరలో ఒక వృక్షం ఉంటె బాగుండును. కనీసం వృక్షపు ఛాయలోనైనా నేను కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చును. అని అతను మనస్సులో చాలా ద్రుఢ౦గా సంకల్పం చేసుకున్నాడు. కొద్దిసేపటిలో ఆశ్చర్యంగా అతనికి ఒక పే....ద్ద.. చెట్టు కనిపించింది. దాన్ని చూడగానే అతనికి పట్టలేని సంతోషం కలిగింది. మెల్లగా లేని ఓపిక తెచ్చుకుని అతను ఆ మహా వృక్షం వైపు నడిచి, ఆ వృక్షపు నీడలో హాయిగా సేద తీర్చుకోసాగాడు. ఒక అర గంట అయ్యాక అతని సేద తీరి , ప్రాణం కుదుట పడి హాయిగా అనిపించింది. అతనికి విపరీతంగా దాహం వేస్తూ ఉండాలి. దేవుడా ! నీవు నన్ను కరుణించి ఒక వృక్షాన్ని ఇక్కడ చూపించావు. దాని నీడలో నా అలసట తీరి ప్రాణం హాయిగా ఉంది. ఇప్పుడు నాకు విపరీతంగా దాహంగా ఉంది. చల్లటి నీళ్ళు కానీ, పానీయం కాని ఉంటె ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు.
అలా అతను
అనుకున్న మరుక్షణమే అక్కడ చల్లని నీళ్ళు, పానీయాలు ప్రత్యక్షమయ్యాయి. అతడు ఎంతో
దప్పిక మీద ఉన్నందువల్ల ఇంకొక ఆలోచన లేకుండా ఆ శీతల జలాన్ని, పానీయాలని త్రాగి
దప్పిక తీర్చుకున్నాడు. ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా, హాయిగా ఉంది. అప్పుడు అతనికి
ఆకలి గుర్తుకు వచ్చింది. ఆ...హా..... . ! వృక్షపు ఛాయ దొరికింది. చాలా
బాగుంది. దప్పిక వేసింది. శీతల పానీయాలు కావాలి అనుకున్నాను. అవి దొరికాయి. దప్పిక
తీర్చుకున్నాను హాయిగా ఉంది. ఇప్పుడు నాకు ఆకలి వేస్తున్నది. రుచికరమైన రక రకాల
పదార్థాలు తినాలని అనిపిస్తుంది. చాలా ఆకలిగా ఉంది బాగా అలసి పోయాను కదా ! రక రకాల
పదార్థాలు తినడానికి దొరికితే బాగుండును అని అతను అనుకోగానే అక్కడ అతను
అనుకున్నట్టుగానే రక రకాల తిను పదార్థాలు అతనికి ప్రత్యక్షమయ్యాయి. బాగా ఆకలి మీద ఉన్నాడేమో మరొక ఆలోచన లేకుండా అవన్నీ గబ గబా అతను తినేసి తన
ఆకలిని తీర్చుకున్నాడు. ఇప్పుడు ప్రాణం ఇంకా చల్లగా, హాయిగా ఉంది. వృక్షపు ఛాయా
దొరికింది, దప్పిక తీరి పోయింది, ఆకలి కూడా అతనికి పూర్తిగా తీరి పోయింది. కడుపు
బాగా నిండి పోయిందేమో మాంచి నిద్ర వస్తుండాలి. కాని పడుకోవాలంటే అక్కడ ఇసుక
తప్ప ఏమీ లేదు. ఇసక మీద పడుకుంటే ఒళ్ళంతా గుచ్చుకు పోతుంది. ఇక్కడ ఒక హంసతూలికా
తల్పం ఉంటె బాగుండును. పోనీ ఒక మంచం ఉన్నా బాగుండును. నేను దానిమీద హాయిగా పడుకుని
ఒళ్ళు మరిచి నిద్ర పోతాను అని అనుకున్నాడు. అలా అనుకోగానే అక్కడ ఎదురుగా వృక్షపు
ఛాయలో ఒక మెత్తని పరుపు గల మంచం ప్రత్యక్షమైంది. సరే అని అతను ఆ మంచం మీద హాయిగా
పడుకుని సేద తీర్చుకున్నాడు.
ఇప్పుడు అతని
కోరికలు అన్నీ తీరాయి కాబట్టి అతని ఆలోచనలు ఇప్పుడు కాస్త మారిపోయాయి. ఇది
మనుష్యుల యొక్క సహజసిద్ధమైన ప్రవృత్తి అన్నమాట. అతను మెల్లగా ఇప్పుడు ఆలోచించ
సాగాడు. అదేమిటీ? ఈ ఎడారిలో జన సంచారమే లేదు. ఎవరూ లేరు. మరి నేను చెట్టు నీడ
కావాలి అని అనుకోగానే నాకీ వృక్షం కనిపించింది. దాహం వేసింది. శీతల పానీయాలు కావాలి
అని అనుకున్నాను. అవన్నీ వచ్చాయి. ఆకలిగా ఉంది చక్కని తిను పదార్థాలు కావాలి అని
అనుకుంటే అవి కూడా వచ్చినాయి. పడుకోవడానికి మెత్తని పరుపు కావాలి అని అనుకుంటే
మెత్తటి పరుపుగల మంచం కూడా వచ్చింది. ఏమిటీ ఇదంతా కొంపదీసి రాక్షస మాయ కాదు కదా !
ఎవరైనా రాక్షసుడు కాని, భూతం కాని వచ్చి నన్నుతినేస్తుందేమో అని
అనుకున్నాడు. అనుకున్న తక్షణమే ఒక మహా భూతం ప్రత్యక్షమై అతన్ని చక్కగా మింగేసింది.
అతని ఆలోచనలు అంత
తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అతను ఏం కోరుకుంటే అది అక్కడ ప్రత్యక్షమవుతూ
ఉన్నప్పుడు, అంటే సాక్షాత్తు వరాలిచ్చే ఆ కల్పవృక్షమే అక్కడ ఉన్నట్టుగా అన్ని
కోరికలు తీరుతూ ఉండాలి. అతని ఆలోచ నలు అతను అలసిపోయి ఉన్నప్పుడు, దాహంగా
ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు వేరే లాగా ఉండాలి. కడుపు నిండినాక వేరేగా ఉండాలి.
కడుపు నిండి, నిద్ర పోయి బడలిక తీర్చుకున్నాక అతను అలాగా రాక్షసుడు కాని ,
భూతం కాని నన్ను మింగుతుందేమో అని అనుకున్నప్పుడు అలాగే ఆ కోరికని కూడా ఆ కల్ప
వృక్షం తీర్చి వేసింది. ఈ కథలో చాలా నీతి ఉంది. నేను 2005 లో జగ్గి వాసుదేవ రావు
గారి వర్క్ షాప్ (work shop) అటెండ్ చేసినప్పుడు ఆ work shop లో ఆయన ఈ కథ చెప్పారు.
మనం పంపించే ఈ భావ ప్రసారాలు, మన సంకల్పం గట్టిగా, గాఢ౦గా ఉంటె అదే పరిస్థితిలో
ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అవి సాక్షాత్తు మన ఎదురుగుండా కనిపిస్తూ ఉంటాయి. మన
సంకల్పాలు, మన కోరికలన్నీ కూడా నేరవేరుతూ ఉంటాయి. అందుకనే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ
మన ఆలోచనలు మంచిగా, పరిశుద్ధంగా పెట్టుకోవాలి, మంచి మాటలే మాట్లాడాలి. ఎదుటి
వాళ్లకి మేలు కలిగేటట్టుగానే మాట్లాడాలి. మరి ఆకాశంలో “తథాస్తు” దేవతలు ఉంటారు.
మనకు మంచి ఆలోచనలు వచ్చినప్పుడు “తథాస్తు” , “తథాస్తు” అని అంటుంటారు. అలాగే మనకి
పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు కూడా “తథాస్తు”, “తథాస్తు” అని
అంటుంటారు. అలాగే అవి జరుగుతూ ఉంటాయి అని చెప్పుతుండే వాళ్ళు. ఈ thought waves
(భావ ప్రసారాలు) అనేవి చాలా శక్తివంతమైనవి. మన వాక్కుని మనం జాగ్రత్తగా వాడుకోవాలి
లేకపోతె మనకి తెలియకుండానే మనం విపరీత పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు
దేవుణ్ణి నిందించి లాభమేమిటీ? మనమే అనాలోచితంగా అవి జరగాలి అని అనుకున్నప్పుడు,
అవి జరుగుతుంటే ఇక్కడ భగవంతుని పాత్ర ఏమీ లేదు కదా! కాకపొతే భగవంతుడు మనకి ఇచ్చిన
వాక్కుని మనం ఎంత వాడుకున్నా మంచికే వాడాలి. మరి శాస్త్రీయపరంగా అవగాహన కాని
ఉదాహరణ కాని కావాలంటే మీరు కన్వద మహర్షి గారి కణ సిద్ధాంతం చదివితే ఇదంతా
శాస్త్రీయపరంగానే ఉంది అని అనుకుంటారు.