కణ్వదమహర్షి కణ సిద్ధాంతం - 2
కణ్వదమహర్షి చెప్పిన విషయాలన్నీ కూడా నేను చాలా దీర్ఘంగా (లోతుగా deep ) విమర్శించుకుంటూ నేను నా గదిలోనే గడిపాను. తెల్లవారుఝామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, గురుద్వారాలో అల్పాహారం తిని. ఇంకా నైరోబీకి బయల్దేరుదామని కారు దగ్గరకి వెళ్లాను. మరి ఏ కారణాల వల్లో తెలియదు కాని ఎంత ప్రయత్నం చేసినా కారు ఇంజను స్టార్ట్ కాక పోవడంతో ఆ ప్రయత్నం విరమించుకుని నేను నా గదిలోకి వెళ్లి ప్రశాంతంగా కూర్చున్నాను. ఆ రోజు శనివారం నేను నైరోబీకి కాస్త ఆలస్యంగా వెళ్ళినా ఫరవాలేదని నిశ్చింతతో గదిలోనే ఉండిపోయాను. మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు లోపల ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. అనుకోకుండా ఎంతో అద్భుతంగా కణ్వద మహర్షి గదిలో దర్శనమిచ్చారు.
తెల్లవారుఝాము దాకా నేను జన్యు కణాల గురించి చెప్పినదంతా నెమరు వేసుకుంటూ ఉన్నావు కదా ! అని అనగా , "అవును మహాత్మా ! మీరు చెప్పిన విషయాలే నేను నెమరు వేస్తున్నాను అని బదులు ఇచ్చాను. అయితే మానవులలో అంత అద్భుతమైన శక్తి ఉందా మహాత్మా? నేను నమ్మలేక పోతున్నాను. మనలో అవయవ నిర్మాణ లోపాలు కనక ఉంటే జన్యు కణాలు, stemcells తో మాట్లాడి , ఆ అవయవాలలో ఉన్న లోపాల్ని సరి దిద్దుకునేంత శక్తి మానవునికి ఉందా? అని నేను పదే పదే ఆలోచిస్తున్నాను. అదెలా సాధ్యం? అని కూడా అనుకుంటున్నాను అని చెప్పగా ఆయన నాయనా! మనిషిలో ఎంతో అద్భుతమైనటువంటి శక్తి సంపదలు దాక్కుని ఉన్నాయి. మరి మర్రి చెట్టు చూసావా ? ఎంత పెద్దగా ఉంటుంది ఎంత విశాలంగా, ఎంత ఎత్తుగా ఉంటుంది . రావి చెట్టు చూసినా అంతే కదా! మరి వాటి యొక్క విత్తనం ఎంత చిన్నగా ఉంటుంది. ఆ చిన్న విత్తనంలో, ఆ సూక్ష్మంగా ఉన్న ఆ విత్తనంలోనే అంత పెద్ద చెట్టు ఎలా ఎదగాలి ఎలా ఉండాలి ? అన్న మొత్తం ప్రణాళిక కూడా ఉంటుంది కదా! అందుకనే నేను నీకేం చెప్పానంటే సూక్ష్మాన్ని పట్టుకోవాలి. సూక్ష్మాన్ని నీవు చదవ గలిగితే స్తూలమంతా నీకర్థమవుతుంది .అందుకనే పెద్దవాళ్ళు సూక్ష్మంలోనే స్తూలముందని, సూక్ష్మంలోనే మోక్షముందని అన్నారు కదా ! ఏ రకంగా అయితే ఇల్లు కట్టడానికి ముందు ఒక కాగితం మీద ఆ ఇంటి ప్లాన్ గీస్తావో, ముందే ఎక్కడ ఏం ఉండాలో నిర్ణయించు కుంటావో అదే విధంగా నిర్మాణం చేయిస్తావో అదే విధంగా ప్రతి జీవికి, ప్రతి మొక్కకి. ప్రాణమున్న ప్రతి వాటికీ కూడా అవి బీజ రూపంలో ఉన్నప్పుడే ఆ మొత్తం ప్రణాళిక అంతా దానిలో లిఖించ బడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రణాళిక అంతా జన్యు కణంలో నే ఉంటుంది. నీకు ఇదివరకే చెప్పాను అంత సూక్ష్మ కణంలో కూడా మరి ఆ nucleus చుట్టూ అటూ ఇటూ ఉన్నటువంటి ప్రోటాన్స్ (protons), న్యూట్రాన్స్ (nutrons) మధ్యలో కూడా ఎంతో శక్తి ఉంటుంది. శూన్యం లాగా కనిపించి నప్పటికీ అక్కడ ఇన్ఫర్మేషన్ information అనే జ్ఞానం ఉంటుంది అని ఇదివరకే చెప్పాను కదా! కాబట్టి మనిషి కనుక తన లోపల ఉన్నటువంటి వికల్పాలన్నీ తొలగించుకుని, గట్టి సంకల్పంతో, గాఢ విశ్వాసంతో, గట్టి నమ్మకంతో స్టెమ్ సెల్స్(stemcells )తో కాని జన్యు కణాలతో కాని మాట్లాడినప్పుడు ముందు రాబోయే అవయవ నిర్మాణ లోపాలు కనుక ఒక వేళ ఉంటే, వంశ పారంపర్యంగా వచ్చే (hereditdory
Diseases) వ్యాధిలవుతే అవి తప్పకుండా నివారించ బడతాయి.
అయితే అవి పిండ రూపంలో ఉన్నప్పుడే కనుక ఆ జన్యు కణాలతో మాట్లాడే ప్రక్రియ కనుక మనం మొదలు పెట్టితే, నిజంగా చెప్పాలంటే గర్భ ధారణ కలిగాక ఆ ప్రక్రియ కనుక మొదలు పెట్టితే అద్భుతమై నటువంటి ఫలితాలు వస్తాయి. నాయనా! మనిషికంత శక్తి భగవంతుడు ప్రసాదించాడు. కాని తర తరాల నుంచి వస్తున్నటువంటి అజ్ఞానం , అంధ విశ్వాసాలు అన్నీ కూడా మనుషుల్ని పైకి రానీయకుండా వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఏ విధంగా అయితే ఒక పెద్ద బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు అది చాలా వేగంగా వెళ్ళకుండా దానికి తాళం (speed lockers)
వేస్తాము. అది వేసినప్పుడు దానికి గంటకి 150 కి.మీ వేగంతో ప్రయాణం చేయగలిగే స్తోమత ఉన్నా అది గంటకి 80 కి. మీ.వేగాన్ని దాటదు. అదే విధంగా మనిషి యొక్క ఆలోచనలు కనుక అయ్యో! ఇది మా వల్ల కాదు . ఇది తర తరాల నుంచి వస్తున్నది అని మన పెద్ద వాళ్ళు చెప్తున్నారు అన్న భావం మనస్సులో ఎప్పుడైతే బలంగా నాటుకు పోతుందో మరి అటువంటి వ్యక్తుల జీవితాలు అంత సుఖప్రదంగా ఉండవు. వాళ్ళు పూర్ణాయుశ్శుతో బ్రతకరు. ఒక వేళ బ్రతికి ఉన్నా అనారోగ్యంతో ఉంటారు అని నేను నీకు చెప్తున్నాను. అంతటి అద్భుతమైనటువంటి శక్తి మానవులకున్నది. ఎలాగంటే నీకు ఉదాహరణ కావాలి కదా !
మరి మానవుడు ఈ సృష్టిలో అన్ని జంతువులకన్నా , అన్ని ప్రాణుల కన్నా పరిమాణ క్రమంలో ఎంతో ప్రగతిని సాధించాడు కదా ! అటువంటి మానవుడు కొంత ప్రగతి సాధించాక అక్కడే ఆగి పోయాడు. ఇంకా ముందుకు పెరగటం లేదు . మామూలు జంతువులూ , అడవిలో ఉన్నటువంటి జంతువుల ముందు అతడు ఎందుకు పరాజితుడవుతున్నాడు ?ఎందుకు ఆ పరిమాణ క్రమం మీ సైన్సు మహాశయుడు చెప్పినటువంటి అంటే Darwin 's
theory ప్రకారం మనిషి యొక్క పరిమాణ క్రమం చూసుకుంటే అన్ని జంతువుల కన్నా కొన్ని వేల రెట్లు ముందు ఉన్నాడు. మామూలుగా ఒక star fish చిన్న స్టార్ ఫిష్ యొక్క చేయి విరిగినప్పుడు అది వెంటనే ఇంకొక చేయి నిర్మించుకుంటుంది కదా ! మరి స్టార్ ఫిష్ తో పోలిస్తే మానవుడు కొన్ని వేల రెట్లు పరిమాణ క్రమంలో ముందు ఉన్నాడు.
అలాంటి మానవునికి ఏదైనా అవయవ నిర్మాణంలో లోపం ఉంటే మరి అది ఎందుకు సరి దిద్దుకోలేక పోతున్నాడు ? అది ఎందుకంటే ఆ మనిషిలో అది సాధ్యం కాదు అనే ఒక ఆలోచన ఉన్నది. ఆ భావం బలంగా నాటుకు పోయింది. ఆలోచనకి ప్రబలమైన శక్తి ఉంది (Thoughts are
very powerful and guide our actions.) కాబట్టి ఆతను సంపూర్ణ ఆయుష్షుని పొంద లేక పోతున్నాడు. మార్పు అనేది మన ఆలోచనల్లో, మన సంకల్పంలో గట్టిగా ఉంటే బలంగా కనుక ఉంటే బాహ్యంగా కాదు లోపల ఉన్నటువంటి నిర్మాణ ప్రక్రియ తప్పకుండా మారి పోతుంది. అది గుండె జబ్బు కావచ్చు ,ఇతర జబ్బులు కావచ్చు అవన్నీ తప్పకుండా మార్చు కోవచ్చు . సరి దిద్దుకునే స్థితి ఉన్నది కాబట్టి సంకల్పం అనేది చాలా గట్టిగా, దృడంగా ఉండాలి. ఉన్నప్పుడే పనులు జరుగుతాయి మరి మానవుని శరీరంలో వెన్ను పూస నుంచి మన నాడీ మండలము (Nervous System) అంతా అక్కడ్నుంచే కదా వ్యాపిస్తుంది.
DNA
RNA
DNA
ఉదాహరణకి ఈ నరాలన్నీ ముందు భుజం నుంచి అన్ని చోట్లా వెళ్ళుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఎక్కడో ఒక చోట మన వెన్ను పూసకి (Spinal
Cord) దెబ్బతగిలి ఆ భాగం విరిగిపోతే, మామూలుగా ఏ విధంగా అయితే స్టార్ ఫిష్ వెంటనే చేయి నిర్మించుకో గలుగుతుందో అటువంటి శక్తి మనకి కూడా ఉంది కాని తర తరాల నుంచి ఉన్న అభిప్రాయం ఏమంటే ఒకసారి nervous system లో ఒక nerve పాడవుతే అది మళ్ళీ పునరుత్పత్తి కాదు , అక్కడ regeneration అన్నది జరగదు అని ఒక ఆలోచన మనలో బలంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మన శరీరం లోపల ఒక enzyme ఎక్కడైతే, ఏ భాగమైతే శిథిలమైందో ఏ భాగమైతే దెబ్బ తిందో అక్కడికి వెళ్లి మళ్ళీ ఆ nerve పెరగకుండా ఆ enzyme నిరోధిస్తుంది. మామూలుగా అయితే ఇలాంటి అపోహలేవీ లేకుండా గాఢ విశ్వాసం కనుక ఉంటే ఈ enzyme అన్నది అక్కడకి రానే రాదు. అది రానప్పుడు మామూలుగానే కొంత కాలానికి పాడయి పోయినట్టి, చెడిపోయినట్టి అ nerve త్వరలోనే మళ్ళీ నిర్మించబడి మామూలుగానే మనం ఆరోగ్యవంతుల మవుతాము.మనకు జబ్బులు వచ్చినప్పుడు మన అవయవ నిర్మాణంలో లోపం వచ్చినప్పుడు ఆ అవయవంలో ఉన్న DNA కణాలతో కాని stemcells తో కాని మనం మాట్లాడినప్పుడు , ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి తప్పకుండా పని చేస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని మళ్ళీ ప్రసాదిస్తాయి. దీనిలో ఏమాత్రం సందేహం లేదు అని మరొక్కసారి కణ్వద మహర్షి గారు చెప్పారు. అంతే కాకుండా మన జన్యు కణాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం మార్చ గలిగితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ప్రస్తుతం శాస్త్రజ్ఞులు ఏ పాశ్చాత్య శాస్త్రజ్ఞులైతే జన్యు కణాల మీద పరిశోధన చేస్తున్నారో వాళ్ళంతా ఏమంటారంటే మొత్తం జన్యు కణాలు మన శరీరమంతా ఐదు శాతం (5%) మాత్రమే ఉన్నాయి మిగతా తొంభై ఐదు శాతం (95%) జన్యు కణాలు కావు అని చెప్పటం జరిగింది. ప్రోటీన్ కోడ్ తో ఉన్న జిన్స్ (genes )ని మాత్రమే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు DNA గా గుర్తించారు RNA కోడ్ తో ఉన్నవి ప్రోటీన్ కోడ్ వి కావు కాబట్టి జన్యు కణాలు కావు అని వాళ్ళు చెప్పారు కాని ఇది పూర్తిగా తప్పు. మన మహర్షులు, సిద్ధ పురుషులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే చెప్పారు . ఇక్కడ ఈ జన్యు కణాలనేవి ప్రతి కణం లోను, stemcells అనేవి ప్రతి కణ నిర్మాణంలోనే ఉంటాయి. వాటి యొక్క శక్తి చాలా గొప్పది అని ఎప్పుడో చెప్పారు. కాని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు మాత్రం తొంభై ఐదు శాతము (95%) ఎందుకూ పనికి రాదు ఐదు శాతము (5%) మాత్రమే ఈ జన్యు కణం ఉత్పత్తికి పనికి వస్తాయి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాని ఈ మధ్య జరుగుతున్న పరిశోధనల్లో మెల్ల మెల్లగా వాళ్ళు కూడా వాళ్లు చేసిన నిర్ధారణ తప్పు అని కూడా తెలుసుకుంటున్నారు. (They confirmed
that RNA is also as important as
DNA ) ఎప్పుడైతే మన ప్రతి జన్యు కణంలో గట్టి సంకల్పాన్ని , దృఢ నమ్మకాన్ని నాటుతామో వాటికి భావ ప్రసారాల ద్వారా ఆదేశాలనిస్తామో అది అద్భుతంగా పని చేస్తుంది. మన ఆయుష్షు పెరుగుతుంది. మన ఆరోగ్యం బాగు పడుతుంది. శారీరికంగా మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా సంపూర్ణంగా ఆరోగ్యం కలుగుతుంది నాయనా ! అని ఆయన ఎంతో ప్రేమగా చెప్పారు. ఇక్కడ మన పూర్వీకుల దగ్గరనుంచి వస్తున్న దృఢ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాలన్నీ మన శరీరంలో ఉన్న జన్యు కణా లన్నింటిలో వ్యాపింప జేసామో అప్పుడు మనలో ఉన్నటువంటి అద్భుత శక్తులన్నీ కూడా ఎందుకూ పనికి రాకుండా నిర్వీర్యమై పోతాయి. ఎప్పుడైతే అ అడ్డు తొలగి పోతుందో మానవాళి అంతా త్వర త్వరగా పురోగతిని సాధిస్తుంది. ముఖ్యంగా 1987 నుంచి అద్భుతమైన కాలము. ఒక 25-27 సంవత్సరాల వరకు మానవుని యొక్క మేధస్సు ఎంతో అభివృద్ధి చెందుతుంది.
కణాలతొ మాట్లాడడం, stemcells తో మాట్లాడడం నేర్చు కుంటాడు. ఇంకా ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా ఈ విషయంలో ఇంకా ఎన్నో అద్భుతాలు ముందు ముందు సాధిస్తారు.
నాయనా ! ఇప్పటికే నేను నీకు చాలా సమాచారాన్ని ఇచ్చాను. అది మెల్ల మెల్లగా నీవు ఒక్కొక్క విషయాన్ని విమర్శన చేసుకుంటే ఇంకా రాను రాను మిగతా విషయాలు కూడా నేను తప్పకుండా చెప్తానుఅని నీవు ఇక నైరోబీకి బయల్దేరు నాయనా అని చెప్పడం జరిగింది. ఆయన అదృశ్యమవగానే నేను వెంటనే నా కారు దగ్గరకి వెళ్లి స్టార్ట్ చేయగానే నా కారు స్టార్ట్ అయింది. నేను మనస్సులోనే గురుద్వారాకి , కణ్వద మహర్షి కి నమస్కారం చేసుకుని తిరుగు ప్రయాణమై పోయాను .