దేవ దత్తుని వృత్తాంతం 11
వల్లభదాసు యొక్క కీర్తి
నాగనాథుడు తన మనో నేత్రానికి కనిపిస్తున్నఈ వ్యవహారాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వున్నాడు. వల్లభదాసు రాజమ్మగారు వెల్లిన తదుపరి, స్నానానంతరం పూజా మందిరంలో శ్రీపాదవల్లభుని ముందు ధ్యానం లో కూచున్నారు. సమస్యల పరిష్కారానికి దత్త ధ్యానం చేయడం వల్లభదాసుకు అలవాటు. ఆరోజు ధ్యానానంతరం వల్లభదాసు ధైర్యం గా వుండడం చూసి అతని అనుచరులు సంతోపడ్డారు.అతను తన ఆంతరంగిక అనుచరులను పిలిచి కొన్ని ఆదేశాలను ఇచ్చి పంపడం జరింది. తరువాత మరికొందరికి ఏవో ఉత్తరాలు రాసి ఇచ్చి పంపివేసారు. తరువాత కమలమ్మగారికి ఏవో ఆదేశాలను ఇచ్చి రాజమ్మగారి దగ్గరకు పంపారు.
రాజమ్మగారి కుమార్తె సుమతి చాల తెలివైన అమ్మాయి, లౌకికజ్ఞానం కలిగినది. శ్రీపాదుని పై అనన్య భక్తి కలిగినది అయినందు వల్ల తనకు రాబోవు ప్రమాదము పసిగట్టి శ్రీపాదుని పరి పరి విదముల తనను కపాడమని వేడుకుంటోంది.తన తండ్రి, నాన్నమ్మగారు కపట సన్యసిని నమ్మడం ఆ అమ్మయికి ఎంతో అయిష్టతగా ఉంది.ఈ లోపు కమలమ్మగారి ద్వారా అందిన వల్లభదాసు ఆదేశాలను రాజమ్మ తన కుమార్తెకు చేరవేసింది. తరువాత తన భర్తను పిలిచి అతనికి సుమతి గురిచి ఎదో చెప్పడంతో, ఆమె భర్త స్వామి వారి దగ్గరకు వెళ్ళి ఏదో సర్ది చెప్పడంతో ఆ కపట సన్యసి సరే అంటూ నాలుగు రోజుల తరువత అమ్మయిని వెంటపెట్టుకురమ్మన్నారు.ఇదంత చూసి రాజమ్మ తన కుమార్తె రక్షింపబడటానికి నాలుగు రోజుల సమయం దొరికినందుకు సంతసించింది. ఈలోపు వల్లభదాసు శ్రీపాదుని అండతో ఎదో ఒకటి చేసి తన కుమార్తెను రక్షిస్తాడు అని విశ్వసించింది.సుమతి ఈ విషయం తెలిసి ఈ అయిదు రోజులు శ్రీపాదుని ధ్యానంలో ఏకభుక్తం చేస్తూ తన సమయం గడపాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రి మరి కొంత మంది జనులు ఆ స్వామీజీపై మూఢవిశ్వాసం కలవారు అవడం చేత స్వామీజీకి లేని మహిమలు ఆపాదించి తెలిసిన బందు,మిత్రులకు ప్రచారం చేస్తున్నారు.
ఆరోజు మధ్యహ్న సమయంలో స్వామివారు దత్త హోమం చేస్తారు దానిలో పాల్గొనదలచిన వారు హోమమునకు కావలసిన నెయ్యి, ద్రవ్యాలతో రావలసిందిగా చాటింపువేసారు.అన్నదానంలో పాల్గునేవారిద్వారా, హోమంలో పాల్గునేవారి ద్వారా ఎంతో వ్యాపారం చుట్టుప్రక్కల దుకాణాలలో జరిగింది.పెద్ద సంఖ్యలో ధనిక, పేదా అను తేడా లేకుండా భక్త జనం గుమి కూడారు, పందిల్లు వేయపడ్డాయి, అన్నదాన సామాగ్రి సమకూడింది. ముందుగా ధనం చెల్లించిన దుకాణదారులు దుకాణాలలోనే స్వామి అనుచరులు నిర్దేసించిన విదంగా అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో స్వామివారి చిత్రపటాలు, స్వామి వారి అభిషేకతీర్థం లాంటివి వేల సంఖ్యలో మూఢభక్తులకు అమ్మసాగారు. ఎంతో మంది స్వామివారి సన్నిహితులు అయిన విధ్యావంతులు, అధికారులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. రక్షకశాఖాధికా రి స్వామి వారి భక్తుడు అవటం చేత రక్షకభటులు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.
వల్లభ దాసు రాసి ఇచ్చిన ఉత్తరాలు జిల్లా అధికారికి అందించారు వల్లభదాసు అనుచరులు. అది చదివి ఆ అధికారి తన యంత్రాంగానికి చేయవలసిన పనులను పురమాయించారు. ఎప్పటిలాగా ఈసారి కూడా శ్రీపాదుని లీలల మహత్యం వెల్లడి కాబోతున్నందులకు వల్లభదాసు, అతని అనుచరులు ఎంతో ఆనందంతోను ఆసక్తితోను ఎదురు చూస్తున్నారు.