దేవదత్తుని వృత్తాంతం - 16
నాగనాథుని సమ్యక్ విచారణ
నాగనాథుడు తన మనోనేత్రాలకు కనపడినటువంటి దృశ్యాలను అందులోని వ్యక్తులను గురించి చాల తీక్షణంగా విమర్శను మొదలు పెట్టాడు. అయ్యో ఈ భారతదేశంలో సాక్షాత్తు భగవంతుడు 9సార్లు అవతారాలు ఎత్తి ఎన్నో రకములుగా ప్రజల్ని దుష్టులనుండి రక్షించి ధర్మస్థాపన కోసం మనుషుల యొక్క మనసుల్లో ఆలోచనలతో సహా ఎలా పవిత్రంగా ఉండాలో పవిత్రమైన తను మనుష్య జన్మను ఎత్తి ఆచరించి చూపించినప్పటికి కూడా ఈ ప్రజల్లో ఎటువంటి మార్పులేదేమిటి అనుకున్నాడు.
అంతేకాకుండా సాక్షాత్తు దత్తస్వామి కూడా ఎన్నో అవతరల్లో భూమిమీద ధర్మప్రచారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి అనేక కోట్ల మందుని ఉధ్ధరించిన్నప్పటికి వారి యొక్క ఉపదేశాలు స్వల్ప కాలంలోనే మరచి, ఆయన తత్వాన్ని వక్రీకరించి తమకు అనుగుణంగా మార్చుకొని చిన్న చిన్న మాయలతో అమాయక ప్రజల్ని తప్పుదారి పట్టింస్తున్నారు. వారు భ్రష్టులవడమే కాకుండా ప్రజలని కూడా మోసం చేస్తున్నారే. ఎన్నో శాస్త్రాలు చదివిన పండితులు కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. లోకంలో ముఖ్యంగా భారతదేశంలో గోమాతకి, స్త్రీమూర్తికి, భూమాతకి ఎటువంటి గౌరవం లేకుండా చేస్తున్నారే అని వాపోయాడు.
ఎంతో మంది మేము దత్త పురాణం108 సార్లు మిగతా పురాణాలు పారాయనము చేసాము అని గొప్పలు చెపుకుంటున్నారు. వారిలో కూడా ఇసుమంత అయినా మార్పు లేదు బాగా ధర్మ విరుధ్ధంగా ప్రవర్తిస్తున్నారు.ఈ మూర్ఖ ప్రజలు కూడా వాళ్ళు చేసే చిన్న చిన్న మాయలకు మర్మాలకు లోబడి పోయి అసలు తత్వాని మరిచి దారి తప్పి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చాలా రకాలుగా ఆయన విమర్శ చేసుకోవడం మొదలు పెట్టాడు.
అయినా ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి? ఎందుకు దేవదత్తుల వారు నన్ను ఈ విధముగా గమనించమని చెప్పారు దీనిలో అంతరార్దం ఏమిటి ?అని ఆలోచించ సాగాడు. ఎక్కడ చుసినా నాకు ఒక్కడు కూడ నిజమైన దత్త భక్తులు కనబడుట లేదు.ఎంత సేపు వారి ద్రుష్టి గొప్పలు చెప్పుకోవడం,డబ్బు సంపాదించు కోవడం తప్ప మరొకటి లేదు. నిజంగా దత్తుని గురించి ఆయన తత్వాన్ని గురించి ప్రజలకి మార్గోపదేశం చేసి సంఘాన్ని ఒక్క శాస్త్రీయపరమైన మార్గంలో ఎందుకు పెట్టడం లేదు అని అనుకున్నాడు.
శ్రీ దత్త పురాణంలో సాక్షాత్తు దత్త స్వామి ఎంతో శాస్త్రీయతతో ఎన్నో విషయాలు చెప్పారు.ఆ స్వామి నేను సాక్షాత్తు భగవంతుడిని అని ఎక్కడా చెప్పలేదు. మరి ఈ చిల్లర దేవ్వుళ్ళు అందరు కూడా ఈ దత్త స్వామిని మించిపోయి ఉన్నారు. కొన్ని వేల కోట్ల ధనాన్ని పోగు చేయటం, ఆస్తులను సంపాదించడం, తనని నమ్మిన అమాయక యువతులను శిష్యురాల్లుగా చేసుకొని మోసపూరితంగా వారిని ప్రభావితం చేసి చివరికి వారిని వివాహం కూడా చేసుకుంటుంన్నారు.వారి ధన, మానాన్ని కూడ హరించి వేస్తున్నారు కదా స్వామి ఎమిటి, ఎందుకు నాకు ఈ శిక్ష? అని ఆయన పరి పరి విధాలుగా ఆలోచించడం మొదలు పెట్టాడు. సాక్షాత్తు శ్రీ స్వామి వారు కురుపురంలో తపస్సు చేసిన ప్రదేశంలోను రుక్మిని పాండురంగ ఆలయం ఎదురుగా పశువుల కొట్టంలో స్వామి దర్బారు చేసిన ఆ ప్రాగణంలోనగనాధుడు తీవ్ర ధ్యానంలో నిమగ్నులయ్యారు.
ఆయన మనో నేత్రానికి శ్రీ దేవదత్తుల వారు కనిపించి "నాయనా, నాగనాధ నీ అంతరంగం నాకు అవగతమైనది నువ్వు సాక్షాత్తు దత్తాత్రేయ నిజమైన భక్తుడివి అందుకే నీకు ఇంత ఆవేదన నిర్వేదన కలుగుతున్నది. ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన భారత దేశంలో కర్మ సిద్దాంతాన్ని మహా పండితులు కూడా అపార్ధం చేసుకొని వారికి ఉన్న వాక్చాతుర్యంతో వివిధ సిద్దాంతములను ప్రవేశపెడుతున్నారు. దతాత్రేయుని యొక్క వివిధ అవతారాలను కూడా వారి భక్తులు విమర్శిస్తున్నారు. అలాగే శ్రీ పాద శ్రీవల్లభ స్వామి వారి భక్తులు శ్రీ నరసింహ సరస్వతి గారిని, షిర్డీ సాయిబాబాను కూడా విమర్శిస్తు, విపరీతమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వారే ప్రస్తుతం సమాజంలో చాలా గొప్ప వ్యక్తులుగా చలామని అవుతున్నారు. సామాజికంగా,శాస్త్రీయపరంగా అన్ని విధాలుగా యుగాలు మారుతూన్నాయి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి . దానికి అనుగుణంగా ఇప్పుడు పురాణ ప్రవచనాలు చెప్పేవారు శాస్త్రీయతను జోడించి చెప్పలేక పోతున్నారు, పురాణ ప్రవచనాలు తరతరాల నుంచి వస్తున్నఅదే బానిలో చెప్పుకుంటున్నారు.
విష్ణు భక్తులు ఒంటి మీద శంకు చక్రాలను వాతలుగా పెట్టుకొని శివుని యొక్క నామశరణం చేయకూడదని భక్తుల దగ్గర విపరితమైన ప్రమణాలు చేయిస్తున్నారు.శివ భక్తులు విష్ణు భక్తులను ధ్వేశించడం,వీర శైవులు విష్ణు భక్తులను సంహరించడం చేస్తున్నారు.ఈ భారత దేశానికి మత గురువులు చేసిన ద్రోహం ఇంక ఎవ్వరు చెయ్యలేదని చెప్పడం అతిసయోక్తి కాదు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న ఈ తరం పిల్లలు ప్రజ్ఞాపుత్రులు అని వారిని వ్యవరిస్తుంటారు. వాళ్ళందరు కూడ ఈ పురాణంలో ఉన్నవాటిని పుక్కిట పురాణాలుగా తీసి పారేస్తున్నారు. శాస్త్రీయ పరంగా వారు అడిగే ప్రశ్నలకు బహుముఖ పాడింత్యం ఉందని ప్రకటించుకున్న వారు కూడా ఏమి సమాధానం చెప్పలేక పోతున్నారు.వారందరు కూడా కీర్తికి ఆశపడో, డబ్బుకు ఆశపడో తమకు తోచిన విధంగా వారు చదువుకున్న పురాణాలకు వక్చ్యాతుర్యంతో వారికి అణుగుణంగా ఆలోచించే విధంగా తయారు చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం భారతదేశంలో నాస్తికత్వం ప్రభలింది.వీరబ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొన్ని వేల మంది దొంగ సాధువులు,సన్యాసులు,అవదూతలు సమాజాన్ని అనేక విధంగా బ్రష్టు పట్టిస్తూ సర్వ నాశనం చేస్తున్నారు.ఇటువంటి వారి దురాగతాలని బయటికి చెప్పేవారు ఎవరు లేరు. ఎందుకంటే వారందరికి కూడా కర్మ సింద్దంతం భయపెడుతు ఉంటుంది, కాని ఈ నవ యుగ నిర్మాణ శక్తిలో ఈ పాత శక్తులన్ని కూడ కొట్టుకు పోతాయి. సాక్షాత్తు శ్రీ దత్త స్వామి చెప్పిన విధంగా ఒక్క నూతన యుగ శక్తి నిర్మాణం జరుగుతుంది. దీనికి నాందిగా చాలా మంది మహత్ములు కృషి చేస్తున్నారు. అందులో చెప్పుకో దగ్గ మహత్ముడు పండిత శ్రీ రామశర్మ ఆచార్య. కానీ ఆయనకు కూడ చాలా భక్తి భావం ఉండి ప్రియ శిష్యులుగా ఉన్నవారికి కూడ వారికి తెలియకుండానే అహం పెరిగిపోతూ ఉన్నది. వీటనింటిని కూడ నువ్వు విశ్లేషించాలి దానికి తగినట్టువంటి పరిస్థితులను అవకాశాలని ఆ విచక్షణ శక్తిని ఆ విమర్శనాత్మకమైనటువంటి ఆ జ్ఞానాన్ని నీకు దత్త స్వామి అనుగ్రహిస్తున్నాడు.ఇవన్ని కూడ నీలోనే నిద్రాణ స్థితిలో ఉన్నాయి వాటికి ఇప్పుడు అంకురార్పన జరిగింది. కాబట్టే నువ్వు నన్ను దర్శించుకోగలిగావు, నేను కూడ పనిముట్టుని మాత్రమే సుమా. కాబట్టి నువ్వు ఈ దత్త స్వామి యొక్క నూతన యుగ శక్తి నిర్మాణాన్ని ప్రజలకి చెప్పాలి. ఈ కపట సాదు సన్యాసులు గురించి నీకు అనుభవంలో వచ్చినది వివిధ పాత్రల ద్వార తెలియజేయడం జరుగుతుంది.ఇటువంటి విషయాలన్నిటిని కూడ నువ్వు నిర్భయంగా నిర్మొహమాటంగా చెప్పవలసి ఉంటుంది. ఎన్నో విమర్శలు నీకు వస్తాయి కాని నువ్వు వాటికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారత దేశంలో ఇటువంటి చేదు నిజాలని వినటానికి ఎవరు కూడ ఇష్టపడరు ఎందుకంటే తర తరాలుగా వారి పెద్దల నుంచి వచ్చినదే వాళ్ళు వల్లె వేస్తు ఉంటారు తప్ప వారిలో ఒక్క విమర్శనాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికి కూడ వారికి ఎన్నో సందేహాలు ఉన్నప్పటికి వాటిని భయటికి చెప్పటానికి మాత్రం భయపడుతుంటారు కాబట్టి నువ్వు ఈ పనిని చేయడానికి ఎంచుకోబడ్డావు నాయనా కాబట్టి ఈ నిర్వేదాన్ని పోగొట్టుకో అని మరి కొన్ని యోగ రహాస్యాలు ఆయనకు వెల్లడించి ఆయన మాయమైపోయాడు."