శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామ్రుతము రెండవ భాగము
గురించి కొన్ని ఆసక్తికర సంగతులు :
బ్రహ్మశ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారితో నాకు చాలా సన్నిహిత సంబంధం వుండేది. మొదటిసారిగా 2007 లో నేను శ్రీపాద శ్రీ వల్లభ చరితామ్రుతము చదివినపుడు ఆయనతో ఎలాగైన మాట్లాడాలనిపించింది.అనూహ్యంగా నాకు తెలిసిన వ్యక్తీ ద్వారా నాకు ఆయన సెల్ నెంబర్ దొరికింది. మొదటిసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడాను.అప్పట్లో ఆయన భీమవరంలో వుండేవారు.ఆ తరువాత నేను పిఠాపురం వెళ్ళినపుడు అక్కడ వున్న వారం రోజులు దీక్షితులమావయ్య గారితో ఎన్నో విజ్ఞానకరమైన,ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకొన్నాము. అప్పట్లో ఆయన తన దగ్గర వున్నటువంటి సంపూర్ణ చరితామ్రుతము మొదటి భాగము ఒక అక్షరం కూడా మార్చబడకుండా వున్న ఆ పవిత్ర గ్రంధాన్ని నేను తిరిగి హైదరాబాద్ వెళ్లేముందు నాకు ప్రసాదంగా ఇచ్చారు. దానితో పాటు ఒక పవిత్రమైన ఔదుంబర మొక్కని ప్రసాదించారు.
బ్రహ్మశ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు
బ్రహ్మశ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారితో నాకు చాలా సన్నిహిత సంబంధం వుండేది. మొదటిసారిగా 2007 లో నేను శ్రీపాద శ్రీ వల్లభ చరితామ్రుతము చదివినపుడు ఆయనతో ఎలాగైన మాట్లాడాలనిపించింది.అనూహ్యంగా నాకు తెలిసిన వ్యక్తీ ద్వారా నాకు ఆయన సెల్ నెంబర్ దొరికింది. మొదటిసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడాను.అప్పట్లో ఆయన భీమవరంలో వుండేవారు.ఆ తరువాత నేను పిఠాపురం వెళ్ళినపుడు అక్కడ వున్న వారం రోజులు దీక్షితులమావయ్య గారితో ఎన్నో విజ్ఞానకరమైన,ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకొన్నాము. అప్పట్లో ఆయన తన దగ్గర వున్నటువంటి సంపూర్ణ చరితామ్రుతము మొదటి భాగము ఒక అక్షరం కూడా మార్చబడకుండా వున్న ఆ పవిత్ర గ్రంధాన్ని నేను తిరిగి హైదరాబాద్ వెళ్లేముందు నాకు ప్రసాదంగా ఇచ్చారు. దానితో పాటు ఒక పవిత్రమైన ఔదుంబర మొక్కని ప్రసాదించారు.
ఉన్న వారం రోజులు మా మధ్య ఎంతో దగ్గర
సంబంధం ఏర్పడింది.ఆయన నన్ను తన పిల్లవాడిలా భావించారు.ప్రత్యేకంగా రైల్వేస్టేషన్
కి వచ్చి మాకు వీడ్కోలు ఇచ్చారు.ఆయన ఒక మేధావి ,శాస్త్రజ్ఞులు;ISRO లో ఆయన అబ్దుల్ కలాం గారితో చాలా సన్నిహితంగా పనిచేసిన
శాస్త్రజ్ఞులు. ఆ పుస్తకం ఇచ్చినపుడు పిఠాపురం సంస్థానం వాళ్ళు తొలగించినటువంటి
అద్భుతమైన విషయాలు కూడా మా చేత ప్రత్యేకంగా చదివించారు.ఈ విషయం లోనే ఆయన
మనస్తాపానికి గురి అయ్యారు.హైదరాబాద్ వచ్చినపుడు మా ఇంటికి భోజనానికి వచ్చి మమ్మలనందరినీ ఆనందపరిచారు. అప్పుడు నేను
ప్రతి రోజు మావయ్యగారిని శ్రీపాద శ్రీవల్లభ చరితామ్రుతము మిగిలిన 2,3,4,5,6
భాగాలూ త్వరగా రాయమని చెప్పి చిన్నపిల్లవాడిల మారాం చేసేవాడిని.ఆయన దగ్గర నాకు అంత చనువు వుండేది.మాకు ఒక ఉపాయం
దొరికింది.నేను మరికొందరు కలిసి DIGITAL VOICE RECORDER ఆయనికి గిఫ్ట్ గా ఇచ్చాము.
ఆయన సంధ్య భాష లో చెప్పేటప్పుడు
చేతిలో ఏదో ఒక వస్తువు పట్టుకొని వుంటారు.ఆయన సంకల్పించగానే ఆకాశతత్త్వంలో
వున్నటువంటి యోగ రహస్యాలు శక్తి ప్రసారం ద్వారా బయటికి వస్తాయి.కానీ ఒకసారి
మాత్రమే ఆ వాక్కు వస్తుంది మరల రెండవసారి రాదు.ఇంకో విషయం ఎంటంటే అది ఏ భాష లో
అయిన రావచ్చు.అందుకని అది రికార్డు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా సరి
చూసుకోవాల్సి వస్తుంది.
జూన్
మొదటి వారం 2010 నేను ప్రశాంత్ గారు పిఠాపురం లో ఒక వారం రోజులు బస చేసి ఆయనతో
సంధ్యభాషలో రెండవ భాగం లో విశేషాలు DIGITAL VOICE RECORDER లో రికార్డు చెయ్యాలని సంకల్పించాము.ముందు జాగ్రత్తగా ఇంకా
రెండు TAPERECORDERS తీసుకువెళ్ళాలని
పధకం వేసాము. మావయ్యగారు సుమారు నెల రోజులు
హైదరాబాద్ లో వున్నారు.ప్రతి రోజు ఆయన
సాన్నిధ్యంలో చాలా సేపు గడిపే వాళ్ళము.ఆయన ప్రియశిష్యులు రఘునాథ బాబు గారు ఆయనని
నీడలా వెంట వుండేవారు.
మావయ్యగారు మంచి ఎండాకాలంలో రఘుబాబు గారు,శ్రీరాములు గారు వారి శ్రీమతి వరలక్ష్మి గారితో కలిసి
పాండిచేరి లోని అరబిందో ఆశ్రమంలో గణపతి హోమం చేసి తదుపరి రమణ మహర్షి ఆశ్రమానికి
వెళ్ళడం జరిగింది.అక్కడ ఉండగానే మావయ్యగారికి ప్రేరణ కలిగి కొంత ఉపోద్గాతాన్ని
చెప్పడం దాన్ని రఘుబాబు గారు DIGITAL VOICE RECORD లో చెయ్యడం జరిగింది.పుణ్య దంపతులు అయిన శ్రీరాములు గారు
మరియు వారి శ్రీమతి వరలక్ష్మి గారి ఇంట్లో బస చేసారు.ఆ తరువాత అక్కడి నుండి నాకు
ఫోన్ చేసి ఒరేయ్ నువ్వు చెప్పినట్లు గానే రెండవ భాగము ప్రారంభించాను అని చెప్పారు. మరల హైదరాబాద్ వచ్చాక
నాతోమావయ్యగారు చాలాసేపు ఫోనులో మాట్లాడారు.త్వరలో రెండవ భాగం వస్తోందని
చాలా
సంతోషించాను.కాని సాయంత్రానికల్లా నా
సంతోషం విషాదంగా మారిపోయింది.ఆ రోజు సాయంత్రమే ఆయన స్వర్గస్తులయ్యారు. ఆయన
అప్పుడప్పుడు నాతో అంటుండేవారు ఏమిరా నా ఆరోగ్యం బాగోలేదు ఈ రెండవ భాగాన్ని
ఇప్పుడు నేను రాయగలనా?మరో
జన్మలో రాయవలసి వస్తుందేమో?అనేవారు.రికార్డు
చేసిన ఉపోద్ఘాతాన్ని CD చేసి రఘుబాబు గారు నాకు బహుమతిగా ఇచ్చారు.ఎవరికీ ఇవ్వకూడదని
ఆంక్ష విదించారు.కానీ నేను అయన మాటని మన్నించలేదు. నిజమైన దత్త భక్తులకు ఇవ్వమని ప్రేరణ వచ్చినందువల్ల మరియు దీక్షితులు
మావయ్యగారి గురించి దత్త భక్తులందరికీ చెప్పాలని ఈ విషయాలని
తెలియచేస్తున్నాను.
ఆయనతో గడిపిన రోజులు నా
జీవితంలో మరిచి పోలేనివి.అయన ఇచ్చిన పుస్తకం నా దగ్గర చాలాజాగ్రత్తగా
పెట్టుకున్నాను. దాన్ని ఫోటో
కాపీ చేయించి కొంతమంది దత్త బంధువులకి బహుమతిగా ఇచ్చాను. మేము చేయించిన
ఈ సంపూర్ణ చరితామ్రుతము DVD శ్రీ మల్లాది గోవింద
దీక్షితులుగారు ఆశీర్వదించి ఇచ్చినటువంటి అద్భుతమైన,అపూర్వమైన,అమూల్యమైన
కానుకగా సాక్షాత్తు శ్రీపాద శ్రివల్లభులు ఈ అవకాశం ఇచ్చినట్లుగా భావించండి.ముఖ్యంగా దత్తభక్తులు గమనించవలసినది
మేము చేయించిన ఈ DVD యధాతధంగా శ్రీ శంకర భట్టు రచించిన విషయాలన్నీ కూడా చదవడం
జరిగింది.భక్తులందరూ దీనిని శ్రవణం చేసి శ్రీపాద శ్రివల్లభులు మరియు శ్రీ మల్లాది
గోవింద దీక్షితులు గారి దీవెనలు పొందుదురు గాక.
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే