మన భారతీయ సంస్కృతి లో "గురువు" కు అతి ప్రముఖ స్థానము వుంది. 'గు' అంటే చీకటి, 'రు' అంటే తొలగించేవాడు అని శాస్త్రార్దము.అందుకే గురువుని త్రిమూర్తులతో పొల్చారు.
“గురుర్బ్రహ్మాగురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః”
అంటే
గురువు బ్రహ్మవలె శిష్యుని లో జ్ఞానాన్ని పుట్టించి, విష్ణువు వలె ఆ జ్ఞానాన్ని అర్ధము చేసుకునేలా
చేసి, శివుని వలె అజ్ఞానాన్ని తనలో లయింప చేసుకునేవాడు.అటువంటి గురువు కి నమస్కారములు.
అలాగే "గురుగీత"
లో పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పారు. దైవాన్ని నిందించినా కాపాడడానికి గురువు
వున్నాడు, కానీ గురువునే నిందిస్తే కాపాడే వాళ్ళెవ్వరు లేరు. అందుకే
“నగురోరధికం తత్త్వం నగురోరధికం తపః
నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవేనమః”
మన ఈ కలియుగంలో సామాన్య మానవునికి
మార్గదర్సకత్వం వహించడానికి,
మనల్ని ఆధ్యాత్మిక పథంలో కి తీసుకి వెళ్ళడానికి ఆది గురువైన దత్త త్రేయుడు తన పూర్ణ
అవతారాలు అయిన శ్రీపాద శ్రీ వల్లభ స్వామి,నృసింహ సరస్వతి,స్వామి సమర్ధ,షిర్డీ సాయిబాబా మరియు తన అంశ అవతారాలు అయిన
మాణిక్య ప్రభువు.రాంలాల్ మహా ప్రభువు ఇలా మరెంతోమంది గురువులను ఈ భూమి ఫై అవతరింప చేసారు.
మనకు తెలియకుండా గుప్తంగా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు వున్నారు.వారిలో ఒక్కొక్కరిని
దత్త భక్తులకు పరిచయము చెయ్యటమే ఈ మన ఆధ్యాత్మిక గురువులు అనబడే ఈ వ్యాస లక్ష్యము.దీని
ద్వారా ఎంతో మంది గురువుల గురించి తెలుసుకొని మన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విస్తరింప
చేసుకుందాము .
త్వరలో మీ ఆధ్యాత్మిక గురువులు ......................COMING SOON.
జై గురుదత్త