N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Monday 2 September 2013

Aadhyatmika Purogathiki Sadhanalu


                  ఆధ్యాత్మిక పురోగతికి సాధనాలు

నవగ్రహ శాంతి : సాధారణంగా మనము ఏమనుకుంటమంటే ఏ గ్రహానికి సంబంధించిన దోషం వల్ల పీడింప బడుతున్నమో ఆ గ్రహానికి సంబందించిన  శాంతి జరిపించుకొవాలని.ఆ గ్రహ సంబంధిత రత్నమో,రాయో ధరించాలని అనుకుంటాము. కానీ అది సరిఅయిన అభిప్రాయము కాదు.అలాదోష భూఇష్టమైన ఆ గ్రహానికి సంబంధించిన శాంతికాండను జరిపించడం వల్లగానీ,తత్సంబందిత రత్నాన్ని ధరించడం వల్ల గానీ దోషమైన ఆ గ్రహానికి మరింత బలం చేకూరి వారి జీవితాల్లో మరిన్ని కష్టాలు,భాదలు సంభవించవచ్చు అని E .K మాస్టర్ గారి సూచన. జాతకచక్ర రీత్యా బలం పొందిన గ్రహానికి మరింత బలన్నిచ్చే విధానాల ద్వారా దోషపూరిత గ్రహం ఇచ్చే చెడు ఫలితాలను పోగొట్టుకోవచ్చు. రవి గ్రహానికి శాంతి చేయించడం వల్ల చంద్ర గ్రహానికి సంబంధించిన చెడు ఫలితాలు తొలగి పోతాయి.అలాగే గురు గ్రహానికి సంబంధించిన శాంతి చేయించడం వల్ల రవి గ్రహానికి సంబంధించిన పీడ తగ్గుతుంది.శుక్ర గ్రహానికి శాంతి చేయించడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి.అదే విధంగా గురు గ్రహానికి శాంతి చేయించడం వల్ల శుక్ర గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా  ఈ గురు గ్రహ శాంతి చేయించడం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే రవి గ్రహానికి శాంతి చేసుకుంటే కుజ గ్రహ దోషాలు పోతాయి.అంటే కాకుండా రవి గ్రహ శాంతి వల్ల రాహు కేతువుల యొక్క పీడ కూడా తొలగిపోతుంది.
           

ఫై వివరణ క్షుణ్ణంగా పరిశీలిస్తే రవి గ్రహానికి ,గురు గ్రహానికి శాంతి చేయించడం వల్ల దాదాపు  అన్ని గ్రహాలు శాంతిస్తాయి. రవి అనగా సూర్యుడు అంటే సవితా శక్తి.సవితా శక్తి యొక్క మరొక రూపమే గాయత్రి.గురువు అనగా ఆది గురువైన దత్తుడే.ఆ దత్తుని అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభుడు "గాయత్రి మంత్రమే నానిర్గుణమైనపాదుకలు" అని తెలిపారు. దిని ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే గాయత్రి మంత్రాన్ని అతి శ్రద్దగా జపించడం వల్ల ఒక అద్భుతమైన రక్షణ కవచం సాధకుని చుట్టూ ఏర్పడుతుంది.దాని వల్ల సాధకుల ఫై ఎలాంటి దుష్ట గ్రహ ప్రభావము పని చేయదు.ఇందులో అతి ప్రధానంగా మనకు అందజేయబడిన ఓ గొప్ప రహస్యమేమిటంటే గోమాత సమక్షంలో ఆ పరిసరాలలో చేయబడే మంత్ర జపము అత్యంత విశేషఫలితలనందిస్తుందని మనం గుర్తుంచుకోవాలి.

పరమ దయమూర్తి,అపర గాయత్రి స్వరూపులు రెండు వందల కోట్ల గాయత్రి మంత్ర జపం చేసిన పరమ పూజ్య గురుదేవులు వేదమూర్తి ,తపోనిష్ట,యుగద్రష్ట శ్రీపండిత శ్రీశ్రీరామ శర్మ ఆచార్య ఏమన్నారంటే " నేడు గాయత్రి అందరూ జపించవచ్చు.దానికి వున్న ఆంక్షలు తీసివెయబడ్డాయి.కుల,మత.జాతి,లింగ,వయో బేధాలు లేకుండా అందరూ త్వర త్వరగా గాయత్రి జపం ప్రారంభించండి.

 రాబోయే రోజుల్లో విపరీత గ్రహ స్థితి వల్ల మనవ జాతి రక రకాల కష్ట నష్టాలను,ఊహించని విపత్హులను ఎదుర్కోబోతోంది.ఇప్పటికే ఎన్నో గడ్డు సమస్యలు,విపరీత వాతావరణాన్ని కలిగించే పరిస్థితులు చాలాచోట్ల కారు మేఘల్లా కమ్ముకొచ్చాయి.రకరకాల మానసిక శారీరక వ్యాధులు భాదలతో ఎందఱో కుమిలిపోతున్నారు.ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా పెరిగే సూచనలు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇవి కాకుండా ఎన్నో కుటుంబాలు రక రకాల సమస్యలతో కురుకుపోతాయి.అనేకమంది ఇప్పటికే అశాంతికి గురి అయ్యివున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితి నుండి మనల్ని,సమాజాన్ని కాపాడాలంటే గాయత్రి మంత్రాన్ని జపించడమే ఏకైక మార్గము.

 ఫై గడ్డు పరిస్థితులను ఎదుర్కొని మన జీవితాలలోకి సుఖ సంతోషాలకు స్వాగతం పలకాలంటే రోజుకు:

          గాయత్రి మంత్రాన్ని రోజుకు ''మూడు మాలలు (మాల అంటే 108 సార్లు)
               ఆదిత్య హృదయం మూడు సార్లు
          హనుమాన్ చాలీసా ఒకసారి
          శ్రీరామ రక్షా స్తోత్రం ఒకసారి
             'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే"      అనే ఈ శ్లోకం 16 సార్లు  చెయ్యాలి.

ఈ విధంగా చేసే వాళ్ళు మాకు మీ యొక్క జప సంఖ్య తెలిపినచో మీ యొక్క గోత్ర నామాలతో స్వామి వారి సన్నిధిలో గాయత్రి యజ్ఞం లో మీ జప యజ్ఞాన్ని ధార పోస్తాము.