N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Wednesday 28 December 2016

దేవదత్తుని వృత్తాంతం - 02

దేవదత్తుని వృత్తాంతం - 02


ప్రతి నాణానికి రెండువైపులు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఎప్పుడైతే దైవీ సంపద విజృ౦భిస్తుందో అప్పుడు అవతార పురుషుడు భూమ్మీద ప్రజలని ఉద్ధరించడానికి వస్తాడు. అదేవిధంగా దానికి కొన్ని వందల రెట్ల అసుర శక్తులు కూడా అవతరిస్తాయి. పైకి వారు సామాన్యంగానే సత్ప్రవర్తన ఉన్నట్టుగా కనిపిస్తారు కాని వాళ్ళలో అజ్ఞానం, అహంకారం, అరిషడ్వర్గాలనే దుష్టశక్తులు, అసురశక్తులు విజృ౦భిజృస్తూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మికపరంగా తక్కువ పరిణామ౦లో ఉన్నవారికి అర్థం కాని సమస్య. అందుకే వాళ్ళు తికమక పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ అసురశక్తులకి అద్భుతమైన వాక్చాతుర్యం, ఎంతో కొంత పాండిత్య ప్రవేశం ఉంటుంది. దేవతాశక్తులు ఎక్కువగా మౌనంగానే ఉండి తమ శక్తుల్ని మరుగుపరచుకుని ఉంటారు. పైకి వాళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటూ ఉంటారు. 


ఇదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి, మాటల్లో చెప్పలేనటువంటి సాక్షాత్తు ఆ శ్రీపాద దత్త స్వామి యొక్క బ్రహ్మాండమైన తేజస్సుతో మానవరూపంలో అవతరి౦చిన ఈ పీఠికాపురంలో కూడా ఎన్నో అసురశక్తులు కూడా ప్రవేశించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇటువంటి పవిత్రమైన భూమిలో సాక్షాత్తు దేవుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులవారిని దత్తుని రూపంలో, మహా పండితులని చెప్పబడే మనుష్యులు కూడా గుర్తించలేకపోయారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా, లౌకిక ప్రపంచం కన్నా ఎక్కువ రాజకీయాలు ఉంటాయి. కాని అమాయకులైనటువంటి మానవులందరూ కూడా ఈ దైవిక శక్తుల కన్నా అసుర శక్తులకి ఎక్కువగా దాసోహమంటారు.  పూర్వజన్మలో ఎంతో కొంత ఆధ్యాత్మిక సాధన చేసినవాళ్ళుకూడా చాలాసార్లు ఈ మాయాప్రభావానికి లోబడి ఎంతో కొంత దత్తాత్రేయుని అనుగ్రహం ఉన్నప్పుడు, కొద్దిగా చెడు అనుభవాలు జరిగినా, వాళ్ళు ఈ మాయనుండి బయటపడడం జరుగుతుంది. ఆ అసురశక్తులని ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు. సాక్షాత్తు షిర్డీ సాయిబాబా గారు కూడా ఈ మాయను జయించడానికి చాలా కష్టపడ్డారని చెప్పడం జరిగింది.

పీఠికాపురంలో అప్పటిపరిస్థితుల్లో  ఉన్న రాజకీయాలు అంటే ఆధ్యాత్మికపరంగా ఎన్నో ఉంటూ ఉండేవి. బ్రాహ్మణోత్తములుగా చెప్పబడ్తున్న వారు కూడా ఈ అవతారాన్ని గుర్తించలేక పోయారు. చాలా మంది ఈ కలియుగంలో దత్తుని భక్తులుగా చెప్పబడుతూ, పైకి భక్తిని నటిస్తూ కొన్ని లక్షలమంది సామాన్య జనుల్ని మోసం చేసి చాలా ధనాన్ని, భూసంపదలని సంపాదించుకున్నారు. వారి పేరుప్రఖ్యాతులు ఎంతగా ప్రాకిపోయాయంటే నిజమైన దత్త భక్తులు వారు చేస్తున్నటువంటి మోసాలని గ్రహించి కొంతమంది జనాలనైనా భ్రష్టులుగా కాకుండా ఉండాలనే సదుద్దేశ్యంతో వారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కపట సన్యాసులు, ఈ కపట దక్తుల వల్ల వారికి ఎన్నో ఇక్కట్లు, ఇబ్బందులు, ఒక్కొక్కసారి మృత్యువాతపడడం కూడా చాలా సహజంగా జరుగుతూ ఉండేది.

ఇలా ధ్యానస్థితిలో దేవదత్తుని మనోనేత్రాల ముందు అన్ని పరిస్థితులు అవగతమవుతూ ఉన్నాయి. దానికి ఆయన కొంత క్షేదపడసాగాడు. ఇలా ధ్యానస్థితినుండి ఆయన ఒక్క క్షణకాలం ఈ మాయా ప్రపంచంలోకి వచ్చారు. వచ్చే ముందు ఆయన మనోనేత్రానికి ఎదురుగుండా ఎంతో తేజస్సుతో ఉన్న ఒక యువకుడు కనిపించాడు. దత్త మహాప్రభువు యొక్క సూచన ఆయనకి పరావాక్కులో అందింది. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఒక పాతికేళ్ళ వయస్సు ఉన్న యువకుడు కనిపించాడు. అతని ముఖంలో ఎంతో తేజస్సు, ప్రశాంతత, కుతూహలం కనిపించింది. అతని మనోనేత్రానికి ఆ యువకుడు శంకరభట్టు వంశానికి చెందిన వ్యక్తి లాగా అనిపించాడు కాని అది ఆయన బయట పడనీయలేదు. ఆ ఎదురుగా ఉన్న యువకుడు మెడలో జంధ్యం వేసుకుని, ముఖాన విభూతి రాసుకుని, పంచ కట్టుకుని ఎంతో శ్రద్ధాభక్తులతో దేవదత్తునికి సాష్టాంగ దండ ప్రణామం చేసి, అంజలిఘటించి, ఎంతో వినమ్రంగా ఇలా అన్నాడు. “స్వామీ! నా పేరు నాగనాథుడు. నా పూర్వీకులు కన్నడదేశంలో ఉండేవారు. ప్రస్తుతం నేను ఈ తెలుగుగడ్డలో నివసిస్తున్నాను. 

మా వంశ పారంపర్యంగా దత్తుని మేము ఆరాధన చేస్తూ ఉంటాం. నాకు ఒక వారం రోజులక్రితం మీరు దత్త దీక్షలో ఉండగా, ఏకముక్తంతో ద్రుత పారాయణం చేస్తూ ఉండగా నాకు స్వప్నంలో ఒక అద్భుతమైన పురుషుడు, మహానుభావుడు కనిపించాడు. అలాగే నాలో ఒక దివ్యవాణి నాకు నీవు ఫలానా రోజున పిఠాశ్రీపీఠికాపురంలో స్వయంభూ ఆలయం దగ్గర ఒక వృక్షం దగ్గర ఉన్న ఒక మహానుభావుడ్ని కలవవలసిందిగా ఆజ్ఞాపించారు. నేను ఎంతో సంభ్రమాశ్చర్యాలతో పదేపదే ఈ స్వప్నం గురిచి ఆలోచిస్తూ ఉండగా, అది కలయా, నిజమా, భ్రాంతియా అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ మరుసటి రోజు కూడా అదే స్వప్నం రాసాగింది. లోపల ఎంతో వేదన కలిగి నేను ఈ ప్రదేశానికి వచ్చాను. ఇక్కడ మీరు ఎంతో నిశ్చలంగా ధ్యానస్థితిలో ఉన్నారు. మీ చుట్టూతా ఒక అద్భుతమైన కాంతిని నేను చూడగలిగాను. దానితో నాకు ఎంతో మనఃశాంతి, ఏదో తెలియని ఆనందం, ఆనందకరమైన అనుభూతులు కలిగాయి. మీరు తప్పకుండా ఎవరో మహాత్ములు, మహానుభావులని నాకు తెలిసిపోయింది. నేను దాదాపు మూడుగంటల నుండి ఇక్కడే నిల్చుని మిమ్మల్నే తదేకంగా చూస్తున్నాను. మీరు ఏమాత్రం చలనం లేకుండా సమాదిస్థితిలో ఉండడం చూసి నాకు చాలా ఆశ్చర్యం,సంతోషం కలిగింది. ఈ కలియుగంలో నేను ఎంతో మంది దత్త భక్తులని చెప్పబడే సాధువులని, సన్యాసుల్ని చూశాను. వారి దర్శనభాగ్యం చేత నాకు ఎటువంటి శాంతి కల్గకపోగా ఎంతో అశాంతికి గురి అవుతూ ఉండేవాడిని. నేను దత్తభక్తున్ని కావడం వల్ల పరిపరి విధాలుగా ఆ దత్తాత్రేయున్ని అనేకవిధాలుగా నాకు దత్తతత్వాన్ని చెప్పి అసలైన, నిజమైన మహాత్ముని దర్శనం చేయించమని ఆర్తితో పదేపదే ప్రార్థిస్తూ ఉండేవాడిని. స్వామీ ! ఇన్నాళ్ళకి ఆ దత్తాత్రేయుడు నన్ను అనుగ్రహించాడు. మీ దగ్గరకి పంపించాడు. మీరే నన్ను ఉద్ధరించాలి. ఈ కలియుగంలో మా చుట్టుప్రక్కల జరుగుతున్నటువంటి అనేక విషయాలు మేము గమనిస్తున్నప్పుడు మాకు ఆధ్యాత్మికత అంటే ఏమిటో అనేది అర్థం కావడంలేదు . ఒక అయోమయస్థితిలో ఉండిపోయాము. మా  ప్రశ్నలకి సరి ఐన సమాధానాలు చెప్పేవారు ఎవరూ లేరు. అసలు దత్తాత్రేయుని తత్త్వం ఏమిటీ? అది ఒక అనంతమైన ఆధ్యాత్మిక చైతన్యం అని తెలుసు కాబట్టి మరి ప్రస్తుత౦, నేను చూస్తున్నటువంటి దత్తభక్తులని చెప్పబడేవారు పరస్పరంగా ప్రవర్తిస్తున్నారు. అందుకని నేను కొంత అయోమయస్థితిలో ఉన్నాను. దయచేసి నా సందేహాలని నివృత్తి చేసి నాకు నిశ్చల భక్తిని ప్రసాదించండి” అని కన్నీళ్ళతో దేవదత్తుడ్నివేడుకొన్నాడు.       
                    
నేను ఆ యువకుడిని చూసి చాలా సంతోషపడ్డాను. అతని యొక్క భావతరంగాలు ఎంతో పరిశుద్ధంగా, స్వచ్చంగా, నిర్మలంగా ఉన్నాయి. అతను ఎంతో ఆర్తితో ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలను ముఖ్యంగా దత్తాత్రేయునితత్వం తెలుసుకోవాలని ఉన్నాడని నేను తెలుసుకున్నాను. అతను ఎన్నో జన్మలనుండి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందిఉన్నాడు. అందుకనే అతనికి సాక్షాత్తు దత్తాత్రేయుల వారి మీద భక్తి కలిగింది. అందులో అతను శంకర భట్టు వంశానికి చెందినవాడు కదా! అని నేను నా మనస్సులో ఆలోచించుకున్నాను. చిరునవ్వు నవ్వుకుని, “నాయనా! నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు వస్తావని నాకు మనస్సులో ఎంతో అనిపిస్తూ ఉండాలి. నీ సందేహాలని నేను నా శాయశక్తులా తీర్చడానికి ప్రయత్నిస్తాను. కాని నాయనా, దత్తాత్రేయుని తత్వం తెలుసుకోవడం అంత సులభం కాదు. అది అనంతమైనటువంటి శక్తి. అన్ని రూపాల్లో అన్ని శక్తులలో అది ఏవిధంగా అయితే మహాసముద్రంలో అన్ని సముద్రాలు, నదులు, తటాకాలు, సరస్సులు, సెలయేళ్ళు కలిసిపోతాయో అదేవిధంగా చరాచర సృష్టి అంతా అందులోనే తత్వాలు, లక్షణాలు అన్నీ కూడా ఇటువంటి మహాచైతన్యంలో కలిసిపోయి ఉంటాయి. కాబట్టి నాకు తెలిసినట్టి ఒక చిన్న నీటిబిందువంత ఆ దత్తాత్రేయునితత్వాన్ని చెప్పడానికి ఆ దత్తుడి యొక్క అనుగ్రహాన్ని అర్థించి నీకు నేను చెప్తాను. సందర్భానుసారంగా దత్తుని పేరుతొ నా నోటినుండి ఏ సమాధానాలు వస్తాయో అవి నీవు గ్రహించు గాక !  

అయితే మనమొకసారి ఈ పీఠికాపురం లో మామూలు వ్యక్తులవలె నడుచుకుందాం” అని చెప్పి అతనితో కూడి వారు మరొక్కసారి అక్కడ కుక్కుటేశ్వర ఆలయంలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయునికి నమస్కరించి బయటకి వచ్చారు. బయటకి రాగానే వారు శ్రీపాద శ్రీవల్లభులవారి దేవస్థానానికి దారి చూపించమని ఇద్దరు ముగ్గురు ఆగంతుకులని అడిగితే వాళ్ళు మాకు తెలియదని చెప్పారు. ఈ సమాధానం వినేసరికి దేవదత్తునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఒకప్పుడు శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి ప్రఖ్యాతి దేశదేశాలా వ్యాపించి అనేకదేశాల నుండి మహా భక్తులు ఆయన్ని దర్శించడానికి వస్తుండేవాళ్ళు. అటువంటి అ మహానుభావుని యొక్క మరి నివాసం ఎక్కడ ఉందని అడిగినప్పుడు మాకు తెలియదని చెప్పితే చాలా ఆశ్చర్యం అనిపించింది. “ఆహా ! యేమిరా ఈ కలియుగ మానవులు ! అట్టడుగు స్థాయికి వచ్చారు!” అని కించిత్తు అయన బాధ పడ్డాడు. అప్పుడే అక్కడకి వచ్చిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు వారికి “మీరు ఉప్పలస్వామి వారి ఆలయం దగ్గరకి వెళ్ళండి. అక్కడే శ్రీపాదశ్రీవల్లభులవారి సంస్థానం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు అలాగే అక్కడకి నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ దేవ దత్తుడు సామాన్య మానవుని వలె ప్రవర్తించాల్సి వచ్చింది కాబట్టి ఆయన మానవధర్మం ప్రకార౦ తన శక్తులని ఏమాత్రం ఉపయోగించకుండా అలాగే ఆ మార్గం గుండా పయనించ సాగారు. ఆయన దృష్టిగోచరానికి కనిపించనిదంటూ ఏమీ ఉండదు కదా! కాని ఆయన తన మహిమల్ని మరుగుపరచుకుని ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మౌనంగానే ఆ దారిన నడుస్తున్నారు. ఆ దారి అంతా ఇరుకుగా ఉండాలి. అటుప్రక్కన ఇటుప్రక్కన మురికినీళ్ళు పడడం ఇష్టంలేదు. ప్రజలందరూ  ఏమాత్రం క్రమశిక్షణ లేకుండానే మంచం మీద పిల్లాపాపలతో సంభాషణలతో, అరుపులతో కేకలతో ప్రవర్తించడం గమనించాడు. అలాగే వాళ్ళు మార్గమధ్యంలో వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ అడుక్కుంటూ చివరకి వేణు గోపాల స్వామి ఆలయం వీథిలో ప్రవేశించారు. వేణుగోపాల స్వామి ఆలయం చాలా పురాతనమైనది. దానికి ముందుగానే వారికి స్వామి వారు నివసించిన గృహం కనిపించింది. దాన్ని సాక్షాత్తు వాసుదేవానంద సరస్వతి గారే తమ తపశ్శక్తితో కనుక్కున్నారని చెప్పడం జరిగింది.
                       
అక్కడ లోనికి ప్రవేశించగానే సామాన్యదుస్తుల్లో కనిపించిన visitors ని వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కుని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా చెప్పారు. అక్కడ పూజ చేసేందుకు కొద్దిగా దక్షిణ ఇవ్వమని చెప్పారు. ముందుగా వారిద్దరూ కూడా శ్రీపాదశ్రీవల్లభ స్వామి, నృసింహ స్వామి విగ్రహాలకి నమస్కారం చేసుకున్నారు. పైకి సామాన్య మానవునివలేనే ప్రవర్తించవలసి వచ్చింది కాబట్టి సంకల్పమాత్రంతో కావలసినంత దక్షిణ చెల్లించుకుని అర్చన చేయించుకున్నారు. ఆహా ! ఏమి ఈ విధీవైపరీత్యం ! ఎంత విశాలంగా పెద్ద పెద్ద గదులతో వెనకా ముందు బోలెడంత ఖాళీ స్థలంతో ఉండే ఇల్లు ఇలా అయిపోయిందే! అని ఆయన కించిత్తు బాధపడ్డారు, ఆశ్చర్యపడ్డారు. వెనక ఎన్నో పూల చెట్లు, తులసి మొక్కలు, కొబ్బరి చెట్లు, బావితో విశాలంగా ఉండేది. ముందు వైపు కూడా చాలా విశాలంగా పెద్ద పెద్ద అరుగులతో ఉండేది. ప్రక్కనే పశువులగొట్టంలో ఆవులు ఉంటూ ఉండేవి. పటిష్టమైన గోడలతో, దృఢమైన స్తంభాలతో ఎంతో వైభవంగా కళకళలాడుతూ ఉండేది. అక్కడ వాళ్ళు డబ్బు చెల్లించారు. అక్కడకి వచ్చిన భక్తులు చాలా మంది కన్నడ దేశస్తులు, మరాఠి దేశస్తులు కనిపించారు. అక్కడ భోజనాల కోసం ఎత్తైన బల్లలు అమర్చారు. స్టీల్ డైనింగ్ టేబుల్స్ ని వారు అమర్చారు. అని నాగనాథుడు చెప్పాడు. ఆహా ! ఏమిటో పద్ధతులన్నీ మారిపోయాయి. హాయిగా క్రింద దర్భాచాపలు వేసుకుని , సుఖాసనంలో కూర్చుని, ఆచమనం చేసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో అతిథులకి, భక్తులకి వడ్డిస్తుంటే ఆ కమ్మని భోజనం దేవీప్రసాదంగా తింటూ ఉండే ఆ దృశ్యం ఆయన కళ్ళకి గోచరించింది. కాని మామూలుగానే ఆయన తన భోజనాన్ని ముగించారు. దురదృష్టవశాత్తు ఆయన చేస్తున్న భోజనంలో ఒక క్రిమికీటకం కనిపించింది. అది నాగనాథుడు చూసి చాలా బాధ పడ్డాడు. ఆ వడ్డించేవాడిని పిలిచి ఇది ఏమిటీ భోజనంలో పురుగు వచ్చింది అని చెప్పగా అతడు చాలా నిర్లక్ష్యంగా “బొద్దింకయే కదా ! తీసి ప్రక్కన అవతల పడేసి భోజనం చేయండి” అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న నాగనాధుడికి, దేవదత్తుడికి చాలా బాధ అనిపించింది. ఎంతో భక్తిశ్రద్ధలతో , మడి కట్టుకుని శుభ్రంగా వంటగది పరిశుభ్రం చేస్సి, పాత్రలన్నీ శుభ్రంగా తోమి, ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా శ్రద్ధగా ఇక్కడకి వచ్చిన భక్తులకి భోజనం పెట్టవలసిన ఈ ప్రదేశంలో వీళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఏమాత్రం భక్తులపట్ల శ్రద్ధ లేకుండా  వాళ్ళకి భోజనం వడ్డించడం చాలా విడ్డూరంగా అనిపించింది. అయితే ఇప్పుడు దేవదత్తుడి మనస్సు కొద్ది కొద్దిగా ఈ కలియుగ మానవుని అర్థం చేసుకోగలుగు తున్నాడు కాబట్టి, ఆశ్చర్యం కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చింది. సరే మిగతా సౌకర్యాలు ఎలా ఉన్నాయో చూడాలని అనిపించింది. 

అక్కడకి భక్తులు రాగానే వారికోసం కొన్ని గదులు కేటాయిస్తారు. వాళ్ళకి కేటాయించిన గది తలుపు తెరిచేసరికి, ఆయన అక్కడ ఒక్క క్షణం కూడా నిల్చోలేకపోయాడు. ఒక చెక్క మంచం, దాని పైన మాసిపోయి అసహ్యంగా ఉన్న దుప్పటి పరిచి ఉంది. గదంతా చెమట దుర్వాసనతో నిండి ఉంది. శ్రీపాదశ్రీవల్లభుల వారు స్వయంగా నివసించిన ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఈభగవంతుని శక్తి ఇటువంటి అపవిత్రమైన మనుష్యుల మధ్య ఎలా ఉంటుంది అన్నది ఆయన గ్రహించాడు. ఆయన మనోనేత్రానికి అక్కడ శక్తి చాలా మటుకు మటుమాయమైపోయిందని తెలిసిపోయింది. అక్కడ కార్యకర్తల మనస్సులో డబ్బు సంపాదించడం తప్పవేరే ఆలోచన లేదు. శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి యొక్క మహిమలను ఊహించుకుని, ఇంకా ఎన్నో అబద్దాలని కల్పించి  చెప్పుతూ, అక్కడకి వచ్చిన భక్తుల దగ్గరనుండి చాలా డబ్బులు వాళ్ళు లాగుతున్నారు. అక్కడ పారాయణం చేసుకోవడానికి డబ్బులు, ఎంతో కొంత దక్షిణ ఇచ్చినవారికి మర్యాదలు చేస్తున్నారు. ఆయన మనోనేత్రానికి వారసులు ఎవరూ అక్కడ కనిపించలేదు. మనసులన్నీ భావకాలుష్యంతోనే నిండి ఉన్నాయి. అక్కడనుండి బయలుదేరి బయటకి రాగానే అక్కడ కాషాయవస్త్రం ధరించిన ఇంకొక యువకుడు కనిపించి ద్విచక్రవాహనం(స్కూటర్ or బైక్) మీద వెళ్ళుతూ, అది ఒక్క నిమిషం ఆపి దేవదత్తుడికి నమస్కరించి “అయ్యా ! మీరు ఎక్కడకి వెళ్ళాలి?” అని అడిగాడు. దానికి సమాధానంగా నాగనాథుడు ఇటుపైన ఉన్న బాబాగారి ధాన్యాగారానికి వెళ్ళాలి అని చెప్పాడు. అతను మేము కూడా దత్తాత్రేయుని భక్తులమే అని చెప్పి విసురుగా, నిర్లక్ష్యంగా అక్కడ్నుంచి వెళ్ళిపోవడం జరిగింది. నాగనాథుని మరియూ దేవ దత్తుని ఆలోచనలు ఒక్క మాదిరిగానే ఉన్నాయి అదేమిటీ ఆ వచ్చినతను దత్తభక్తుడని చెప్తున్నాడు మరి వీళ్ళుకూడా దత్తభక్తులే కదా! మరి వీళ్ళకి వాళ్లకి పడకపోవడం ఏమిటీ అని ఆలోచించారు. దేవదత్తుడిగారికి మాత్రం శ్రీ పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు ఉన్నప్పుడే ఎన్నోరాజకీయాలు, వదంతులు, పుకార్లు ఉన్నాయి అని తెలుసును. అవి ఇప్పటికి కూడా ఇంకా అలాగే ఉన్నాయి. కాకపోతే ఇంకా ఎక్కువగా విజృ౦భి౦చాయి. కనీసం ఇప్పటికి ఇక్కడ నిజమైన పుణ్యాత్ములు, దత్త భక్తులు శ్రీపాదశ్రీవల్లభుల మహిమ తెలుసుకుని గుర్తించినవారు ఉన్నారు కాని ఇక్కడ ఇంతవరకు వాళ్లకి కనిపించలేదు. సరే ! అక్కడ బాపనార్యులు గారి అగ్రహారం ఉన్నది కదా! అది చూద్దామని వాళ్ళు బయలుదేరారు. మెల్లగా నడుస్తూ ఉన్నారు ఆ ఇరుకు సందుల్లో. ఎక్కడ చూస్తే అక్కడ మురికి వాసన, పందులు అక్కడా హాయిగా స్వైరవిహారం చేస్తున్నాయి. అలాగే వాళ్ళు వెళ్ళుతూ ఉన్నారు. 

మొత్తానికి ఎలాగో అలాగ కష్టపడి నాగనాథుని సహాయంతో బాపనార్యులు గారి అగ్రహారం చేరుకున్నారు. అది ఒక పెద్ద విశాలమైన అంగణం. ఒకప్పుడు ఈ అంగణం అంతా కూడా ధాన్యాలతో నిండి పోయి ఉండేది. వచ్చినవారందరికీ అక్కడ భోజన సదుపాయాలూ చేస్తుండేవారు. దూరప్రాంతాల నుండి వచ్చేవాళ్ళకి అక్కడ ఉండడానికి వసతిసౌకర్యాలు కూడా బాపనార్యులు గారు చేస్తూ ఉండేవారు. ఎంతో శోభాయమానంగా, కళకళ లాడుతూ, పట్టువస్త్రాలు ధరించి సాక్షాత్తు దేవతామూర్తుల లాగా కనిపించే స్త్రీలతో అది ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేది. ప్రస్తుతం అది ఎంతో కళావిహీనంగా కనిపించింది.