N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Tuesday 31 January 2017

Gayatri Mantra Mahima-1


ఆధ్యాత్మిక అనుభవాలు - విశేషాలు

గాయత్రి మంత్ర మహిమ 

ఉత్తర ప్రదేశ్ లో ఒక గ్రామంలో ఒక సంపన్న జమీందారి కుటుంబం ఉంటుండేది. కుటుంబానికి యజమాని అయినటువంటి విష్ణు శర్మ గారికి ఊళ్ళో మంచి పేరు ఉండేది. సంస్కృతంలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఆయన ఎంతో కృషి చేసారు. వేదాల్లో ఆయనని ఒకరుగా భావించ బడుతుండేవారు. ఊళ్ళో ఒక పెద్ద మనిషిలాగా ఆయన వ్యవహారిస్తుండేవారు. స్వతహాగా జమీందారు కావడం వాళ్ళ, పేరు ప్రఖ్యాతులు ఉండడం వల్ల సాధారణంగా అక్కడ పండిత సభలు జరిగినప్పుడు చాలా మంది మేధావులు, పండితులు అయినట్టి  వక్తలు తరుచుగా బయటనుంచి వచ్చినప్పుడు వారంతా వీరింటిలోనే మకాం వేస్తుండే వారు

విష్ణు శర్మ గారింట్లో అందరూ కూడా ఎంతో కొంత వేదాభ్యాసం చేసినవాళ్ళు పండితులు. అయితే ఆఖరి కొడుకైన విశ్వనాథ శర్మ మాత్రం మూర్ఖుడి లాగా వ్యవహరిస్తుండే వాడు. ఊళ్ళో అందరు కూడా అతన్ని అవహేళన చేస్తుండే వాళ్ళు. అతను చదువుతున్న బడిలో కూడా అతన్ని ఎందుకూ పనికిరానివాడి లాగా భావిస్తూ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అతన్ని ఎంతో హీనంగా చూస్తుండేవాళ్ళు. అక్క చెల్లెళ్ళు, అన్న దమ్ములు, తల్లి దండ్రులు కూడా ఎంతో వెక్కిరుస్తూ పని మనిషిలాగా చూస్తుండేవాళ్ళు. ఇలా ఉండగా ఒక సారి ఊరికి శ్రీ భవాని శంకర్ చతుర్వేది గారు అనే పేరు గల ఒక పత్రిక యజమాని మరియూ ఎడిటర్ అయినట్టి పండితుడు వచ్చారు. ఆయన్ని ఊరివారందరూ ఎంతో ఘన స్వాగతం చేసి అక్కణ్ణుంచి విష్ణు శర్మ గారింటికి తీసుకుని వచ్చారు. విశ్వనాథ శర్మ ఎందుకూ పనికి రానివాడే అందుకని అతన్ని వచ్చిన వాళ్ళ సేవలకి వినియోగిస్తుందే వాళ్ళు. ఒక రోజు పండితులు గారు బయట ఇంటి ముందు ఉన్న తోటలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండగా అతనికి సేవ చేయటానికి వచ్చినటువంటి విశ్వనాథ శర్మని దగ్గరగా పిలిచారు. విశ్వనాథ శర్మ స్ఫురద్రూపి. చాలా బాగా ఉంటాడు. నాయనా ! ఏమిటీ నీ మొహం చాలా దిగులుగా ఉంది, ఎందుకంత విచారంగా ఉన్నావు ? నీ వయస్సులో ఉన్న పిల్లలు చక్కగా ఆడుతూ - పాడుతూ ఎంతో ఉత్సాహంగా ఉండాలి. మరి ఎందుకు అంత దిగులుగా ఉన్నావు ? సంగతేమిటీ అని ప్రేమగా అడిగారు. మాటకి పిల్లవాడు బొట బొటా కన్నీరు కారుస్తూ, ఏమండీ ! మీరు ఒక్కళ్ళే నాతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు. నన్ను అందరూ అసహ్యించుకుంటారు. చివరకి మా ఉంట్లో నా అన్నదమ్ములు, కుటుంబ సభ్యులందరూ, మా నాన్నగారు కూడా నేనెందుకూ పనికివానిరాడని అంటుంటారు. అలాగే నేను చదువుకుంటున్న బడిలో నా తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎప్పుడూ ఏడిపిస్తూ చాలా హేళనగా నీకు ఒక్క అక్షరం ముక్క కూడా రావటంలేదు, చదువు దండగ అని అంటుంటారు. మా ఇంట్లో అనవసరంగా ఎందుకూ పనికిరాని వాడిలాగా పుట్టావు.  

ఎక్కడైనా పడి చావు అని తిడుతుంటారు. నేనెంత కష్ట పడి చదివినా ఒక్క అక్షరం ముక్క కూడా తలకెక్కటం లేదు నా ప్రయత్నంలో లోపమేమీ లేదు. నన్నేం చేయమంటారో చెప్పండి అని అడిగాడు. నా జీవితం వ్యర్థం కదా అని ఒక సారి  ఊరి చివర ఉన్న చెరువులో ఆత్మహత్య చేసుకుని చచ్చి పోవాలని దూకి  మూడు కిలోమీటర్ల దాకా కొట్టుకుపోయిన నన్ను, ఊళ్ళో వాళ్ళు బయటకి తీసి మా ఇంట్లో వాళ్లకి అప్ప చెప్పారు. అప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా నాతొ ప్రేమగా ఒక్క మాట కూడా అనలేదు పైగా ఎందుకురా బ్రతికావు చచ్చిపోకుండా అని విసుక్కున్నారు, ఎందుకండీ నాకీ  జీవితం ? అసలు భగవంతుడు నన్నెందుకు పుట్టించాడు? నేనెందుకు బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి ? నాకేమీ అర్థం కావటం లేదు. అందుకనే మీ దగ్గరకి వచ్చాను . మీలాంటి వారికి సేవ చేస్తే ఏమైనా కలిసి వస్తుందేమో అని ఆశగా ఉంది అని పాపం పిల్లవాడు ఎంతో దుఃఖిస్తూ చెపాడు. లేత హృదయం ఎంతో గాయ పడినందుకు   వచ్చిన పెద్ద మనిషి కూడా కరిగిపోయి కన్నీరు కార్చాడు. నాయనా ! నేనొక పని చెప్తాను. చేస్తావా? చాలా శ్రద్ధగా  చేయాలి అని అన్నారు. దానికి కుర్రాడు నేను తప్పకుండా శ్రద్ధగా చేస్తాను అది ఏమిటో సెలవియ్యండి అని అంటే, ఏమీ లేదు నాయనా నేను నీకు ఒక గాయత్రి మంత్రం ఉపదేశిస్తాను అది  చాలా అద్భుతమైనది, శక్తివంతమైనది కూడా. నీవు రోజు గాయత్రి మంత్రం జపం చేసుకో. నీ జీవితంలో అద్భతమైన మార్పు వస్తుంది అని చెప్పగా పిల్లవాడు ఎంతో శ్రద్ధగా కాళ్ళు చేతులు కడుక్కుని ఆయన చెప్పిన విధంగానే గాయత్రి మంత్రం నేర్చుకున్నాడు.

గాయత్రి - విద్యాదాయిని
       
వచ్చినపని  అయిపోయినాక శ్రీ భవాని శంకర్ చతుర్వేది గారు వారి ఊరికి వెళ్ళిపోయారు. పొద్దుటి పూట మంత్రం చేసుకోవడానికి కుదరదు పనులు పనులు చెప్పుతూ ఉంటారు అందుకని అతను శ్రద్ధగా రాత్రి పూట గాయత్రి మంత్రం చదవడం, జపం చేయడం మొదలు పెట్టాడు. నిద్ర వస్తుందేమో అని భయ పడి ఒక పిలక్కి తాడు కట్టి ఒక కొక్కానికి వ్రేలాడ దీసి కొక్కానికి దారం కట్టే వాడు . ఎప్పుడైనా నిద్ర మత్తు వచ్చినప్పుడు, తూలినప్పుడు దారానికి కట్టిన పిలక గట్టిగా లాగడంతో నిద్ర లేచి మళ్ళీ చదువుతూ ఉండేవాడు. అయితే ఇలా చేస్తున్నటువంటి రహస్య సాధనని ఇంట్లో ఎవ్వరు కూడా గమనించ లేదు. ఇలాగే రోజులు గడిచి పోతున్నాయి. అయితే అతని మోహంలో మార్పు రావడం అందరూ గమనించారు. అతను ఒక్క నెల రోజుల లోపలే తరగతిలో పరీక్షలన్నీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు  కావడం చూసి అతని ఉపాధ్యాయులంతా ఆశ్చర్య పడ్డారు. అతని తోటి విద్యార్థులు కూడా పిల్లవానిలో వచ్చిన మార్పులు, హుందాతనం, ఠీవీ, మాటలు, అతని మాటల్లో ఉన్నటువంటి దర్పమూ, ఆత్మ స్థైర్యం, ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి మాటలు, అడిగిన ప్రశ్నలకి జవాబులు ఇచ్చే విధానం ఇవన్నీ చూసి ఎంతో ఆశ్చర్య పోయి వారికి తెలియకుండానే అబ్బాయి పట్ల ఎంతో గౌరవంగా వాళ్ళు మెదలడం సంభవించింది. పరీక్షలన్నీ విశ్వనాథ్ తోటి విద్యార్థుల నుంచి కాపి కొట్టి వ్రాశాడా అని ఉపాధ్యాయులకి అనుమానం వచ్చి అతన్ని విడిగా కూర్చుండ బెట్టి పరీక్ష వ్రాయించినా మార్కులు బాగా వచ్చి  అతను ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడవడం, మాటలలో మార్పు, వినయ-విధేయత ఇవన్నీ చూసి వారంతా ఆశ్చర్య పడి పోయారు. ఇంట్లో వాళ్ళు కూడా అతనిలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్య పడి పోయారు. అతని తండ్రి గారు కూడా ఏమిటబ్బా! నా కుమారునిలో ఇలాంటి మార్పు వచ్చింది ! నడక మారింది. మాటతీరు మారింది. మాటల్లో ఆత్మ స్థైర్యం, ఆత్మ ధైర్యం, భాషలో ఉచ్చారణ మారింది మంత్రం చెప్పినా ప్రక్కకి వెళ్లి చక్కగా తప్పులు లేకుండా వల్లే వేస్తున్నాడు. దీనిలోని రహస్యమేమిటో నాకేమి అర్థం కావటం లేదు అని ఒకరోజు విశ్వనాథుని పిలిచి నాయనా ! ఏమిటీ విశేషం? నీలో ఇంత మార్పు వచ్చింది ? ఏం చేస్తున్నావు? అని అడగ్గా అప్పుడు పిల్లవాడు జరిగిందంతా చెప్పాడు. రాత్రంతా నేను ఎక్కడ నిద్ర పోతానో అని గిలక్కి దారం కట్టి వేలాడ దీసి నేను గాయత్రి మంత్రం  జపం చేస్తున్నాను అంతకన్నా నేనేమీ చేయటం లేదు అని చెప్పగా తండ్రి గారు కుమారున్ని  గాడంగా అతన్ని హృదయానికి హత్తుకున్నారు. తను చేసిన పనికి ఆయన విచారిస్తున్నట్టుగా క్షమాపణ చెప్పుకున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ఎడిటర్ గారు ఊరికి వచ్చినప్పుడు విశ్వనాథునిలొ కలిగిన మార్పు గమనించి చాలా ఆశ్చర్య పడ్డారు. అతను నించునే ఠీవి, మాట్లాడే విధానం అన్నీ చూసి ఏమిటీ ఇంత మార్పు వచ్చింది అని అడగ్గా అతను మీరే కదా నాకు గాయత్రి మంత్రం ఉపదేశించింది . గాయత్రి మంత్రమహిమ వల్లే నాలో ఇంత మార్పు వచ్చింది అని ఎంతో వినయంగా చెప్పాడు. రోజు పండిత సభకి కుర్రాడు వెళ్లి అక్కడ వాళ్ళు మాట్లాడినదంతా చక్కగా ఒక పుస్తకంలో వ్రాసుకున్నాడు. రోజు పండిత సభలో లోతుగా చర్చించిన గంభీరమైన విషయాలు అన్నీ కూడా చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా వ్రాయడమూ, వ్రాసినదాన్ని సేకరించి చెప్పడం చూసి ఎడిటర్ గారు ఎంతో   ఆశ్చర్య పోయారు. ఆనతి కాలం లోనే ఆయన కుర్రాడికి తన పత్రిక కార్యాలయం లో ఉద్యోగం ఇచ్చి, అంచెలంచెలుగా ఒక రోజు పిల్ల వాడు   పత్రికకి సంపాదకుడిగా మారడం సంభవించింది.  

గాయత్రి మంత్రం యొక్క మహిమ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఎన్నెన్నో ఉదాహారణలు మనం చెప్పుకొనవచ్చును. గాయత్రి మంత్రం శ్రద్ధగా చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మన మనస్సులో ఎన్నో మార్పులు వస్తుంటాయనే విషయం నిర్ధారణ అయింది. అయితే ఇది యదార్ధంగా జరిగిన సంఘటనయే కాని ఊహించి వ్రాసినది కాదు. గాయత్రి పరివార్ ద్వారా "గాయత్రి " అనే మాస పత్రికలో ఇది వచ్చింది. నాకు వాళ్ళ పేర్లు గుర్తు లేవు కాబట్టి పేర్లు మారి పోయినాయి కాని కథ అంతా యదా తథంగా చెప్పటం జరిగింది.