N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sripada Datta Sai Society

శ్రీపాద దత్తసాయి సొసైటీ 
శ్రీ పాద ఛాయ
పంచ దేవ్ పహాడ్ , మహబూబ్ నగర్ , 509298, ఆంధ్ర  ప్రదేశ్ 
సంప్రదించవలసిన  ఫోన్ నెంబర్ :-
 Sairam Garu: +91 9701268716

www.sridatta.info
Email: sridatta18@gmail.com, srnanduri00@gmail.com



శ్రీ పాద ఛాయ చరిత్ర 
దత్త బంధువులారా ,
మీకొక ముఖ్యమైన విన్నపం చేయ దలచుకున్నాము. 31 జనవరి 2010 రోజున పంచ దేవ్ పహాడ్ లోని శ్రీ పాండురంగ ఆలయం ఎదురుగా ఉన్న ఒక మహా వట వృక్షం క్రింద సాయంత్రం స్వర్గీయ బ్రహ్మశ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, నేను కూర్చుని మాట్లాడుకున్నాము. 

అంకురార్పణ : నాతో దీక్షితులు గారు “ సాయిరాం ! ఇక్కడ యీ క్షేత్రంలో అద్భుతముగా కొన్ని వందల ఏళ్ళ తర్వాత శ్రీ పాద శ్రీవల్లభ స్వామి వారి శక్తిపాతం జరిగినది. దానికి నిదర్శనముగా దివి నుంచి విభూతి వర్షం కురిసినది. 

అనేక వేల మంది సిద్ధ పురుషులు, మహర్షులు, సమస్త దేవతా గణం అదృశ్య రూపములో ఇక్కడకి విచ్చేసినారు. ఈ ప్రాంతమంతా కూడా త్వరలోనే గొప్ప క్షేత్రంగా మారుతుంది. అనేక మంది దత్త భక్తులు, యోగులు, అవధూతలు ఇక్కడకి ఈ క్షేత్రానికి ఆకర్షించ బడతారు.

Accomodation at Sripada Chaaya


దీక్షితులు గారి హెచ్చరిక – ఆదేశము
ఒక ముఖ్య విషయం నీకు చెప్పుతున్నాను. జాగ్రత్తగా విను.  శక్తిపాతం జరిగిన ఈ ప్రదేశంలో  బ్రహ్మాండమైన దైవికమైన జఠరాగ్నిప్రజ్వరిల్లుతుంది. దానిని శాంతింప చేయడానికి విశేషముగా నిరంతరమూ అన్నదానము ప్రాణాహుతులు గా ఈ జఠరాగ్ని అనే హోమంలో సమిధల మాదిరిగా అర్పించాలి. అప్పుడే ఈ ప్రాంతమంతా కూడా, ప్రజలంతా కూడా సుఖ శాంతులతో ఉంటారు. లోగడ శ్రీ పాద స్వాములవారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపనార్యులు గారు పిఠాపురం స్వయంభూదత్తుని ఆలయంలో శక్తిపాతం జరిగినప్పుడు అన్నశాంతి విశేషముగా జరపవలసిందని చేసిన అభ్యర్థనని అక్కడి వారు నిర్లక్ష్యం చేశారు. దాని ఫలితముగా అక్కడ ఒక పెద్ద భూకంపం కలిగింది .

పది వేల మంది ఆ జఠరాగ్నికి బలి అయిపోయినారు. కాబట్టి మనం ముఖ్యంగా నీవు ఈ కార్య క్రమాన్ని నడిపించాలి .” అని ఆదేశించారు. మనకి ఇక్కడ శ్రీ అనఘా దేవి సమేత అనఘ స్వామి వెనక ఉండి ఈ కార్య క్రమాన్ని ఆయనే నడిపిస్తారు. మనం కేవలం నిమిత్తమాత్రులమే అని సెలవిచ్చారు. ముందు ముందు మనకి ఎన్నో అడ్డంకులు వస్తాయి. విపరీత శక్తులెన్నో, మాయలో పడ్డ దత్త భక్తులు మనకి చెప్పరాని, చెప్పలేని అడ్డంకుల్ని సృష్టిస్తారు. ఎన్నో అపనిందలు కూడా నెత్తిన వేసుకోవలసి వస్తుంది.  వాటికి మనము సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి పరమ భక్తుడైన శ్రీపతి గారు విషమ పరిస్థితులని ఎదుర్కొనవలసి వస్తుంది. చిన్నా , పెద్దా అందరు కూడా ముఖాన ఉమ్మేస్తారు. అటువంటి విపరీత పరిస్థితులకి  కూడా తట్టుకొని నిలబడాలి. తర్వాత అంతా  ప్రశాంతంగా జరిగి పోతుంది. 

శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆదేశం ప్రకారం పంచ భూత యజ్ఞం, అనఘాష్టమి వ్రతం, గో పూజ ప్రత్యేక సందర్భాల్లో పితృ హోమం విరివిగా జరగాలి. భవిష్యత్తులో మీ కార్య కలాపాలన్నీ కూడా మీ స్వంత విశాలమైన క్షేత్రంలో జరపబడతాయి. మాయా శక్తుల విజృంభణ నాశనమై పోతుంది. ఈ క్షేత్రంతో  సంబంధం పెట్టుకోవడం అనేది పూర్వ జన్మ సుకృతంలాగా భావించబడుతుంది. దానికి నేను సిద్ధంగా ఉంటాను. అహంకార పూరితులు, ధన గర్వంతో మదించిన వారు ఈ క్షేత్రంలో అడుగు పెట్ట లేరు. ఇలా ఇంకా ఆయన ఎన్నో విషయాలు చెప్పారు.

ఆ రోజున దీక్షితులు గారు చెప్పినవన్నీ కూడా యదాతథంగా జరిగినాయి. జరుగుతున్న కార్యక్రమాలు శ్రీపాద ఛాయలో గాయత్రి మాత అంశగా వచ్చిన శ్రీమతి మైత్రేయి గారు 2010 నుంచి  నిర్విఘ్నంగా గాయత్రి హోమం, అనఘాష్టమి వ్రతం, గో పూజ, పితృ హోమం అనేక వేల మందితో స్వయంగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని అనేక ఆధ్యాత్మిక అనుభవాలని వాళ్ళు పొందుతున్నారు. 

 విన్నపం 
విగ్రహ ప్రతిష్ఠ ఈ సంవత్సరాంతం లోగా శ్రీదత్త పంచాయతనం జరుగుతుంది. అంతే  కాకుండా శివాలయం  స్థాపన జరుగుతుంది.  భక్తులందరికీ రెండు నెలలముందు తెలియ పరచుతాం. 

Route:

From Secunderabad, Shamshabad, Jadcharla, Mahbub Nagar, Makthal

At outskirts of Makthal, we have to take left turn on Kacha road for 15 kms to Reach Panchadev Pahaad. On the right hand side you will find a newly constructed arch. Enter the arch, you will reach Sri Padha Chaya. This are all new constructions. While taking left turn at Makthal, the the corner you will also find Kanyaka Parameshwari Temple.