దీపయజ్ఞము
యజ్ఞము అనగా త్యాగము,బలిదానము మరియు శుభ కర్మ అగ్ని,వాయువుల సహకారముతో
సమస్త విశ్వ కళ్యాణమునకు యజ్ఞము ద్వారా వితరణ చేయదగును. వాతావరణ కాలుష్య నివారణ వలన
సమస్త మానవాళికి ఆరోగ్య సంవర్ధకమగు ప్రాణ వాయువు లభించును.హవన మొనర్చబడిన పదార్దములు
వాయువులో కలిసి ప్రాణులు అందరికి లభించి వారి ఆరోగ్యము పెంపొందించి,రోగ నివారణకు సహాయకరులగును.
యజ్ఞము చేయు వేళ ఉచ్చరించబడిన వేదమంత్రముల పునీత శబ్దద్వని ఆకాశమున వ్యాప్తమై జనుల
అంతఃకరణముల యందు సాత్వికతను,పరిశుద్ధతను పెంపోదించును.యజ్ఞము వలన ఉద్భవించిన శక్తి శాలి
యగు తత్వము వాయు మండలమున వ్యాపించి సుక్ష్మ జీవులను నశింపచేయును తద్వారా రోగ రహితమైన
జీవితం అందరికి లభించును.విధి పూర్వక మైన యజ్ఞము ఒనర్చుట వైజ్ఞానానికి తధ్యము.దాని
వలన కామ,క్రోధ,లోభ,మోహ ,మద, మత్సరములు,ఈర్ష్యాద్వేషాలు మరియు
పిరికితనము ,కాముకత,సోమరితనము,ఆవేశము సంశయము మొదలగు
పలు మానసికోద్వేగాముల చికిత్సకు యజ్ఞము ఒక విస్వసనీయమగు పధ్ధతి.
దీపయజ్ఞ విధి విధానము:
బ్రహ్మ సంధ్య: శరీరమును,మనస్సును పవిత్ర మొనర్చుటకు
ఇది చేయబడుతుంది.దీనిలో అయిదు పనులు చేయవలసి వస్తుంది.
పవిత్రీకరణ : ఎడమ చేతిలోనికి నీరు
తీసుకుని కుడి చేతితో మూసి,గాయత్రీ మంత్రోచ్చారణ
చేసి తరువాత ఆ నీటిని ఈ క్రింది వున్న మంత్రము చదువుతూ శిరస్సు మీద,శరీరము మీద చల్లుకొనవలెను.
ఓం
అపవిత్రః పవిత్రో వా
సర్వావస్థాంగతో
పివా:
యః
సమరే త్పుండరీకాక్షం
స బాహ్యభ్యన్తరః
శుచి: ||
ఓం
పునాతు పుండరీకాక్షః, పునాతు పుండరీకాక్షః,
పునాతు||
ఆచమనము:- వాక్కు,మనస్సు ,అంతః కరణములను శుద్ధి
పరచుటకు మూడుసార్లు చెంచాతో నీటిని త్రాగవలెను.
ఓం
అమృతోపస్తరణమపి
స్వాహా || 1 ||
ఓం
అమృతాపిధానమసి
స్వాహా || 2 ||
ఓం
సత్యం యశః శ్రీర్మయి
శ్రీ: శ్రయతాం స్వాహా
|| 3 ||
శిఖా బంధనము:- శిఖ యొక్క స్థానము
తాకుతూ గాయత్రీ యొక్క ఈ చిహ్న మాద్యంగా ఎల్లప్పుడూ సదాలోచనలు ఇచ్చట స్థాపించ బడుతున్నాయని
భావించు కుంటూ ఈ క్రింది మంత్రమును ఉచ్చరించాలి.
ఓం
చిద్రూపిణి మహామాయే దివ్యతేజః
సమన్వితే |
తిష్టదేవి
తిష్టదేవి శిఖామధ్యే తేజోవృద్ధి
కురుష్వమే
||
ప్రాణాయామము:- శ్వాసను మందగతితో
గంభీరముగా ఆకర్షించి ఆపుట,మరియు వదిలి పెట్టుట
ప్రాణా యామ క్రమములోనికి వస్తుంది. శ్వాసను ఆకర్షించేటప్పుడు ప్రాణ శక్తి,మరియు శ్రేష్టత్వము శ్వాస ద్వారా లోపలికి ఆకర్షించ బడుచున్నట్లుగా
భావించాలి.విడిచి పెట్టే సమయంలో మాలోని దుర్గుణములను దుష్ప్ర వృత్తులను, మొదలగు చెడు ఆలోచనలు నిస్వాసముతో బాటు బయటకు వెడలి పోతున్నట్లుగా
భావించాలి.ప్రాణాయామమును ఈ క్రింది మంత్రములను ఉచ్చరించిన పిదప చేయాలి.
ఓం
భూ: ఓం భువః
ఓం స్వః
ఓం మహః
ఓం జనః
ఓం తపః
ఓం
సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియో
యోనః ప్రచోదయాత్
ఓం
ఆపోజ్యోతి రసో మృతం
బ్రహ్మ భూర్భువః స్వః
ఓం ||
న్యాసము: దీని ప్రయోజనము దేవపూజనలాంటి శ్రేష్టమైన కార్యములను చేయగల్గుటకై శరీరము యొక్క మహత్వపూర్ణ అవయవాలన్నిటిలోనూ పవిత్రతను ప్రవేసిమ్పచేయుట, మరియు అంతర్ స్మృతిని మేల్కొల్పుట. ఎడమ అరచేతిలోనికి నీరు తీసుకుని కుడిచేతి అయిదు వ్రేళ్ళను నీటిలో తడిపి చెప్పబడిన చోట మంత్రోచ్చారణతో బాటు స్పృశించవలెను.
ఓం వాజ్ఞమే ఆస్యే స్తు | (రెండు పెదవులు)
ఓం నసోర్మే ప్రోణో స్తు | (రెండు ముక్కు రంధ్రములు)
ఓం అక్ణోర్మే ఛక్షురస్తు | (రెండు నేత్రములు)
ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు | (రెండు చెవులు)
ఓం బాహ్వొర్మే బలమస్తు | (రెండు చేతులు)
ఓం ఊర్వోర్మే ఓజస్తు | (రెండు తొడలు)
ఓం అరిష్టానిమేంగాని తనూస్తాన్వా మే సహా సంతు || (శరీరము అంతటా చల్లుకొనవలెను)
ఫైన చెప్పబడిన ఈ కర్మ కాండలు సాధకునిలోపవిత్రతా,తీక్షణతా అభివృద్ధి
చెందాలని, మరియు మాలిన్యములను
విసర్జించ వలెనని,ఆత్మశోధన,బ్రహ్మసంధ్యల యొక్క
ఉద్దేశ్యము. పవిత్ర మైన తీక్షణత గల వ్యక్తియే భగవంతుని దర్భారులో ప్రవేసించే అధికారమును
పొందగలడు.
పృథ్వి పూజనము:
ఓం
పృథ్వి ! త్వయా ధృతా లోకా దేవి, త్వం విష్ణునా ధృతా
త్వం చ ధారయ మాం దేవి ! పవిత్రం కురుచాసనమ్ ||
ఈ శరీరమును ఇచ్చిన భూమాత కు నేను కృతజ్ఞుడను/ కృతజ్ఞు రాలను
అని నమస్కారమును చేసుకోవాలి.
సంకల్పము:
ప్రతి మహత్వ పూర్ణ కర్మకాండ యందును సంకల్పము తీసుకోవడము ప్రధానంగా, పరంపరాగతంగా వస్తున్నది. లక్ష్యము, ఉద్దేశ్యము నిశ్చితమై ఉండాలి. అది బయటికి చెప్పాలి. శ్రేష్ఠ కార్యములు ఘోషణా పూర్వకముగా చేయబడతాయి. హీన, స్వార్ధ, తంత్రంతో కూడినవి గప్ చిప్ గా చేయబడతాయి. సంకల్పము వలన మనోబలము పెరుగుతుంది. మనస్సు యొక్క బలహీనత వల్ల కలిగిన కుసంస్కారాలపై అంకుశం ప్రయోగింపబడుతుంది. స్థూల ఘోషణ వల్ల దైవీ శక్తుల యొక్క సంయోగము మరియు సహకారము లభిస్తాయి. గోత్రము, ఋషి పరంపరలోని మహాత్ముల జీవిత విధానమును అనుసరించి మన జీవితాలను తీర్చిదిద్దుకోవాలి.
కుడిచేతిలో పూలు, అక్షతలు మరియు జలము తీసుకోవాలి. ఎడమచేయి క్రిందను ఉంచాలి. మంత్రము చదువుతూ పూజావస్తువులను ఒక పాత్రలో వదలాలి. మధ్య వచ్చే మాసం పేరు, పక్షము, గోత్రము, నామము మొదలగునవి ప్రతినిధులని పూర్తి చేసుకుని చెబుతూ ఉండాలి.
ఓం విష్ణుర్విష్ణుర్విష్ణు: శ్రీ మద్భగతో మహాపురుషస్య విష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యశ్రీ బ్రహ్మణో ద్వితీయే పరార్దే, శ్రీ శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, భూర్లోకే, జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే, ఆర్యావర్తైకదేశాంతర్గతే .... క్షేత్రే....మాసానాం మాసోత్తమే...మాసే....పక్షే. ... తిధౌ.....వాసరే....గోత్రోత్పన్నః....నామాహం సత్ప్రవృత్తి సంవర్ధనాయ, దుష్ప్రవృత్తి ఉన్మూలనాయ, లోక కళ్యాణాయ, ఆత్మ కళ్యాణాయ, వాతారణ పరిష్కారాయ, ఉజ్జ్వల భవిష్య కామనా పూర్తయే చ, ప్రబల పురుషార్థం కరిష్యే, అస్మై ప్రయోజనాయ చ, కలశాది - అవాహిత దేవతా - పూజన పూర్వకం, ..... కర్మ సంపాదనార్థం సంకల్పం అహం కరిష్యే.
చందన ధారణ :
ఓం
చందనస్య మహత్పుణ్యం, పవిత్రం పాపనాశనం,
ఆపదాం
హారతే నిత్యం, లక్ష్మీస్తిష్తటి సర్వదా
||
కుడి చేతి ఉంగరపు వ్రేలితో చందనము తీసుకోని స్వయముగా తమ నుదుట
ను ధరించవలెను.
కలశ స్థాపన: వేదికపై జల కలశమును ఉంచాలి. రాగితో చేయబడినది ఉత్తమము. దాని
కంఠమునకు సూత్రమును కట్టాలి. పుష్పములతో అలంకరించాలి. దానిపై మూతను పెట్టి, పైన వెలుగుతున్న
దీపమును ఉంచాలి.
ఈ కలశము విశ్వ బ్రహ్మాండమునకు, విరాట్ బ్రహ్మకు, భూ పిండమునకు
ప్రతీక. దీనిని శాంతికిని, సృజనమునకును, సందేశావాహకముగా కీర్తిస్తూ, సమస్త దేవతలూ కలశరూప
పిండము, లేక బ్రహ్మాండము నందు వ్యష్టి, సమిష్టి రూపములలో ఉంటారని చెప్పబడినది. ఒకే
వస్తువులో సమస్త దేవతలనూ దర్శించటానికి కలశ స్థాపన చేయబడుతుంది. జలమున గల శీతలత, శాంతి,
దీపమునకుగల తేజస్సు, పురుషార్థము యొక్క సామర్థ్యము అందరియందు ఓత ప్రోతమై ఉండాలి. ఇదే
దీప యుక్త కలశము యొక్క సందేశము. ఒక కార్యకర్త కలశపూజను చేస్తుంటే తక్కినవారు భావనా
పూర్వకముగా చేతులు జోడించాలి.
ఓం తత్వయామి బ్రహ్మణావందమానః తదాశాస్తే
యజమానో హవిర్భి: అహేడమానో వరుణేహ
భోధ్యురుశ గ్వం, సమాన ఆయు: ప్రమోషీ: ||
ఓం మనోజూతిర్జుషతామాజ్యస్య
బృహస్పతిర్యజ్ఞమిమం తనోత్వరిష్టం, యజ్ఞగ్వం సమిమం దధాతు
విశ్వేదేవా స ఇహ మాదయన్తామో మృతిష్ట
||
ఓం వరుణాయనమః | ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, ధ్యామి ఓం వరుణ దేవతాయేనమః గన్దాక్షత, పుష్పాణి, ధూప, దీప, నైవేద్యం సమర్పయామి | తతో నమస్కారం కరోమి ఓం కలశాస్థ దేవతాభ్యోనమః ||
ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణాః స్మృతః ||
కుక్షౌ తు సాగరాః సర్వ్, సప్తద్వీపా వసుంధరా
రుగ్వేదో థ యజుర్వేదః సామవేదోహ్య ధర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే, కలశంతు సమాశ్రితాః
అత్ర గాయత్రీ సావిత్రీ, శాంతి పుష్టి కరీ సదా ||
త్వయి తిష్టన్తి భూతాని, త్వయి ప్రాణాః ప్రతిష్టితాః
శివం స్వయం త్వమేవాసి, విష్ణుస్త్వంచ ప్రజాపతి: ||
ఆదిత్యాః వసవో రుద్రా, విశ్వేదేవాః సపైతృకాః
త్వయి తిష్టన్తి సర్వే పి యతః కామఫల ప్రదాః ||
త్వత్ప్రసాదాదిమం యజ్ఞం, కర్తుమీహే జలోద్భవః
సాన్నిధ్యం కురుమే దేవా ! ప్రసన్నోభవ సర్వదా ||
గురుఆవాహన: సాధకునికి మార్గదర్శనం చేసే గురువు, పరమాత్మ యొక్క దివ్య శక్తి యొక్క అంశము.సద్గురు
రూపంలో పరమ పూజ్య గురుదేవులు మరియు వందనీయ
మాతాజీని అభినందిస్తూ గాయత్రీ హవన సాఫల్యానికి గురు ఆహ్వానము క్రింది మంత్రోచ్ఛారణతో చేయవలెను.
గురుర్బ్రహ్మాగురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః |
అఖండ మండలాకారం వ్యాప్తం
యేన చరాచరమ్
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవేనమః ||
మాతృవత్ లాలయిత్రీచ, పితృవత్ మార్గదర్శికా
నమోస్తు గురు సత్తాయై, శ్రద్ధ ప్రజ్ఞాయుతా చ యా ||
ఓం శ్రీ గురవేనమః ఆవాహయామి,స్థాపయామి, ధ్యా యామి,పూజయామి ||
గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యం సమర్పయామి ||
గాయత్రీ ఆవాహనము: గాయత్రీ ఉపాసనకు ఆధార కేంద్రము మహా ప్రజ్ఞ ఋతుంభరా గాయత్రి.
గాయత్రి చిహ్నమైన చిత్రపటమును చక్కగా అలంకరింపబడిన పూజా వేదిక మీద స్థాపించి ఈ దిగువ
మంత్రములతో ఆమెను ఆహ్వానించాలి.సాధకుని ధ్యానమునకు అనుగుణ్యముగా గాయత్రి మాత శక్తి
అచ్చట అవతారము దాల్చుచున్నదని,స్థాపింపబడుచున్నదని భావించాలి.
ఓం ఆయాతు వరదాదేవి ! అక్షరే బ్రహ్మవాదిని !
గాయత్రిచ్చ్హన్దసాం మాతాః బ్రహ్మయోనిర్నమో స్తుతే |
ఓం గాయత్రైనమః ఆవాహయామి, స్థాపయామి
ధ్యాయామి,
పూజయామి తతోనమస్కారం కరోమి ||
ఓం స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయన్తామ్ |
పావమానీ ద్విజానాం ఆయు: ప్రాణం, ప్రజాం, పశుం,
కీర్తిం, ద్రవిణం, బ్రహ్మవర్చనం, మహ్యమ్ దత్వా ప్రజత బ్రహ్మలోకం
||
ఓం శ్రీ గాయత్రీ దేవ్యైనమః ఆవాహయామి,స్థాపయామి, ధ్యా యామి,పూజయామి ||
గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యం సమర్పయామి ||
గాయత్రి మాతను,గురుశక్తిని ఆహ్వానించి నమస్కరించిన పిదప దేవ పూజనములొ సన్నిహిత
సంబందము స్థాపించుకునే నిమిత్తము పంచోపచార పూజ చేయబడుతుంది.వీటిని నియమ పూర్వకంగా నెరవేర్చండి.జలము,అక్షతలు,పుష్పములు,ధూప దీపములు,మరియు నైవేద్యము చిహ్నరూపములో ఉన్న ఆరాధ్య దైవ సమక్షములో సమర్పింపబడాలి. నీటితో వినయము, సహృదయత, అక్షతలతో సమయదానము,అంశదానము పూలతో అంతరిక
సంతోషము,ధూప దీపములతో సువాసన,వెలుతురు పుణ్యము పరమార్ధము,అట్లే నైవేద్యముతో మాధుర్యము,మర్యాదల బోధ జరుగుతుంది.ఈ
ఉపచారములు మానవుని వ్యక్తిత్వాన్ని సత్ ప్రవృత్తులతో నేరవేర్చుటకు చేయబడతాయి.ఈ కర్మకాండ వెనుక ఉన్న భావన మహత్వపూర్ణమైనది.
గాయత్రి జపము: గాయత్రి మంత్రమును
కనీసము 3 మాలలు లేక గడియారమును
బట్టి సుమారు 15 నిమిషములు నియమిత రూపములొ
జపము చేయాలి.ఎక్కువ చేయగలిగితే మరీ మంచిది.పెదవిని కంఠాన్ని,నోటిని కదుపుతూ వుండాలి,
లేక రెండవవాడు వినలేనంత మెల్లిగా ఉండాలి. జపప్రక్రియ కషాయ,కల్మషాలను,చెడు సంస్కారాలను కడిగి వేయుటకు చేయబడుతుంది.
ఓం భూర్భువః స్వః
తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య
ధీమహి ధియో యోనః
ప్రచోదయాత్ |
ఈ విధముగా మంత్రమును ఉఛరిస్తూ,వరుసను పాటిస్తూ నిరంతరమూ మనము పవిత్రము అగుచున్నామని,దుర్భుద్ది స్థానములో
సద్బుద్ధి స్థాపన జరుగుతోందని భావించాలి.
దీపయజ్ఞము: ఈ క్రమమును పూర్తి చేసిన పిదప ఈ విధముగా దీపయజ్ఞమును ప్రారంభించవలెను. ఒక పళ్ళెంలో నాలుగు
వైపుల నాలుగు ప్రమిదలు మధ్యలో ఒక ప్రమిద పెట్టి ఒక్కొక్క ప్రమిద ఒక్క అగరబత్తితో వెలిగించాలి.దీని
తరువాత గాయత్రీ మంత్రము చదివి తరువాత స్వాహా
అని రెండు ఆవు నేతి చుక్కలు(ఆహుతులు) ప్రమిదలలో వేసి "ఇదం గాయత్రీ ఇదం న మమ"
అనాలి.ఇలా 24 సార్లు చేసిన తరువాత సిద్ధ మంగళ స్తోత్రము
ప్రతి రెండు లైన్స్ తరువాత స్వాహా అని రెండు ఆవు నేతి చుక్కలు(ఆహుతులు) ప్రమిదలలో వేసి
"ఇదం దత్తాత్రేయ ఇదం న మమ" అనాలి. ఇలా మొత్తం ఒక్కసారి సిద్ధ మంగళ స్తోత్రాని
కి 9 సార్లు ఆహుతులు వేసుకోవాలి. ఈదే విధముగా లలితా సహస్ర నామము చేసినపుడు,ఆదిత్య హృదయం చేసినపుడు కూడా చేసుకోవచ్చు.ఈ విధముగా మీరే మీ
ఇంట్లోనే దీప యజ్ఞము చేసుకోవచ్చు.
సూర్యార్ఘ్యదానము :
జపము పూర్తి అయిన పిదప పూజా వేదిక మీద ఉంచబడిన చిన్న కలశంలో
ఉన్న జలమును సూర్యుని దిశలో అర్ఘ్య రూపేణా ఈ క్రింది మంత్రములను ఉచ్చరిస్తూ జలమును
సూర్య దేవునకు అర్పించాలి.
ఓం సూర్యదేవ! సహస్రాంశో,
తేజోరాశే జగత్పతే |
అనుకంపయ మాం భక్త్యా
గృహాణార్ఘ్యం దివాకర ||
నీరు ఆత్మబలమునకు ప్రతీకమని, సూర్యుడు విరాట్ బ్రహ్మకు చిహ్నమని,మరియు మన యొక్క శక్తి
సంపదలు సమిష్టికై సమర్పింపబడి విసర్జించ బడుతున్నాయని భావించవలెను.
శుభకామన :
స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం |
న్యాయేన మార్గేణ మహీం
మహీశాః |
గోబ్రాహ్మణేభ్యో: శుభమస్తు
నిత్యం |
లోకాః సమస్తాః సుఖినోభవంతు
కాలేవర్షతు పర్జన్యః పృధ్వీ
సస్యశాలినీ
దేశో యం క్షోభ
రహితో బ్రాహ్మణా స్సన్తు
నిర్భయాః ||
సర్వే భవంతు సుఖినః
సర్వే సన్తు నిరామయాః
|
సర్వే భద్రాణి పశ్యన్తు
మా కశ్చిత్ దుఃఖ
మాప్నుయాత్ ||
అపుత్రాః పుత్రినః సంతు
పుత్రినః సంతు పౌత్రిణః
|
నిర్ధనాః సధనాః సంతు
జీవంతు శరదాం శతం
||
ఓం శాంతి: శాంతి:
శాంతి: ||
అసతోమా సద్గామయః |
తమసోమ జ్యోతిర్గమయ |
మృత్యోర్మా అమృతంగమయ |
స్వార్ధం మ్మా పరమార్ధంగమయ |
అవ్యవస్థా మ్మా సువ్యవస్థాంగమయ ||
ఓం శాంతి: శాంతి:
శాంతి: ||
ఓం ఓం ఓం
ఓం ఓం
రోగరహితమైన జీవితం, వృద్దాప్యరహితమైనజీవితం, మృత్యురహితమైనజీవితం
అందరికి రావాలని విశ్వమంతా ఏకీకరణ జరగాలని, నవయుగ నిర్మాణం జరగాలని, పృథ్వి స్వర్గంగా మారాలనే
అఖండ గురు సత్తా సంకల్పానికి సహకరించటం కోసం ఈ గాయత్రీ యజ్ఞము నిర్వహించబడుతోంది.
మన శరీరంలో ఉండే పంచ వీరభద్రుల
స్థానాలు అవి పని చేసే విధానము :
- జీవ విధ్యుత్ (బయో ఎలక్ట్రిసిటీ) ఈ జీవ విధ్యుత్ మన శరీరంలో మన బ్రెయిన్ లో
వుంటుంది.ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంటేనే మన శరీరం డెవలప్మెంట్ అవుతుంది. ఈ ఆలోచనా వచ్చిన అది ఈ జీవ విధ్యుత్
వల్లనే వస్తాయి.మన బ్రెయిన్ 1.5 వోల్ట్స్ లో వుంటుంది.
2.జీవ అయస్కాంతం (బయో
మాగ్నటిజం) దీన్నే ఇంకో భాషలో 'ఆరా' అంటాము. ఇది ప్రతి రోజు సిన్సియర్ గా గాయత్రి మంత్ర సాధన చెస్తూ
ఉంటే డెవలప్ అవుతుంది .ఆరా అంటే మన చుట్టు ఉండే అయస్కాంత శక్తి.మనం ఇది సాధన చెస్తూ
ఉంటే మనలో ఉండే వెలుగు కూడా అందరికి కనిపిస్తుంది.ఇదే సుక్ష్మీ కరణ సాధన .మనము చేసే
పనులు,ఆలోచనలు అన్ని బయో
ఎలక్ట్రిసిటీ వల్ల జరుగుతాయి.బయో అయస్కాంతం ఒక తేజో వలయంలాగా మన చుట్టూ వుంటుంది. అది
చూసే గురువులు మన జీవితాలను అర్ధము చేసుకుంటారు.ఈ శక్తిని డెవలప్ చేయడానికి జపము ఉపయోగ
పడుతుంది.జపము అందుకే చేయాలి.గాయత్రి అక్షర న్యాసంగా చేస్తే మన శరీరము అంతా గాయత్రి
(సూర్య శక్తి ) శక్తిగా మారిపోతుంది.
3.రేడియేషన్ ఒక దాంట్లో
నుండి ఒక శక్తి వెళ్తూ వుంటుంది. ఉదాహరణకి ఇంట్లో మీరు ఒక కూర చూసారు.మీరు ఆ కూరకావాలని అడగరు.కానీ అమ్మ ఆ కూర వండింది అనుకోండి అది రేడియేషన్.
అంటే ఒక ఆలోచన యొక్క కంపనలు మాత్రమే వెళ్లి మీకు కావలసిన వస్తుంటే అదే .రేడియేషన్.అదే
విధంగా అష్ట సిద్ధులు కూడా వస్తాయి.కానీ ఆ రేడియేషన్ మనకి తెలియాలి అంతే.
4.క్రియేషన్-రిప్రోడక్షన్
: క్రియేషన్ అంతే సృజనాత్మక శక్తి ఏమీ లేని దగ్గర నుండి బ్రహ్మ
ఇదంతా సృష్టించాడు.తరువాత రిప్రోడక్షన్ - ఒకటి తాయారు చేశాక దాని నుండి రిప్రోడక్షన్
ఒక పుష్పము నుండి అనేక పుష్పాలు ముందు క్రియేషన్
దాని నుండి రిప్రోడక్షన్.
5. ఇమ్యునిటి - రోగ నిరోధక
శక్తి : ఈ సుక్ష్మీ కరణ సాధనలో
ఈ ఇమ్యునిటి చాలా అవసరం.ఎందుకంటే మన శరీరం గురించే మనకు తెలియదు.మనం కరెక్టుగా ఆసన,ప్రాణాయామం చేస్తే
అన్ని ఇమ్యూన్ అయిపోతాయి.ఏది మనకు కరస్టు కాదో,ఏది మనకు మంచిది కాదో అవి ఇమ్యూన్ అయిపోతాయి.ఈ
పంచ వీర భద్రులను కరెక్టుగా చేస్తే మన జీవితాలు మారిపోతాయి.అవి ఎలా పని చేస్తున్నాయో
మనకు తెలుస్తాయి.
గాయత్రీమంత్ర సర్వాక్షర మహిమ వర్ణన
గాయత్రీ శక్తి విశ్వవ్యాప్త శక్తి దానితో సంబంధము స్థాపించుకొనిన
యడల సూక్ష్మ ప్రకృతి స్వాదినమగును.దాని వలన బౌతికము,మానసికము,ఆత్మకు సంబందించిన క్షేత్రములలోని అన్ని సంపత్తులను పొంద వీలు
కలుగును. శరీరము నందలి విబిన్న అంగముల నుండి నాడులు శరీరమునందు అంతటను వ్యాపించి ఉండును.కొన్ని
నాడులు కలసిన యెడల "గ్రంధి" అని పిలవబడును.జప యోగమునందు నిష్టులయిన వారు
ఆయా మంత్రములను ఉచ్చరించుట వలన ఆయా గ్రంధులను జాగృతము చేయుదురు. ఆయా గ్రందులయందు నిబిడీ
కృతమైన శక్తులు వ్యక్తీకరించబడు చుండును.
"ఓం"కారము ఉచ్ఛరించినపుడు శిరస్సుఫైన
వున్నఆరు అంగుళముల ప్రాంతము నందు శక్తి జాగృతమగును.
"భూ:" అను దానిని ఉచ్ఛరించినపుడు కుడి
కన్ను ఫైన నలుగు అంగుళములు వున్న ప్రాంతము జాగృతమగును.
"భువః" అను దానిని ఉచ్ఛరించినపుడు మానవుని త్రినేత్రము ఫైన వున్న మూడు అంగుళముల
ప్రాంతము జాగృతమగును.
"స్వః" అను దానిని ఉచ్ఛరించినపుడు ఎడమ కన్ను ఫైన నాలుగు అంగుళముల వున్న ప్రాంతము జాగృతమగును.
"తత్" అను దానిని ఉచ్ఛరించినపుడు ఆజ్ఞా చక్రము ప్రాంతమందున్న "తాపిని" అను గ్రంధి యందు సాఫల్యశక్తి జాగృతమగును.
"స" అను దానిని ఉచ్ఛరించినపుడు ఎడమ కన్ను వున్న ప్రాంతమున "సఫలత" అను గ్రంధి యందు పరాక్రమమును శక్తి జాగృతమగును.
"వి" అను దానిని ఉచ్ఛరించినపుడు కుడి కన్ను యందు "విశ్వ" అను గ్రంధి లోని "పాలన"
అను శక్తి జాగృతమగును.
"తు:" అను దానిని ఉచ్ఛరించినపుడు ఎడమ చెవి యందు "తుష్టి" అను గ్రంధి లోని "మంగళకరము"
అను శక్తి జాగృతమగును.
"వ" అను దానిని ఉచ్ఛరించినపుడు కుడి చెవి యందు "వరద" అను పేర గల గ్రంధి లోని "యోగము" అను
శక్తి జాగృతమగును.
"రే" అను దానిని ఉచ్ఛరించినపుడు నాసికా మూలము నందు "రేవతి" అను గ్రంధి లోని
"ప్రేమ" అను శక్తి జాగృతమగును.
"ణి" అను దానిని ఉచ్ఛరించినపుడు ఫై పెదవి యందు "సూక్ష్మ" అను గ్రంధి లోని "ఘన"
అను సంజ్ఞ గల శక్తి జాగృతమగును.
"యం" అను దానిని ఉచ్ఛరించినపుడు క్రింది పెదవి యందు "జ్ఞాన" గ్రంధి లోని "తేజము"
అనే నిబిడీకృతశక్తి జాగృతమగును.
"భర్" అను దానిని ఉచ్ఛరించినపుడు కంఠము నందు "భర్గ" అను గ్రంధి లోని "రక్షణ" నిబిడీకృతశక్తి జాగృతమగును.
"గో" అను దానిని ఉచ్ఛరించినపుడు కంఠకూపము నందు "గోమతి" గ్రంధి లోని "బుద్ది" అను శక్తి
జాగృతమగును.
"దే" అను దానిని ఉచ్ఛరించినపుడు ఎడమ ఛాతీ అగ్రభాగము నందు "దేవిక" అను గ్రంధి లో "దమనము"
అను శక్తి జాగృతమగును.
"వ" అను దానిని ఉచ్ఛరించినపుడు కుడి ఛాతీ అగ్రభాగము నందు
"వారాహి" అను గ్రంధి లో
"నిష్ఠ" అను శక్తి జాగృతమగును.
"స్య" అను దానిని ఉచ్ఛరించినపుడు ఉదరమునకు ఫైన చివరి ప్రక్క
టెముకలు కలియు స్థానమందు "సింహిని" అను గ్రంధి లో "ధారణా" అను శక్తి జాగృతమగును.
"ధీ" అను దానిని ఉచ్ఛరించినపుడు కాలేయము నందు "ధ్యాన" అను గ్రంధి లో
"ప్రాణ" అను శక్తి జాగృతమగును.
"మ" అను దానిని ఉచ్ఛరించినపుడు ప్లీహము నందు "మర్యాద" అను గ్రంధి లో "సంయము" అను శక్తి జాగృతమగును.
"హి" అను దానిని ఉచ్ఛరించినపుడు నాభి యందు "స్ఫుట" అను గ్రంధిలో నిబిడీకృతమైన తపోశక్తి జాగృతమగును.
"ధి" అను దానిని ఉచ్ఛరించినపుడు వెనుబాము చివరి భాగము నందు "మేధా" అను గ్రంధిలో నిబిడీకృతమైన దూరదర్శితాశక్తి జాగృతమగును.
ఎడమ భుజము నందు "యోగమాయా" గ్రంధి కలదు.దీనిలో జగృతాశక్తి
అంతర్నిహితము . దీని కొరకు "యో" అను దానిని ఉచ్చరించవలెను.
"నః" అను దానిని ఉచ్ఛరించినపుడు కుడిమోచేయి యందు "ధారిణి" గ్రంధిలో
"సరసతా" అను శక్తి జాగృతమగును.
"ప్ర" అను దానిని ఉచ్ఛరించినపుడు ఎడమ మోచేయి నందు "ప్రభవ" గ్రంధిలో "ఆదర్శ" అను శక్తి జాగృతమగును.
"చో" అను దానిని ఉచ్ఛరించినపుడు కుడి మణికట్టు నందు "ఊష్మా" గ్రంధిలో "సాహసము"
అను అంతర్నిహితశక్తి జాగృతమగును.
"ద" అను దానిని ఉచ్ఛరించినపుడు కుడి అరచేతి యందు "దృశ్య" అను గ్రంధిలో "వివేకము" అను శక్తి జాగృతమగును.
"యాత్" అను దానిని ఉచ్ఛరించినపుడు ఎడమచేతి యందు "నిరంజన" అను గ్రంధిలో "సేవ" అను శక్తి జాగృతమగును.
ఈ విధముగా గాయత్రీ
మంత్రము నందలి 24 అక్ష్రములకునూ, 24 గ్రంధులకునూ,24 రకములయిన శక్తులకును
సన్నిహిత సంబందము కలదు.
విషయ సేకరణ : శ్రీపాద శ్రీవల్లభ చరితామ్రుతము మరియు పూజ్య గురుదేవులు
Dr మారెళ్ళ
శ్రీ రామకృష్ణ గారి ప్రవచనముల నుండి.