N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Friday 14 October 2016

అతీంద్రియ శక్తులు



భారతదేశానికి రాక ముందే పాల్ బ్రంటన్ (Paul Brunton) సాధువులు, మహాత్ములు, మహర్షులు, సిద్ధ పురుషులు, అగ్గోరీల గురించి కూడా ఎంతో కొంత చదివి వచ్చాడు. అతడు తాను ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడే ఉంటున్న ఒక అగోరీ గురించి విని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకతన్ని “ఇక్కడ అగోరీ ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. “అవును ఇక్కడ ఒక అగోరీ ఉన్నాడు . కాని అతను పిచ్చి వాడు, ఎవర్ని దగ్గరకు రానీయడు, రాళ్ళు పెట్టి కొడతాడు” అని చెప్పాడు. పాల్ బ్రంటన్ (Paul Brunton) “నన్ను అతని దగ్గరకు తీసుకుని వెళ్ళు. నీవు దూరంగా ఉండి అతన్ని నాకు చూపించి, నీవు వెళ్ళిపో” అని అతనికి ఎంతో నచ్చ చెప్పాడు. 



చివరకు అతను ఎంతో అయిష్టంగా ఒప్పుకుని పాల్ బ్రంటన్ (Paul Brunton) తో వెళ్ళడం జరిగింది. అక్కడ నదీ తీరంలో ఉన్న ఒక చిన్న గుట్టమీద కూర్చుని ఒక వ్యక్తి విచిత్ర ఆకారంలో వీళ్ళకి కనిపించాడు. అతను వీళ్ళని చూడగానే కఠినమైన పదజాలంతో తిడుతూ రాళ్ళని వాళ్ళవైపు విసర సాగాడు. ఒక పిచ్చివాని మాదిరిగా అతను ప్రవర్తించ సాగాడు. దీనికి పాల్ బ్రంటన్ (Paul Brunton) తో వచ్చినటువంటి వ్యక్తి గడగడా వణికిపోయి “అయ్యా! మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోవడం మంచిది. వాడు రాళ్ళతో కొట్టి మనల్ని గాయ పరుస్తాడు” అని చెప్పాడు.

“చూడూ ! అతను రాళ్ళని మనవైపు కావాలనే గురి తప్పెటట్టుగా విసురుతున్నాడు కాని మనల్ని కొట్టడం లేదు. కేవలం అతను మనల్ని బెదిరించి దూరంగా తరమడానికే ప్రయత్నం చేస్తున్నాడు. నీవు భయపడవద్దు. ధైర్యంగా నాతో రా” అని చెప్పగా అక్కడ అగోరీ కొంచెం శాంతించి పాల్ బ్రంటన్ (Paul Brunton) తో పాటు ఆ వ్యక్తి ని కూడా రమ్మని చెప్పడంతో దిక్కు తోచక, అక్కడనుంచి వెళ్ళిపోతే ఆ అగోరీ ఏం చేస్తాడో అనే భయంతో ఆ వ్యక్తి కూడా పాల్ బ్రంటన్ (Paul Brunton) తో పాటు ఆ అగోరీ దగ్గరకు వెళ్ళాడు. ఆ అగోరీ పాల్ బ్రంటన్ (Paul Brunton) ని కూర్చోమని చెప్పి, మీకోసం మధురమైన పదార్థాన్ని తయారు చేసి ఇస్తాను అని చెప్పి, ప్రక్కనే ఉన్న వ్యక్తికి ఒక చాకును ఇచ్చి, అక్కడే నది దగ్గరలో ఉన్న ఒక శవాన్ని కోసి కొంచెం మాంసాన్ని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ వ్యక్తికి భయంతో నోట మాట రాలేదు. కాని వెళ్ళకపోతే ఆ అగోరీ ఏం చేస్తాడో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఎలాగోఅలా ఆ శవం దగ్గరకి వెళ్లి మెల్లగా అతి కష్టంతో కాస్త మాంసం ముక్కని  కోసి, అగోరీ ఇచ్చిన మట్టి కుండలో దాన్ని వేసి తీసుకుని వచ్చాడు.

ఆ ప్రయత్నంలో, ఆ భయంలో అతను తన వేలుని కోసుకున్నాడు. రక్తం ధారగా కారుతూ ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తిని అగోరీ దగ్గరకు పిలిచి, అతనికి గాయమైన చోట చేత్తో గట్టిగా నొక్కి రాయడంతో ఆ గాయం పూర్తిగా మాయమైపోయి రక్తప్రసరణ ఆగిపోయింది. ఇది చూస్తున్న పాల్ బ్రంటన్ (Paul Brunton) కొంత ఆశ్చర్య పడ్డాడు. అంత పెద్ద గాయం కూడా అతని చేతిస్పర్షతో పూర్తిగా నయమైపోయింది ఎలాగా? అని అనుకుంటూ ఉన్నాడు.  ఆ మాంసపు ముక్కను ఆ మట్టి కుండలో వేసి, నీళ్ళు పోసి దాన్ని కాస్త వేడి చేశాడు. అగోరీ చేస్తున్న తతంగమంతా పాల్ బ్రంటన్ (Paul Brunton) భయంగా ఆ వ్యక్తివైపు చూస్తుండగా అతడు ఒక ఆకులో తానూ వండిన పదార్థాన్ని పెట్టి ఎంతో ఆదరంగా, ఆప్యాయంగా పాల్ బ్రంటన్ (Paul Brunton) కి అందించాడు. అది ఒక తీపి పదార్ధం, మధురమైన పదార్ధం. దాన్నే రసగుల్లా అంటారు. అది బెంగాలి వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఈ వ్యక్తి మటుకు చాలా భయపడి పోయాడు. దాన్ని పాల్ బ్రంటన్ (Paul Brunton) ఎటువంటి సందేహం లేకుండా నోట్లో పెట్టుకున్నప్పుడు అది ఎంతో మధురంగా, తియ్యగా ఉన్నది. అంటే ఈ అగోరీలకి ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థం లాగా మార్చ గలిగే శక్తులున్నాయని పాల్ బ్రంటన్ (Paul Brunton) గ్రహించాడు. అయితే అతనికి తెలిసిన విద్య పాల్ బ్రంటన్ (Paul Brunton) కి అర్థమయ్యేటట్టుగా చెప్పడం చాలా కష్టం కాబట్టి కేవలం అతను చేసిన ఈ అద్భుతాన్ని మాత్రం చూసి ధన్యవాదాలు చెప్పి పాల్ బ్రంటన్ (Paul Brunton) ఆ వ్యక్తి అక్కడనుంచి నిష్క్రమించారు.

వైజ్ఞానిక పరంగా మనం చూస్తే పదార్థాల్లో కొన్ని రకాల molecules ఉంటాయి. ముఖ్యంగా హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, రూపాంతరం చెందుతూ నైట్రోజన్ ఇటువంటి కొన్ని ధాతువుల్నే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఒక ధాతువు ఇంకొక దాతువుతో కలిసినప్పుడు దాని రూపం మారుతుంది. దాని రంగు, వాసన, రుచి మారుతుంది. ఇలా వాటి గుణాలన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు అగోరీ చేసిన ప్రక్రియ కూడా ఇదేలాంటిది. అతను తన సంకల్పంతోటి ఆ చనిపోయిన వ్యక్తి శవం మీదనుంచి తీసినటువంటి మా౦సపు ముక్కలో ప్రోటీన్స్ ఉంటాయి. వాటి యొక్క molecular స్ట్రక్చర్ ని మార్చి, దాన్ని షుగర్ గా మార్చి వేసి దానితో ఈ రసగుల్లా అనే పదార్థ౦ గా మార్చివేయడం జరిగింది.  అందరికి ఇంకా సరిగ్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే పేకముక్కల్ని ఉదాహరణగా తీసుకుందాం. అందులో 52 ముక్కలు ఉంటాయి. వాటితో మనం కోట్ల రకలా combinations చేయవచ్చును. కాని వాటిలో ఉన్న నాలుగురకాల  ముక్కలే ముఖ్యమైనవి. ఒకటి  ఆఠీను (Hearts) అంటారు, ఒకటి కళావరు (clubs),  ఒకటి డైమండ్ (diamond), ఇంకొకటి ఇస్పేటు (spade) అంటారు. ఈ నాలుగు రకాల ముక్కలతోటే మనం ఏవిధంగా కొన్ని వేల combinations చేస్తామో అదే విధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ధాతువులని ఒక వరుసక్రమంలో చేర్చినప్పుడు ఒక పదార్ధం లాగా దాని యొక్క రూపం, ధర్మం ఒక మాదిరిగా ఉంటాయి. దాన్నే విడగొట్టి మనం ఇంకొక వరుసలో అమర్చినప్పుడు దాని యొక్క నిర్మాణం భిన్నంగా ఉంటుంది. దాని గుణాలు కూడా మారిపోతూ ఉంటాయి. అయితే ఈ విధంగా ఈ అగోరీలు ఇటువంటి విద్యని వాళ్ళు మంత్రాలు, తంత్రాలు చేసి సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళని alchemists అని కూడా English లో చెప్తారు.

      ఇదే మళ్ళీ మీరు An autobiography of అ యోగి అనే పుస్తకం లోకి కనక వెళ్ళితే మొట్టమొదట 33 ఏళ్ళ తర్వాత లాహిరి మహాశయ గారు ఎక్కడో నాగపూరు రైల్వే స్టేషన్ లో క్లర్క్ గా పని చేస్తున్నప్పుడు ఆయనకి హిమాలయ పర్వతాలలో ఫలానా చోట రైల్వే నిర్మాణం చేయాలని ఆదేశం రావడం , ఆయన పల్లకి మీద కొన్ని రోజులు ప్రయాణం చేసి అక్కడకి వెళ్ళడం, ఆయనకి పూర్వ జన్మలో గురువుగారైనటువంటి మహావతార బాబాజీ గార్ని ఆ గుట్ట మీద కలవడం జరిగింది. మహావతార బాబాజీ గారు ఆయనకోసం  బంగారంతో, వజ్రాలతో తాపడం చేసినట్టి ఒక బ్రహ్మాండమైన భవనాన్ని సృష్టించడం, అంతే కాకుండా అందులో ఒక చక్కటి సింహాసనాన్ని సృష్టించి దాని మీద లాహిరి మహాశయ గారిని కూర్చోపెట్టడం జరిగింది. అంతే కాకుండా బంగారు పళ్ళాలు సృష్టించి అందులో లాహిరి మహాశయ గారికి ఇష్టమైన పదార్థాలన్నీ సృష్టించి తినిపించడం , పూర్వ జన్మలో ఆయనకున్న ఈ చిన్న కోరిక తీర్చి ఆయన్ని కర్మనుంచి ముక్తి చేయడం జరిగింది. తెల్లవారేసరికి అంత పెద్ద భవనం మాయం కూడా అయిపోయింది. ఇక్కడ ఇదేవిధమైన ప్రక్రియననుసరించారు.
         ప్రకృతిలో molecules, atoms కూడా ఈ వాయువులో తిరుగుతూ ఉంటాయి. ఈ మహావతార బాబాజీ నిష్కల్మషమైన, నిర్మలమైన హృదయం కలవాడు, ప్రకృతితో మమైక్యమైనవాడు కాబట్టి ఆయన సంకల్పించినప్పుడు ఈ భవంతికి కావలసిన ధాతువులన్నింటినీ దగ్గరకు చేర్చి, వాటి సాంద్రత (density) పెరిగి బంగారానికి కావలసినటువంటి molecular స్ట్రక్చర్ ని తయారు చేయడం, అదేవిధంగా డైమండ్ లో ముఖ్యంగా కార్బన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ molecules ని దగ్గరకి తెచ్చి వాటి సాంద్రత పెంచడం, అలా ఆయన ఈ భవంతిని సృష్టించడం జరిగింది. ఆ పని అయిపోగానే అదే సంకల్పంతో ఈ molecules యొక్క సాంద్రత తగ్గించినప్పుడు అవి  మెల్లగా కరిగిపోయి, కరిగిపోయి మళ్ళీ అవి వాయు తత్వంలో ఈ ప్రకృతిలో తిరుగుతూ ఉంటాయి. ఇటువంటి మహోన్నత స్థితికి రావాలంటే మనం ప్రకృతితో అంటే పంచ భూతాలతో పూర్తిగా మమైక్యం అయిపోయి వాటి సాహిత్య స్థితికి మనం వెళ్ళినప్పుడే అటువంటి అద్భుతకార్యాలు చేయగలుగుతాం. అయితే లాహిరి మహాశయ గారికి ఉన్న ఆ చిన్న కోరిక కనుక తీరకపోతే, అది తీరెంతవరకు ఆయన ఎన్నో జన్మలు ఎత్తాల్సివచ్చేది. ఆ చిన్న కోరికని, దాని చుట్టూ ఆవరించుకున్న కర్మని, కర్మబంధాన్నిఆయన త్రెంచి వేసేసి, ఆయన్ని కర్మరాహితుడిగా చేయడం జరిగింది.